Study buddhism what is meditation

ధ్యానం అనేది ఒక ప్రయోజనకరమైన మానసిక స్థితిని అభివృద్ధి చేసే పద్ధతి. కొన్ని మానసిక స్థితులు అలవాటుగా మారే వరకు వాటిని పదే పదే చేస్తూ ఉంటాము. శారీరకంగా, ధ్యానం కొత్త నాడీ వ్యవస్థలను నిర్మిస్తుందని తేలింది.

ధ్యానం యొక్క లాభాలు

ధ్యానం నుంచి మనం అభివృద్ధి చేయగల అనేక విభిన్న ప్రయోజనకరమైన మానసిక స్థితులు ఉన్నాయి:

  • ఎక్కువ రిలాక్స్ గా ఉంటూ తక్కువ ఒత్తిడితో ఉండటం.
  • ఎక్కువ ఏకాగ్రత మరియు తక్కువ ఖాళీ సమయాన్ని పొందటం.
  • ప్రశాంతంగా ఉంటూ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటం.
  • మన గురించి మరియు మన జీవితాల గురించి మరియు ఇతరుల గురించి మంచి అవగాహనను కలిగి ఉండటం.
  • ప్రేమ మరియు కరుణ వంటి ఎక్కువ పాజిటివ్ భావోద్వేగాలను కలిగి ఉండటం.

మనలో చాలా మంది ప్రశాంతమైన, స్పష్టమైన, సంతోషకరమైన మనస్సును కోరుకుంటారు. మనం ఒత్తిడికి లోనైతే లేదా నెగెటివ్ స్థితిలో ఉంటే, అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని నెగెటివ్ గా ప్రభావితం చేస్తుంది మరియు మన వృత్తి, కుటుంబ జీవితాలు మరియు స్నేహాలను నాశనం చేస్తుంది.

ఒత్తిడికి మరియు కొంచెం కోపానికి గురైతే, మనం సహాయం కోసం వేరే పద్ధతులను వెతుకుతాము – అదే ధ్యానం ఎటువంటి నెగెటివ్ దుష్ప్రభావాలు లేకుండా భావోద్వేగ లోపాలను అధిగమించడానికి ధ్యానం మనకు సహాయపడుతుంది.

ధ్యానానికి వాస్తవిక దృక్పథం ఉండాలి. ఇది పాజిటివ్ ఫలితాలను సాధించడానికి మనం ఉపయోగించగల ఒక సాధనం. కానీ ఇదే సమాధానం కాదు. ఒకే కారణం ద్వారా ఏ ఫలితాన్ని సాధించలేము, కానీ అనేక కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణకు, అధిక రక్తపోటు ఉంటే ధ్యానం మనకు ఖచ్చితంగా సహాయపడుతుంది, కానీ మనం కూడా మన ఆహార పద్ధతులను మార్చుకుని, వ్యాయామం చేసి సరైన మందులను తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

బౌద్ధమతంలోని ధ్యానం యొక్క రకాలు

ధ్యానం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవన్నీ మనల్ని ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడినప్పటికీ, ఇదే అంతిమ లక్ష్యం కాదు. ఏదేమైనా, మంచి పాజిటివ్ వాతావరణాన్ని నిర్మించడంలో నిజమైన పురోగతిని సాధించడానికి మనం ఒత్తిడిని వదిలించుకోవడం ఖచ్చితంగా అవసరం, కాబట్టి మనం సాధారణంగా శ్వాసపై దృష్టి పెట్టి విశ్రాంతి తీసుకుంటాము మరియు శాంతంగా ఉంటాము. రెండు రకాల బౌద్ధ ధ్యాన పద్ధతులు: విచక్షణ ధ్యానం మరియు స్థిరీకరణ ధ్యానం.

విచక్షణాత్మక ధ్యానం, తరచుగా "విశ్లేషణాత్మకం" అని దీనిని పిలుస్తారు, ప్రేమ వంటి పాజిటివ్ మానసిక స్థితితో మనం దశలవారీగా పనిచేయడానికి తార్కికతను ఉపయోగిస్తాము. లేదా ఒక పరిస్థితిని విశ్లేషించడానికి మరియు దాని అశాశ్వత గురించి సరైన అవగాహనకు రావడానికి మనం తార్కికతను ఉపయోగిస్తాము. లేదా బుద్ధుని రూపం వంటి పాజిటివ్ లక్షణాలతో కూడిన ఒక వస్తువు యొక్క మానసిక ప్రతిబింబాన్ని నిర్మించి, దానిని స్పష్టంగా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.

అప్పుడు, స్థిరీకరణ ధ్యానంలో, మనం సృష్టించిన సానుకూల స్థితిని సాధ్యమైనంత ఎక్కువ కాలం నిర్వహించడానికి బుద్ధి, శ్రద్ధ మరియు ఏకాగ్రతను ఉపయోగిస్తాము. లేదా మనం నిర్మించుకున్న మానసిక ఇమేజ్ పై దృష్టిని కేంద్రీకరించడానికి మనం ఆ సాధనాలను ఉపయోగిస్తాము.

మనం రెండు రకాల ధ్యానాన్ని చూస్తూ ఉంటాము. మనం కోరుకున్న పాజిటివ్ మానసిక స్థితిని మనం నిర్మించుకుని గుర్తించగలిగినప్పుడు, మనం దానిని స్థిర పరుస్తాము; మరియు ఈ స్థితిపై మన ఏకాగ్రత బలహీనపడినప్పుడు లేదా కోల్పోయినప్పుడు, దానిని మరోసారి సృష్టించడానికి మరియు గుర్తించడానికి మనమే తిరిగి పనిచేస్తాము.

రోజువారీ జీవితం కోసం ధ్యానం

ధ్యానం యొక్క అసలు అర్ధం మనం ఇంట్లో మన కుషన్ మీద కూర్చొని ప్రశాంతంగా, ఏకాగ్రతతో మరియు ప్రేమతో అనుభూతి చెందడం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితాన్ని దీని నుంచి ప్రభావితం చెయ్యటం కూడా. మనం రోజూ ధ్యానం చేస్తే, అది పాజిటివ్ భావోద్వేగాలను ఒక అలవాటుగా మారుస్తుంది. ఇది పగలు లేదా రాత్రి మనకు అవసరమైనప్పుడల్లా చేసుకోవచ్చు. చివరికి, ఇది మనలో ఒక భాగం అవుతుంది - మనం ఎప్పుడూ మరింత ప్రేమగా, ఏకాగ్రతతో మరియు ప్రశాంతంగా ఉండటం చాలా సహజం అవుతుంది.

మనకు నిజంగా కోపం మరియు చిరాకు వచ్చే సమయాలు ఉంటాయి, కానీ మనం అప్పుడు: "మరింత ప్రేమగా ఉండండి" అని మనల్ని మనం గుర్తు చేసుకోవడమే. స్థిరమైన ధ్యాన అభ్యాసం చేస్తే వచ్చే ఈ మానసిక స్థితి గురించి మనకు బాగా తెలుసు కాబట్టి, మనం అలాగే చేస్తాము.

ఎవరూ పరిపూర్ణులు కాదు, మరియు మనమందరం వదిలించుకోవాలనుకునే ఒక రకమైన చెడు అలవాటును కనిపెట్టవచ్చు. అదృష్టవశాత్తూ, ఈ అలవాట్లు మార్చకోదగినవి.

ఈ మార్పుకు మన ప్రయత్నం తప్ప ఇంకేమీ అవసరం లేదు. మనలో చాలా మంది గంటల తరబడి జిమ్ లో గడుపుతారు కాని మన గొప్ప ఆస్తి అయిన మన మనస్సుకు వ్యాయామం చేయడం మర్చిపోతాం. ముందు ఇది కష్టంగానే ఉంటుంది, కానీ ధ్యానం మన జీవితంలో తెచ్చే ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత, మన మనస్సులపై పనిచేయడానికి సమయాన్ని ఇవ్వటం కోసం మనం కృషిచేస్తాము.

Top