బౌద్ధమతంలో ప్రార్థన అంటే ఏమిటి?

Study buddhism prayer 02

మానవ నాగరికత యొక్క పురాతన మనుగడలో ఉన్న సాహిత్యంలో కొన్ని ప్రార్థనకు సంబంధించినవి, సుమేరియన్ ఆలయ శ్లోకాల నుండి దేవుళ్ల పురాతన ఈజిప్టు మంత్రాల వరకు. నేడు, ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలలో ఏదో ఒక ప్రార్థన అంశం అనేది ఉంటుంది. క్రైస్తవులు, ముస్లిములు మరియు యూదులు దేవుడిని ప్రార్థిస్తారు, హిందువులు తమ ప్రార్ధనలను సమర్పించడానికి వివిధ దేవుళ్ల దగ్గరకు వెళ్తారు. బయట బౌద్ధమతం దీనికి భిన్నంగా ఏం లేదు. దాదాపు ఏ బౌద్ధ దేశంలోనైనా ఆలయం లేదా మఠాన్ని సందర్శించినప్పుడు, సందర్శకుల గుంపులు గుంపులుగా, చేతులు జోడించి, బుద్ధుని విగ్రహాల ముందు ప్రార్ధనలు చెయ్యడం మీరు గమనించవచ్చు. టిబెటన్ బౌద్ధమతం గురించి తెలిసినవారికి, ఆంగ్లంలోకి అనువదించబడిన ప్రార్థన పూసలు, ప్రార్థన చక్రాలు మరియు ప్రార్థన జెండాలు ఉన్నాయి. 

ప్రార్థనలో మూడు అంశాలు ఉన్నాయి: ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థించే విగ్రహం మరియు ప్రార్థించే దేవుడు. అందువల్ల, బౌద్ధమతంలో ప్రార్థన అనేది చాలా సంక్లిష్టమైనది. సృష్టికర్త లేని నాస్తిక మతంలో బౌద్దులు ఎవరి కోసమని ప్రార్థిస్తారు, దేని కోసం ప్రార్థిస్తారు? మనకు ఆశీర్వాదాలు ప్రసాదించడానికి ఎవరూ లేనప్పుడు, ప్రార్థన చేసి ప్రయోజనం ఏమిటి? బౌద్దులకు, ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, "మన బాధలను మరియు సమస్యలను తొలగించడం ఎవరికైనా సాధ్యమేనా?" అని.

మార్పు కోసం ప్రార్థన ఒక్కటే సరిపోదు. దానిని కార్యాచరణలో పెట్టాలి. - 14వ దలైలామా

బుద్ధుడే ఏకంగా తన జ్ఞానం, సామర్ధ్యంతో మన సమస్యలన్నిటినీ తొలగించలేడని చెప్పాడు. ఇది అసాధ్యం. మన గురించి మనమే బాధ్యత వహించాలి. మనం సమస్యలను, బాధలను అనుభవించకూడదు అని అనుకుంటే, అవి జరగకుండా ముందే నివారించుకోవాలి. మనం సంతోషాన్ని అనుభవించాలనుకుంటే, సంతోషానికి కావలసిన కారణాలను మనమే సృష్టించాలి. బౌద్ధమత ఆలోచన నుంచి చూస్తే, స్వచ్ఛమైన నైతికత మరియు నీతిని అనుసరించడం ద్వారా మనం దీనిని సాధించవచ్చు. మన ప్రవర్తన, ఆలోచనను మార్చుకుని మనకు కావలసిన జీవితాన్ని సృష్టించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.

బౌద్దులు ఎవరిని ప్రార్థించాలి?

విగ్రహాలకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు సమర్పించడం, గుళ్లలో శ్లోకాలు చదవటం చూసినప్పుడు వాళ్ళు దేవుడిని ఏమి అడుగుతున్నారు, ఎవరిని ప్రార్థిస్తున్నారు? "శాక్యముని బుద్ధ, దయచేసి నాకు మెర్సిడెస్ దొరుకుతుందా!" లేదా "మెడిసిన్ బుద్ధా, దయచేసి నా రోగాన్ని నయం చేయండి" అని ప్రజలు ఆలోచిస్తుండగా, చాలా మంది బౌద్ధ గురువులు ఈ రకమైన ప్రార్థనల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెబుతారు.

దానికి బదులుగా, బౌద్ధమతంలో, మన కోసం మనం పనిచేయడానికి ప్రేరణ మరియు శక్తి కోసం బుద్ధులను మరియు బోధిసత్వులను ప్రార్థిస్తూ మనం మన స్వంత ఆనందానికి కారణాలను సృష్టించుకోగలము, అలాగే ఇతరులకు సాధ్యమైనంత ఎక్కువ సహాయం చెయ్యగలము. వాళ్ళ దగ్గర ఏదో మంత్ర దండంతో మనకు ప్రత్యేక శక్తి వస్తుందని కాదు, వాళ్లను ఒక ఉదాహరణగా తీసుకుని రోల్ మోడల్స్ గా చూడాలి- అప్పుడు "నేను ఇది చేయగలను!" అనే ఆత్మవిశ్వాసంతో మనం నిండి ఉంటాము.

బౌద్ధ ప్రార్థన కార్యకలాపాలు, సూత్రాలు, మంత్రాలు చదవటం, అలాగే దేవతలను కొలవటం, కరుణ, ఉత్సాహం, సహనం మొదలైన నిర్మాణాత్మక భావోద్వేగాలను పెంపొందించడానికి మరియు ఇతరులకు సహాయం చేసే నిర్మాణాత్మక పనులలో పాల్గొనడానికి మన స్వంత అంతర్గత సామర్థ్యంతో కనెక్ట్ అవ్వాలి.

ఏడు-భాగాల ప్రార్ధన

ఏడు-భాగాల ప్రార్థన అనేది ఒక ప్రసిద్ధమైన అభ్యాసం, ఇది పూర్తి బౌద్ధమత మార్గం యొక్క మాధుర్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఏడు భాగాలు, దీనిలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది:

(1) ప్రపంచంలోని అన్ని పరమాణువుల లాగా అందరికి, ధర్మానికి, అత్యున్నత సభకు మరియు మూడుసార్లు అనుగ్రహించిన బుద్ధులందరికీ నమస్కరిస్తున్నాను. 
(2) మంజుశ్రీ, ఇతరులు అయిన మీకు నైవేద్యాలు సమర్పించినట్లే, నేను కూడా మీకు, నా సంరక్షకులకు, మీ ఆధ్యాత్మిక సంతానానికి నైవేద్యాలు సమర్పిస్తున్నాను.
(3) నా ప్రారంభ సంసార జీవితంలో మరియు ఇతర జన్మలలో, నేను తెలియకుండానే చెడు పనులను చేశాను, ఇతరుల చేత ఆ పనులను చేయించాను, ఇంకా, అమాయకత్వం యొక్క గందరగోళంతో అణచి వేయబడినప్పుడు, నేను వాటిని ఆనందించాను - నేను ఏమి చేసినా, వాటిని తప్పులుగా చూసి నా సంరక్షకులైన మీకు నా హృదయ లోతుల్లో నుంచి వాటి గురించి మీకు చెప్తాను.
(4) ప్రతి పరిమిత జీవికి ఆనందాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో మీరు బోధిచిత్తను అభివృద్ధి చేసిన సానుకూల శక్తి సముద్రంలో ఆనందంతో నేను ఉండిపోయాను.
(5) చేతులు జోడించి, అన్ని దిక్కులలో ఉన్న బుద్ధులను నేను ప్రార్థిస్తున్నాను: దయచేసి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిమిత జీవుల కోసం ధర్మ దీపాన్ని వెలిగించండి.
(6) చేతులు జోడించి, దుఃఖానికి అతీతమైన విజయవంతుడైన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను: ఈ సంచార జీవులను వారి అంధత్వంలో విడిచిపెట్టకుండా ఉండటానికి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
(7) వీటన్నిటి ద్వారా నేను ఏ విధమైన సానుకూల శక్తిని నిర్మించుకున్నానో, అన్ని పరిమిత జీవుల బాధలను నేను తొలగించగలను.
  • ప్రార్థనలో మొదటి భాగం సాష్టాంగ నమస్కారం. కరుణ, ప్రేమ మరియు జ్ఞానం వంటి విలువైన వాటికి గౌరవ సూచికగా మనం బుద్ధులకు సాష్టాంగ నమస్కారం చేస్తాము. సాష్టాంగ నమస్కారం, మన శరీరంలోని అత్యున్నత భాగాన్ని – అంటే తలను - నేలపై ఉంచడం అనమాట. ఇలా చేస్తే మనకు అహంకారాన్ని అధిగమించడానికి మరియు వినయాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
  • ఆ తర్వాత మనం నైవేద్యాలు సమర్పిస్తాం. చాలా మంది బౌద్దులు నీటి గిన్నెలను సమర్పిస్తారు, కాని ఆ వస్తువు మాత్రమే ముఖ్యమైనది కాదు. ముఖ్యమైనది ఏమిటంటే అది ఇవ్వడానికి కలిగే ప్రేరణ - మన సమయం, కష్టం, శక్తి మరియు ఆస్తులు - ఇవన్నీ ఈ అనుబంధాలను అధిగమించడానికి మనకు సహాయపడతాయి.
  • మూడవది, మనం మన లోపాలను, పొరపాట్లను ఒప్పుకుంటాం. కొన్నిసార్లు మనం సోమరితనం లేదా స్వార్థపరులం అవుతాం, మరియు కొన్నిసార్లు మనం చాలా వినాశకరమైన పనులను చేస్తాం. మనం వీటిని ఒప్పుకుని పశ్చాత్తాపపడతాం, అవే తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతాం. ఈ నెగెటివ్ కర్మ ప్రేరణల ప్రభావాన్ని అధిగమించడంలో ఇది ఒక భాగం.
  • అప్పుడు, మనం సంతోషిస్తాము. మనం చేసిన అన్ని మంచి పనుల గురించి, ఇతరులు చేసిన నమ్మశక్యం కాని నిర్మాణాత్మక పనుల గురించి మనం ఆలోచిస్తాం. బుద్ధులు చేసిన గొప్ప పనులను కూడా మనం తెలుసుకుంటాం. ఇది అసూయను తొలగించుకోవడానికి మనకు సహాయపడుతుంది.
  • తర్వాత, మన౦ బోధనలను అనుసరిస్తాం, ఇది మనలో ఒక గ్రహణాత్మక మానసిక స్థితిని సృష్టిస్తు౦ది. "మనం నేర్చుకోవాలనుకుంటున్నాం, మనకు మరియు ఇతరులకు ఆనందాన్ని కలిగించాలనుకుంటున్నాము!" అని అనిపిస్తుంది.
  • ఉపాధ్యాయులు వెళ్లిపోవద్దని మనం వేడుకుంటున్నాం. దీని మునుపటి భాగంలో, మనం బోధనలను నేర్చుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటాము, ఇప్పుడు ఉపాధ్యాయులు మనల్ని విడిచిపెట్టవద్దని మనం పూర్తి జ్ఞానోదయం పొందే వరకు బోధించాలని కోరుకుంటున్నాము.
  • చివరగా, మనకు అత్యంత ముఖ్యమైన స్టెప్ ఉంది, అదే అంకితభావం. మనం సృష్టించిన ఏ సానుకూల శక్తినైనా అందరికి అందించి దాని నుంచి మనకు మరియు ఇతర జీవులకు ప్రయోజనం చేకూరుస్తాం.

ఈ ప్రార్ధన నుంచి మనకు తెలిసేది ఏమిటంటే, బౌద్ధమతంలోని లక్ష్యం ఏదో ఒక బయట జీవులను కష్టాల నుంచి రక్షించడం కాదు. "మీరు గుర్రాన్ని నీటిలోకి తీసుకువెళ్ళవచ్చు, కానీ మీరు దానిని నీళ్లు తాగేలా చెయ్యలేరు" అనే సామెత లాగా అనమాట. మరో మాటలో చెప్పాలంటే, బుద్ధులు మనకు మార్గాన్ని మాత్రమే చూపుతారు, కాని మమకారం మరియు అజ్ఞానాన్ని అధిగమించడానికి మరియు మనందరికీ ఉన్న అపరిమితమైన నిర్మాణాత్మక సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మనమే ప్రయత్నం చేయాలి.

సారాంశం

బయట, బౌద్ధమతం ప్రార్థన ఆచారాలను కలిగి ఉన్నప్పటికీ, మన రోజువారీ జీవితంలో సహాయం కోసం బయట వాళ్లను అడగటం దీని ఉద్దేశం కాదు. బుద్ధులు, మరియు బోధిసత్వులు ఇప్పుడున్న స్థానం నుంచి సంపూర్ణ జ్ఞానోదయానికి మార్గాన్ని చూపే పరిపూర్ణ రోల్ మోడల్స్. బుద్ధులను, బోధిసత్వులను ప్రార్థించడం ద్వారా, మనం వారి నుండి ప్రేరణను పొంది మన అంతర్గత సామర్థ్యాలను పెంచుకోగలము: అపరిమితమైన కరుణ, ప్రేమ మరియు జ్ఞానం మనందరికీ ఉన్న సామర్ధ్యమే.

Top