బౌద్ధమతాన్ని మన జీవితాలలో ఇంటిగ్రేట్ చేసుకోవడం

14:18
ధర్మం అంటే ఒక నివారణ చర్య అని అర్థం. మనకు సమస్యలు రాకుండా ఉండేందుకు మనం చేసే ఒక పని.

జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడానికే ధర్మం ఉంది

ధర్మ సాధనలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవాలంటే ముందు మనం చేయాల్సిన మొదటి పని మన జీవితంలో మనకు ఉన్న వివిధ రకాల సమస్యలు లేదా ఇబ్బందులను గుర్తించడం. ఆ తర్వాత ఈ సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడే ధర్మ అభ్యాసం చెయ్యడం.

ధర్మ సాధన అంటే కేవలం మంచి అనుభూతిని పొందడం, లేదా మంచి అభిరుచిని కలిగి ఉండటం లేదా ట్రెండీగా ఉండటం కాదు. ధర్మ సాధన మన సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అంటే ధర్మాన్ని నిజంగా ఆచరించాలంటే, అది అంత సులభమైన ప్రక్రియ కాదని మనం గ్రహించాలి. మన జీవితాల్లోని ఇబ్బందులను, సమస్యల నుంచి పారిపోకుండా, వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నామనే ఆలోచనతో ఉండాలి.

మన సమస్యలు అనేక రూపాల్లో ఉంటాయి. మనలో చాలా మందికి అవి తెలుసు - మనకు అభద్రతా భావం ఉంటుంది; ఇతరులతో మనకు ఇబ్బందులు ఉన్నాయి; మనం దూరమయ్యామని అనుకుంటూ ఉంటాం; మన భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ తో మనకు ఇబ్బందులు వస్తాయి – ఇవన్నీ మనందరికీ ఉండే సాధారణ సమస్యలే. మన కుటుంబాలతో మరియు మన తల్లిదండ్రులతో మనకు సమస్యలు వస్తాయి; వాళ్ళకు అనారోగ్యం వస్తుంది మరియు ముసలివాళ్లు  అవుతారు. మన స్వంత అనారోగ్యాలు మరియు వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడంలో మనకు ఇబ్బందులు వస్తాయి. మనం యువకులం అయితే, మన జీవితాలతో మనం ఏమి చేయబోతున్నామో, ఎలా జీవించాలో, ఏ దిశలో వెళ్లాలో గుర్తించడంలో ఇబ్బందులు పడతాము. మనం ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి.

గందరగోళం

మనమందరం అనుభవించే ఈ సమస్యలు కారణాల నుంచే వస్తున్నాయని గ్రహించడం బౌద్ధమతంలోని అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి. ఏ కారణం వల్లో అవి అక్కడ ఉన్నాయని కాదు. ఈ సమస్యలకు కారణం మన లోనే ఉంటుంది. ఇది ఒక పెద్ద అంతర్దృష్టి మరియు చాలా మందికి దీన్ని అంగీకరించడం సులభం కాదు. ఎందుకంటే మనలో చాలా మంది మన సమస్యలకు నిందను ఇతరులపై లేదా బయటి పరిస్థితులపై వేస్తాము. మనం ఇలా అనుకుంటాము, "నువ్వు చేసిన పని వల్ల నేను బాధలో ఉన్నాను - నువ్వు నాకు కాల్ చెయ్యలేదు; నువ్వు నన్ను వదిలేసావు; నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఇదంతా నీ తప్పే అని." లేదా మనం మన తల్లిదండ్రులపై నిందను వేస్తాము - మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఏమి చేశారు అని చూడము. లేదా ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి మొదలైన వాటిపై మనం నిందలు వేస్తాం. ఇప్పుడు, వాస్తవానికి, ఇవన్నీ మన జీవిత అనుభవంలో పాత్రను పోషిస్తాయి. బౌద్ధమతం దానిని ఖండించదు. కానీ ప్రధాన కారణం, మన సమస్యలకు లోతైన కారణం మన లోనే ఉంది - ఇదే మన స్వంత ఆలోచన, ముఖ్యంగా మన గందరగోళం.

మన జీవితంలో బౌద్ధమతాన్ని ఆచరించడం అంటే బౌద్ధమత ఆలోచనను స్పష్టంగా నిర్వచించే ఒక అంశాన్ని మనం కనిపెట్టాలనుకోవడం అని నేను చెబుతాను. మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, దాని మూలాన్ని కనిపెట్టడానికి మన లోపల వెతుకుతాము మరియు దాన్ని గుర్తించిన తర్వాత, దాన్ని మన లోపలి నుంచి తీసెయ్యడానికి ప్రయత్నిస్తాము. మన సమస్యలకు కారణాలను కనిపెట్టడం గురించి మనం మాట్లాడేటప్పుడు, నేను చెడ్డ వ్యక్తిని మరియు నేను మారాలి మరియు మంచిగా ఉండాలి అని నైతిక నిర్ణయం తీసుకోవడంపై ఆధారపడి ఉండదు. బౌద్ధమతం నైతిక తీర్పులు ఇవ్వదు. మనం మన సమస్యలకు మూలాన్ని మనం లోపలే కనిపెట్టడానికి ప్రయత్నిస్తాము, ఎందుకంటే మనం బాధపడి ఆ సమస్యలను మరియు అసంతృప్తిని వదిలించుకోవాలని అనుకుంటాము. వాటికి ప్రధాన కారణం మన స్వంత ఆలోచనలే. ముఖ్యంగా బుద్ధుడు మన సమస్యలకు, బాధలకు లోతైన కారణం మన అయోమయమే అని చెప్పారు. కాబట్టి, మనం చెయ్యాల్సింది ఏమిటంటే, అసలు మనకు ఏమి జరుగుతుందో మనం ఎలా గందరగోళానికి గురవుతున్నామో అని సరైన అవగాహనను పొంది దాన్ని ఎలా సరిదిద్దవచ్చో తెలుసుకోవాలి.

మన గందరగోళం దేని వల్ల వస్తుంది? ఇది అనేక విషయాల గురించి ఉంటుంది. ఒకటి ప్రవర్తనా కారణం మరియు ఇంకొకటి ప్రభావం. మనం ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తే అది మనకు ఎటువంటి ప్రభావాన్ని చూపదని మనం అనుకుంటాము. ఉదాహరణకు, "నేను ఆలస్యంగా రావచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు, అయినా ఏమీ పర్వాలేదు" అని మనం అనుకుంటాము. అది తప్పు; అది చాలా గందరగోళంగా ఉంటుంది. లేదా మనం చేసే పని లేదా ప్రవర్తించే విధానం ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుందని అనుకుంటాము, అది అసంబద్దమైనది మరియు అలా జరగకపోవచ్చు. ఉదాహరణకు, "నేను మీతో మంచిగా ఉన్నాను, కాబట్టి మీరు కూడా నన్ను ప్రేమిస్తారు. నేను నీకు ఒక మంచి బహుమతిని కొన్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవు?" అని. ఇలాంటి ఆలోచనలతో, మన పనులు మరియు ప్రవర్తన అసాధ్యమైన ప్రభావాన్ని చూపుతాయని లేదా అవి సాధ్యమైన వాటికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని అనుకుంటాము. అలాగే, కొన్ని విషయాలు ఒక రకమైన ప్రభావాన్ని కలిగిస్తాయని మనం అనుకోవచ్చు; కానీ, వాస్తవానికి, అవి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఉదాహరణకు, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాము, కాబట్టి సంతోషంగా ఉండటానికి మార్గం ఎప్పుడూ తాగడమే అని మనం అనుకుంటాము. కానీ ఇది ఆనందం కంటే ఇంకా ఎక్కువ సమస్యలను తెచ్చిపెడుతుంది.

మనం ఎలా ఉన్నాం, ఇతరులు ఎలా ఉన్నారు మరియు ప్రపంచం ఎలా ఉంది అనే దాని గురించి ఆలోచించడం ఇంకొక విషయం. ఉదాహరణకు, వృద్ధాప్యం మరియు అనారోగ్యానికి గురికావడం వల్ల మనం బాధపడి అసంతృప్తి చెందుతాము. కానీ మనుషులుగా ఇంకేం ఆశించగలం? మనుషులు అనారోగ్యానికి గురవుతారు, మరియు ముసలివాళ్లుగా అవుతారు, మనం చిన్న వయసులోనే చనిపోతే తప్ప – ఇవన్నీ పెద్దగా ఆశ్చర్యపడే విషయాలేమీ కాదు. మనం అద్దంలో నెరిసిన జుట్టును చూసుకుని దాని గురించి అసంతృప్తి మరియు దిగ్భ్రాంతి చెందడం ప్రారంభించినప్పుడు, ఇది అవాస్తవికమైనది మరియు ప్రపంచం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి గందరగోళంగా అనిపిస్తుంది.

వయసు పెరిగే కొద్దీ మనకు సమస్యలు ఉన్నాయని అనుకుందాం. దాని గురించి మన గందరగోళం కారణంగా - దాని యొక్క వాస్తవికతను అంగీకరించకపోవడంతో - కలవరపరిచే భావోద్వేగాలు మరియు వైఖరుల ప్రభావంతో మనం విధ్వంసకరమైన మార్గాల్లో ప్రవర్తిస్తాము. ఉదాహరణకు, యవ్వనంగా మరియు ఆకర్షణీయంగా కనిపించడానికి కష్టపడుతూ, మనం సురక్షితంగా ఉంటామని ఆశించే వాటిని పొందడానికి కోరికతో పనిచేస్తాము - ఇతరుల శ్రద్ధ మరియు ప్రేమ, ముఖ్యంగా మనకు ఆకర్షణీయంగా అనిపించే యువకుల దృష్టి మరియు ప్రేమ లాంటిది. ఈ సిండ్రోమ్ వెనుక సాధారణంగా నేను ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిని అనే ఆలోచన ఉంటుంది; నేనే ఈ విశ్వానికి కేంద్రం అని. కాబట్టి అందరూ నన్నే పట్టించుకోవాలి. నేను ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరూ నన్ను ఆకర్షణీయంగా చూసి ఇష్టపడాలి అని. ఎవరైనా మనల్ని ఆకర్షణీయంగా చూడకపోతే లేదా వాళ్ళు మనల్ని ఇష్టపడకపోతే అది మనకు పిచ్చి ఎక్కిస్తుంది. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే మనకు ఇంకా పిచ్చి ఎక్కుతుంది - వారు మనల్ని ఆకర్షణీయంగా చూడాలని కోరుకున్నప్పుడు, శారీరకంగా కాకపోయినా, కనీసం ఏదో ఒక విధంగానైనా మనపై దృష్టి పెట్టకపోతే ఇలా జరుగుతుంది. అందరికీ శాక్యముని బుద్ధుడు నచ్చలేదు. కాబట్టి అందరూ మనల్ని ఇష్టపడాలనే ఆలోచన ఎందుకు!

అందరికీ నచ్చాలనే మన కోరిక అవాస్తవికమైన ఆశ. ఇది రియాలిటీ కాదు. ఇది గందరగోళం, కోరిక, అనుబంధం ఆధారంగా ప్రతి ఒక్కరూ మనల్ని ఆకర్షణీయంగా భావించి మనపై దృష్టి పెట్టాలి అని అనుకుంటాము. అమాయకత్వం వెనుక కలవరపరిచే వైఖరి ఉంటుంది. మనం చాలా ముఖ్యం మరియు అందరూ మనల్ని ప్రేమించాలని అనుకుంటాము, కాబట్టి అతనిలో ఏదో తప్పు ఉంది అందుకే నన్ను ఇష్టపడటం లేదు అని మనం అనుకుంటాం. లేదా అంతకంటే ఘోరంగా, మనల్ని మనం అనుమానించు కోవడం ప్రారంభిస్తాము: "నాలో ఏదో లోపం ఉంది, అందుకే ఈ వ్యక్తి నన్ను ఇష్టపడటం లేదు అని అనుకుంటాము", అప్పుడు మనం చెడ్డగా భావించి అపరాధ భావనకు లోనవుతాము. ఇదంతా అమాయకత్వం.

అలాంటప్పుడు మన గురించి మనం పని చేసుకోవడమే ముఖ్యమైన విషయం. ధర్మ సాధన అంటే ఇదే. పరిస్థితులు ఎలా ఉన్నా - మనకు ఇబ్బందులు, అభద్రతా భావం లేదా ఇంకేవైనా ఉన్నా, మన గురించి మనం ఆలోచించుకోవాలి. నేను అనుభవిస్తున్న ఈ కలవరపరిచే భావోద్వేగాల వెనుక గందరగోళం ఎక్కడ ఉంది? ఏదేమైనా, మనం అభివృద్ధి చెందిన సమస్యలను ఎదుర్కొంటున్న సంబంధాన్ని చూస్తున్నట్లయితే, గందరగోళంలో ఉన్నది మనం మాత్రమే కాదని గ్రహించాలి. సహజంగానే అవతలి వ్యక్తి కూడా అయోమయంలో ఉంటాడు. ఇక్కడి విషయం ఏమిటంటే, "మీరే మారాలి; నేను చేస్తున్న ప్రతిదీ సరైనదే మరియు పరిపూర్ణమైనదే; మారాల్సింది నువ్వు మాత్రమే." మరోవైపు, నేను మాత్రమే మారాలని చెప్పను, ఎందుకంటే అది అమర వీరుల సముదాయాన్ని దిగజార్చుతుంది. మనం అవతలి వ్యక్తితో విషయాలను బహిరంగంగా చర్చించడానికి ప్రయత్నిస్తాము – అయినా కానీ, ఆ వ్యక్తి దీన్ని అంగీకరించాలి. మనిద్దరం అయోమయంలో ఉన్నామని అంగీకరించాలి. మన రిలేషన్ షిప్ లో ఏం జరుగుతోందో అని అర్థం చేసుకుంటున్న విషయంలో మన ఇద్దరిలో ఒక సమస్య ఉంది, కాబట్టి మన ఇద్దరిలో ఉన్న అయోమయాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది ముందుకు సాగడానికి అత్యంత వాస్తవికమైన మరియు ధార్మిక మార్గం.

ధర్మాన్ని ఆచరించే ముందు దాన్ని అర్థం చేసుకోవడం

బౌద్ధమత అభ్యాసంలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని ట్రిక్స్ ఎలా ప్లే చేయాలో నేర్చుకోవాలి అని సూచనలు పొందినంత మాత్రాన సరిపోదు. ఏదైనా అభ్యాసంతో, కష్టాలను అధిగమించడంలో అది మనకు ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ అభ్యాసాన్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలనే మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఊహలను కూడా మనం తెలుసుకోవాలి. దీని అర్థం మనం అధునాతన పద్ధతులతో ప్రారంభించము. ధర్మ బోధనలు ఎలా రూపుదిద్దుకున్నాయో, ఏ ప్రాక్టీస్ తో ఏం జరుగుతోందో తెలుసుకునేలా మొదటి నుంచి ఒక పునాదిని వేస్తాం.

ఇప్పుడు, "మీకు ఏదైనా టాబ్లెట్ ఇస్తే, అది ఎలా పనిచేస్తుంది అని ప్రశ్నలు వెయ్యకుండా దాన్ని వేసుకోండి!" అనే బోధనలను మనం చదువుతాము. ఇది మంచి సలహా అయినప్పటికీ, ఇది తీవ్రమైన హెచ్చరిక అని మనం అర్థం చేసుకోవాలి. కేవలం అధ్యయనం చేసి బోధనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే తప్ప, మనం నేర్చుకున్న వాటిలో దేనిని ఆచరణలో పెట్టకూడదు. మనం ఆ ఎక్స్ట్రీమ్ ని నివారించాలని అనుకుంటున్నాం. అయితే, మనం నివారించాల్సిన మరో ఎక్స్ట్రీమ్ కూడా ఉంది. అలాంటప్పుడు ఏదో ఒక ఆచారానికి సంబంధించి కొన్ని ధర్మ సూచనలను మనం వింటుంటే గుడ్డిగా వాటి గురించి ఏమిటో మనకు తెలియకపోయినా వాటిని మనం పాటించాలి. ఆ ఎక్స్ట్రీమ్ నుంచి వచ్చే ప్రధాన సమస్య ఏమిటంటే, ఈ అభ్యాసాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మనకు నిజంగా అర్థం కాదు. ఏదైనా ప్రాక్టీస్ వెనుక ఉన్న పాయింట్ ను మనం అర్థం చేసుకుంటే - అది ఎలా పనిచేస్తుందో మరియు దాని ఉద్దేశ్యం ఏమిటో మనం అర్థం అవుతుంది. అప్పుడు దాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఎవరూ చెప్పనవసరం లేదు. మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం మరియు దానిని ఎలా అన్వయించుకోవాలో మనకు తెలుసుకుంటాం.

మన సమస్యలను తొలగించుకోవడం గురించి మాట్లాడేటప్పుడు, మనం మన స్వంత వ్యక్తిగత సమస్యలను తొలగించడం గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇతరులకు సహాయం చెయ్యడంలో మనకు ఉన్న ఇబ్బందులను వదిలించుకోవడం గురించి కూడా మాట్లాడుతున్నాము. "బద్ధకం, స్వార్థం, చాలా బిజీగా ఉండటం వల్ల ఇతరులకు సహాయం చెయ్యడంలో నాకు సమస్యలు ఉన్నాయి." లేదా, "మీ సమస్య ఏమిటో నాకు అర్థం కాలేదు మరియు మీకు సహాయం చెయ్యడానికి ఏమి చెయ్యాలో నాకు తెలియదు." మనకు ఉన్న పెద్ద సమస్య అదే కదా? ఇతరులకు సహాయం చెయ్యడంలో ఈ ఇబ్బందులన్నీ మన గందరగోళం వల్లే వస్తాయి. ఉదాహరణకు, నేను సర్వ శక్తిమంతుడైన దేవుడిలా ఉండాలి మరియు అదే మీ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది; మరియు ఇది మీ అన్ని సమస్యలను పరిష్కరించకపోతే, మీలో ఏదో తప్పు ఉంది అని. నువ్వు సరిగ్గా చెయ్యలేదు, కాబట్టి మీరు దోషులు. లేదా నేను దోషిని ఎందుకంటే నేను మీ సమస్యలను పరిష్కరించలేదు కాబట్టి. అందుకని నేను మంచి వ్యక్తిని కాదు. మళ్ళీ, ఇది కారణం మరియు ప్రభావం గురించి ఉన్న గందరగోళం.

ధర్మం పట్ల విశ్వాసం

ఇంకొక విషయం ఏమిటంటే, మన జీవితంలో ధర్మాన్ని నిరాటంకంగా అన్వయించుకోవాలంటే, మన సమస్యల నుంచి బయటపడటం నిజంగా సాధ్యమే అనే నమ్మకం ఉండాలి. ప్రాథమిక బౌద్ధమత విధానాన్ని అనుసరించడం ద్వారా మన గందరగోళాన్ని వదిలించుకోవడం సాధ్యమేనని మనం నమ్మాలి: దేనినైనా వదిలించుకోవడానికి, అది వచ్చే కారణాలను తొలగించాలి. కానీ, నిజానికి, మన ఇబ్బందులన్నిటినీ తొలగించడం సాధ్యమేనని లోతైన, దృఢమైన నమ్మకాన్ని పొందడం చాలా కష్టం, అలా అది మళ్ళీ జరగదు, అలాగే మోక్షం మరియు జ్ఞానోదయం పొందడం సాధ్యమే అనే దృఢమైన నమ్మకాన్ని పొందడం కూడా చాలా కష్టమే. ముక్తి, జ్ఞానోదయం అంటే ఏమిటో కూడా అర్థం కానప్పుడు ఇది చాలా కష్టం. కాబట్టి వాటిని సాధించడం సాధ్యమేనా కాదా అని మనం నిజంగా ఎలా తెలుసుకోగలం? అలా ఉండటం సాధ్యమని మనం అనుకోకపోతే, మనం కూడా తెలియని దాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం అమాయకత్వం కాదా? అప్పుడు అది మనం ఆడుతున్న ఒక రకమైన పిచ్చి ఆట అవుతుంది; మన ధర్మ ఆచారం నిజమైనది కాకుండా పోతుంది.

మనం నిజంగా నమ్మాలంటే చాలా అధ్యయనం, అవగాహన, లోతైన ఆలోచన మరియు ధ్యానం అవసరం. మోక్షం, జ్ఞానోదయం సాధించడం నాకు సాధ్యమే అని మనం నమ్మాలి. వాటిని సాధించడం శాక్యమునికి మాత్రమే సాధ్యం అని అనుకోకుండా వాటిని నేను కూడా సాధించగలను, మరియు ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యమే అని అనుకోవాలి. మన గందరగోళం నుంచి బయటపడాలంటే మనం ఏం చెయ్యాలో అర్థం చేసుకోవాలి. నిజంగా మనం దాన్ని వదిలించుకోవాలంటే ఏం చెయ్యాలి? మనల్ని గందరగోళం నుంచి కాపాడేది సరైన అవగాహన; కాబట్టి, సరైన అవగాహన గందరగోళాన్ని ఎలా పోగొడుతుందో మరియు దాన్ని ఎలా తొలగించగలదో మనం అర్థం చేసుకోవాలి, అప్పుడే అది మళ్ళీ రాకుండా ఉంటుంది. వీటన్నిటి ఫలితంగా, ధర్మ సాధన నిజ జీవితంలోనే జరుగుతుందని మనం చూస్తాము; ఇది మన సమస్యలను, మన గందరగోళాన్ని మరియు జీవితంలోని మన కష్టాలను డీల్ చేస్తూ ఉంటుంది.

ధర్మ సాధనకు ఆత్మపరిశీలన అవసరం

ధర్మ సాధన అనేది కేవలం మన జీవితంలో, ఒక మంచి నిశ్శబ్దమైన ధ్యాన గుహకు లేదా మన గదిలోకి వెళ్లి, దేనితో సంబంధం లేకుండా  కుషన్ మీద కూర్చొని బ్రేక్ తీసుకోవడం కాదు. తప్పించుకోవడం ధర్మ ఆచరణలో ప్రధాన అంశం కాదు. మనం ధ్యానం చేసుకోవడానికి ఒక నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మన జీవితంలో మన సమస్యలను ఎదుర్కోవటానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అలా చేస్తాము. ముఖమైన ఫోకస్ జీవితంపైనే ఉండాలి. కూర్చొని ధ్యానం చేస్తూ ఒలింపిక్ మెడల్ గెలవడంపై ఫోకస్ పెట్టకూడదు! 

ధర్మ సాధన అంటే ధర్మాన్ని జీవితంలో అన్వయించుకోవడం. ధర్మ సాధన అనేది ఒక ఆత్మపరిశీలన. దానితో, మన భావోద్వేగ స్థితులు, మన ప్రేరణలు, మన ఆలోచనలు మరియు మన బలవంతపు ప్రవర్తనా విధానాలపై శ్రద్ధ వహించడానికి ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఆందోళన కలిగించే భావోద్వేగాలను మనం గమనించాలి. ఇబ్బంది పెట్టే భావోద్వేగం లేదా విధానం యొక్క లక్షణం ఏమిటంటే, అవి మనకు లేదా ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మనం మనశ్శాంతిని కోల్పోయి అదుపు తప్పుతాం. ఇది చాలా ఉపయోగకరమైన నిర్వచనం ఎందుకంటే ఇది తెలుసుకుంటే అప్పుడు మనం ఒకరి ప్రభావంతో పనిచేస్తున్నప్పుడు గుర్తించడానికి సహాయపడుతుంది. మనకు అసౌకర్యంగా అనిపిస్తే మన మనస్సులో ఏదో జరుగుతోందని మనకు అర్ధం అవుతుంది. ఇలాంటి సమయాల్లో లోపల ఏం జరుగుతోందో తెలుసుకుని, దాన్ని సరిదిద్దడానికి విరుగుడు మందులు వాడాలి.

దీనికి మన లోపల ఏమి జరుగుతుందో అని తెలుసుకోవడానికి చాలా సున్నితంగా ఉండాలి. మన భావోద్వేగ స్థితిని మార్చడానికి ఏదైనా చేయాలంటే, అది ఇబ్బందికరంగా అనిపిస్తే, అది మనకు మరియు ఇతరులకు చాలా అసంతృప్తిని సృష్టిస్తుందని తెలుసుకోవాలి. అది మనకు వద్దు. ఇప్పటికే అది ఎక్కువయ్యింది. ఇంకా మనం పాడయ్యితే ఎవరికైనా ఎలా సహాయం చెయ్యగలం?

అనువైన విధంగా ఉండటం

ధర్మ సాధనకు ఒకటి రెండు కాదు అనేక విభిన్న ప్రత్యర్థి శక్తులు అవసరం. మన జీవితాలు చాలా సంక్లిష్టమైనవి మరియు ఒకే విరుగుడు ఎప్పుడూ పనిచెయ్యదు. ప్రతి పరిస్థితిలో ఒక నిర్దిష్ట ప్రాక్టీస్ అంత ప్రభావవంతంగా ఉండదు. మన జీవితంలో విషయాలను నిజంగా అన్వయించుకోగలగడానికి బాగా అనువైన విధంగా ఉండటం మరియు అనేక పద్ధతులు అవసరం. ఇది పని చెయ్యకపోతే, మనం అది చేస్తాము; అది పని చెయ్యకపోతే, మనం దీన్ని ప్రయత్నిస్తాము.

మీరు జీవితంలో ఏదైనా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఎప్పుడూ రెండు లేదా మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలను కలిగి ఉండాలని నా గురువు సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారు చెప్పేవారు. అప్పుడు, ప్లాన్ A పని చెయ్యకపోతే, మీరు ఆపెయ్యకూడదు. ఎందుకంటే మీకు B లేదా C అనే రెండు బ్యాకప్ ప్లాన్ లు ఉంటాయి. వాటిలో ఒకటి ఆఖరుకి పనిచేస్తుంది. ఇది నాకు చాలా ఉపయోగకరమైన సలహాగా అనిపిస్తుంది. ధర్మం విషయంలో కూడా అదే జరుగుతుంది: ఏ పరిస్థితిలో అయినా పద్ధతి A పని చెయ్యకపోతే, మనకు ఎప్పుడూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. మనం చూడవలసిన ఇతర విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి, వివిధ పద్ధతులు మరియు ధ్యానాలను నేర్చుకున్న తర్వాత మనం శారీరక శిక్షణ లాగా నేర్చుకొనేటప్పుడు ఈ సాధన చేస్తాము. ఈ పద్ధతుల గురించి తెలుసుకోవడానికి మనల్ని మనం శిక్షణ ఇచ్చుకుంటాము, అలా మనకు అవసరమైనప్పుడు వాటిని రోజూ జీవితంలో అప్లై చేసుకుంటాము. దీనికి ధర్మ సాధనను ఒక అభిరుచిగా కాకుండా, ఫుల్-టైమ్ నిబద్ధతగా చూడాల్సిన అవసరం ఉంది.

ఎక్స్ట్రీమ్ లను నివారించండి

మనం మన కుటుంబాలలో ధర్మ ఆచారాన్ని అప్లై చేస్తాము. మన తల్లిదండ్రులతో, మన పిల్లలతో వ్యవహరించేటప్పుడు మరియు పనిలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మనం దీనిని ఉపయోగిస్తాము. ఇలా చెయ్యడం వల్ల మనం వివిధ ఎక్స్ట్రీమ్ లను దూరం చేసుకోవాలి. ఈ విషయం గురించి మనం ఇంతకు ముందే కొంచెం మాట్లాడుకున్నాం. మన సమస్యలకు నిందను ఇతరులపై మోపడం లేదా ఆ నిందను పూర్తిగా మన పైనే వేసుకోవడం మానుకోవాలి – దీని కోసం మనందరం సహకరించాలి. ఇతరులను మార్చడానికి మనం ఇలా ప్రయత్నించవచ్చు, కానీ మనల్ని మనం మార్చుకోవడమే సులభం.

కాబట్టి, సొంత-మెరుగుదలపై దృష్టి పెట్టాలి; కానీ ఇలా చేయడంలో, నార్సిసిస్టిక్ సొంత-ఆందోళన యొక్క తీవ్రతను నివారించడానికి మనం ప్రయత్నించాలి. మన సొంత పనిలో ఉంటూ ఎప్పుడూ మనల్ని మనం చూసుకుంటాము, ఇతరులను పట్టించుకోము. ఇది మనమే విశ్వానికి కేంద్రం మరియు మన సమస్యలు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనవి అనే భావనను బలపరుస్తుంది. ఎవరి సమస్యలు మనకు ముఖ్యం కాదు లేదా మనకు ఏవీ బాధ పెట్టవు.

మనమందరం చెడ్డవాళ్లమని, లేదా మంచి వాళ్లమని అనుకోవడం ఇంకొక ఎక్స్ట్రీమ్. మన కష్టమైన కోణాలను, మనం పనిచేయాల్సిన పనులను గుర్తించాల్సిన అవసరం ఉన్న మాట నిజమే. కానీ మన పాజిటివ్ కోణాలను, లక్షణాలను కూడా మనం గుర్తించాలి, అలా మనం వాటిని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోగలం. మనలో చాలా మంది పాశ్చాత్యులకు ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది. మన సమస్యలు మరియు గందరగోళంపై ఎక్కువగా దృష్టి పెడితే, ఇది మన ఆత్మగౌరవాన్ని సులభంగా బలపరుస్తుంది. ఇది అసలు పాయింట్ అయితే కాదు.

మన భావోద్వేగాలను గమనిస్తూనే, మన మంచి లక్షణాలను గుర్తుంచుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవాలి. క్రూరమైన వ్యక్తులకు కూడా మంచి లక్షణాల యొక్క అనుభవం కొంత ఉంటుంది. నిస్సందేహంగా, వారు కుక్కపిల్ల లేదా పిల్లి పిల్లిని తమ ఒడిలో ఉంచుకోవడం, దానిని పెంచుకోవడం మరియు దాని పట్ల కొంచెం ప్రేమను అనుభూతి చెందడం వంటి వాటిని పొందారు. దాదాపు ప్రతి ఒక్కరికి ఆ అనుభవం ఉంటుంది. కాబట్టి, ఇలాంటి కొంత ప్రేమను ఇవ్వగలమని మనం గుర్తించి ఈ పాజిటివ్ కోణాలను చూడగలుగుతాము. ధర్మ సాధన అనేది కేవలం మన నెగెటివ్ కోణాల్లో పనిచేయడం మాత్రమే కాదు; ఇది సమతుల్యంగా ఉండాలి. మన పాజిటివ్ కోణాలను బలోపేతం చెయ్యడానికి కూడా మనం కష్టపడాలి.

ఇలా మన లోపాలను మరియు మన మంచి లక్షణాలను చూడటం మధ్య బ్యాలెన్స్ ను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనం వేరే ఎక్స్ట్రీమ్ లను నివారించాలి. ఒక ఎక్స్ట్రీమ్ అపరాధ భావం, "నేను చెడ్డవాడిని. నేను ప్రాక్టీస్ చేయాలి మరియు నేను ప్రాక్టీస్ చేయనందుకు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యాను." ఈ మాటలను మనం తొలగించాలి. ఇది అసలు "ఉండవలసిన" విషయం కాదు. మనకున్న సమస్యల నుంచి బయటపడాలంటే, భవిష్యత్తులో వేరే సమస్యలు రాకుండా ఉండాలంటే, "నేను నా సమస్యను వదిలించుకోవాలనుకుంటే, ఈ ప్రాక్టీస్ చెయ్యాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసినా చెయ్యకపోయినా అది మన ఇష్టం. "నువ్వు దీన్నే చెయ్యాలి, అలా చెయ్యకపోతే, నువ్వు చెడ్డవాడివి" అని ఎవరూ చెప్పడం లేదు.

కానీ, మనం మరొక ఎక్స్ట్రీమ్ ను కూడా నివారించాలి, అదే, "మనమందరం పర్ ఫెక్ట్ గా ఉన్నాము; మీ బుద్ధ స్వభావాన్ని చూడండి మరియు ప్రతిదీ పరిపూర్ణమైనది" అని అనుకోవడం. ఇది చాలా ప్రమాదకరమైన ఎక్స్ట్రీమ్. ఎందుకంటే ఇది మనం మారాల్సిన అవసరం లేదని చెప్తుంది; మనం ఇప్పటికే బాగున్నాము కాబట్టి మన ప్రతికూల మార్గాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మనం ఈ రెండు ఎక్స్ట్రీమ్ లను అవాయిడ్ చెయ్యాలి - మనం చెడ్డవాళ్లమని భావించడం. అసలు మన బాధ్యత మనమే తీసుకోవాలి. మన జీవితంలో ధర్మాన్ని ఏకీకృతం చేయడానికి అదే కీలకమైనది. మన జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి మనమే బాధ్యత తీసుకుంటాం.

ప్రేరణ

మన కోసం మనం కష్టపడుతుంటే, ఆధ్యాత్మిక గురువుల నుంచి, అలాగే మనతో ప్రాక్టీస్ చేస్తున్న ఇతర వ్యక్తుల నుండి ప్రేరణను పొందవచ్చు. ఏదేమైనా, చాలా మందికి, చాలా శతాబ్దాల క్రితం గురువులు గాలిలో ఎగిరే వారని చెప్పే అద్భుతమైన ఉపాధ్యాయుల కథలు నుంచి సరైన ప్రేరణ లభించదు. ఎందుకంటే ఇలాంటి విషయాలని రిలేట్ చేసుకోవడం చాలా కష్టం మరియు అవి మనల్ని పూర్తి మ్యాజిక్ ట్రిప్ లోకి తీసుకెళ్తాయి. పరిచయం తక్కువగా ఉన్నా కానీ మనకు నిజంగా ఎవరితో అయితే కొంత పరిచయం ఉందో వాళ్లనే ఉదాహరణగా తీసుకోవడం మంచిది.

బుద్ధులు లేదా నిజమైన అర్హత కలిగిన ఉపాధ్యాయులు మనల్ని ఆకట్టుకోవడానికి మనల్ని ప్రేరేపించడానికి ప్రయత్నించరు. వాళ్లు సూర్యుడితో సమానం అని ఉదాహరణగా చెప్పవచ్చు. సూర్యుడు వేడి ఇవ్వడానికి ప్రయత్నించడు; సూర్యుడు ఎలాగైతే ఉంటాడో సహజంగానే మనకు వేడి వస్తుంది. గొప్ప ఆధ్యాత్మిక గురువుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. వారు జీవితంలో ఉన్న విధానం, వారి స్వభావం మరియు వాళ్ళు వ్యవహరించే మార్గాల నుంచి సహజంగానే మనకు ప్రేరణను ఇస్తారు. ఇది మ్యాజిక్ ట్రిక్ ఏమీ కాదు. అత్యంత స్ఫూర్తిదాయకమైనది మరింత వాస్తవికమైనది. వాళ్లకు మంచి స్వభావం ఉంటుంది.

నాకు డుడ్ జోమ్ రింపోచే గారు గుర్తున్నారు. అతను చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. అతను నైంగ్మా వంశానికి హెడ్ మరియు నా గురువులలో ఒకరు. అతనికి భయంకరమైన ఆస్తమా ఉంది. నాకు కూడా ఆస్తమా ఉంది కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు కూడా తెలుసు. సాధారణంగా శ్వాస తీసుకోలేనప్పుడు బోధనను ఇవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు ఎందుకంటే కావలసిన గాలి తీసుకోవడానికి చాలా శక్తి అవసరం. ఆ పరిస్థితిలో మీ శక్తిని ఉపయోగించడం చాలా కష్టం. అయినా కానీ, డుడ్ జోమ్ రింపోచే గారు ఇప్పటికీ ఆ భయంకరమైన ఆస్తమాతో బాధపడుతూ స్టేజీ పైకి వెళ్లి బోధించడం నేను చూసాను. ఆస్తమాతో ఆయన ఏమాత్రం ఇబ్బంది పడలేదు మరియు అద్భుతమైన బోధనలు ఇస్తూ నమ్మశక్యం కాని మనిషిగా ఉన్నారు. ఇది నమ్మశక్యం కాని స్ఫూర్తి, చాలా మంచి వ్యక్తి, ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ ట్రిక్ లేదు. ఇది నిజ జీవిత పరిస్థితులతో డీల్ చేస్తుంది మరియు ఇది స్ఫూర్తిదాయకమైనది.

ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ప్రోగ్రెస్ ని సాధిస్తున్నప్పుడు మన నుంచి కూడా మనం ప్రేరణను పొందవచ్చు. ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రేరణకు సోర్స్. మన ప్రోగ్రెస్ నుంచి మనం ప్రేరణను పొందుతాము. కానీ ఇలా చెయ్యడంలో మనం చాలా సున్నితంగా ఉండాలి. చాలా మంది ప్రజలు ఈ అంశాన్ని భావోద్వేగంగా మేనేజ్ చెయ్యలేరు, ఎందుకంటే మనం కొంత ప్రోగ్రెస్ ను సాధిస్తే అది అహంకారం మరియు గర్వపడే ధోరణిలా కనిపిస్తుంది. కాబట్టి, ప్రోగ్రెస్ అంటే ఏమిటో మనం జాగ్రత్తగా డిఫైన్ చెయ్యాలి.

మార్గంలో ఉన్న ప్రోగ్రెస్

అన్నింటికంటే ముందు, ప్రోగ్రెస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని మనం గ్రహించాలి; అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఇది సంసారం యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి, మరియు ఇది అధిక మరియు తక్కువ పునర్జన్మల గురించి మాత్రమే కాదు. సంతోషం మరియు కష్టాలు రావడం అనేది రోజువారీ జీవితాన్ని కూడా సూచిస్తుంది. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను అసంతృప్తిగా ఉన్నాను. మన మూడ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ చెయ్యాలని అనిపిస్తుంది, ఇప్పుడు నాకు ప్రాక్టీస్ చెయ్యాలని అనిపించడం లేదు అనే ఆలోచన ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అందుకే ఆశ్చర్యపోకండి. నిజానికి, మనం ఒక ‘అర్హత్’ గా, ముక్తితో సంసారం లేని జీవిగా మారే వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. నమ్మశక్యం కాని రీతిలో ముందుకు సాగిన సంసారం అలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి చాలా కాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత అకస్మాత్తుగా పర్సనల్ రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఇబ్బందులు ఎదురైనప్పుడు నిరుత్సాహ పడకండి. దీని అర్థం మనం ఒక భయంకరమైన అభ్యాసకులమని కాదు. మన సంసార పరిస్థితిని బట్టి చూస్తే ఇది సహజమైనదే.

ధర్మ ఆచరణలో సాధారణంగా అద్భుతాలు జరగవు. మనం జీవితంలో ధర్మాన్ని అన్వయించుకోవాలనుకుంటే, అద్భుతాలను ఆశించవద్దు, ముఖ్యంగా మన ప్రోగ్రెస్ లో. ప్రోగ్రెస్ ని రియలిస్టిక్ గా ఎలా అంచనా వెయ్యాలి? దలైలామా గారు చెప్పేది ఏమిటంటే, ధర్మ ఆచారాన్ని ఒకట్రెండు సంవత్సరాల సమయంలో మాత్రమే చూడకండి. ఐదేళ్ల ప్రాక్టీస్ పరంగా చూస్తే, "నేను ఐదు, పది సంవత్సరాల క్రితం కంటే ప్రశాంతంగా ఉన్నానా? నేను ఇంకా కష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలనా మరియు వాటి వల్ల అంతగా ఇబ్బంది పడకుండా ఉండగలనా?" అని ఆలోచించాలి. అలా అయితేనే మనం కొంత ప్రోగ్రెస్ ని సాధించాం అని అర్ధం, అదే స్ఫూర్తిదాయకమైనది. మనకు ఇంకా సమస్యలు ఉన్నాయి, కానీ ఇది మనం ముందుకు సాగడానికి బలాన్ని ఇస్తుంది. కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం అంతగా బాధ పడము. మనం తొందరగా కోలుకుంటాము.

ప్రేరణకు ఒక సోర్స్ గా మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ ప్రేరణ మనకు సరైన మార్గంలో వెళ్ళడానికి బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం సరైన దిశలో వెళ్తున్నామనే నమ్మకం ఉంటుంది. మనకు ఆ వాస్తవిక ఆలోచన ఉంటేనే సరైన దిశలో వెళ్తున్నామని మనం నమ్ముతున్నాము - అంటే ఆ సాధారణ దిశలో వెళ్ళేటప్పుడు, మనం ఎప్పుడూ ఒడిదుడుకులను ఎదుర్కుంటూ ఉంటాము.

ధర్మ సాధనను మన రోజువారీ జీవితంలో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో కొన్ని సాధారణ ఆలోచనలు ఇవి. ఇవి మీకు సహాయపడతాయని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.

Top