ప్రేరణ యొక్క మధ్యంతర మరియు అధునాతన స్థాయిలు

సమీక్ష

మనం ఆధ్యాత్మిక మార్గం యొక్క గ్రేడెడ్ దశల గురించి మాట్లాడుతున్నాము, ఇందులో మనం ముఖ్యంగా మన ప్రేరణను ఒక చిన్న పరిధి నుండి పెద్దదిగా విస్తరించుకోడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ విధంగా, ప్రతి దశ ఇంతకు ముందు దానిపై నిర్మించుకుంటూ వెళుతుంది.

ఇలా చేయడానికి మనకు రెండు మార్గాలు కూడా ఉన్నాయని తెలుసు. మనం ధర్మ-లైట్ వెర్షన్ ను అనుసరించవచ్చు, దీనితో ఈ జీవితకాలాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు కొంచెం మెరుగ్గా మార్చడానికి మనం ఆలోచిస్తున్నాము. మనలో చాలా మంది ఇక్కడి నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా, సాంప్రదాయిక ప్రదర్శన ఈ స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకోదు. ఎందుకంటే ఇది ప్రారంభం మరియు అంతం లేని పునర్జన్మపై నమ్మకంతో ఉంటుంది. అసలు విషయం అయిన ధర్మం, కోకాకోలా లాగానే పునర్జన్మ నేపథ్యంలో ఈ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది.

ప్రేరణ యొక్క ప్రారంభ స్థాయి, అన్ని స్థాయుల ప్రేరణల లాగానే, ఒక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక కారణం మరియు దాని వెనుక ఒక భావోద్వేగం ఉంచుకుంటుందని మనం చూశాము, ఇది ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రారంభ దశలో, మనం మన భవిష్యత్తు జీవితాలను మెరుగుపరచుకోవడానికి చూస్తాము, అలా ఒక విలువైన పునర్జన్మను పొంది, అది గొప్ప లక్ష్యాలను చేరుకోవడానికి మనకు సహాయపడుతుందని అనుకుంటాము. అంతిమ లక్ష్యాలను ఈ జన్మలో సాధించడం కష్టమని మనం తెలుసుకుంటాం. దీనికి చాలా సమయం మరియు చాలా కష్టం అవసరం. మంచి పునర్జన్మలను కలిగి ఉండటానికి ప్రయత్నించడానికి కారణం ఏమిటంటే, మనం మార్గంలో ఉండవచ్చు అని.

ఈ అమూల్యమైన పునర్జన్మ అనే లక్ష్యాన్ని సాధించినప్పుడు మనం అదే చెయ్యాలని అనుకుంటాము. మన తర్వాతి జన్మలో స్వర్గానికి వెళ్లి అక్కడ మంచి సమయం గడపడం గురించి మనం మాట్లాడటం లేదు. ఈ ఆలోచనలో, మంచి పునర్జన్మను వెతుక్కోవడానికి మనల్ని ప్రేరేపించే భావోద్వేగం మరింత ఘోరమైన పునర్జన్మను వస్తుందనే భయం. ఈ అధ్వాన్నమైన స్థితులలో, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి మనకు ఏ అవకాశాలు ఉండవు. కానీ దీని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉందని మనకు నమ్మకం ఉంటుంది. మనం దీన్ని ఒక సురక్షిత దిశ లేదా ఆశ్రయంగా చర్చించాము. ఈ దిశ ముఖ్యంగా మన మానసిక కార్యకలాపాలతో పాటు, లేదా మన ప్రవర్తన పరంగా అన్ని పరిమితులు మరియు ప్రతికూల అంశాలను పూర్తిగా ఆపడానికి ప్రయత్నిస్తుంది. దీనికి తోడు. మనం మంచి నిర్మాణాత్మక మార్గాల్లో ప్రవర్తించాలనుకుంటున్నాం. మనకున్న ఈ అమూల్యమైన మానవ జీవితానికి ఉన్న అవకాశాలను గుర్తించి, మరణ సమయంలో మనం దీన్ని కచ్చితంగా కోల్పోతామనే అవగాహనతో ఈ పని చేస్తున్నాం. మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు అస్సలు తెలియదు.

మంచి పునర్జన్మలు కూడా అంత సంతృప్తికరంగా ఉండవు

ఈ మధ్యంతర పరిధితో, మనం దీని గురించి ఇంకా విశ్లేషిస్తాము. మనకు ఇంకా మంచి పునర్జన్మలు లేదా విలువైన పునర్జన్మలు ఉన్నా కానీ, అలాగే కొనసాగడం అసంతృప్తిగా ఉంటుంది. జీవితం సాగుతూ ఉంటుంది మరియు దాని స్వభావం ఒక క్షణం తర్వాత మనం ఎలా అనుభూతి చెందుతామో ఖచ్చితంగా చెప్పలేని విధంగా మారుతూ ఉంటుంది. మనం ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చు, కానీ తర్వాతి నిమిషంలో, మనం అకస్మాత్తుగా తక్కువ సంతృప్తిని, విచారాన్ని లేదా నిరాశను కూడా అనుభవించవచ్చు. చిన్న చిన్న విషయాలు మనల్ని బాధిస్తాయి మరియు నిజానికి, ప్రతి జీవితంలో మన పుట్టుక నుంచే ఎలాంటి ఎటువంటి నియంత్రణ లేకుండా గడపాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి. మనం నడవడం మరియు మాట్లాడటం నేర్చుకోవాలి, మరియు ఇలా చెయ్యడం నిజంగా బోరింగ్ గా ఉంటుంది. మనం బడికి కూడా అలాగే రోజూ మానకుండా ఎలా వెళ్లాలని అనిపిస్తుంది?! మనం ఒక భాగస్వామిని మరియు ఉద్యోగాన్ని వెతుక్కోవాలి మరియు మళ్ళీ అనారోగ్యాన్ని, వృద్ధాప్యాన్ని మరియు మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన గురించే కాకుండా మనం ప్రేమించిన వారిని కూడా పట్టించుకోవాలి.

ఈ అమూల్యమైన మానవ జీవితంలో కూడా, చాలా అసంతృప్తికరమైన విషయాలు ఉన్నాయి, మరియు ఈ భావోద్వేగ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మనకు కోపం వచ్చి బాధ కలుగుతుంది. మనం అత్యాశకు గురవుతాము. మనుషులతో, మరియు వస్తువులతో మనకు గొప్ప అనుబంధాలు ఉంటాయి. మనం కారణం, ప్రభావం మరియు వాస్తవికతను తెలుసుకోకుండా ఉంటాము. అందుకని మనం వ్యవహరించే మరియు మాట్లాడే విధానం ఇతరులపై ఎటువంటి ప్రభావాన్ని చూపించాడని మనం ఎలా పడితే అలా ఉంటాము. మనం ఎప్పుడూ ఇతరులు అసలు ఉన్నారో లేదో అన్నట్లు ప్రవర్తిస్తాము. అది పూర్తిగా అమాయకత్వం, కదా?

ఈ సమస్యలన్నీ అలా వస్తూనే ఉంటాయి మరియు ఏ అదృష్ట పునర్జన్మలోనైనా ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. మనం అదృష్టవంతుల నుంచి దురదృష్టవంతులుగా, మంచి నుంచి అధ్వాన్నమైన పునర్జన్మల పరిస్థితులకు వెళ్లడం కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. దీని అర్థం "నియంత్రణలో లేని రిపీట్ అయ్యే ఉనికి లేదా పునర్జన్మ" అని, దీనికి సంస్కృత పదం "సంసారం".

త్యాగం: స్వేచ్ఛగా ఉండాలనే సంకల్పంతో విముక్తిని లక్ష్యంగా చేసుకోవడం

మధ్యంతర పరిధితో, వీటన్నింటి నుంచి విముక్తి పొందాలనేదే మన లక్ష్యం. మన మానసిక విషయాలకు ఏ ఆరంభం లేదా అంతం అనేది లేదు, మరియు ఈ నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ యొక్క ఈ అంతులేని చక్రంలో ఉండాలని మనం కోరుకోవడం లేదు. "ఎప్పటికీ అంతం కాదు" అని మనం చెప్పినప్పుడు, అంటే మనం ఏమీ చెయ్యకపోతే అది ఎప్పటికీ అలాగే ఉంటుందని దాని అర్థం. దాన్ని ముగించి సంసారం యొక్క నిజమైన ముగింపును మనం అనుభవించాలి. ఎందుకు? ఎందుకంటే మనం ఆ బాధలను ఆపెయ్యాలని కోరుకుంటాము. మనకు వచ్చే సమస్యలు అంత భయంకరమైనవి కానప్పటికీ, అలాంటి సమస్యలను మనం ఆపెయ్యాలని అనుకుంటాము. మోక్షం పొందాలని కోరుకోవడానికి ఇదే కారణం.

సంస్కృతంలో ముక్తిని "నిర్వాణ" అని పిలుస్తారు మరియు దీని వైపు మనల్ని నడిపించే భావోద్వేగాన్ని సాధారణంగా "త్యాగం" అని పిలుస్తారు. ఇది ఉత్తమమైన అనువాదం కాదు, కానీ ఇది ప్రాథమికంగా స్వేచ్ఛగా ఉండటానికి ఒక మంచి బలమైన సంకల్పాన్ని సూచిస్తుంది. త్యాగంతో, మనం ఈ బాధను సరిపోయినంత అనుభవించామని నిర్ణయించుకుంటాము. మనం దానితో విసిగిపోయి ఉన్నాము, మరియు ఒక లోతైన స్థాయిలో మనం వీటన్నిటి వల్ల విసుగు చెంది ఉన్నాము. ఇది ఇప్పటికే సరిపోతుంది: మనం స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటున్నాము.

మనకు ఇబ్బంది కలిగించే భావోద్వేగాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం

స్వేచ్ఛగా ఉండాలంటే మన సమస్యలకు, బాధలకు ఉన్న కారణాలను మనం వదిలించుకోవాలి. బాధను మాత్రమే కాదు, దాని కారణాలను కూడా వదులుకోవడానికి మనం పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. మనం ఐస్ క్రీం లేదా చాక్లెట్ ని లేదా మరేదైనినైనా మానుకోవడం గురించి మాట్లాడటం లేదు. ఇది త్యాగం యొక్క చాలా చిన్నపాటి అవగాహన. మన కోపాన్ని, దురాశను, వ్యామోహాన్ని వీటన్నిటి నుంచి విముక్తి చేసుకోవడమే మనం కష్టపడాలి. చాక్లెట్ విషయంలో, దాని మంచి లక్షణాలను అతిశయోక్తిగా భావించే వాటి పట్ల మనకున్న మమకారాన్ని వదులుకోవాలి. ఉదాహరణకు, "ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన మరియు రుచికరమైనది అని, మరియు ఇది నాకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది!" అని మనం అనుకుంటాము. చాక్లెట్ నిజంగా ఇలా చెయ్యగల సామర్థ్యాన్ని కలిగి ఉంటే, అప్పుడు మనం ఎంత ఎక్కువ తింటే, అంత సంతోషంగా మనం ఉంటాము. కానీ మనం ఎంత చాకోహోలిక్ అయినప్పటికీ, తొందరలోనే మనం అనారోగ్యానికి గురవుతాము మరియు ఆ చాక్లెట్ ను మళ్లీ తినడానికి ఇష్టపడము.

మన బంధాలు, కోపం లాంటి వాటిని వదులుకోవాలనే మన కోరికలో నిజాయితీగా ఉండటం నిజంగా చాలా కష్టం. దాన్ని మనం చిన్నచూపు చూడకూడదు. ఇది ఎవరో తమ తలను గోడకు కొట్టే ఒక జోక్ లాంటిది, మరియు వాళ్ళు తమ తలను కొట్టడం ఆపరు, ఎందుకంటే అప్పుడు అది ఇంకా ఘోరంగా ఉంటుందో లేదో తెలియదు కాబట్టి. ఇది మనకు పూర్తిగా అలవాటై పోయింది కాబట్టి మనం మన తలలను గోడకేసి కొట్టుకుంటూ ఉంటాం. నిజానికి, ఇది ఒక తీవ్రమైన ఉదాహరణ. చాలా సాధారణమైనది ఎవరితోనైనా చెడు సంబంధంలో ఉండటం లాంటిది, కానీ మనం ఒంటరితనానికి భయపడటం వల్ల దాన్ని బ్రేక్ చెయ్యడానికి ఆలోచిస్తాము. అలాగే, మనం ఈ అనారోగ్యకరమైన సంబంధాన్ని పెట్టుకుని దయనీయంగా ఉంటాము.

ఇది చాలా సాధారణమైన విషయం, కదా? కొంతమంది మనల్ని వదిలేసి వెళ్లినా వాళ్లను మనం ఏమీ అనము. మనం ఇక్కడ ఎటువంటి వింత వాటి గురించి మాట్లాడటం లేదు, ఎప్పుడూ అనుభవించే వాటి గురించే మాట్లాడుతున్నాము.

నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ నుంచి విముక్తి పొందడం సాధ్యమేనా, మరియు నేను దాన్ని సాధించగలనా?

అంతిమంగా ఈ ముక్తి, మరియు జ్ఞానోదయం అనే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా అది సాధ్యమేనని నమ్మి, దాన్ని ఎలా సాధించవచ్చో తెలుసుకోవాలి. ఇవి కష్టమైనా విషయాలు మరియు అవి మనమందరం సాధించగల లక్ష్యాలు అని నిరూపించడం కష్టం కాబట్టి, చాలా మంది వాటిని వదిలేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే మనకు నిజంగా ఈ లక్ష్యాలను సాధించగలమనే నమ్మకం లేకపోతే, వాటి కోసం పనిచెయ్యడానికి మనం ఎందుకు ఆలోచిస్తాం? మనం ఒక ఆట లాంటిది ఆడుతున్నాము, చివరికి ఇది సరైనది కాదు అని తెలుసుకుని వదిలేస్తాము.

బుద్ధ-స్వభావం (మోక్షానికి, జ్ఞానోదయానికి సహాయపడే అంశాలు), మనస్సు యొక్క సహజ స్వచ్ఛత మొదలైన వాటిని బాగా లోతుగా పరిశీలించాలి. మనల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు గందరగోళం మన మనస్సులో ఒక ప్రాథమిక భాగం కావా? అలా అయితే, అవి ప్రతి క్షణం అక్కడే ఉంటాయి అని అర్ధం. అలా కాకపోతే, అవి తాత్కాలికమైనవా మరియు అవి తిరిగి రాకుండా వాటిని తొలగించవచ్చా?

దాని గురించి ప్రశ్నించడం, చర్చించడం చాలా అవసరం. ఏదో గుడ్డి విశ్వాసంతో మనం అంగీకరించాల్సిన విషయం కాదు ఇది. నిజానికి, మనం దాన్ని ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తే అంత మంచిది, ఎందుకంటే మన సందేహాలన్నింటినీ క్లియర్ చేసుకోవాలి మరియు మనం ఏమి చేస్తున్నామో దానిపై బలమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. నూటికి నూరు శాతం ఒప్పుకునే వరకు మనం వేచి చూడాలా? అవును అది అంత సులభమైన ప్రశ్న కాదు. మనం పూర్తిగా నమ్మామని మనం ఎలా తెలుసుకోగలం? దీనికి చాలా సమయం పడుతుంది.

ఇది కేవలం చెత్త అని మనం అనుకుంటే, మనం దాని మీద పని చెయ్యలేము. కానీ అదంతా సాధ్యమేనని భావించే రీతిలో మనం వెళ్తుంటే, అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వొచ్చు. అయితే, అది నిజమని అనుకోవడం కేవలం ఒక గుడ్డి విశ్వాసం లేదా "నా టీచర్ అలా అన్నారు" అని కాకుండా ఏదో ఒక కారణం మీద ఆధారపడి ఉండాలి. బుద్ధుడే స్వయంగా ఇలా అన్నాడు, "నేను చెప్పిన విషయాలను కేవలం విశ్వాసంతో నమ్మకండి, బంగారాన్ని ఎలా అయితే పరీక్షిస్తారో అలా చూడండి" అని. మనం అది నిజమో కాదో పరిశీలించాలి.

పునర్జన్మను నమ్మడం: సెర్కాంగ్ రింపోచే గారి రెండు జన్మలలోని విషయం

పునర్జన్మను ఒక నిజమైన సత్యంగా నమ్మడం చాలా పెద్ద ప్రక్రియ. నేను నా స్వంత అనుభవాన్ని మీతో పంచుకోగలను ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు దీని మీద పని చేశాను. నేను 45 సంవత్సరాలకు పైగా బౌద్ధమతాన్ని అధ్యయనం చేస్తున్నాను, ఒకానొక సమయంలో, పునర్జన్మ ఎందుకు అర్థవంతంగా ఉంటుందో హేతుబద్ధత ఆధారంగా నేను ఒక మేధోపరమైన అవగాహనకు వచ్చాను. కానీ నన్ను నిజంగా భావోద్వేగ స్థాయిలో ఒప్పించింది ఈ రెండు జన్మల పాటు నా గురువుతో నాకున్న అనుబంధం. అతని పేరే సెర్కాంగ్ రింపోచే మరియు అతను దలైలామా గారి గురువులలో ఒకరు; ఆయనకు అత్యంత సన్నిహిత శిష్యుడిగా ఉండటం నా అదృష్టం. ఆయన దగ్గర నేను తొమ్మిదేళ్లు ఉండి చదువుకున్నాను, ఆ సమయంలో ఆయన కోసం అనువాదం చేసి ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేశాను. ఆయన విదేశీ పర్యటనలన్నింటిలో నేను ఆయనతో ఉండి దగ్గరగా పని చేసాను. అతను 1983 లో మరణించారు మరియు టిబెటన్ వ్యవస్థ తుల్కుస్ లో తిరిగి  పునర్జన్మను పొందారు.

అతని వయస్సు ఇప్పుడు 25 సంవత్సరాలు మరియు నేను అతనితో ఇప్పటికీ చాలా దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉన్నాను, ఇంతకుముందు ఉన్నట్లే. నిజానికి, ఇప్పుడు మా ఇద్దరి వయస్సు రివర్స్ అయ్యింది!

ఈ కొత్త సెర్కాంగ్ రింపోచే గారిని నేను మొదటిసారిగా అతనికి కేవలం నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కలిశాను, నేను మొదటిసారి అతని గదిలోకి వెళ్ళినప్పుడు, అతని సహాయకులు అతన్ని అడిగారు, "ఇతను ఎవరో మీకు తెలుసా?" అని. "మూర్ఖంగా మాట్లాడకండి, ఇతను ఎవరో నాకు తెలుసు" అని అతను సమాధానం ఇచ్చారు. మొదటి నుంచి, ఒక నాలుగేళ్ల పిల్లవాడిగా, అతను నా పట్ల చాలా సన్నిహితంగా మరియు ఆప్యాయంగా ఉండేవారు, ఇతర వ్యక్తులతో కన్నా చాలా ఎక్కువగా. పెద్దయ్యే వరకు ఇలానే ఉన్నారు.

మనం అతని మునుపటి జీవితానికి సంబంధించిన వీడియోలను చూసే వాళ్ళము, అప్పుడు ఆయన నాతో ఇలా అనేవారు - మరియు - "ఓహ్, నేను అలా చెప్పడం గుర్తుంది" అని. అన్ని లాజిక్ లు మరియు కారణాలతో పాటు, ఈ అనుభవమే నాకు "సరే, బహుశా, అయి ఉండొచ్చు..." అనే భావనను మరచిపోవడానికి సహాయపడింది. అది నాకు భరోసాను ఇచ్చింది.

ఇవి అంత సులభమైనవి కాదు. మోక్షం పొందడం నిజంగా సాధ్యమేనా? మనస్సు యొక్క స్వభావం నిజంగా స్వచ్ఛంగా ఉంటుందా? హేతుబద్ధంగా లేదా భావోద్వేగపరంగా అర్థం చేసుకోవాలంటే దాని గురించి మనం లోతుగా ఆలోచించాలి. కానీ మెల్లమెల్లగా, మనం దానితో కలిసి పని చెయ్యగలం.

నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మకు కారణం నిజాన్ని అర్ధం చేసుకోకపోవడం

లామ్-రిమ్ లోని మధ్యంతర స్థాయి ప్రేరణతో, ఆధారపడిన 12 లింకులతో పునర్జన్మ యొక్క విధానం గురించి మనకు చాలా తెలిసింది. కర్మ, కర్మ అనంతర పరిణామాలు మొదలైన సమస్యలను పరిష్కరించే చాలా సంక్లిష్టమైన పద్ధతికి ఇది పెట్టిన పేరు మాత్రమే. కోపం, దురాశ లాంటి వివిధ రకాల ఇబ్బందిని కలిగించే భావోద్వేగాలు, అవి ఎలా ఉత్పన్నమయ్యాయో, వాటి వెనుక ఉన్నవి ఏమిటో లోతుగా అర్థం చేసుకోవాలి. సులభంగా, నేను దీన్ని "గందరగోళం" అని పిలుస్తాను, ఇక్కడ ఇతరులపై మరియు మనపై మన ప్రవర్తన ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా లోతుగా ఆలోచిస్తే, మనం అసలు ఎలా ఈ ఉనికిలో ఉన్నాము, ఇతరులు ఎలా ఉనికిలో ఉన్నారు మరియు ప్రతిదీ ఎలా ఉనికిలో ఉంది అనే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం.

ప్రాథమికంగా, మనం వస్తువులను స్వతంత్రంగా, పూర్తిగా తమ స్వంత శక్తితో ఉనికిలో ఉన్నాయని మరియు అన్నింటి నుంచి వేరుగా ఉన్నాయని భావిస్తాము, అవి ప్లాస్టిక్ చుట్టబడినట్లు ఉంటాయని అనుకుంటాము. ప్రతిదీ ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటుందని మనం భావించినప్పటికీ, వస్తువులు ప్లాస్టిక్ లో చుట్టి కర్రలతో కట్టేసి ఉన్నాయని ఆలోచిస్తాము. అసాధ్యమైన మార్గాల గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనేక స్థాయిలలో ఉన్నాయి. ఏది అసాధ్యమో, మన అయోమయం ప్రతి ఒక్కరిపై, ప్రతి దానిపైనా ఎలా చూస్తుందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి.

శూన్యత (శూన్యం): ఉనికి యొక్క అసాధ్యమైన మార్గాలు అస్సలు లేకపోవడం

మనం అర్థం చేసుకోవాల్సినదాన్ని "శూన్యత" లేదా "శూన్యం" అంటారు. శూన్యత అంటే పూర్తిగా లేకపోవడం; అది అస్సలు ఉండకపోవడం. అసాధ్యమైన ఈ అంచనాల యొక్క నిజమైన సూచన ఉండకపోవడం. అవి నిజమైన వేటికీ సరితూగవు.

శాంటాక్లాజ్ ని ఒక ఉదాహరణను మనం ఉపయోగించవచ్చు. ఎరుపు రంగు సూట్ ధరించిన పొడవాటి తెల్లని గడ్డం ఉన్న వ్యక్తిని మనం చూస్తున్నాము, అతనిని మనం "శాంటా క్లాజ్" అని పిలుస్తున్నాము. అతను శాంటాక్లాజ్ అని మనం అనుకుంటాము, కానీ అలా ఎందుకు? ఎందుకంటే, అతను శాంటాక్లాజ్ లాగా కనిపిస్తాడు కాబట్టి. ఏదేమైనా, శాంటాక్లాజ్ యొక్క రూపం నిజమైన దేనికి అనుగుణంగా ఉండవు, ఎందుకంటే నిజమైన శాంటా క్లాజ్ ఎవరూ లేరు. శూన్యత దీని గురించే మాట్లాడుతుంది, ఈ వ్యక్తి యొక్క రూపానికి అనుగుణంగా ఉన్న నిజమైన శాంటా క్లాజ్ ఎవరూ ఉండకపోవడం. ఇది ఎప్పుడూ అక్కడ ఒక మనిషి ఉన్నాడని, అతను శాంటాక్లాజ్ లా కనిపిస్తాడని కాదనదు. ఆ మనిషి మనకు కనిపించే తీరు మోసపూరితమైనదని మనం చెప్తాము. అతను చూడటానికి శాంటాక్లాజ్, కానీ నిజమైన శాంటా క్లాజ్ కాదు, ఎందుకంటే అలాంటి వారు ఎవరూ లేరు.

మన మనస్సు ఎప్పుడూ ఇలానే పనిచేస్తుంది. ఈ వ్యక్తి అత్యంత అందమైన వ్యక్తి అని, లేదా ఆ వ్యక్తి అత్యంత భయంకరమైన వ్యక్తి అని, లేదా మనం ప్రపంచానికి దేవుడిచ్చిన బహుమతి అని మరియు మనం అసలు దేనికి పనికిరామని అన్ని రకాల అసంబద్ధతలను చూపిస్తాము. ఈ విషయాలను మనం లేదా వారు అలానే ఉన్నట్లుగా, అన్నింటికీ పూర్తిగా స్వతంత్రంగా, నిజం మరియు అది మారనట్లుగా చూస్తాము.

నిజానికి అలాంటి వారు ఎవరూ లేరు. అది అసలు అసాధ్యం, ఎందుకంటే ప్రతిదీ ఇతర విషయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. దలైలామా గారు ఎప్పుడూ మన వేళ్లను ఉదాహరణగా తీసుకుని చెప్తారు. మన నాలుగో వేలు పెద్దదా, చిన్నదా? ఐదవ వేలితో పోలిస్తే ఇది పెద్దది, కానీ మధ్య వేలితో పోలిస్తే చిన్నది. కాబట్టి, దాని వైపు నుంచి చూస్తే, దాని స్వంత శక్తితో, అది పెద్దదా లేదా చిన్నదా? దీనికి ఏ సమాధానం లేదు ఎందుకంటే ఇది మిగతా వాటితో పోల్చితే పెద్దది లేదా చిన్నది అవ్వొచ్చు. ఇది పూర్తిగా మిగతా వాటిపై ఆధారపడి ఉంటుంది మరియు ఏది పెద్దది, ఏది చిన్నది అనే మన భావనపై కూడా ఆధారపడి ఉంటుంది. మీకు అర్ధం అయ్యిందని నేను అనుకుంటున్నాను.

ఈ మధ్యంతర స్థాయిలో, శూన్యత గురించి అవగాహన పొందడం ద్వారా ఈ ప్రాథమిక అపార్థాన్ని వదిలించుకోవడానికి మనం పనిచేస్తాము. ఈ గందరగోళమే నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మకు కారణమవుతుంది, ఎందుకంటే ఇది కర్మ మరియు కర్మ అనంతర పరిణామాలను యాక్టివేట్ చేస్తుంది, ఆధారపడిన 12 లింకుల విషయాలతో ఇది వివరించబడింది.

ఏకాగ్రత మరియు నైతిక క్రమశిక్షణ యొక్క అవసరం

శూన్యత గురించి అవగాహనను పొందాలంటే ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతను పెంపొందించుకోవాలంటే నైతిక క్రమశిక్షణ అవసరం. ఒక చెట్టును నరికివేయడమే దీనికి ఉదాహరణ. అర్థం చేసుకోవడం ఒక పదునైన గొడ్డలి లాంటిది, కానీ నిజంగా ఒక చెట్టును నరికివేయడానికి మనం ఎప్పుడూ ఒకే చోటులో నరకాలి. ఒకే చోటులో నరకడం అంటే ఏకాగ్రత. నిజానికి గొడ్డలిని తీసుకుని ఎత్తి ఒకే చోటులో కొట్టడానికి మనకు బలం అవసరం. ఈ బలం నైతిక క్రమశిక్షణ నుంచి వస్తుంది, ఇక్కడ మనం వినాశకరమైన పనులకు దూరంగా ఉంటాము.

ఈ మధ్యంతర పరిధి తీసుకోగల వివిధ రకాల ప్రతిజ్ఞలను కూడా అందిస్తుంది. ఇందులో సన్యాసి లేదా సన్యాసినుల పూర్తి లేదా కొత్త ప్రతిజ్ఞలు లేదా మగ లేదా ఆడ వాళ్ళ ప్రతిజ్ఞలు ఉంటాయి. గృహస్థుడు అంటే మఠంలో బ్రహ్మచారి జీవితాన్ని గడపని వ్యక్తిని సూచిస్తుంది, కానీ మీకు కుటుంబం ఉండాలని దీని అర్థం కాదు; ఇది ఒంటరి వ్యక్తులను కూడా సూచిస్తుంది. ప్రాచీన భారతదేశంలో, ఇది చాలా అరుదు, ఎందుకంటే గృహస్థులకు ఎప్పుడూ ఒక కుటుంబం ఉంటుంది. ఈ సన్యాసి మరియు గృహస్థ ప్రతిజ్ఞలను కలిపి "వ్యక్తిగత విముక్తి కోసం ప్రతిజ్ఞలు" అని పిలుస్తారు, ఎందుకంటే అవి మన స్వంత విముక్తి కోసం ఉద్దేశించబడినవి. మన ధ్యాన అభ్యాసానికి మరియు అటువంటి సానుకూల విషయాలకు ఆటంకం కలిగించే భావోద్వేగాల ద్వారా ప్రేరేపించబడే వివిధ రకాల ప్రవర్తనలను పోగొట్టడానికి ఈ ప్రతిజ్ఞలు మనకు సహాయపడతాయి.

నిజానికి ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే ఇంకెప్పుడూ ఆ పనిని చెయ్యనని మనం ప్రతిజ్ఞ తీసుకున్నప్పుడు, అది మనల్ని నిర్ణయం తీసుకోలేనితనం నుంచి విముక్తి చేస్తుంది. ఉదాహరణకు, మనం మద్యపానం లేదా సిగరెట్లను విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని ఊహించుకోండి. మద్యపానం చేసే లేదా సిగరెట్లు తాగే వాళ్లతో మనం ఉన్న ప్రతిసారీ, మనకు కూడా అవి తాగాలా వద్దా అనే ఆలోచన ఉంటుంది. మనం నిజంగా మానెయ్యడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితిలో ప్రతిసారీ, మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఇది ఒత్తిడి కాకపోయినా ఒక సవాలుగా ఉంటుంది.

మనం ఒక ప్రతిజ్ఞ చేస్తే అదే ఫైనల్. మనం నిర్ణయం తీసుకున్నాము, "నేను ఇంక తాగను. నేను ధూమపానం చెయ్యను" అని లేదా అది ఏమైనా కావచ్చు. అప్పుడు మన చుట్టుపక్కల అందరూ తాగుతున్నారా లేదా అనేది ముఖ్యం కాదు, ఎందుకంటే మనం మన మనస్సులో అలా నిర్ణయించుకున్నాము కాబట్టి. ఒక పరిమితి లేదా శిక్షగా ఉండటానికి బదులుగా, ఈ ప్రతిజ్ఞ చెయ్యడం నిజానికి మనకు చాలా బలాన్ని ఇస్తుంది మరియు నిర్ణయం తీసుకోకపోవడం నుంచి మనల్ని విముక్తి చేస్తుంది, ముఖ్యంగా మన అంతిమ విముక్తిని సాధించడానికి హాని కలిగించే విషయాలకు సంబంధించి.

బౌద్ధమతంలో ప్రతిజ్ఞలు చేసుకోవడానికి ఎలాంటి అడ్డు ఉండదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇది లేదా ఆ ప్రతిజ్ఞ చెయ్యాలని ఎవరూ చెప్పరు, మరియు మీరు సన్యాసిగా లేదా సన్యాసినులుగా మారి మఠంలో నివసించాలని కూడా ఎవరూ చెప్పడం లేదు. ఏదేమైనా, సంసారం నుంచి విముక్తి పొందడం మరియు కోపం, మమకారం, దురాశ మొదలైన వాటికి దూరంగా ఉండడం గురించి మీరు నిజంగా సీరియస్ గా ఉంటే, కొన్ని ప్రతిజ్ఞలు చేస్తే అది ఖచ్చితంగా సులభతరం అవుతుంది. బహుశా మనం ఇంకా దానికి సిద్ధంగా లేకపోవచ్చు, అయినా ఇది మంచిదే. మనల్ని, మన పరిస్థితులను మనం నిజాయితీగా అంచనా వేసుకోవాలి.

ఇదే మధ్యంతర స్థాయి. ఏకాగ్రత మరియు శూన్యత ఇందులో ఒక భాగం అయినప్పటికీ, అవి ఇంకా పూర్తిగా చర్చించబడలేదు. అడ్వాన్స్ డ్ స్కోప్ టీచింగ్స్ లో ఈ అంశాలను పూర్తిగా పరిశీలిస్తారు.

ప్రేరణ యొక్క ఆధునిక స్థాయి: అందరి గురించి ఆలోచించడం

ఆధునిక స్థాయితో, విశ్వంలో మనం ఒక్కళ్ళమే లేము అనే కోణంలో ఆలోచిస్తాము. అందరూ మనలాగే అదే పరిస్థితిలో ఉన్నారు. మిగిలిన వాళ్లంతా బాధపడుతూ నియంత్రణలో లేని పునర్జన్మలను అనుభవిస్తున్నారు. మనం స్థిరమైన ఆనందాన్ని కోరుకుంటాము మరియు బాధలను పోగొట్టుకోవాలని అనుకుంటాము, అలాగే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఈ విషయంలో మనమంతా సమానమే. ఇది నాకు మరియు కొంత మందికి మాత్రమే కాదు, ప్రతి జీవి. మనమందరం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నాము. మనమే స్వతంత్రంగా ఉనికిలో లేము. నిజానికి, మనం ఆ విధంగా మనుగడను సాగించలేము.

అందరినీ సమానంగా చేర్చడానికి మన హృదయాలను విస్తరించడానికి కొన్ని అధునాతన పద్ధతులు ఉన్నాయి. ఇతర జీవులందరినీ పూర్వజన్మలో మన తల్లులుగా గుర్తించడం గురించి, మన పట్ల నమ్మలేని దయను చూపడం గురించి మాట్లాడేటప్పుడు మనం ఇంతకు ముందు కొంచెం చర్చించాము. మనల్ని చూసుకోవడంలో ఇతరులకు తల్లిలా ఉండే సామర్థ్యం ఎలా ఉంటుందో చూడగలిగే ధర్మ-లైట్ వెర్షన్ ఉంది. అయితే, దీనిలో పరిమితులు ఉన్నాయి ఎందుకంటే మన స్నేహితుడైన దోమకు దీనిని ఉపయోగించడం కష్టం.

ప్రేమ

మన హృదయాలను విస్తరి౦చడ౦ ప్రార౦భి౦చడానికి, మన౦ "ప్రేమ" అనే దాన్ని పె౦పొ౦ది౦చుకోవడ౦తో ప్రారంభిస్తాము. ఈ ప్రక్రియ నిజానికి సమతౌల్యంతో ప్రారంభమవుతుంది, ఇక్కడ మనం కొంతమంది పట్ల ఆకర్షితులం అవ్వలేము, ఇతరులచే పట్టించుకోబడము మరియు మిగిలిన వారి కన్నా డిఫరెంట్ గా ఉంటాము. మనం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటానికి పనిచేస్తాము మరియు దీనితో మనం ప్రతి ఒక్కరితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాము. ప్రతి ఒక్కరూ మన తల్లిగా ఉండి పూర్వజన్మలో మన పట్ల ఎంతో దయగా ఉన్నారు అనే లాజిక్ తో లేదా మనం ఆస్వాదించే మరియు ఉపయోగించుకునే ప్రతిదీ ఇతరుల నుంచి ఎలా వస్తుందో తెలుసుకోవడంతో దీన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మీ కింద ఉన్న నేలను, మీరు ఉన్న ఇల్లుని, మీరు తాగే నీటిని గమనించండి, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అని మనం ఆలోచిస్తామా? మన కోసం ఈ నీరు, ఆహారం ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇదంతా ఇతరుల పని, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి కష్టం నుంచి వచ్చాయి. మనమందరం సమానమే కాబట్టి కేవలం మన సొంత ప్రయోజనాల కోసం పనిచేయడంలో లాజిక్ లేదు, ఎందుకంటే నిజానికి మనం మన గురించే కాకుండా పక్కన ఉన్న వ్యక్తుల ప్రయోజనం గురించి కూడా ఆలోచించాలి.

దీని ఆధారంగా మనం అందరిపై సమానంగా ప్రేమను పెంపొందించుకోగలుగుతున్నాం. ఈ ప్రేమ అనేది ప్రతి జీవి సంతోషంగా ఉండాలని మరియు ఆ సంతోషానికి కారణాలు ఉండాలనే కోరికగా చెప్పబడుతుంది. దీనికి రొమాంటిక్ ప్రేమతో ఏ సంబంధం లేదు, ఇది సాధారణంగా చాలా అనుబంధంతో కలిసిపోయి ఉంటుంది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని మనం చెప్పినప్పుడు, "నాకు నువ్వు కావాలి. నన్ను ఎప్పటికీ వదలకు. నువ్వు లేకుండా నేను బతకలేను" అని అర్ధం. అవతలి వ్యక్తి నుంచి మనం కోరుకున్న శ్రద్ధ దొరకనప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా చెడుగా చెప్పినప్పుడు, అప్పుడు అది "నేను మిమ్మల్ని ప్రేమించను" అనే లాగా మారిపోతుంది.

బౌద్ధమతంలో, మనం మాట్లాడే ప్రేమ రకానికి ఇతరులు ఎలా ప్రవర్తిస్తారో లేదా వారు మన పట్ల ఎలా ఉంటారో అనే దానికి అసలు సంబంధం లేదు. ఇది కేవలం ఒక కోరిక మాత్రమే: మీరు సంతోషంగా ఉండాలి అని. మిగతావన్నీ నా శరీరంలో ఒక భాగమే: వాటిలో కొన్ని మాత్రమే కాదు, అన్నీ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాము. మన కాలి వేళ్లు మనకు ఏం చేసినా ఫరవాలేదు.

కరుణ

ప్రేమతో, మన౦ "కరుణను" పె౦పొ౦ది౦చుకు౦టా౦. ఇది ఇతరులు బాధల నుంచి, వాటి కారణాల నుంచి విముక్తి పొందాలనే కోరిక. ఇది బాధ యొక్క ఊహా స్థాయిని, జీవితంలోని ఒడిదుడుకులను మాత్రమే కాకుండా, నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ లాంటి లోతైన బాధలను కూడా సూచిస్తుంది. కరుణను కలిగి ఉండటం అంటే మనం ఇతరుల పట్ల జాలి పడటం కాదు, "అయ్యో పాపం" అని అనుకుంటూ. బౌద్ధమత కరుణ అనేది గౌరవంతో మరియు ఇతరుల బాధలు మరియు దాని కారణాలు పోవాలనే అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం మంచి కోరిక లేదా అందమైన మాటలు కాదు. కరుణతో, బాధలు లేని స్థితిని తీసుకురావడానికి మనం బాధ్యత తీసుకోవడం ప్రారంభిస్తాము. ఇక్కడ ఎంతో ధైర్యం కావాల్సి ఉంటుంది.

"గొప్ప కరుణ" అని పిలువబడే దాన్ని మనం అభివృద్ధి చేసినప్పుడు, మన కరుణ అన్ని జీవులను సమానంగా లక్ష్యంగా చేసుకుంటుంది మరియు వాళ్ళందరిని శ్రద్ధ గల, ప్రేమగల తల్లిగా భావిస్తుంది. మన గొప్ప కరుణ ప్రతి జీవిని ఇంకా ఏ బాధలను భరించకుండా రక్షించాలనే కోరికతో ఉంటుంది.

అసాధారణమైన సంకల్పం

మనకు ఉన్న తర్వాతి దశ "అసాధారణ సంకల్పం" అని మనం పిలిచే ఒక మానసిక స్థితిని అభివృద్ధి చేసుకోవడం. ఇది ఇతరులకు బాగా సహాయం చెయ్యడానికి మాత్రమే కాకుండా బాధ్యతను తీసుకోబోయే ఒక బలమైన నిర్ణయం. బుద్ధుని సంపూర్ణ జ్ఞానోదయ స్థితికి చేరుకోవడానికి ఇతరులకు సహాయపడే బాధ్యతను తీసుకోవాలని మనం నిర్ణయించుకుంటాము. మనం ఇలా చెయ్యాలని అనుకోలేదు; మన మనస్సులలో అలా అనుకున్నాము: మనం దీన్ని ఖచ్చితంగా చెయ్యబోతున్నాము అని.

బోధిచిత్త: అందరికి మేలు జరిగేలా జ్ఞానోదయం పొందడమే లక్ష్యం

ఈ క్రమంలో చివరి దశ మనం "బోధిచిత్త" అని పిలిచే దాన్ని అభివృద్ధి చెయ్యడం, దీనికి ఆధారం ప్రేమ, కరుణ మరియు అసాధారణమైన సంకల్పం. మనం బుద్ధుని స్థితిని పొందితేనే అందరికీ అలాంటి మేలు జరుగుతుందని గ్రహిస్తాం. కానీ, ఈ కోరిక నిజమైనదిగా ఉండాలంటే, అసలు బుద్ధుడు అంటే ఏమిటో, బుద్ధుడు ఇతరులకు సహాయం చేయగల మరియు చేయలేని మార్గాలను మనం అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, బుద్ధుడు తన ఒక స్నాప్ తో అందరి బాధలను తొలగించగల సర్వ శక్తిమంతుడైన దేవుడు కాదు. ఒక బుద్ధుడు ఖచ్చితంగా ఇతరులకు మంచి మార్గాన్ని చూపగలడు మరియు వారికి ప్రేరణను ఇవ్వగలడు, కానీ కష్టపడాల్సింది మనమే. మన కోసం ఎవరూ వాస్తవాన్ని అర్థం చేసుకోలేరు. దాన్ని మనమే అర్థం చేసుకోవాలి.

అందువల్ల, ప్రేమ మరియు కరుణతో నడిచే బోధిచిత్త మన భవిష్యత్తులోని జ్ఞానోదయంపై దృష్టి పెడుతుంది. ఇది మన స్వంత జ్ఞానోదయం, బుద్ధ శాక్యముని లేదా సాధారణమైన జ్ఞానోదయం కాదు. మనకు ఇంకా జ్ఞానోదయం కాలేదు, కానీ అది మన మానసిక ఆలోచనల యొక్క బుద్ధ-ప్రకృతి కారణాల ఆధారంగా చెయ్యవచ్చు. ఈ కారణాలు దాని ప్రాథమిక మచ్చలేని స్వభావం మరియు దాని అన్ని సామర్థ్యాలు మరియు అవకాశాలను కలిగి ఉంటాయి. మనం ఇతరులకు సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఉద్దేశ్యంతో, ఇంకా కాని ఈ జ్ఞానోదయంపై దృష్టి పెడతాము. జ్ఞానోదయం పొందే మార్గంలో, ఇతరులకు కూడా సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలని మనం అనుకుంటాము.

ఇది బోధిచిత్త. ఇది నమ్మశక్యం కాని ఒక విశాలమైన స్థితి మరియు మనస్సు. కేవలం ప్రేమ మరియు కరుణను ధ్యానించినందుకు మనం దానిని తప్పు పట్టకూడదు. ఇదొక్కటే కాదు. ప్రేమ, కరుణే ఆధారం కానీ బోధిచిత్త చాలా ఎక్కువది.

ఆరు దూరదృష్టి ఆలోచనలు (ఆరు పరిపూర్ణతలు)

మనం చూసినట్లుగా, అధునాతన పరిధిలో ఉన్న లక్ష్యం బుద్ధుని స్థితిని సాధించడం, అలా మనం ఇతరులకు సాధ్యమైనంత వరకు బాగా సహాయం చెయ్యగలుగుతాము. మనం ప్రేమ, కరుణ మరియు అసాధారణ సంకల్పంతో నడపబడతాము. కానీ నిజానికి ఈ జ్ఞానోదయాన్ని మనం ఎలా సాధించగలం? సంస్కృతంలో "ఆరు పరిపూర్ణతలు" అని పిలువబడే "ఆరు పరమితాలు" లేదా నేను సాధారణంగా అనువదించినట్లుగా, "ఆరు దూరదృష్టి ఆలోచనలు" అని పిలువబడే వాటి ప్రదర్శనకు ఇది మనల్ని తీసుకువస్తుంది. నేను ఈ పదాన్ని ఇష్టపడతాను ఎందుకంటే అవి చాలా దూరం వెళ్తాయి, బుద్ధుని జ్ఞానోదయ స్థితికి ఇవి మనల్ని తీసుకువెళతాయి. కొంత మందికి, "పరిపూర్ణతలు" అనే పదాన్ని ఉపయోగించడం వల్ల అవి పరిపూర్ణంగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ అది నిజం కాదు, కాబట్టి వారు సరిపోరని అనుకుంటారు. ఈ పదం చెప్పే భావన అది కాదు.

ఔదార్యము

మనం పెంపొందించుకోవాల్సిన మొదటి గుణం ఉదారత, ఇక్కడ మనం ఇతరులకు వస్తువులనే కాకుండా సలహాలు, బోధనలు మరియు భయం నుంచి స్వేచ్ఛను ఇస్తాము. ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేకపోయినా, వాళ్లకు ఏది అవసరం ఉందో దాన్ని ఇవ్వడానికి ఆలోచనను మనం పెంపొందించుకుంటాం. మనం ఇవ్వగల ఇంకొక బహుమతి, మనం ఇతరులతో మంచిగా ప్రవర్తించడం. మనం సమతౌల్యాన్ని పెంపొందించుకున్నాం కాబట్టి, ఇతరులు మనల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇతరులపై కోపం తెచ్చుకోవడం, వారిని అంటి పెట్టుకోవడం, వారి నుంచి ఏదైనా పొందాలని కోరుకోవడం. ఇతరులు మనకు నచ్చని పని చేసినప్పుడు మనం వారిని విస్మరించము లేదా తిరస్కరించము. దీనికి అదనంగా, మనం నిజంగా మరియు నిజాయితీగా వారికి సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తాము. అది నిజంగా మనం ఎవరికైనా ఇవ్వగలిగే మంచి బహుమతి, ఉదారతతో మనం అభివృద్ధి చేసే ఒక అద్భుతమైన బహుమతి ఇది.

నైతిక క్రమశిక్షణ

మనం పెంపొందించుకునే తర్వాతి దూరదృష్టి నైతిక క్రమశిక్షణ, ఇక్కడ మనం విధ్వంసకరంగా ఉండకుండా, సాధ్యమైనంత నిర్మాణాత్మకంగా పనిచెయ్యడానికి చూస్తాము. చదువుకోవడానికి, ధ్యానించుకోడానికి, ఇతరులకు సహాయపడటానికి మనకు క్రమశిక్షణ ఉంది. ఒకరికి సహాయం చెయ్యడానికి మనం అలసిపోము మరియు మనకు సహాయం చెయ్యాలని అనిపించనంత మాత్రాన ఇతరులను నిర్లక్ష్యం చెయ్యము.

ఓర్పు

కోపగించుకోకుండా, బాధ పడకుండా బాధలను, కష్టాలను భరించగల సామర్థ్యమే సహనం. మన కోసం మనం పని చేసుకోవడం మరియు ఇతరులకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించడం అంత సులభం కాదు, మరియు చాలా మందికి సహాయం చేయడం కూడా అంత సులభం కాదు. అవి మనకు కష్టమైన సమయాన్ని తెచ్చిపెడతాయి మరియు మనకు కోపం రాకుండా ఉండటానికి ఓపిక అనేది చాలా అవసరం. సహనాన్ని పెంపొందించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, ఇతర అన్ని దూరదృష్టి వైఖరుల లాగానే.

పట్టుదల

తర్వాతది పట్టుదల, ఇక్కడ మనకు ఎంత కష్టమొచ్చినా ఆ పనిని చెయ్యకుండా వదులుకోలేము. ఈ కోణంలో చూస్తే, ఈ దూరదృష్టి వీరోచిత ధైర్యసాహసం లాంటిది. మన౦ వదులుకోకపోవడమే కాదు, ఇతరులకు సహాయ౦ చెయ్యడ౦లో కూడా స౦తోష౦గా ఉ౦టా౦, సహాయ౦ చేసే అవకాశ౦ లభి౦చిన౦దుకు మనం చాలా స౦తోష౦గా ఉ౦టా౦. దీనిని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అనేక సూచనలు ఉన్నాయి మరియు వాటిలో ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనేటటువంటివి ఉన్నాయి. మనల్ని మనం చాలా కష్టపడితే ఎవరికీ సహాయం చెయ్యలేము. దీనికి సంబంధించి, మనపై మనం పని చెయ్యకుండా ఇతరులకు సహాయం చెయ్యకుండా నిరోధించే వివిధ రకాల సోమరితనాన్ని అధిగమించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి.

మానసిక స్థిరత్వం

దీన్ని అనుసరించి మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి అభ్యాసాలు కూడా ఉన్నాయి. ఇది ఏకాగ్రతను మాత్రమే కాకుండా, భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా కలిగి ఉంటుంది. మనం కోరుకునేది మానసిక కదలికల ప్రభావానికి లోనుకాకుండా, మనకు ఆకర్షణీయమైన వస్తువుల వైపు ఎగురుతూ, నీరసంగా, నిద్రపట్టకుండా ఉండే స్థిరమైన మానసిక స్థితి ఉండడం. అలాంటి మనసు మనం దేనిపై దృష్టి పెట్టాలని అనుకుంటాం దానిపైనే పెడుతుంది. ఉదాహరణకు, ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు, మన మనస్సులు మిగతా విషయాల గురించి ఆలోచించడానికి వెళ్లవు. స్థిరత్వానికి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మనకు లేవనే అర్థంలో కూడా మనం ఆలోచిస్తున్నాము; మనం అప్పుడు మూడీగా ఉండము. దీని అర్థం మనం అతిగా సున్నితంగా లేము అని కాదు, కానీ సమతుల్యతతో మరియు స్థిరంగా ఉన్నామని అర్ధం.

వివక్షాపూరిత అవగాహన

దీనిని తరచుగా "జ్ఞానం" అని అనువదిస్తారు మరియు సంస్కృతంలో ఇది ప్రజ్ఞాపరమిత అని అంటారు. ఈ ఆఖరి ఆలోచన విషయాలు ఎలా ఉన్నాయో మరియు అసాధ్యమైన వాటి మధ్య వివక్ష చూపే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది చాలా నిర్దిష్టమైన అవగాహన, కాబట్టి "జ్ఞానం" అనే పదం కొంచెం అస్పష్టంగా ఉంటుంది. అసాధ్యం ఏమిటో తెలుసుకోవాలనే అవగాహన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాము, ఇందులో శూన్యత (శూన్యం) యొక్క అవగాహన ఉంటుంది. కొన్ని విషయాలు హాస్యాస్పదమైనవి, అసాధ్యమైనవి మరియు దేనినీ సూచించవు అని మనం వివక్షను చూపిస్తాము.

ఈ అభ్యాసాలు మరియు పద్ధతులతో మనం ఆరు-దూరపు ఆలోచనలు, మన లక్ష్యం, ప్రేరణ, సంకల్పం మరియు బోధిచిత్తను అభివృద్ధి చెయ్యడానికి పనిచేస్తాము. ఇవన్నీ ప్రేరణ యొక్క అధునాతన పరిధిని కలిగి ఉంటాయి.

సారాంశం

ప్రారంభ స్థాయిలో, మధ్యంతర పరిధితో, మంచి స్థితిలో మనకు పునర్జన్మలు ఉన్నప్పటికీ, మనం ఇంకా బాధలు అనుభవిస్తామని మనం గ్రహిస్తాము. మనం సమస్యలను ఎదుర్కుంటాము, అనారోగ్యానికి గురై చనిపోవాల్సి ఉంటుంది, మళ్ళీ ఇలానే జరుగుతూ ఉంటుంది. దీనితో విసుగు చెందుతూ, నియంత్రణలో లేని రిపీట్ అయ్యే ఈ పునర్జన్మల అంతటా, ప్రత్యేకంగా ఏమీ లేదని మనం అర్థం చేసుకున్నాము, కాబట్టి దీని నుంచి విముక్తిని లక్ష్యంగా పెట్టుకున్నాము.

మనం ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు, మనల్ని మనం ముఖ్యమైన వ్యక్తిగా - విశ్వం యొక్క కేంద్రంగా భావించడం మానేస్తాము. సుఖాన్ని కోరుకోవడంలో, బాధను వద్దనుకోవడంలో ప్రతి ఒక్కరూ మనలాగే ఉన్నారని మనం గ్రహిస్తాము. అంతే కాకుండా, పూర్వజన్మలో, ఈ జన్మలో సమస్త జీవరాశులు మన పట్ల మంచి దయను చూపించాయి. వాళ్ళు లేకపోతే మనం తినలేం, త్రాగలేము, చదవలేము, రాయలేము, షాపులకు వెళ్ళలేము, సినిమాలను ఆస్వాదించలేము, లేదా పెద్దగా ఏ పనీ చెయ్యలేము. ఈ దయను మర్చిపోవడం సిగ్గుచేటు అని భావించి, వారి పట్ల జాలి, ప్రేమతో ఉత్తేజితులై, బోధిచిత్తను పెంపొందించుకుంటూ, ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి మన స్వంత జ్ఞానోదయాన్ని పొందాలని అనుకుంటాము.

Top