సంతోషానికి సోర్స్ గా కరుణ

Compassion as a source of happiness

సంతోషం కోసం ప్రయత్నించడమే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు లక్ష్యం

మనం ఈ భూమి మీద ఉన్నాము; మనం ఇక్కడే జీవిస్తున్నాము మరియు మనకు జీవించే హక్కు ఉంది. నాన్-సెంటియెంట్ జీవులు అయిన పువ్వులకు కూడా ఇక్కడ జీవించే హక్కు ఉంది. ఒకవేళ వాటికి రసాయన స్థాయిలో ఏమైనా నష్టం కలిగిస్తే, ఆ పువ్వులు వాటికవే రిపేర్ చేసుకుని బతకడానికి ప్రయత్నిస్తాయి. కానీ [అవి కాకుండా] కీటకాలు, అమీబాలతో సహా అతి చిన్న జీవులైన మనుషులను చిన్నపాటి సెంటియెంట్ జీవులుగా పరిగణిస్తారు. [మరియు సెంటియెంట్ జీవులుగా, మనకు ఇంకా ఎక్కువ పనులు చేసుకునే శక్తులు ఉన్నాయి.]

శాస్త్రవేత్తలతో నేను జరిపిన చర్చల ప్రకారంగా, వాటి ఇష్టం ప్రకారం లేదా కోరిక ప్రకారం జీవించే వాటిని "సెంటియెంట్ జీవులు" అంటారని చెప్పారు. "సెంటియెంట్" అంటే స్పృహలో లేదా చేతన స్థాయిలో ఉండటం కాదు. నిజానికి, "చైతన్యం" లేదా "స్పృహ" అంటే ఏమిటో చెప్పటం కష్టం. సాధారణంగా, ఇది మనస్సు యొక్క ఒక స్పష్టమైన అంశం అని అర్థం. కానీ, మనం సగం స్పృహలో ఉండి లేదా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు చైతన్యం ఉండదా? కీటకాలకు ఇది ఉంటుందా? చైతన్యం కన్నా దీన్ని ఓ "అభిజ్ఞా శక్తి" అని చెప్పడం చాలా సమంజసం.

ఏ సందర్భంలో అయినా, మనం ఇక్కడ ప్రస్తావిస్తున్న ప్రధాన అంశం భావాలను అనుభవించే సామర్థ్యం: నొప్పి, ఆనందం లేదా న్యూట్రల్ భావాలు. నిజానికి, ఆనందం మరియు బాధ [సంతోషం మరియు దుఃఖం] అనే వాటినే మనం మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఉదాహరణకు, ప్రతి సెంటియెంట్ జీవికి జీవించే హక్కు ఉంది. బ్రతకటం అంటే ఆనందం లేదా సౌకర్యాల కోసం కోరికలను కలిగి ఉండటం: అందుకే జీవులు మంచిగా బ్రతకటానికి కష్టపడతాయి. అందుకని, మన మనుగడ ఆశపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతీ సారీ నేను ఎప్పుడూ జీవిత పరమార్థం సంతోషమేనని చెప్తూ ఉంటాను. ఆశ, సంతోషకరమైన అనుభూతితో మన శరీరం మంచిగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఆశ మరియు ఆనందం మన ఆరోగ్యానికి బాగా అవసరం. ఆరోగ్యం సంతోషకరమైన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది.

మరోవైపు, కోపం అనేది అభద్రతా భావంపై ఆధారపడి ఉంటుంది. ఇది మనకు భయాన్ని కలిగిస్తుంది. మనకు ఏదైనా మంచి జరిగినప్పుడు, మనం సురక్షితంగా భావిస్తాము. మనల్ని ఏదైనా బెదిరించినప్పుడు, మనకు అభద్రతా భావం కలిగి కోపంగా మారుతాము. కోపం అనేది మన మనుగడకు హాని కలిగించే వాటి నుంచి తనను తాను రక్షించుకునే మనస్సులో ఒక చర్య. కానీ కోపం [మనల్ని చెడుగా అనుభూతి చెందేలా చేస్తుంది, కాబట్టి చివరికి అది] మన ఆరోగ్యానికి చెడ్డది.

అనుబంధం అనేది మనం బ్రతకడానికి సహాయపడే ఒక విషయం. కాబట్టి, మొక్క కూడా, ఎటువంటి స్పృహ లేకుండా, కొంత రసాయనాలను కలిగి ఉంటుంది, ఇది తనను తాను రక్షించుకోవడానికి మరియు పెరుగుదలకు దానికి అదే సహాయం చేసుకుంటుంది. శారీరక స్థాయిలో మన శరీరం ఒకేలా ఉంటుంది. కానీ, మానవులుగా, మన శరీరానికి భావోద్వేగ స్థాయిలో సానుకూల అంశం ఉంటుంది, ఇది ఒకరితో అనుబంధం లేదా మన ఆనందం పట్ల బాధ్యతను కలిగి ఉంటుంది. [కోపం, మరోవైపు, హాని కలిగించే] వాటితో కలిసి ఉండి మనల్ని [ఆనందంతో సహా] అన్ని మంచి విషయాలకు దూరం చేస్తుంది. శారీరక స్థాయిలో, ఆనందం కలిగించే విషయం శరీరానికి మంచిది; దాని విరుద్ధంగా కోపం [దుఃఖాన్ని కలిగించేది] మనకు హానికరం. అందుకని, [మనుగడను అన్వేషించే ఆలోచన నుంచి] సంతోషకరమైన జీవితాన్ని గడపడమే మన జీవిత లక్ష్యం.

ఇది నేను మాట్లాడుతున్న ప్రాథమిక మానవ స్థాయి; నేను రెండవ స్థాయి అయిన మతం గురించి ఏమీ మాట్లాడటం లేదు. మతపరమైన స్థాయిలో, జీవితం యొక్క అర్ధానికి విభిన్నమైన వివరణలు ఉన్నాయి. రెండవ అంశం నిజానికి చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది; అందుకని, కేవలం ప్రాథమిక మానవ స్థాయిలోనే మాట్లాడటం మంచిది.

సంతోషం అంటే ఏమిటి?

మన జీవిత లక్ష్యం సంతోషం పొందడమే కాబట్టి, అసలు సంతోషం అంటే ఏమిటి? కొన్నిసార్లు శారీరక బాధలు లోతైన సంతృప్తిని కూడా తెచ్చిపెడతాయి. [కఠినమైన వ్యాయామం చేసిన తర్వాత అథ్లెట్ కి వచ్చే సంతోషం లాంటిది] కాబట్టి "సంతోషం" అంటే ప్రధానంగా ఒక లోతైన సంతృప్తి కలిగించే భావన. కాబట్టి మన జీవితం యొక్క లక్ష్యం సంతోషాన్ని పొందటమే.

సంతోషం, దుఃఖం లేదా బాధ - వీటన్నిటిలో రెండు స్థాయిలు ఉంటాయి: మొదటిది ఇంద్రియ స్థాయి మరియు రెండవది మానసిక స్థాయి. ఇంద్రియ స్థాయి చిన్న క్షీరదాలు, కీటకాలలో సాధారణంగా ఉంటుంది - ఒక ఈగకి ఉన్నట్టు. ఒక చల్లని వాతావరణంలో, సూర్యుడు బయటకు వచ్చినప్పుడు, ఈగ సంతోషంతో చక్కగా ఎగురుతుంది. ఒక చల్లని గదిలో, ఇది తగ్గిపోతుంది: ఇది విచారానికి సంకేతాన్ని చూపుతుంది. కానీ, దానికి ఇంకా అధునాతన మెదడు ఉంటే, ఈ ఇంద్రియ ఆనందం యొక్క మరింత బలమైన భావనను కావాలనుకుంటుంది. మన అధునాతన మెదడు పరిమాణంలో పెద్దది, అందుకని, మనకు తెలివితేటలు ఉన్నాయి.

శారీరక కష్టాలు లేని మనుషులను పరిశీలి౦చ౦డి. వీరికి సంతోషకరమైన, సౌకర్యవంతమైన జీవితం, మంచి స్నేహితులు, జీతం మరియు పేరు ఉన్నాయి. అయినా కానీ, కొంతమంది కోటీశ్వరులు, ఉదాహరణకు - సమాజంలో ఒక ముఖ్యమైన భాగం అని భావించే వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు. నేను కొన్ని సందర్భాల్లో చాలా ధనవంతులను, ప్రభావవంతమైన వ్యక్తులను కలిశాను. వాళ్లకు చాలా బాధలు ఉన్నాయి. వాళ్ళకు లోతుగా, ఒంటరితనం, ఒత్తిడి మరియు ఆందోళనలు లాంటి అనుభూతులను కలిగి ఉన్నారు. కాబట్టి, వాళ్ళు మానసిక స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.

మనకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, కాబట్టి శారీరక స్థాయి కన్నా మన మానసిక స్థాయి యొక్క అనుభవం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా శారీరక నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణగా, కొన్ని రోజుల క్రితం నేను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. నా పేగుల్లో చాలా నొప్పి మొదలయ్యింది. ఆ సమయంలో, నేను భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రమైన బీహార్ లో ఉన్నాను. అప్పుడు నేను బుద్ధగయ మరియు నలందా గుండా వెళుతున్నాను. అక్కడ నేను చాలా పేద పిల్లలను చూశాను. వాళ్లు ఆవు పేడను సేకరిస్తున్నారు. వాళ్ళకు ఎలాంటి విద్యా సౌకర్యాలు లేవు అది చూసి నేను చాలా బాధపడ్డాను. అప్పుడు, రాష్ట్ర రాజధాని పాట్నా సమీపంలో, నాకు చాలా నొప్పి వచ్చి చెమటలు పట్టాయి. అక్కడ ఒక ముసలి రోగి తెల్లని గుడ్డ ధరించి, చాలా మురికిగా ఉండటాన్ని నేను గమనించాను. అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. ఆ రోజు రాత్రి నా హోటల్ గదిలో, నా నొప్పి చాలా ఎక్కువైపోయింది, కానీ నా మనస్సులో మాత్రం ఆ పిల్లలు మరియు ఆ ముసలి రోగి గురించే ఆలోచన వస్తుంది. వాళ్ళ గురించి అలా ఆలోచించటం నిజంగా నా నొప్పిని బాగా తగ్గించేసింది.

ఉదాహరణకు ఒలింపిక్ క్రీడల కోసం శిక్షణ తీసుకునేవారినే తీసుకుందాం. వాళ్లు చాలా కష్టంతో కూడుకున్న శిక్షణను పొందుతారు. వాళ్లు ఎంత బాధను, కష్టాన్ని అనుభవించినప్పటికీ, మానసిక స్థాయిలో వాళ్లు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందుకని, శారీరక అనుభవం కంటే మానసిక సంతృప్తి చాలా ముఖ్యం. జీవితంలో నిజంగా ముఖ్యమైనది సంతోషం మరియు సంతృప్తి.

సంతోషానికి కారణాలు

ఇప్పుడు సంతోషానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ బాడీ ఎలిమెంట్ ప్రశాంతమైన మనస్సుతో బాగా పనిచేస్తుంది. కాబట్టి, ఇబ్బంది పడిన మనస్సుతో కాకుండా, మంచి ప్రశాంతమైన మనస్సు మనకు చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. మన శారీరక పరిస్థితి ఎలా ఉన్నా మనకు అవసరం లేదు, మనకు కావలసింది మానసిక ప్రశాంతత. కాబట్టి, ఒక ప్రశాంతమైన మనస్సును ఎలా తీసుకురాగలం?

ఇప్పుడు, అన్ని సమస్యల నుండి బయటపడటానికి, అది సాధ్యమైనది కాకపోవచ్చు; మనస్సును సరిగ్గా మలుచుకుని సమస్యలను మరచిపోవడం కూడా ఒక కష్టమైన పనే. మన సమస్యలను మనం స్పష్టంగా తెలుసుకుని వాటిని పరిష్కరించుకోవాలి, కానీ అదే సమయంలో మనం ఒక ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండాలి, అప్పుడే మనం మంచి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటాము. అప్పుడు వాటిని సరిగ్గా అర్ధం చేసుకుని సరైన విధంగా ఎదుర్కోగలుగుతాము.

ట్రాంక్విలైజర్లు తీసుకునే వారి విషయానికొస్తే - వాళ్ళ గురించి నాకు ఏమీ తెలీదు. ట్రాంక్విలైజర్లు తీసుకునే వాళ్ళకు తెలివితేటలు పెరుగుతాయా లేదా నీరసంగా అవుతారా అనే విషయం నాకు తెలియదు; నేను వాళ్లను అడగాలి. ఉదాహరణకు, 1959లో, నేను ముస్సూరీలో ఉన్నప్పుడు, మా అమ్మ లేక ఎవరో బాగా ఇబ్బంది పడినప్పుడు: నేను అసలు నిద్రపోలేదు. వాళ్లకు కొన్ని మందులు ఇవ్వచ్చని అప్పుడు వాళ్ళు కాస్త సోయలో లేనట్లు ఫీల్ అవుతారని డాక్టర్ నాకు చెప్పారు. అది మంచిది కాదని అప్పుడు నాకు అనిపించింది. ఒక వైపు అది మనసుకు ప్రశాంతతను ఇచ్చినా, ఇంకోవైపు మనిషి బాగా నీరసంగా అయిపోతాడు, అది అంత మంచిది కాదు. నేను ఇంకో దారిని ఎంచుకున్నాను. ఆ సమయంలో తెలివితేటలు పూర్తిగా పనిచేసేలా శ్రద్ధగా మరియు అప్రమత్తంగా ఉండాలని నేను చెప్పాను, డిస్టర్బ్ అవ్వకుండా. ఎలాంటి ఆటంకాలు లేని మానసిక ప్రశాంతత ఉత్తమమైనది.

దీని కోసం, దయగల మానవ అనురాగం చాలా ముఖ్యమైనది: మన మనస్సు ఎంత దయగా ఉంటే, మన మెదడు అంత మెరుగ్గా పనిచేస్తుంది. మన మనస్సులో భయం మరియు కోపం మొదలైతే, అప్పుడు మన మెదడు నెమ్మదిగా పనిచేస్తుంది. ఒక సందర్భంలో నేను ఒక ఎనభై ఏళ్లు పైబడిన శాస్త్రవేత్తను కలిశాను. అతను తన పుస్తకంలో ఒక దాన్ని నాకు ఇచ్చాడు. అది "వి ఆర్ ప్రిజన్స్ ఆఫ్ యాంగర్" అనుకుంటా. ఒక వస్తువుపై మనం కోపాన్ని పెంచుకున్నప్పుడు ఆ వస్తువు చాలా చెడ్డగా కనిపిస్తుందని అతను తన అనుభవం నుంచి చెప్పారు. కానీ ఆలా చూడటం తొంభై శాతం మన మెంటల్ ప్రొజెక్షన్ లోనే ఉంటుంది. ఇది తన సొంత అనుభవంలోనిది.

బౌద్ధమతం కూడా అదే చెబుతోంది. మనకు దేని మీద అయినా నెగెటివ్ భావం వస్తే, అప్పుడు మనం రియాలిటీని చూడలేము. మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మనస్సును కోపం తొక్కేస్తుంది; అప్పుడు, మనం ఒక తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరూ తప్పుడు నిర్ణయం తీసుకోవాలని అనుకోరు, కానీ ఆ క్షణంలో, మంచి మరియు తప్పుని వేరు చేయడానికి మన తెలివితేటలు సరిగ్గా పని చెయ్యవు. గొప్ప నాయకులకు కూడా అలాంటి అనుభవాలే ఎదురవుతాయి.

అందుకనే, కరుణ మరియు ఆప్యాయత మెదడుని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. రెండవది, కరుణ మనకు అంతర్గత బలాన్ని ఇస్తుంది; ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది, ఇది భయాన్ని తగ్గిస్తుంది, మరియు ఇది మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి కరుణకు రెండు బాధ్యతలు ఉన్నాయి: ఇది మన మెదడుని మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది మరియు ఇది అంతర్గత బలాన్ని అందిస్తుంది. ఇవే మన సంతోషానికి కారణాలు. నేను ఇలాగే జరుగుతుందని అనుకుంటాను.

ఇప్పుడు మిగతావి కూడా సంతోషానికి మంచివే. ఉదాహరణకు ప్రతి ఒక్కరూ డబ్బును ఇష్టపడతారు. మన దగ్గర డబ్బు ఉంటే మంచి సౌకర్యాలు పొందవచ్చు. సాధారణంగా, మనం వీటినే అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తాము, కానీ నేను అలా అనుకోవటం లేదు. వస్తువుల సుఖం శారీరక శ్రమ నుంచే వస్తుంది, కానీ మానసిక ప్రశాంతత మన సొంత ప్రయత్నం ద్వారా రావాలి. మనం ఒక షాపుకు వెళ్లి అక్కడి దుకాణదారుడికి డబ్బులు ఇచ్చి మాకు మనశ్శాంతి ఇవ్వండి అని చెబితే అలాంటిదేమీ ఇక్కడ లేదు అని చెబుతాడు. చాలా మంది దుకాణదారులు మనకు పిచ్చి అని అనుకుంటారు. మనల్ని చూసి నవ్వుతారు. కొన్ని ఇంజెక్షన్ లు లేదా మాత్రలు తాత్కాలిక ఆనందం ఇస్తాయేమో కానీ మానసిక ప్రశాంతతను పూర్తిగా ఇచ్చేది ఏదీ లేదు. అందుకని, మనం మానసిక విధానాన్ని ఉపయోగించాలి. నేను ప్రసంగాలు ఇచ్చినప్పుడల్లా, ఆధునిక ప్రజలైన మనం బయట అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము అని నేను చెబుతాను. మనం కేవలం ఆ స్థాయి వరకే దృష్టి పెడితే సరిపోదు. నిజమైన ఆనందం మరియు సంతృప్తి లోపలి నుంచి రావాలి.

దానికోసం ప్రాథమిక అంశాలు కరుణ మరియు మానవ అనురాగం, ఇవి జీవశాస్త్రం నుండి వస్తాయి. ఒక చిన్న పిల్లోడిగా మన మనుగడ కేవలం ఆప్యాయత మీదే ఆధారపడి ఉంటుంది. ఆప్యాయత ఉంటేనే మనం సేఫ్ గా ఉన్నట్టు ఫీలవుతాం. అది లేకపోతే మనం ఆందోళన, అభద్రతా భావానికి గురవుతాం. మన తల్లి నుంచి దూరంగా ఉంటే మనం ఏడుస్తాం. మనం అమ్మ దగ్గర ఉండి, తనని గట్టిగా హత్తుకుని, ఆప్యాయంగా ఉంటే అప్పుడు మనం సంతోషంగా, నిశ్శబ్దంగా ఉంటాం. ఒక చిన్న పిల్లోడిలా, ఇది ఒక బయోలాజికల్ ఫ్యాక్టర్. ఉదాహరణకు, నా గురువు అయిన ఒక జీవ శాస్త్రవేత్త, న్యూక్లియర్ హింసను తగ్గించటానికి పనిచేస్తున్నాడు - ఒక బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డ యొక్క మెదడు మరియు శరీరం అభివృద్ధికి చాలా వారాల వరకు తన తల్లి శారీరక స్పర్శ ముఖ్యమైనదని నాకు చెప్పాడు. ఇది భద్రత మరియు సౌకర్యం యొక్క అనుభూతిని తెస్తుంది. ఇది మెదడుతో సహా పూర్తి శారీరక పెరుగుదలకు సహాయం చేస్తుంది.

కాబట్టి, కరుణ మరియు ఆప్యాయత యొక్క విత్తనం మతం నుంచి రాలేదు: జీవశాస్త్రం నుంచి వచ్చింది. మనమందరం తల్లి గర్భం నుంచే వచ్చాం, ఆ అమ్మ సంరక్షణ, మరియు ఆప్యాయత వల్ల మనమందరం బతకగలుగుతున్నాం. భారతీయ సంప్రదాయంలో, భూమిలో కమలం నుంచి జన్మించడాన్ని స్వచ్ఛమైనదని మనం అనుకుంటాం. వినటానికి ఇది చాలా బాగుంటుంది, కానీ అక్కడి ప్రజలకు ప్రజల కంటే ఆ కమలాల మీద ఎక్కువ అభిమానం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి తల్లి గర్భం నుంచి జన్మించడం ఒక అదృష్టం. అలా పుట్టినప్పుడు మనం కరుణతో ఈ లోకంలోకి వస్తాం. కాబట్టి మన సంతోషానికి ఇవే కారణాలు.

Top