అమూల్యమైన మానవ జీవితంపై ధ్యానం చెయ్యడం

పరిచయం

ఈ సాయంత్రం మన టాపిక్ విశ్లేషణాత్మక ధ్యానం. ఇప్పుడు, మన జీవితంలో పాజిటివ్ దిశలో మరియు బోధిచిత్త మార్గంలో వెళ్ళడం కోసం మనపై మనం పని చేసుకోవడానికి మూడు దశల ప్రక్రియ ఉంటుంది:

 • ముందుగా మనం బోధనలు వినాలి.
 • ఆ తర్వాత మనం వాటి గురించి ఆలోచించాలి.
 • మరియు మనం వాటిని ధ్యానించాలి.

అందుకు దీన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ఇది చాలా ప్రామాణికమైన బౌద్ధమత బోధన.

ప్రశాంతంగా ఉండడం

నిశ్శబ్దంగా ఉండటానికి శ్వాసపై దృష్టి పెట్టడం - ఇది షమత యొక్క పూర్తి పరిధి అని కొంతమంది నమ్ముతారు - ఈ మూడింటికి ఇది ఒక ప్రాథమిక విషయం మాత్రమే. బోధనలు వినడానికి ముందు మనం ప్రశాంతంగా ఉండాలి; వాటి గురించి ఆలోచించే ముందు మనం ప్రశాంతంగా ఉండాలి; ధ్యానం చెయ్యడానికి ముందు కూడా మనం ప్రశాంతంగా ఉండాలి, కాబట్టి శ్వాసపై దృష్టి పెట్టడం అనేది దానికి సహాయపడుతుంది. ప్రశాంతంగా ఉండడం మాత్రమే మనల్ని ఏకాగ్రత స్థితికి తీసుకురాలేదు, మరియు ఇది ఖచ్చితంగా మన సమస్యలకు కారణాలను తొలగించదు (అయినప్పటికీ ఈ అడ్డంకులను ఎదుర్కోవటానికి ఇది మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది).

నిజానికి, శ్వాసపై దృష్టి పెట్టడం పూర్తి ఏకాగ్రతను అభివృద్ధి చెయ్యడానికి ఉపయోగపడేదిగా మనం తీసుకోవచ్చు, కానీ ప్రశాంతంగా ఉండడానికి ఆ దృష్టిని ఉపయోగించడం మనల్ని ఏకాగ్రత స్థితికి తీసుకురాదు. దీన్ని ఇంకొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే, శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా పూర్తి ఏకాగ్రతను సాధించవచ్చని థెరవాడ బోధనల్లో మాత్రమే చెప్పబడింది. శ్వాసపై దృష్టి పెట్టడం అనేది ఇంద్రియ అవగాహన లాంటిది - ఇది శారీరక అనుభూతిని గ్రహించడం లాంటిది - మరియు టిబెటన్ సంప్రదాయం అనుసరించే మహాయాన బోధనల ప్రకారం, పూర్తి ఏకాగ్రతను పొందడానికి మీరు ఇంద్రియ జ్ఞానాన్ని కాకుండా మానసిక జ్ఞానాన్ని ఉపయోగించాలి.

కాబట్టి, టిబెటన్ బౌద్ధమత సంప్రదాయంలో ధ్యానాన్ని చూసినప్పుడు, శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనం ప్రశాంతతకు మించి చూడాల్సి ఉంటుంది. అది ప్రాథమికమైనది మాత్రమే.

వినడం

సరే, ఇప్పుడు మనం ఆ బోధనలు వినాలి, వాటి గురించి ఆలోచించాలి మరియు ధ్యానం చెయ్యాలి. ఈ మూడు దశల నుంచి, మనం ఒక రకమైన విచక్షణాత్మక అవగాహనను పొందుతాము (ఇది సాధారణంగా జ్ఞానంగా అనువదించబడుతుంది, కానీ జ్ఞానం అనేది చాలా అస్పష్టమైన పదం). ముందుగా మనం ఒక విషయాన్ని గుర్తించాలి. దీన్ని సాధారణంగా "గుర్తించడం" అని అంటారు. విజువల్ సెన్స్ ఫీల్డ్ లో లాగానే - దాన్ని ఎదుర్కోవటానికి మరియు ఏదైనా లోతైన అవగాహనను పొందడానికి, మీరు ఒకరి ముఖం యొక్క ఆకారం మరియు రంగును గోడ నుంచి వేరు చెయ్యగలగాలి. కాబట్టి ఇది మొదటి దశ, ఇది ప్రత్యేకమైనది. విచక్షణాత్మక అవగాహన ఏమి చేస్తుంది అంటే, ఇది దానికి ఒక నిర్ణయాత్మకతను జోడిస్తుంది: "ఇది ఖచ్చితంగా ఇదే మరియు అది కాదు" అని. విచక్షణా అవగాహన అంటే అదే (నేను చెప్పినట్లుగా, ఇది సాధారణంగా జ్ఞానంగా అనువదించబడుతుంది, కానీ జ్ఞానం ఇక్కడ మనం మాట్లాడుతున్న దాని అర్ధాన్ని చెప్పదు).

కొన్ని బోధనలు వినడం ద్వారా మనకు లభించేది ఆ వినికిడి నుంచి ఉత్పన్నమయ్యే విచక్షణా జ్ఞానం, అంటే బౌద్ధమత బోధనల పదాల వివక్షను చూపడం. దీని అర్థం ఏమిటంటే, మనం బౌద్ధమత మాటలను ఇతర మాటల నుంచి వేరు చేస్తాము (ఇవి బౌద్ధేతర ప్రకటనలు అని అనుకుందాం), మరియు మనం వాటి గురించి ఇలా అనుకుంటున్నాము: "ఇది బుద్ధుని బోధన." బోధనలతో ఎక్కడికైనా వెళ్లాలంటే, ఇవి బౌద్ధమత బోధనలు అని మనం అనుకోవాలి, కదా?

కాబట్టి ఇక్కడ ఈ దశలో మనకు లభించేది ధర్మం గురించి ఉండే పదాల యొక్క ఆలోచన, కానీ వాటి అర్థం ఏమిటో మనకు తెలియదు. ఉదాహరణకు, నాకు ఒక విలువైన మానవ జీవితం ఉంది. సరే, బౌద్ధేతర ప్రకటనల నుంచి మనం దాన్ని వేరు చెయ్యవచ్చు. కాబట్టి, మనకు ఒక విలువైన మానవ జీవితం ఉంటుంది, మరియు బుద్ధుల పట్ల గౌరవం కారణంగా ఇది నిజం అని మనం అనుకుంటాము, కాని ఈ దశలో, దాని అర్థం ఏమిటో మనకు తెలియదు. బౌద్ధమత బోధన ఈ మానవ జీవితం అర్ధం లేనిదని, ఈ జీవితానికి ఏ ప్రయోజనం లేదని చెప్పదని మనకు తెలుసు. "సరే, మనకు ఒక అమూల్యమైన మానవ జీవితం ఉందని బౌద్ధమత ప్రకటన" అని మనం తేడాను చూపించాము.

ఆలోచించడం

ఇప్పుడు మనం తర్వాతి దశకు వెళ్ళాలి, అంటే దాని అర్ధాన్ని తెలుసుకోవడానికి దాని గురించి ఆలోచించాలి. అంటే ఆ విలువైన మానవ జీవితం యొక్క నిర్వచనం గురించి ఆలోచించడం - దాని అర్థం ఏమిటి - మరియు అది ఎందుకు విలువైనది అని ఆలోచించడం. అది మనకు అర్థమైతే, మనం బోధనను అర్థం చేసుకుంటాము, కదా? కాబట్టి, మనం దీనితో పని చెయ్యాలి. మనం దాని గురించి ఆలోచించాలి. అమూల్యమైన మానవ జీవితానికి పద్దెనిమిది లక్షణాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, నేను జంతువుని కాదు. మనం జీవసంబంధమైన అర్థంలో మాట్లాడటం లేదు - మనం మొక్క, జంతువు కాదు. మనం ఆ కోణంలో మాట్లాడటం లేదు. దీర్ఘకాలంలో ఏది సహాయకారిగా ఉంటుందో, ఏది హానికరమో తేడా చూపించే, అర్థం చేసుకోగలిగే, కమ్యూనికేట్ చెయ్యగల జీవిని మనిషి అంటారు అని తెలుసుకోవాలి.

కాబట్టి, దాని అర్థం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి - నేను ఒక జంతువును కాదు - మరియు మనం తార్కిక మార్గాన్ని అర్థం చేసుకోవాలి మరియు ఇది సిద్ధాంతాన్ని రుజువు చేస్తుందని నమ్మాలి. ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే, ధర్మాన్ని ఆచరించడానికి మరియు సాక్షాత్కరించడానికి జంతువుగా కాకుండా మనిషిగా జన్మించడం విలువైనది మరియు ఒక అదృష్టం. సిద్ధాంతం అంటే మనం నిరూపించడానికి ప్రయత్నిస్తున్నది. ధర్మాన్ని ఆచరించడానికి, సాక్షాత్కరించడానికి జంతువుగా కాకుండా మనిషిగా జన్మించడం ఒక అమూల్యమైన అవకాశం. ఒక జంతువుగా, నేను జంతు ప్రవృత్తుల యొక్క బలమైన విపరీతమైన ప్రభావానికి లోనవుతాను. జంతు ప్రవృత్తులు అంటే ఏమిటి? వేటాడటం మరియు చంపడం. మొరిగే కుక్కలాగా కోరిక వచ్చినప్పుడల్లా ఏ సమయంలోనైనా వేరే జంతువుతో శృంగారంలో పాల్గొనడం. ఒక జంతువుగా, దీర్ఘకాలికంగా ఏది సహాయకారిదో మరియు ఏది హానికరమో అని గుర్తించడానికి మనకు చాలా బలహీనమైన శక్తులు ఉంటాయి. అలాగే, తక్కువ సమయంలో, అవి గుర్తించబడతాయి - మీరు సింహం నుంచి పారిపోతారు ఎందుకంటే అది మనల్ని భయపెడుతుంది. కానీ దీర్ఘకాలంలో, అవి ఏది సహాయకారిదో మరియు ఏది హానికరమైనదో తెలుసుకోలేరు. కాబట్టి, నేను ఇలా ఉంటే, ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టం అవుతుంది.

మీరు దాని గురించి ఆలోచించి అది ఏమి మాట్లాడుతుందో ఊహించడానికి ప్రయత్నించాలి. దాని వల్ల కలిగే నష్టాలను మనల్ని మనం ఒప్పించుకోవడానికి జంతువుగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకునే ప్రయత్నం చేస్తాం. నాకు ఎప్పుడూ ఈ ప్రవృత్తి ఉంటే, వేటాడాలనే ఈ బలమైన ప్రవృత్తి... అంటే, పిల్లి ఒక కీటకాన్ని లేదా ఎలుక వెంబడి వెళ్ళే విధానాన్ని చూడండి - అది దాన్ని అసలు తినదు కూడా - కేవలం దాన్ని పట్టుకుని హింసించడానికి ప్రయత్నిస్తుంది. ఇది నా మొదటి ప్రవృత్తి అయితే, నేను నేలపై కొద్దిగా కదులుతున్న దేనినైనా చూసినప్పుడు బలమైన ప్రేరణ దానికదే వస్తుంది, దీని గురించి ఆలోచిస్తూ నా మీద నేను ఎలా పని చేసుకోగలను?

మన ప్రవర్తనను గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గదిలో ఒక ఈగ లేదా బొద్దింక లేదా దోమను మనం గమనిస్తాము, మరియు ఇది మనం మన హెల్మెట్ ధరించి, తుపాకీని బయటకు తీసి, వేటకు బయలుదేరినట్లుగా ఉంటుంది, మరియు మనం ధ్యానం చెయ్యలేము - ఇంకేమీ చెయ్యలేము – ఆ వేటను పట్టుకుని చంపే వరకు. నేను చెప్పినట్లుగా, విషయాలను వాటి అసంబద్ధమైన అర్ధాలుగా గమనించడం చాలా సహాయపడుతుంది. హెల్మెట్ ధరించి ఆఫ్రికన్ సఫారీకి వెళ్లాలని ఆలోచిస్తే మన ప్రవర్తన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు. మనం ఆ దోమను గదిలోంచి తరిమికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నామో దాని కోసం మన ఆలోచనలో కాస్త మార్పు వచ్చింది. మనం వేటలో ఉన్న జంతువు కాదు.

అలాగే, మనం ఒక జంతువు అయితే మరియు ఏ సమయంలోనైనా మనపై దాడి చెయ్యగల వేరే జీవులచేత ఎప్పుడూ వేటాడబడుతుంటే - మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి - అది కూడా మనకు ప్రశాంతత, ఏకాగ్రతను పొందడానికి మరియు అధ్యయనం కోసం అనుకూలమైన పరిస్థితిని ఇవ్వదు.

కాబట్టి, ఈ విధంగా, మనం జంతువు యొక్క ఇతర లక్షణాలను పరిశీలిస్తాము - ఒక జంతువు యొక్క లైంగిక ప్రవర్తన రకం, జంతువు యొక్క ప్రాదేశికత మొదలైనవి - మరియు ఇది మన ఆధిపత్య ప్రవృత్తి, బలమైన ప్రవృత్తి అయితే, మళ్ళీ ఏదైనా ప్రోగ్రెస్ సాధించడం చాలా కష్టం అవుతుంది.

లేదా మనం నిరంతరం చాలా భారీ భారాన్ని మొయ్యాల్సి వస్తే - భారతదేశంలో లాగా, ఒక ఎద్దు చాలా భారీ భారాన్ని మొయ్యాల్సి ఉంటుంది (మరియు ఎప్పుడూ తన్నులు తింటూ ఉంటుంది) - అది కూడా ప్రాక్టీస్ చెయ్యడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి, ఈ ఉదాహరణ గురించి మనం ఆలోచించినప్పుడు, ఒక జంతువుగా జన్మించిన ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు, మనం దాన్ని పురాతన భారతదేశ నేపథ్యంతో జత చెయ్యాలి. మనం బాంబి గురించి లేదా ధనిక ఇంటిలో వేరొకరి కుక్కపిల్ల గురించి ఆలోచించడం లేదు. మనం ఒక బొద్దింక గురించి ఆలోచిస్తున్నాము. మనం ఒక వీధి కుక్క గురించి ఆలోచిస్తున్నాము. మనం ఒక పని జంతువు గురించి ఆలోచిస్తున్నాము.

కాబట్టి, మనం ఇక్కడ నిర్వచించే లక్షణాన్ని సరిగ్గా పొందుతాము మరియు మనం ఇలా లేమని అర్థం చేసుకున్నాము. కాబట్టి, నేను దీని నుంచి విముక్తి పొందాను. అందుకే, ధర్మాన్ని ఆచరించే అవకాశం మరియు స్వేచ్ఛ నాకు ఉంది. అందువల్ల, నాకు విలువైన మానవ జీవితం ఉంటుంది.

ఈ పని చేస్తూ మనం కొన్ని క్షణాలను గడుపుదాం. జంతువుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో గుర్తిస్తాము, మరియు మనం దాని నుంచి స్వేచ్ఛగా ఉన్నామని అర్థం చేసుకుంటాము మరియు మనం వాటి నుంచి విముక్తి పొందినందుకు, మనకు అభ్యాసం చెయ్యడానికి అవకాశం ఉంటుంది.

అలాగే, మనం పూర్తిగా జంతు ప్రవృత్తుల శక్తికి లోను కాలేదని తెలుసుకుంటాము:

 • నేలపై కదిలే ఏ చిన్న వస్తువు వెనుక నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు.
 • ఇతర జంతువులన్నీ మొరగినప్పుడు నేను మొరగాల్సిన అవసరం లేదు మరియు అవి చేసే పనిని నేను చెయ్యాల్సిన అవసరం లేదు.
 • నేను ఇంకొక జంతువుపై దూకాల్సిన అవసరం లేదు - అంటే నన్ను ఆకర్షించే జంతువును చూసినప్పుడల్లా, నేను దాని పైకి దూకడం.

నాకు ఈ జంతు ప్రవృత్తులు కొద్దిగా ఉన్నప్పటికీ, నేను వాటిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నేను ఒక మనిషిని. ఏది సరైనదో, ఏది కాదో నేను గుర్తించగలను. అందువల్ల, ఈ కారణంగా, నాకు ఒక ప్రయోజనం కోసం ఈ విలువైన మానవ జీవితం ఉంటుంది. దీని ఉద్దేశం బాగా డబ్బు సంపాదించాలని కాదు ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరించడం.

ఈ దశలో మనం ఏం చేస్తున్నాం? ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం కేవలం మాటల మీద ఆధారపడటం లేదు. అది మొదటి దశ. కానీ ఒక అమూల్యమైన మానవ జీవితం మరియు మన పరిస్థితి యొక్క లక్షణ గుర్తులు లేదా దాన్ని డిఫైన్ చెయ్యడం ద్వారా మరియు తార్కిక మార్గంపై ఆధారపడటం ద్వారా, మనం ఒక అస్పష్టమైన అవగాహనను పొందుతాము. అంచనా అంటే ఒక తార్కిక మార్గంపై ఆధారపడటం - కారణంగా, అప్పుడు నాకు అది తెలుస్తుంది అని. మనం ఆలోచించడం వల్ల వచ్చే విచక్షణాత్మక అవగాహనను పొందుతాము, మరియు ఇది అర్థం లేని పదాల ఆలోచనపై కాకుండా దానితో అర్థం ఉన్న ఒక ఆలోచనపై దృష్టి పెడుతుంది. కాబట్టి ఇక్కడ అర్థం ఉన్న ఆలోచన "నేను ఒక జంతువుగా ఉండటానికి స్వేచ్ఛగా ఉన్నాను కాబట్టి నాకు విలువైన మానవ జీవితం ఉంది" అని ఉంటుంది. మరియు ఇది దాని గురించి నిర్ణయాత్మకమైనది. ఇది దీనిపై వివక్ష చూపుతోంది. ఇది ఇతర కారణాల నుంచి మరియు అస్పష్టమైన నిర్వచనాలు మొదలైన వాటి నుంచి వివక్షతను చూపుతుంది మరియు దాని గురించి నిర్ణయాత్మకంగా ఉంటుంది.

ఆ విచక్షణా అవగాహనపై దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నిద్దాం: "నేను ఒక జంతువుగా ఉండాలో లేదో స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టి నాకు ఒక విలువైన మానవ జీవితం ఉంది." ఆ అవగాహనపై మనం దృష్టి పెడతాం. ఆ ఆర్డర్ ఇంకొక రకంగా ఉండాలి: "నేను జంతువుగా ఉండాలో లేదో స్వేచ్ఛ నాకు ఉంది. కాబట్టి, నాకు అమూల్యమైన మానవ జీవితం ఉంది." మరో మాటలో చెప్పాలంటే, మనం ఒక తార్కిక మార్గంపై ఆధారపడతాము మరియు తర్వాత ముగింపుకు వస్తాము, మరియు పదే పదే మనం ఆ తార్కిక మార్గంపై ఆధారపడాల్సి ఉంటుంది.

అవును, ఈ మొదటి రెండు దశలు, వినికిడి మరియు ఆలోచనల మధ్య చాలా తేడా ఉందని మీరు తెలుసుకుంటారు. ఒక్కొక్క దాని నుంచి మనకు లభించే వివక్షాపూరిత అవగాహన చాలా వేరుగా ఉంటుంది.

 • మొదటిది: "నాకు ఒక అమూల్యమైన మానవ జీవితం ఉంది." అది బౌద్ధమత బోధనలు అని మీకు తెలుసు - దానిలో ఎటువంటి సందేహం లేదు - కానీ ఇది నిజం అని మాత్రమే మనం అనుకుంటాము. అలా ఎందుకో మనకు తెలియదు. అసలు దీని అర్థం ఏమిటో మనకు తెలీదు.
 • కానీ రెండవ దానితో, ఒక విలువైన మానవ జీవితం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది, అది మనకు ఎందుకు ఉందో (దానికి కారణం) తెలుస్తుంది, మరియు దాన్ని విలువైనదిగా మార్చే ఉద్దేశ్యం ఏమిటో మనకు తెలుస్తుంది (ధర్మాన్ని ఆచరించగలగడం విలువైనది). కాబట్టి అవగాహన లేకుండా అది నిజమని అనుకోవడానికి బదులుగా, మనం ఈ నిర్ధారణకు రాగలుగుతాము మరియు ఊహ ద్వారా దాన్ని సరిగ్గా తెలుసుకోగలుగుతాము. అంటే తర్కం మీద ఆధారపడటం. దాని గురించి మనకు ఒక వివక్షాపూరిత అవగాహన ఉంటుంది. అంటే ఆ విషయంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటాం. "ఈ కారణం చేత నాకు విలువైన మానవ జీవితం ఉంటుంది మరియు దీన్ని ఆ ప్రయోజనం కోసం ఉపయోగించాలి" అని మనకు ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది. 

చర్చ

ఇప్పుడు, ఈ దృఢమైన నమ్మకాన్ని పొందడానికి చర్చ చాలా సహాయకరమైన మార్గం, ఎందుకంటే చర్చ ఏం చేస్తుంది అంటే, ఏదైనా నిర్ణయాత్మక ఇబ్బందిని తొలగించడానికి లేదా అర్థం గురించి అస్పష్టమైన ఆలోచనను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. మనం నిర్ణయం తీసుకోలేం. మనం కంగారు పడము : నాకు అది ఉందా? అది లేదా? దీని అర్థం ఇదేనా? దీని అర్థం అదేనా? అని. ఎందుకంటే మన ఆలోచనలో మనం చెయ్యగలిగిన దానికంటే ఎక్కువ తప్పులను ఇతరులు కనిపెడతారు. మీరు ఒంటరిగా కూర్చొని మీకు అర్ధం అయిన దాన్ని చెక్ చేస్తుంటే, "ఓహ్, సరే, ఇంక చాలు" అని చెప్పడం చాలా సులభంగా ఉంటుంది. ఇతరులు మన ఆలోచనలోని లోపాలను మరియు లొసుగులను బాగా సమర్థవంతంగా కనిపెట్టగలుగుతారు, మరియు మన కంటే వాటిని వాళ్ళే ఎక్కువ కాలం మరియు ఎక్కువ ఉత్సాహంతో దాయగలరు. కొన్నిసార్లు చర్చలలో, మీరు ఒక భావోద్వేగ స్థితికి చేరుకుని, "ఇంక చాలు. నన్ను వదిలెయ్యండి" అని చెప్తారు. మీరు ధ్యానంలో ఒంటరిగా ఇలా చేసి ఉంటే, మీరు ఎప్పుడో దాన్ని ఆపేసేవారు. కాబట్టి, ఈ కారణంగా, టిబెటన్ సంప్రదాయం చర్చా పద్ధతిని ఇలా వివరిస్తుంది. మన అవగాహన గురించి ఎటువంటి నిర్ణయాత్మకత లేకుండా దృఢమైన నమ్మకాన్ని పొందడానికి ఇది మనకు సహాయపడటానికి ఉద్దేశించబడింది.

విశ్లేషణాత్మక ధ్యానం

బోధనల గురించి ఆలోచించడం జరిగింది. ఇప్పుడు మనం వాటి గురించి ధ్యానం చేయాలి. అంటే, దీన్ని ప్రజలు రెండవ దశ ధ్యానం అని అనుకుంటారు, కాని నిజానికి, ఇది బోధనల గురించి లోతుగా ఆలోచించడమే. ధ్యానం అనేది అంతకు మించి ఉంటుంది. కానీ, ఈ రెండో అడుగు వేస్తే తప్ప మనం ధ్యానం చెయ్యలేము. మీరు బోధనలను అర్థం చేసుకుని, అది సరైనదని నమ్మితే తప్ప, మీరు దాని గురించి ధ్యానం చెయ్యలేరు. మీరు దేనినైనా అర్థం చేసుకుని అది తప్పు అని నమ్మవచ్చు, కానీ మనం దాన్ని అర్థం చేసుకుని అది నిజం అని నమ్మడం గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఈ అవగాహనను, ఈ నమ్మకాన్ని మన రోజువారీ జీవితంలో మన జీవన విధానంలో కలుపుకోవడానికి ఈ ధ్యానం ఒక మెట్టు.

కాబట్టి ముందు మనం విశ్లేషణాత్మక ధ్యానం చేస్తాము, దీన్ని నేను "విచక్షణ ధ్యానం" అని పిలుస్తాను, ఆ తర్వాత స్థిరీకరణ ధ్యానం చేస్తాము. ఈ రెండు బోధనలు ఒకటిగా చెయ్యడానికి మరియు వాటిని అర్ధం చేసుకోవడానికి సహాయపడతాయి. ఇప్పుడు, విచక్షణ ధ్యానానికి మనం ప్రాథమికంగా రెండు మానసిక కారణాలను ఉపయోగిస్తాము (దీనికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది; మనం ఉపయోగించాల్సిన అనేక ఇతర మానసిక కారణాలు కూడా ఉన్నాయి - ఏకాగ్రత మొదలైనవి). వాటిని అనువదించడానికి నేను ఇష్టపడే మార్గం స్థూల గుర్తింపు (టోగ్-పా) మరియు సూక్ష్మ విచక్షణ (యోడ్-పా). కొన్ని సందర్భాల్లో, ఈ రెండు పదాలకు "దర్యాప్తు" మరియు "పరిశీలన" అని అర్థం వస్తుంది.

ఈ రెండు మానసిక కారణాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక టెక్స్ట్ ని ఎడిట్ చేసే ఉదాహరణను తీసుకుందాం, అది మీరు రాసినది లేదా ఇంకెవరైనా రాసినది అయి ఉండవచ్చు, దాన్ని చెక్ చేసి అందులో ఏవైనా పొరపాట్లు ఉన్నాయో లేదో తెలుసుకుందాం. ముందుగా, మనం పైపైన చెక్ చేస్తాము మరియు ఈ ప్రింటెడ్ పేజీలో తప్పులు ఉన్నాయని కనిపెడతాము. మీరు పైపైన చూస్తేనే వాటిని గుర్తించగలరు. తర్వాత మీరు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట వివరాలను గుర్తిస్తారు. ఇందులో తేడా కనిపిస్తోందా? కాబట్టి చెకింగ్ లో, ఏమి జరుగుతుందో అని పైపైన గుర్తించడం, ఆ తర్వాత చాలా జాగ్రత్తగా పరిశీలించడంతో ఇక్కడ ఏమి తప్పు ఉందో బాగా తెలుస్తుంది.

కాబట్టి, మనకు ఈ అమూల్యమైన మానవ జీవితం ఉందని విశ్లేషణాత్మకంగా లేదా విచక్షణతో ధ్యానించడానికి, మనం ఏమి చెయ్యాలి? మనం మనపై దృష్టి పెడతాము, మరియు జంతువు కాకపోవడం యొక్క నిర్వచించే లక్షణాలు మనకు ఉన్నాయో లేదో పరిశోధిస్తాము. కాబట్టి, మనం పైపైన పరిశోధిస్తాము మరియు అలా ఉండటానికి స్వేచ్ఛను మనం కనిపెడతాము. సరే, మనం చెక్ చేసినప్పుడు ఏం కనిపెడతాము? మనం నేర్చుకోగలం, కమ్యూనికేట్ చేయగలం, ఒక జంతువు కంటే చాలా అధునాతన స్థాయిలో పని చెయ్యగలం అని కనిపెడతాము. అవును? కాబట్టి అలానే చెయ్యండి. మాటల్లోనే కాదు, పర్సనల్ గా కూడా చూడండి. ఈ రెండో స్టెప్ ని చేశాం. ఈ పదాలకు అర్థం ఉంది, గుర్తుందా? మనం ఈ క్రింది విషయాలను గుర్తించాము:

 • నేను నేర్చుకోగలను.
 • నేను కమ్యూనికేట్ చెయ్యగలను.
 • నేను జంతువు కంటే చాలా అధునాతన స్థాయిలో వ్యవహరించగలను.

ఒక జంతువు నుంచి ఆ తేడాను మనం కనిపెట్టాము. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము, మరియు మనం కొన్నిసార్లు జంతువులా వ్యవహరించినప్పటికీ - ఉదాహరణకు, డిస్కోలకు వెళ్ళడం, సంభావ్య భాగస్వాముల వెనుక పడడం మరియు ఒక రాత్రి సంబంధాలను కలిగి ఉండటం లాంటి మన లైంగిక ప్రవర్తనలో - మనం అలా ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకుంటాము. మనం తేడాను చూపించి మన ప్రవర్తనను మార్చుకోగలము. కాబట్టి, మనం జంతువు కాదు అనే విచక్షణపై దృష్టి పెడతాము. మన ప్రవర్తన గురించి సరిగ్గా తెలుసుకుంటాము.

మనం భాగస్వామి కోసం తిరుగుతున్నామా లేక మన ఇంట్లో దోమలు, బొద్దింకలను వేటాడుతున్నామా, ఏదైనా సరే, "నేను అలా ప్రవర్తించవచ్చు, కానీ నాకు ఎటువంటి బలవంతం లేదు. నాకు నచ్చిన దాన్ని నేను ఎంచుకోగలను. నేను అలా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక మనిషిని, జంతువుని కాదు. నేను అన్ని కుక్కల లాగా మొరగాల్సిన అవసరం లేదు. సరైన పొడవు లేని బట్టలు వేసుకోవాలని, జుట్టు ఇలా ఉండకూడదు అలా ఉండాలని, ఆ పాట కాకుండా ఈ పాట పాడాలి అని ఎవరైనా చెప్తే మనం అలా చెయ్యాల్సిన అవసరం లేదు. ఇతరులు మొరిగితే మనం కూడా వాళ్ళను చూసి మొరిగే జంతువులము కాదు. మంచి సంబంధిత, సరైన పాయింట్ ని మనం ఇక్కడ ఉపయోగిద్దాం. అందరూ "యుద్ధం, యుద్ధం, యుద్ధం" అని అరుస్తున్నప్పుడు మనం కూడా "యుద్ధం, యుద్ధం" అని అరవాల్సిన అవసరం లేదు కదా? ఇతరులు మొరగటం చూసి మనం కూడా అలాగే మొరిగే జంతువులము కాదు.

కాబట్టి, "నేను నిజంగా జంతువును కాదు" అని ఈ చిన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము. అలానే చెయ్యండి. "వెళ్లి ఆ ఎముకని తీసుకురా" అని ఓనర్ చెప్పే వరకు ఎదురు చూసే ఆ కుక్కలా ఉండాల్సిన జంతువులం మనం కాదు. మనం ఆలోచించగలం.

ఆ గుర్తింపుని మరియు విచక్షణను, ముఖ్యంగా మనం జంతువు కాదనే అవగాహనను కొనసాగిస్తూ, మనం మళ్ళీ తార్కిక మార్గం గుండా వెళ్తాము:

 • మనం జంతువులమైతే ధర్మాన్ని పూర్తిగా ఆచరించలేము.
 • జంతువులుగా ఉండకుండా మనకు మన సొంత స్వేచ్ఛ ఉంటుంది.
 • కాబట్టి ధర్మాన్ని ఆచరించడానికి మనకు విలువైన మానవ జీవితాలు ఉన్నాయి.  

అప్పుడు మనం ఆ అస్పష్టమైన అవగాహనపై దృష్టి పెడతాము మరియు విలువైన మానవ జీవితాన్ని కలిగి ఉన్నామని గుర్తించడంపై దృష్టి పెడతాము.

కాబట్టి దయచేసి అలానే చెయ్యండి:

 • మనం జంతువులమైతే ధర్మాన్ని పూర్తిగా ఆచరించలేము.
 • జంతువులుగా ఉండకుండా మనకు మన సొంత స్వేచ్ఛ ఉంటుంది. దీన్ని నేను గుర్తించగలను.
 • కాబట్టి ధర్మాన్ని ఆచరించడానికి మనకు విలువైన మానవ జీవితాలు ఉన్నాయి.
 • ఎ౦దుకు అని అర్థ౦ చేసుకుని ఇప్పుడు మన౦ ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని కలిగి ఉన్నామని గ్రహి౦చుకోవచ్చు.  

సరే. దీనికి ఈ విచక్షణ ఉంది కాబట్టి, దీన్ని విచక్షణ ధ్యానం అని అంటారు. నేను చెప్పినట్లుగా, ఇది సాధారణంగా విశ్లేషణాత్మక ధ్యానంగా అనువదించబడుతుంది, కానీ విశ్లేషణాత్మకం అనేది దాని అర్థాన్ని పూర్తిగా చెప్పదు, కదా? ఇక్కడ ధ్యానం చెయ్యడం వల్ల కలిగే విచక్షణా జ్ఞానం మనకు ఉంటుంది. ఇది చాలా నిర్ణయాత్మకమైనది ఎందుకంటే ఈ విలువైన మానవ జీవితం కారణం కోసం మనకు ఉందని మనం గుర్తించగలము. మరియు మనం దాన్ని పరిశీలిస్తాము. మన దగ్గర కారణం చేతనే అది ఉందని గ్రహిస్తాము.

స్థిరీకరణ ధ్యానం

ధ్యానానికి రెండు దశలు ఉన్నాయి, విచక్షణ మరియు స్థిరీకరణ. స్థిరీకరణ ధ్యానంతో, మనం ఒక విలువైన మానవ జీవితాన్ని దాని వివరాలను అంతగా పట్టించుకోకుండా ఉంటాము. ఇక్కడ ముఖ్యమైన పదం యాక్టివ్ గా ఉండటం - ఇక్కడ "నేను జంతువు కాదు కాబట్టి" మరియు "నేను జంతువు అయితే, నేను ధ్యానం చెయ్యలేను" అనే మొదలైన వాటిని గుర్తించకుండా ఉంటాము. అందువల్ల, మనం ఏమి చేస్తున్నాము అంటే, మనకు విలువైన మానవ జీవితం ఉందనే భావనపై దృష్టి పెడుతున్నాము. అలా, మనకు విలువైన మానవ జీవితం ఉందనే భావనపై దృష్టి పెడుతున్నాము. ఇక్కడ అనుభూతి చెందడం అంటే దృఢమైన నమ్మకం - మనం దాన్ని నిజంగా నమ్ముతున్నాము. దాని మీదే మీరు దృష్టి పెడతారు. వీటి వివరాలను గుర్తించడం అని కాదు. ఇది ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని కలిగి ఉన్న దృఢమైన నమ్మకం మరియు అనుభూతి. నిజానికి, ఇది ఏమిటో అర్థం చేసుకోవడం మరియు దాన్ని గుర్తించడంపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఒక క్షణం అలా చేద్దాం.

ఈ రకమైన ధ్యానంతో మన సమయాన్ని వృధా చెయ్యడం లాంటి లోపాలు మరియు సమస్యలు పోతాయి మరియు ఈ రకమైన ధ్యానంతో మన విలువైన మానవ జీవితాన్ని గ్రహించి, దాన్ని ధర్మం కోసం నిర్మాణాత్మకంగా ఉపయోగించడం ద్వారా మనం మంచి లక్షణాలను పెంపొందించుకోవచ్చు. మన గురించి మనం కొంత అర్థం చేసుకున్నాం కాబట్టి, దాన్ని కలపడానికి ప్రయత్నిస్తాము; మనం దాన్ని అనుభవిస్తాము. ఇది మార్పును తెస్తుంది ఎందుకంటే ఇది సమస్యల కారణాన్ని తొలగిస్తుంది మరియు మంచి నాణ్యతను అభివృద్ధి చేస్తుంది.

దీనితో పాటు ఎటువంటి అవగాహన లేకుండా కేవలం శ్వాసపై దృష్టి పెట్టడంతో దీన్ని పోల్చవచ్చు. ఇది మనల్ని శాంతపరచవచ్చు, కానీ ట్రాంక్విలైజర్ తీసుకుని నిద్రపోవడం కూడా అలాగే ఉంటుంది. ఇది మన సమస్యలకు కారణాలను పోగొట్టదు. మరోవైపు, మనం శ్వాసపై అవగాహన మరియు విచక్షణతో దృష్టి పెడితే - అశాశ్వతం, క్షణిక మార్పులు, శ్వాసను నియంత్రించే వ్యక్తిగా లేదా ఆ ప్రాసెస్ ను తొలగించే పరిశీలకుడిగా నేను దృఢంగా లేను లాంటి విషయాలను అర్థం చేసుకోవడం ఉంటుంది. అప్పుడు అది మన సమస్యలకు కారణాలను వదిలించుకోవడానికి పని చెయ్యడం ప్రారంభిస్తుంది.

ధర్మం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఈ విచక్షణ చాలా అవసరం: ఇది మన సమస్యలకు కారణాలను వదిలించుకోవడం మరియు మన సానుకూల సామర్థ్యాన్ని గ్రహించడానికి ఉపయోగపడుతుంది.

మేధోపరమైన, అంతర్లీన, అకారణమైన మరియు భావోద్వేగ-అనుభూతి అవగాహనలు

ఇప్పుడు, విచక్షణ మరియు స్థిరమైన ధ్యానం రెండూ భావనాత్మకమైనవని ఇక్కడ గమనించండి. అవి రెండూ మనం ఇక్కడ వివరించిన వాటిలో భావాత్మక జ్ఞానాలు. రెండూ కాన్సెప్ట్ గానే ఉంటాయి. ఒక అమూల్యమైన మానవ జీవితం అంటే ఏమిటో అనే ఆలోచన మాధ్యమం ద్వారా అవి రెండూ ఉన్నాయి. కాన్సెప్చువల్ అంటే అదే – ఇది ఒక ఆలోచన మాధ్యమం ద్వారా ఉంటుంది. వివేకవంతమైన ధ్యానం తార్కిక మార్గంపై ఆధారపడి ఉంటుంది, మరియు స్థిరీకరించే వ్యక్తి తార్కిక మార్గంపై ఆధారపడలేదు, కానీ ఇప్పటికీ, అవి రెండూ విలువైన మానవ జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడంపై దృష్టి పెడతాయి. కాబట్టి, ఆలోచన అనేది ఒక గుర్తు. ఐడియా అంటే ఏమిటి? ఐడియా అంటే ఒక అమూల్యమైన మానవ జీవితాన్ని వివరించడం. మనం దాన్ని ఒక చిత్రంతో లేదా ఒక భావనలోని పదాలతో చూపిస్తున్నాము, కానీ దానిలో ఒక అర్థం దాగి ఉంటుంది. బొమ్మ లేదా భావన అనే పదానికి సంబంధం ఉన్న ఒక అర్థం ఉంది.

నేను దీన్ని తీసుకువస్తున్నాను ఎందుకంటే చాలా తరచుగా బౌద్ధమత ధ్యాన ప్రక్రియను అర్థం చేసుకోవడంలో మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. అన్నింటికీ మించి, మనం పాశ్చాత్య దేశాల నుంచి పదాలను అందిపుచ్చుకుంటాము, అది పూర్తిగా భిన్నమైన వ్యవస్థ. ఎప్పుడూ ఆ పాశ్చాత్య భాషలో, మేధో ప్రక్రియ మరియు అంతర్లీన ప్రక్రియ మధ్య తేడాను మనం గుర్తిస్తాము. కాబట్టి, మన బౌద్ధమత ఎనాలిసిస్ లో ఇది దేనికి అనుగుణంగా ఉంటుంది?

 • మనం దేనినైనా పదాలతో వివరిస్తే - పదాలతో కూడిన ఆలోచనతో వివరిస్తే - ఆ పదాల మాధ్యమం ద్వారా దేనిపైనైనా దృష్టి పెడితే, దాన్ని మేధో ప్రక్రియ అని పిలుస్తాము.
 • ఒక భావన లేదా చిత్రం ద్వారా దేనినైనా వివరిస్తున్నప్పుడు - అదే ఒక భావన లేదా చిత్రంపై ఆధారపడిన ఆలోచన - మరియు దానిపై దృష్టి పెట్టేటప్పుడు, మనం దాన్ని అంతర్లీన ప్రక్రియ అని పిలుస్తాము.

కానీ దయచేసి ఇక్కడ గమనించండి, మనం పదాలతో లేదా ఇమేజ్ మరియు అనుభూతితో దేనినైనా వివరిస్తుంటే, ఈ రెండు సందర్భాల్లో, ఇది సరైనది కావొచ్చు లేదా కాకపోవచ్చు. ఈ రెండూ భావనాత్మకమైనవి, ఈ మేధో ప్రక్రియ మరియు అంతర్లీన ప్రక్రియ రెండూ భావనాత్మకమైనవి, మరియు పదాల అర్థం ఏమిటో లేదా భావన లేదా చిత్రం దేన్ని సూచిస్తుందో సరైన అవగాహనతో పాటు ఉండాలి. మీరు దాన్ని అనుసరిస్తారా?

అంతేకాక, ఈ అవగాహనను జీర్ణించుకోగలగడానికి మనం దాన్ని నమ్మాలి, మరియు మనం దృఢమైన నమ్మకంతో దానిపై దృష్టి పెట్టాలి. అదే దృఢమైన నమ్మకంతో పాశ్చాత్య దేశాలలో దీన్నే మనం అంతర్గత అవగాహన అని పిలుస్తామని నేను అనుకుంటున్నాను. మరియు ఈ అంతర్గత అవగాహన ప్రశంస లాంటి నిర్మాణాత్మక భావోద్వేగాలతో కలిసి ఉన్నప్పుడు - విలువైన మానవ జీవితం యొక్క విలువను మరియు దాని అరుదైన ప్రాముఖ్యతను మనం అభినందిస్తాము - అప్పుడు పాశ్చాత్య దేశాలలో మన అవగాహనతో భావోద్వేగానికి లోనయ్యామని చెబుతాము.

అందుకే ఆధ్యాత్మిక గురువుతో ఆరోగ్యకరమైన సంబంధం కలిగి ఉండడానికి రెండు కోణాలు ఉన్నాయి, అవే దానిపై చేసే ధ్యానాలు. ఒకటి గురువు యొక్క మంచి లక్షణాలపై దృఢమైన నమ్మకం, రెండవది వారి దయను ప్రశంసించడం. కాబట్టి, మనకు ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది, మరియు మనం మానసికంగా కూడా కదిలించబడతాము. మనలో ఈ రెండూ ఉన్నప్పుడు, దాన్ని మాటలతో లేదా ఒక భావనతో వచ్చిందా అని వివరించడం ముఖ్యం కాదు; ఇందులో ఎలాంటి తేడా ఉండదు. కాబట్టి, మన పాశ్చాత్య విశ్లేషణ నుంచి మేధోపరమైన లేదా సహజమైన విధానాన్ని అనుసరిస్తున్నామా లేదా అనేది ముఖ్యం కాదు. ఆ విషయంలో, ప్రశంసల పట్ల మనకు దృఢమైన నమ్మకం, అవగాహన ఉన్నంత కాలం మనం పరివర్తనను తీసుకురాగలం. కానీ ఎప్పుడూ దీన్ని గుర్తుంచుకోండి: మనం సంసారంలో ఉన్నంత కాలం, పరివర్తన అనేది మారుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజూ మెరుగుపడదు. దీర్ఘకాలిక ట్రెండ్ మెరుగుపడవచ్చు, కానీ రోజువారీ, గంట నుండి గంటకు, ఇది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.

మనం ఒక సహజమైన విధానాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు, అవగాహన మరియు నమ్మకాన్ని కలిగి ఉండటానికి మనం ఇంకా తార్కిక మార్గంపై ఆధారపడాలని గుర్తుంచుకోండి. అలా చెయ్యకపోతే, మనకు ఏదో ఒక భావన ఉంటే, అది చాలా అస్పష్టంగా మరియు వేరుగా ఉంటుంది మరియు దాని అర్థం ఏమిటో మనకు తెలియదు. కానీ మనలోని వివిధ విషయాలను మనం గ్రహించి, అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని మనం నమ్ముతున్నట్లయితే, మనకు దాని అర్ధం తెలుస్తుంది, మనం దాన్ని గుర్తించగలుగుతాము. అప్పుడు మనం మేధో రకం అయితే మనం దీన్ని వివరించి పదాలతో దానిపై దృష్టి పెట్టవచ్చు, లేదా మనం ఇంకా సహజమైన రకం అయితే దాన్ని ఒక చిత్రం లేదా ఒక అనుభూతి పరంగా సూచించి దానిపై దృష్టి పెట్టవచ్చు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండూ వాలిడ్ అవుతాయి మరియు భావనాత్మకమైనవి. కానీ మన జ్ఞానం నాన్ కాన్సెప్చువల్ గా ఉండాలంటే - అది చాలా కష్టం. అది కేవలం ఒక విషయాన్ని గ్రహించడం - మనకు విలువైన మానవ జీవితం ఉందని గ్రహించడం - దాని గురించి ఒక ఆలోచన ద్వారా కాకుండా, భావన ద్వారా కాకుండా, సూటిగా తెలుసుకోవడం లాంటిది. అది చాలా కష్టం.

కాబట్టి, మనకు ఈ స్పష్టత ఉంటే, మనం మేధో రకమా లేదా అంతర్లీన రకమా అని తెలుసుకోవచ్చు, ఇంకా ఏదైనా ప్రోగ్రెస్ సాధించడానికి మనం ఈ సరైన మార్గాల ద్వారా వెళ్ళాలి: మీరు ఏదో ఒకటి వింటారు; ఇది నిజమేనని మీరు అనుకుంటారు. అప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, గుర్తించాలి; మీరు అస్పష్టమైన అవగాహనను పొందాలి. ఆ తర్వాత దానిపై దృష్టి పెట్టాలి. సరే, మనం ఈ మార్గంలో ఎలా ప్రోగ్రెస్ సాధిస్తాము అనే ప్రక్రియ ఇది. ఇది వినడం, ఆలోచించడం మరియు ధ్యానం చెయ్యడం ద్వారా తెలుస్తుంది. విశ్లేషణాత్మక ధ్యానం అంటే అదే.

దీనికి కొంచెం సమయం పడుతుంది. బహుశా, ఇప్పుడే మీరు దీని గురించి విని ఉంటారు. అప్పుడు మీరు దాని గురించి ఆలోచించి అర్ధం చేసుకోవాలి. విశ్లేషణాత్మక ధ్యానం అంటే ఏమిటో ఇంతకు ముందు మీకు చాలా తెలిసి ఉంటుంది, కాబట్టి ఇప్పుడు మీరు రిఫైన్ చేసిన చర్చ గురించి కొంచెం ఎక్కువే విన్నారు. కాబట్టి, దాని గురించి మీరు ఆలోచించాలి. నెమ్మదిగానే ఆలోచించండి.

ప్రశ్నలు

ఈ విశ్లేషణాత్మక ధ్యానం యొక్క ప్రాముఖ్యతను మరియు ఇది ఉపాధ్యాయులతో ఎలా సంబంధాన్ని కలిగి ఉందో నేను అర్థం చేసుకున్నాను. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఉపాధ్యాయులను మనం ప్రశ్నించకూడదని, వాళ్ళు చెప్పేది మరియు వాళ్ళు ప్రవర్తించే విధానం మొదలైన వాటిని నిశ్శబ్దంగా మరియు ఎటువంటి సందేహాలు లేదా ప్రశ్నలు లేకుండా స్వీకరించాలని మనకు ఎందుకు చెప్పబడింది?

ధర్మంలో మనకు కనిపించే నిజమైన బోధనలు ఇవేవీ కావు. ముఖ్యంగా వినయ, నైతిక క్రమశిక్షణ: ఉపాధ్యాయుడు నైతిక క్రమశిక్షణకు వ్యతిరేకంగా, ప్రతిజ్ఞలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే, మనం దాన్ని ఎత్తి చూపుతున్నాము. మనం దానితో కలిసి వెళ్ళము. నైతిక బోధనలకు విరుద్ధంగా ఏదైనా చెయ్యమని ఉపాధ్యాయుడు మనల్ని అడిగితే, మనం వద్దని చాలా స్పష్టంగా చెబుతాము.

సూత్రం, మరియు తంత్ర బోధనల గురించి మనం లోతుగా పరిశీలిస్తే: బోధనలకు సరిపోలని విషయాన్ని ఉపాధ్యాయుడు చెబితే, "అది నాకు అర్థం కాలేదు. ఇది మీరు ఇంతకు ముందు చెప్పినదానికి విరుద్ధంగా ఉంది. దీన్ని ఇంకొంచెం వివరంగా చెప్పగలరా?" అని లేదా "ఇది ఈ టెక్స్ట్ కి విరుద్ధమైనది. దీన్ని ఇంకొంచెం వివరంగా చెప్పగలరా?" అనేటటువంటి ప్రశ్నలను అడగాలి. ఎందుకంటే టీచర్లు అందరి లాగే అప్పుడప్పుడు తప్పులు చెప్తూ ఉంటారు.

బుద్ధుని పూర్వ జన్మలోని ఒక క్లాసిక్ ఉదాహరణ ఉంది: గురువు బుద్ధుడికి, ఇతర విద్యార్థులకు బయటకు వెళ్లి దొంగతనం చెయ్యమని చెప్పినప్పుడు, బుద్ధుడు బయటకు వెళ్లి ఆ పని చెయ్యలేదు. దానికి ఆ గురువు అతన్ని ప్రశ్నించగా, బుద్ధుడు "దొంగతనం చేస్తే ఎవరికైనా ఎలా ఉపయోగం ఉంటుంది?" అని అడిగాడు. దానికి గురువు, "ఆహా, పాఠంలోని విషయం నీకు బాగా అర్థమైంది. నీకొక్కడికే అర్థమైంది" అని చెప్తారు.

ఈ అత్యున్నత తంత్ర ఆలోచనా విధానం నుంచి చూస్తే: ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఉపాధ్యాయుడు మొదలైన వారిలో ఇలాంటి తేడాలు కనిపిస్తే, మనం ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నించినప్పుడు, ఉపాధ్యాయుడు దీన్ని అంగీకరించడు, ఆ ఉపాధ్యాయుడు మారడు – ఈ లోపాలన్నీ మనం చూస్తే, మనం ఉపాధ్యాయుడి నుంచి తాంత్రిక దీక్ష పొందినప్పటికీ, మనం చేయాల్సిందల్లా కేవలం అతనితో దూరం పాటించడమే. ఇక ఆ టీచర్ దగ్గర చదువుకోవాల్సిన అవసరం లేదు, ఆ టీచర్ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏమీ మాట్లాడకుండా ఉండండి. ఒక గౌరవప్రదమైన దూరాన్ని పాటించండి. స్టోరీలను స్ప్రెడ్ చెయ్యకండి. "ఓహ్, ఈ టీచర్ ఎంత చెడ్డవాడో" అని అనుకోకండి. ఒకరు నేర్చుకున్నదాన్నే మెచ్చుకుంటారు, మనం నేర్చుకున్న మంచి గుణాలను మెచ్చుకోండి, ఆ తర్వాత మిగిలిన వాటితో సమానత్వాన్ని పాటించండి.

మనం ప్రశ్నించడం లేదు అని మీరు చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? గురువుకు బుద్ధ స్వభావం ఉందని మీరు ప్రశ్నించరు - ఉపాధ్యాయుడి మాటలు సరైనవి అని అనిపించనప్పుడు మీరు వాటిని ప్రశ్నించరని దీని అర్థం కాదు. తిలోపా నరోపాను కొండపై నుంచి దూకమని చెప్పడం లాంటి ఉదాహరణను మనం పరిశీలిస్తే: దలైలామా గారు ఎప్పుడూ చెప్పినట్లు దాన్ని పరీక్షించండి. తిలోపా బతికి ఉన్న చేపను తిని ఆ తర్వాత దాని ఎముకలను నేలపై పడెయ్యగలడు, మళ్ళీ ఒక చిటికతో, ఆ చేపను మళ్ళీ బతికించగలడు. మరియు నరోపా తన కాలంలో అత్యంత పండితుడైన మఠాధిపతి. కాబట్టి, మన గురువు తిలోపా స్థానంలో ఉంటే మరియు మనం నరోపా స్థానంలో ఉంటే, నరోపా జీవిత చరిత్ర నుంచి ఆ ఉదాహరణ సరైనదే. ఒకవేళ మనం మరియు మన ఉపాధ్యాయుడు ఆ స్థానంలో లేకపోతే - ఇది దాదాపు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడినట్టే - అప్పుడు ఇది పూర్తిగా వేరే విషయం అవుతుంది. కాబట్టి, మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. గురువు ఏం చేసేది ధర్మమా? మరి గురువు ఏం బోధిస్తున్నాడు, అది ధర్మం ద్వారానా? అని. మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటాము. మనకు అది తెలియకపోతే, దాన్ని పరిశీలిస్తాము.

నేను మొదటి స్థాయి విద్యార్థిని. నేను కేంద్రానికి, బోధనలకు కొత్తవాడిని. నిజానికి, నా లోపాలు మరియు అవగాహనా లోపం వల్ల నాకు ఈ కష్టం వచ్చిందని తెలుసు, కాని పునర్జన్మ మరియు వరుస జన్మల ఆలోచనను అర్థం చేసుకోవడం మరియు అంగీకరించడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, మరియు బౌద్ధమత బోధనలలో ఇది చాలా ముఖ్యమైన విషయం అని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి, ఉదాహరణకు, నేను నా విలువైన మానవ జీవితం గురించి ధ్యానం చేసినప్పుడు - నేను చేసినది, నేను దాని గురించి లోతుగా వెళ్లినందుకు - మరియు దాన్ని ఒక బహుమతిగా, ఒక అవకాశంగా, మార్చడానికి చూసినప్పుడు, నేను భవిష్యత్తు జీవితాలను లెక్కలోకి తీసుకోవాలని తెలుసుకున్నాను, ఇది నాకు చాలా కష్టం. కాబట్టి, నా అమూల్యమైన మానవ జీవితం గురించి నేను ఎంత లోతుగా ఆలోచిస్తున్నానో నాకు తెలుసు. ఎందుకంటే, భవిష్యత్తు జీవితాల గురించి అవగాహన లేకుండా, నా విలువైన మానవ జీవితం యొక్క పూర్తి ప్రశంస ఎప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి, ఇది నా సందిగ్ధత. నేను దాన్ని ఎలా దాటగలను?

మీ పరిశీలన చాలా బాగుంది. జ్ఞానోదయం పొందే వరకు దేనినీ అర్థం చేసుకోవడంలో తృప్తి పడకూడదనేది తంత్ర ప్రతిజ్ఞలలో ఉంటుంది. అంటే అమూల్యమైన మానవ జీవితంతో సహా ప్రతి దానిపై మన అవగాహన మనం పురోగమిస్తున్న కొద్దీ ఇంకా లోతుగా వెళ్తుంది. కాబట్టి మనం ఇప్పుడు పునర్జన్మను అర్థం చేసుకున్నప్పటికీ, మన అమూల్యమైన మానవ జీవితాన్ని అర్థం చేసుకోవడంలో మీరు దానికంటే ఇంకా లోతుగా వెళ్ళవచ్చు. దీని అర్థం ఇంతకుముందు దశ అవగాహన ప్రయోజనకరంగా లేదని కాదు. ప్రతి దశ ప్రయోజనకరంగా ఉంటుంది, ప్రత్యేకించి ఇప్పుడు మనకు ఉన్న అవగాహన స్థాయి లోతైన అవగాహనలకు ఈ మార్గంలో ఒక మెట్టు అని మనం గుర్తుంచుకుంటే. ఆ వినయంతో, అది పరిపూర్ణమైనది.

బోధనలలో ఇది చాలా స్పష్టంగా ఉంటుంది: మీరు దాన్ని లోతుగా అర్థం చేసుకున్నారని ఎప్పుడూ అనుకోవద్దు. "ఓహ్, ఇప్పుడు నాకు దొరికింది. ఇకపై విలువైన మానవ జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు." అది చాలా పెద్ద తప్పు. నువ్వు ఎప్పుడూ ఇంకా లోతుగా ఆలోచించవచ్చు అని.

మీరు చెప్పినట్లుగానే, మానవులుగా మనకు విచక్షణా సామర్థ్యం ఉంటుంది. కుక్కలా అరవకుండా లేదా మీరు చెప్పిన పనులన్నీ చెయ్యాలా వద్దా అని మనం ఎంచుకోవచ్చు. కానీ మనకు ఈ విచక్షణా సామర్థ్యంతో పాటు కొంత సామర్థ్యం ఉందని ఇది చెప్తుంది. అలాంటప్పుడు జంతువులుగా పునర్జన్మ పొందితే మనం ఆ సామర్థ్యాలను ఎలా కోల్పోతాం? అంటే, మనం జంతువుగా పునర్జన్మ పొందితే వాటిని మనం కోల్పోగలమని నాకు అహేతుకంగా, అసంబద్ధంగా అనిపిస్తోంది. అక్కడ ఏమి జరుగుతుంది?

మీరు అనువైన మరియు అసలైన వ్యక్తీకరణ సామర్థ్యం మధ్య తేడాను గుర్తించాలి. పిల్లల్లో చాలా సామర్థ్యం ఉంటుంది. వాళ్లకు కారును నడపగల సామర్థ్యం ఉంటుంది, కానీ దీనికి అసలైన సామర్థ్యం ఉండదు. మరియు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనం ఇప్పటికీ స్పష్టంగా ఆలోచించగలము, పని చెయ్యగలము మరియు మిగతావి చెయ్యగలము, కాని ఆ క్షణంలో ఏదో ఒకటి మనకు అడ్డు పడుతుంది, కాబట్టి మనకు దానికి కావలసిన సరైన సామర్థ్యం ఉండదు. అదే విధంగా, ఒక జంతువుగా అన్నిటినీ చెయ్యగలిగినప్పటికీ - బుద్ధ-ప్రకృతి యొక్క సామర్థ్యాలు ఉంటాయి - కానీ అసలైన వ్యక్తీకరణ సామర్థ్యాలు ఉండవు (లేదా అవి ఉన్నా, అవి మనుషులతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి).

అంకిత భావం

మనం దీన్ని అంకిత భావంతో ముగిద్దాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ మనం వినడం మరియు ధ్యానం చెయ్యడం లాంటి పనుల ద్వారా సృష్టించబడిన పాజిటివ్ శక్తిని జ్ఞానోదయం కోసం ఉపయోగించకపోతే, ఏమి చేయకపోతే ఎలా, దీన్ని ఒక డిఫాల్ట్ సెట్టింగ్ లాగా ఉపయోగిస్తే ఇది సంసారాన్ని మెరుగుపరచడానికి ఒక కారణంగా పనిచేస్తుంది. ఉదాహరణకు, చాలా డబ్బు సంపాదించగలిగినందుకు మనం మన మానవ జీవితాన్ని మెచ్చుకుంటాము. కాబట్టి, ఇది జ్ఞానోదయానికి ఒక కారణంగా పని చెయ్యాలంటే, మనం దాన్ని దానికి అంకితం చెయ్యాలి. కాబట్టి, మనం దాన్ని చాలా యాక్టివ్ గా చేస్తాము. మనం "బుద్ధుని మనస్సు, శరీరం, మాటలు మొదలైన వాటిని సాధించగలగడం, అందరికీ ప్రయోజనం చేకూర్చడానికి ఇది ఒక కారణం కావాలి" అని చెప్తాము. అప్పుడు అది అలాంటి కారణంగా పనిచేస్తుంది. మరియు "ఈ అవగాహన ఇంకా లోతుగా వెళ్ళి జ్ఞానోదయం పొందే మార్గంలో ఇది ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా నా ప్రవర్తనలో ఫలితాలను తీసుకురావడం ప్రారంభిస్తుంది."

Top