ఆందోళనను ఎలా వ్యవహరించుకోవాలి?

How to deal with anxiety

ప్రస్తుతం ప్రపంచం ఒక భయంకరమైన స్థితిలో ఉంది. ఒక్కసారి న్యూస్ ఛానల్ ను పెట్టి చూడండి: ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారని! ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని! పర్యావరణం పాడయ్యి పోతుందని మనం వార్తలను చూడవచ్చు. ఒక వారం రోజుల వరకు ఈ వార్తలు మనల్ని ఒకే మంచం మీద ఉండేలా చేస్తాయి.

అది కేవలం బయటి ప్రపంచం గురించి మాత్రమే. మన సొంత జీవితాలలో మనం చెయ్యాల్సినవి ఇంకా చాలా పనులు ఉన్నాయి. మనం తర్వాతి సెలవులకు ఎక్కడికి వెళ్ళాలి? మనం బాగా కావాలనుకున్న ఆ ప్రమోషన్ మన సహోద్యోగికి వస్తే అతనితో మళ్ళీ ఎలా మాట్లాడాలి? అసలు మన జీవితాలతో మనం ఏం చెయ్యాలి? అని.

మన చిన్నతనంలో, "మీ కలలను అనుసరించండి" అని, మరియు మనం ఏది కోరుకుంటే అది అవ్వొచ్చు అని చాలా మంది చెప్పే వాళ్లు. కానీ మనలో ఎంతమంది ఆ కలలను సాకారం చేసుకున్నారు? మనలో ఎంతమంది సోషల్ మీడియా ఫీడ్స్ ను స్క్రోల్ చేస్తూ తమ కలలను సాకారం చేసుకుని జీవిస్తున్న వాళ్లను చూసి అసూయపడుతుంటారు? మనము ఏమో ఇలా ఒక నీరసమైన ఆఫీస్ లో చిక్కుకుని ఉన్నాము, కానీ వాళ్లు తమ జీవితంలో అనుకున్నది చేస్తూ ఉన్నారు.

"ఆనందం" యొక్క ఈ ఆలోచన ఒక అద్భుత కథ లేదా మరొక ప్రకటన నినాదం లాగా అనిపించవచ్చు - ఏదో భవిష్యత్తులో ఆనందంగా ఉండడానికి ఇప్పుడు మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నామా. మనం ఎంత కష్టపడినా కానీ, సంతోషంగా ఉంటామని ఏ గ్యారంటీ లేదు. కొంతమంది డాక్టరేట్ పట్టా పొంది మెక్డొనాల్డ్స్ లో పనిచేస్తున్నారు, మరికొందరు నమ్మశక్యం కాని ధనవంతులు మరియు ప్రసిద్ధ వ్యక్తులు అయ్యారు, చివరికి వాళ్లు నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ మనల్ని జీవితం గురించి ఆందోళన చెందేలా చేస్తాయి, మరియు ఇది సామాజిక ఆందోళనకు దారితీస్తుంది. ఇలా ఎప్పుడూ మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాము. మరో వ్యక్తిని కలిసినప్పుడల్లా మనకు అసౌకర్యంగా అనిపించి, వాళ్ల కళ్ళల్లో చూడలేక స్మార్ట్ ఫోన్ వైపు చూసి దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.

ఇది మన కాలపు ప్లేగు వ్యాధి. ఇది ఎయిడ్స్, క్యాన్సర్ లేదా డిప్రెషన్ కన్నా ప్రమాదకరంగా కనిపించకపోవచ్చు, కానీ ఈ ఆందోళన మన శక్తిని పోగొట్టి అశాంతి భావనను సృష్టిస్తుంది. కొత్త టీవీ సీరియళ్ల నుంచి మన దృష్టిని మరల్చి ఫేస్ బుక్ ఫీడ్ స్క్రోల్ చేసేలా చెయ్యడం. ఇవన్నీ మనం మన ఆలోచనలతో ఒంటరిగా ఉండలేం కాబట్టి ఇలా చేస్తూ ఉంటాం. అన్నిటినీ భరించడానికి మనకు ఇయర్ఫోన్లు మరియు ఎప్పుడూ ఏదో ఒక సంగీతం వినటం అవసరం ఉంటుంది.

ఇది ఇలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మన జీవితంలో ఉన్నదానితో సంతోషంగా ఉండాలని, ఇతరులతో మనల్ని మనం ఎప్పుడూ పోల్చుకోకూడదని మనందరికీ తెలుసు. కానీ దీని అసలు అర్థం ఏమిటి? మనం ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోగలం?

ఒక అడుగు వెనక్కి వేయండి

మనం జీవితంలో ఒక అడుగు వెనక్కి వేసి విశ్లేషించుకోవాలి. ఇది బోరింగ్ గా అనిపించవచ్చు, కానీ మనం దానిని వదిలెయ్యలేము. మనకు ఈ జీవితం నుంచి ఏం కావాలి? అని తెలుసుకోవాలి. అందరికీ సరైన మార్గం అంటూ ఏదీ లేదు, కానీ మన కంటే ముందు అదే మార్గంలో వెళ్లిన వాళ్లు ఉన్నారు. మనం ఒక రాక్ స్టార్ కావాలని అనుకోవచ్చు, కానీ పాపరాజీలు మనల్ని 24/7 వెంటాడితే మనం నిజంగా సంతోషంగా ఉండగలమా? రాక్ స్టార్స్ ఏళ్లు గడుస్తున్న కొద్దీ హ్యాపీగా ఉంటారా? మద్యం, మాదకద్రవ్యాల వైపు వెళ్తూ ఉంటారా? అందుకోసం మనం అవసరమైన సమయాన్ని, శక్తిని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి.

ఒక రూల్ మోడల్ ని వెతుక్కోండి

జీవితాన్ని మరింత సంతోషంగా మరియు అర్థవంతంగా మార్చే జీవన విధానాన్ని మనం కనుగొంటే, తర్వాతి దశ అలా జీవించే వ్యక్తిని కనిపెట్టడం. గొప్ప సంగీత విద్వాంసుడు అవ్వాలంటే, మనం మంచి సాధన చేయాలి. ఒక ఫుట్ బాల్ ఆటగాడిగా మారాలంటే, మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. నడవడానికి కూడా, మనం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది, అది మనకు ఇప్పుడు గుర్తు ఉండకపోవచ్చు. కారణం లేకపోతే ఫలితం ఉండదని దీని అర్ధం. జీవితంలో ఎక్కడికైనా చేరుకోవాలంటే అంకితభావం చాలా అవసరం. ఒక రోల్ మోడల్ మనకు మంచి చిట్కాలను ఇచ్చి గొప్ప ప్రేరణగా ఉండగలడు.

ఇతరులకు సహాయం చెయ్యండి

మన స్వంత ఆలోచనలు మరియు కోరికలలో మునిగిపోవడం చాలా సులభం. మనం ప్రధానంగా జీవితం నుంచి ఏమి కోరుకుంటున్నామో ఆలోచిస్తూ ఉంటాము. ఎవరైనా మన దారిలో ఎదురుగా వస్తే, ఆందోళన చెందడం మొదలుపెడతాం. ఆందోళనలో ఎక్కువ భాగం మనం ఒంటరిగా ఉండటమే, కానీ ఇతరులతో కనెక్ట్ కావడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే వారితో నిజాయితీగా ఉండడం. మన గురించి మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే, మనం బాధలలోనే ఉంటాం; అదే ఇతరులకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది మన ఆనందాన్ని పెంచుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.

అది ఎక్కువగా చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. నిరాశగా ఉన్న రోజున ఒకరిని చూసి చిరునవ్వు నవ్వి, లేదా ఎవరికైనా నిజాయితీగా కృతజ్ఞతలు చెప్పడం ఇద్దరి ఉత్సాహాన్ని పెంచడానికి సహాయపడవచ్చు. బాధ్యతగా అనుకుని ఇలా చెయ్యకండి, ఒకరి రోజును మంచిగా మార్చాలనే నిజమైన కోరికతో చెయ్యండి. దాని తర్వాత, మీ మానసిక స్థితి ఎలా మారిపోతుందో గమనించండి.

మీరు ఎవరో తెలుసుకోండి

మనమందరం ప్రత్యేకంగా ఉండాలని ఇష్టపడతాము, కానీ ఇది మనమందరం ఒకటే అని రుజువు చేస్తుంది. "మీరు ఎవరో తెలుసుకోండి" అంటే నిజంగా మనం అసలు ఎవరో అర్థం చేసుకోవడం. మనందరికీ సమస్యలు ఉన్నాయి, ఒక పరిపూర్ణమైన జీవితం ఎక్కడా ఉండదు. మీరు అనుకునే అన్నిటినీ నమ్మవద్దు!

మనం సరిగ్గా లేని ఫోటోలను ఎప్పుడూ చూపించనట్లే, మిగతా వాళ్లు కూడా చూపించరు. బయట మనం హేళన చేయడానికి భయపడతాం - ఇంకేంటో తెలుసా? - మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారు. పరిపూర్ణమైన జీవితాలతో నిండిన ఈ కాలంలో మనం జీవిస్తున్నప్పటికీ, మనం ఈ ఉచ్చులో పడిపోకూడదు. మనం ఈ విషయాలను గుర్తుంచుకుంటూ, మనస్ఫూర్తిగా ఇతరులకు సంతోషాన్ని అందించడానికి ప్రయత్నిస్తూ మన జీవితాలను అర్థవంతంగా మార్చడానికి కృషి చేస్తూ, మన ఆందోళనను మెల్ల మెల్లగా తగ్గించుకోవచ్చు.

Top