"అశాశ్వతం గురించి ఎలా ధ్యానించాలి" అని ఒక సంక్షిప్త వివరణ

గంగ్ టాంగ్ రింపోచే గారి యొక్క (1762-1823) టెక్స్ట్, అశాశ్వతం గురించి ఎలా ధ్యానించాలో శిక్షణ, ఈ టెక్స్ట్ లో అనేక రూపాలలో కనిపించి, మనస్సును మంచిగా మార్చుకోవడానికి బోధనలు ఇచ్చే తన గురువులందరికి నివాళులు అర్పించడంతో ప్రారంభమవుతుంది:

పరిమిత జీవుల యొక్క అనేక అవసరాలకు అనుగుణంగా వివిధ రూపాల్లో మరియు వైవిధ్యాలలో కనిపించి ఆనందం మరియు శూన్యత యొక్క గొప్ప అర్ధానికి గుర్తు.

ఎనిమిది సుఖాలు, పది సుసంపన్నతలు కలిగిన ఈ అమూల్యమైన మానవ శరీరం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ అవకాశాన్ని కోల్పోయి శాశ్వత విలువ కలిగినది ఏదీ సాధించలేక తర్వాత పునర్జన్మలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఈ ముక్తి మార్గంలో మనల్ని మనం ఉంచుకోవాల్సిన సమయం ఇదే. ఇక్కడ మనమందరం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్ళం, కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ధర్మాన్ని ఆచరించడానికి ఇనుప హుక్ లాంటి జ్ఞాపకంతో, ఏనుగుకు శిక్షణ ఇచ్చే దశలతో, అప్రమత్తతతో మనల్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రాపంచిక, సంసారాల విషయాలను ఈ నెలలోనో, లేదా ఈ సంవత్సరంలోనో పూర్తి చెయ్యడానికి ప్రయత్నించండి, ధర్మాన్ని వాయిదా వేసే ఆలోచనలన్నిటినీ ఈ సంవత్సరంలోనే వదిలేసుకోండి, ఎందుకంటే అది మిమ్మల్ని పట్టి పీడించే దెయ్యం లాంటిది. ఒక టీచర్ ఒకసారి ఇలా అన్నాడు, మతాన్ని అనుసరించే వాళ్ళు జీవించడానికి వాళ్లకు కావలసినవి ఉండటం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ధర్మాన్ని ఆచరించడానికి డబ్బులు సంపాదించుకోవాలని కొందరు సాకులు చెప్తారు, కాని ధర్మాన్ని ఆచరించే తీవ్రమైన అభ్యాసకుడు ఆకలితో మరణించిన దాఖలాలు లేవు.

ధర్మాన్ని అంకితభావంతో పూర్తిగా ఆచరించాలనే ఆలోచనను పుట్టించండి. ఈ జీవిత పనులు నీటిపై ఉండే అలల లాంటివి. అలల లాగా ముందు ఒకటి వస్తుంది, ఆ తర్వాత వెంటనే ఇంకొకటి వస్తుంది. మీరు ఎంత ఎక్కువ చేస్తే, అన్నీ కొత్త పనులు వస్తాయి: దీనికి అంతు ఉండదు. లక్ష్యం లేకుండా అటూ ఇటూ వెళ్లడం కంటే మనపై ఎలాంటి ఆంక్షలు లేనప్పుడు వీటిని వదిలేయాలని గట్టిగా నిశ్చయించుకోవడం మంచిది కదా? ఉదాహరణకు, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే, మీరు ప్రతిదాన్ని విడిచిపెట్టి, దాన్ని జాగ్రత్తగా చెయ్యాలని బలమైన, దృఢమైన, నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇది నరోపా తిలోపాను చూడటానికి వెళ్ళే కథ లాంటిది. ఆయన కావాలనే నలందా మఠాధిపతి పదవిని వదులుకుని వెళ్ళిపోయాడు. మరియు మంజుశ్రీ నుంచి ప్రాధమిక ఆచారాలను విరమించుకోవాలని ఆదేశాలు అందుకున్న సోంగ్ ఖాపా, అలా చెయ్యాలని నిశ్చయించుకుని, తన వేలాది మంది శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.

మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. రేపటి ధర్మ ఆచారం జరగక ముందే ఈ రోజు మరణం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించాలనుకుంటే మీరు ఈ రోజు నుంచే దాన్ని ఆచరించండి.

సోంగ్ ఖాపా, పద్మసంభవ లాంటి గొప్ప గురువుల పనులు ప్రపంచం నలుమూలలా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ గురువులందరూ చనిపోయారు. ఇప్పుడు వారి పేర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, వారి శరీరాలు కనుమరుగైపోయాయి, మరియు వారి బోధనల ద్వారా మాత్రమే మనం వాళ్ళను అర్థం చేసుకోగలము. ఇవన్నీ వారి అశాశ్వతానికి సూచిక, కుషినగర్ లో ఉన్న బుద్ధుని విగ్రహం లాగా అనమాట, బుద్ధుడు కూడా మరణించాడని మనకు ఇది గుర్తు చేస్తుంది. బుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, శ్రావకులు అందరూ చనిపోయాక కూడా మనం చనిపోతామా లేదా అని శాంతిదేవుడు బోధిసత్వ ప్రవర్తనలో చెప్పాడు. ఈ బోధనలన్నిటినీ రచించిన గురువుల లాగానే ఎనిమిదవ దలైలామా గారు కూడా బోధించారు, కానీ ఇప్పుడు ఆయన కూడా బతికి లేరు. అయితే, ఈ మహానుభావుల రూపాలు కనుమరుగైపోయి, అవి తిరిగి బుద్ధుల ప్రకృతి నిధిలో (స్వభవకాయ) కలిసిపోయినప్పుడు, ఇది కేవలం ఊహలలో ఉండే శిష్యులకు అశాశ్వతాన్ని బోధించడానికి మాత్రమే చేయబడిందని మనం గమనించాలి.

ఈ మహానుభావుల లాగానే వందేళ్లలో మనలో ఎవరూ బతికి ఉండరు. తమ సంపదను, బలాన్ని చూసి ఎంతో గర్వపడే రాజులు, రాజనీతిజ్ఞులు కూడా ఇక ఉండరు. వారి పేర్లు మాత్రమే మిగిలిపోతాయి. ప్రస్తుతం ఉన్న అనేక ప్రసిద్ధ ప్రపంచ నాయకులకు కూడా ఇదే వర్తిస్తుంది: వాళ్ళు భవిష్యత్తులో ఇక్కడ ఉండరు. మీ వయస్సులో ఉన్నవారు, మీలాగే శారీరక బలం ఉన్న వాళ్ళు కూడా మరణిస్తారు. అకస్మాత్తుగా వారిని మరణ దేవుడు కిడ్నాప్ చేస్తాడు. కాబట్టి, మీరు ఎందుకు శాశ్వతంగా జీవిస్తామనే నమ్మకం ఉంది? అశాశ్వతం గురించి బోధించినప్పటికీ చావుకు భయపడకపోవడం చాలా మూర్ఖత్వం. గొర్రెలు లాంటి నీరసమైన, తెలివితక్కువ జంతువులు కూడా ఇతర గొర్రెలను ఒక కసాయి వచ్చి చంపడం చూసినప్పుడు, వాటి గుండెలు వేగంగా కొట్టుకుంటూ వణుకు పుట్టిస్తాయి.

గెషే పొటోవాకు సంబంధించిన ఒక కథ ఉంది. ఆ ఊళ్లో నివసిస్తున్న ఒక వ్యక్తి వచ్చి "నాకు చావు వచ్చే ముందు, నువ్వు నాకు దాని సందేశాన్ని పంపగలవా?" అని అడిగాడు. ఆ తర్వాత, ఒక సమీప పైన ఉన్న గ్రామంలో ఒకరు చనిపోవడంతో ఆ వ్యక్తికి సందేశం పంపినా అతను ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ తర్వాత అక్కడి కింద మరియు మధ్యన ఉండే గ్రామంలో వాళ్ళకు ఇదే జరిగింది. అయినా వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు. చివరికి, అతనికి మరణ సంకేతాలు వచ్చాయి, కాబట్టి అతను గెషే పొటోవా దగ్గరకు పరిగెత్తాడు మరియు "మీరు నాకు ఎందుకు ముందే చెప్పలేదు?" అని అడిగాడు. గెషే పొటోవా ఇలా జవాబిచ్చాడు, "నేను చేశాను, కానీ నీకు అర్థం కాలేదు" అని. గెషే పొటోవా తాను నివసించిన పెన్పోలో జరిగిన అన్ని మరణాలను లెక్కించి అశాశ్వతాన్ని ధ్యానించేవాడు.

అశాశ్వతమైన అవగాహన లేఖన సూచనలపై ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు; సకల జీవరాశులను పట్టి పీడిస్తున్న మృత్యువు నుంచి మీరు దాన్ని మీ తెలివితోనే చూడవచ్చు. మరణం యొక్క స్పష్టతను చూసే, కానీ ఈ సాక్షాత్కారాన్ని తమకు అన్వయించుకోని వ్యక్తులు కళ్ళు తెరిచిన అంధులు లేదా గాజు కళ్ళు ఉన్న వ్యక్తులుగా ఉంటారు. భవిష్యత్తులో మన స్నేహితులు, బంధువులు, సేవకులు, బంధుమిత్రులు అందరూ చనిపోతారు. మీరు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, అది గాలి ద్వారా తీసుకువచ్చిన ఆకుల సేకరణ లాంటిది, తర్వాత అది చెల్లాచెదురు అవుతుంది. ఇప్పుడు మనం కలిసి ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మళ్లీ మనం కలుసుకున్నప్పుడు మనం వేర్వేరు రూపాల్లో ఉంటాము మరియు ఒకరినొకరు గుర్తుపట్టలేము. ఎవరైనా అశాశ్వతం గురించి ఆలోచించడం చాలా అరుదు, కానీ మనం కనీసం ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక జీవితం యొక్క సమతుల్యతను కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది స్థిరత్వాన్ని సృష్టిస్తుంది.

ఋతువులు మారడం, ఆకులు రాలిపోవడం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు అశాశ్వతం గురించి మనకు పాఠాలు నేర్పుతాయి. మిలారెపా చెప్పినట్లుగా, "నేను నా చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ఒక బోధనగా చూస్తాను."

అశాశ్వతాన్ని జాతర రూపంలో చెప్పవచ్చు. ఈ కార్యక్రమాలకు వివిధ గ్రామాల ప్రజలు ఒకచోట చేరి ఆ తర్వాత వాళ్ళు వెళ్లిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు మరియు వాళ్ళు మళ్లీ అలానే కలిసి ఇక్కడకు రారు. మన చుట్టూ ఉండే ఈ స్నేహితులు మరియు బంధువులు శరదృతువు జాతరలో లేదా ఈగలలా ఉన్న వ్యక్తుల లాగా ఉంటారు. వాళ్ళు చెల్లాచెదురు అవుతారు.

వసంత ఋతువు మరియు వేసవి కాలం లాంటివి ఆకర్షణీయంగా అందంగా ఉండవచ్చు, కానీ అశాశ్వతమైన మరియు నిరంతర మార్పు యొక్క బోధనలు అలాగే ఉంటాయి. మొక్కలు ముందు ఆకుపచ్చగా, తర్వాత నారింజ రంగులో, ఆ తర్వాత ఎండిపోయి ఉంటాయి. ప్రవాహాలలో ఉండే నీటి ఉష్ణోగ్రత, దాని రంగు మరియు అది చేసే శబ్దాలు అన్నీ ఋతువులను బట్టి మారతాయి. అందమైన శబ్దాలు చేసే బుడగలు అందమైన నృత్యం చేస్తున్నటువంటి ప్రకంపనలతో ఆకుపచ్చ-నీలం రంగులో ఉన్న ప్రవాహాలు చివరికి వాటి ఉపరితలాలపై గడ్డ కడతాయి మరియు తెల్లని మంచు మరియు నీళ్ళు ఎవరో గొణుగుతున్నట్లు శబ్దాన్ని వినిపిస్తాయి. మనుషుల విషయంలో కూడా అదే జరుగుతుంది. వయసులో ఉన్నప్పుడు అందరూ చాలా పార్టీలకు వెళ్లి డ్యాన్స్ చెయ్యడం, పాటలు పాడటం, తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ వారి అలవాట్లు మారిపోతాయి. ఇంతకుముందు ఉదాహరణలో చెప్పినట్లుగానే, వారు గొణుగుతూ శబ్దాలను కూడా చేస్తారు!

వేసవికాలంలో తేనెటీగలు అందమైన తోటల్లో పువ్వులలో ఉండే సారాన్ని వెలికి తీస్తాయి. ఇది మనం యవ్వనంలో ఉన్నప్పుడు చేసేటటు వంటిది. ప్రపంచంలోని సుఖాల్లో, సంతోషాల్లో మనం మునిగి తేలుతాం. కానీ శరదృతువులో పూల తోట ఎడారిలా మారుతుంది మరియు శీతాకాలం నాటికి, ఆ తోటలో గాలి వీచినప్పుడు, అది విచారకరమైన శబ్దాన్ని చేస్తుంది. ప్రజలు అక్కడికి వెళ్లి అన్నిటినీ నగ్నంగా చూడటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు కొండ మొత్తం పూలతో కప్పబడి ఉంటుంది, ఆ తర్వాత శీతాకాలంలో ఇది పూర్తిగా బంజరు భూమిగా మారుతుంది. ఇళ్ల సంగతి కూడా అంతే: అవి కూడా పాతవి అవుతాయి. అందువల్ల, ఇవన్నీ అశాశ్వతానికి ఉదాహరణలు. అయితే, అశాశ్వతానికి అత్యంత తక్షణ గురువు ఒక వ్యక్తి యొక్క భౌతిక రూపమే. వయస్సు పెరిగే కొద్దీ, మన యవ్వనంలో మనం చేసిన పనులు మళ్ళీ చెయ్యలేము: మనం నెమ్మదిగా అయిపోతాము మరియు మన రూపం మారిపోతుంది.

అశాశ్వతం అనేది కేవలం జీవులకే కాదు, భవనాలు, ప్రకృతి, తోటలు, కాలం లాంటి నిర్జీవ వస్తువులకు కూడా వర్తిస్తుంది. నాగార్జునుడు, అసంగ చదువుకున్న నలందలోని గొప్ప మఠాలు, బుద్ధగయ లాంటి ప్రదేశాలు ఎప్పుడో కనుమరుగయ్యాయి. గాండెన్, సెరా మరియు టిబెట్ లోని ఇతర గొప్ప సన్యాస విశ్వవిద్యాలయాల విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మనం ఉన్న లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ అండ్ ఆర్కైవ్స్ కూడా చివరికి శిథిలావస్థలా మారుతుంది. నాగార్జునుడు తన మిత్రునికి రాసిన లేఖలో (సం.సుహ్రిలేఖ) "సప్త సూర్యుల దహనం వల్ల విశ్వమంతా నాశనమైతే, మన శరీరాలు కూడా నాశనమవుతాయి అని అనడంలో ఏ సందేహం లేదు" అని చెప్పాడు, ఎందుకంటే వినాశనం దివ్య రూపాల సమతలం యొక్క మొదటి స్థాయి స్థిరమైన బ్రహ్మ ప్రపంచం ద్వారా ప్రతిదాన్ని నాశనం చేస్తుంది.

నలుపు మరియు తెలుపు ఎలుక ఒక గడ్డి కట్టను బంధించే తాడును మార్చుకుని మరీ తింటాయి. ఈ ఉదాహరణలో నలుపు మరియు తెలుపు ఎలుకలు రాత్రి మరియు పగలుని సూచిస్తాయి, ఆ గడ్డి కట్ట మన జీవితకాలం మరియు గడ్డి చుట్టూ ఉన్న తాడు దాని కాల వ్యవధి. ఈ తాడు నాశనమై, మన ఆయుర్దాయానికి ప్రతీకగా నిలిచే గడ్డి కట్ట కూలిపోయే ముందు, వీలైనన్ని నిర్మాణాత్మక పనులు చేపట్టే అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి.

ప్రతి క్షణం మనం మరణ దేవుని సన్నిధిలోకి వెంటాడబడతాము. ఒక జంతువును కబేళానికి తీసుకెళ్లినట్లే, ప్రతి అడుగు మనల్ని మరణానికి దగ్గర చేస్తుంది. మనం తీసుకునే ప్రతి శ్వాస మనల్ని మరణానికి దగ్గర చేస్తుంది. ఈ రోజు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి మనం మరణానికి ఎంత దగ్గరగా వెళ్ళాము? మనం చిన్న వాళ్లం కాబట్టి చచ్చిపోం అని అనుకోవడం సిల్లీగా ఉంటుంది. మరణ దేవుడికి వయస్సుతో అసలు ఏ పనీ లేదు. తెల్ల వెంట్రుకలు, విల్లుల్లా వంగిన శరీరాలు ఉన్న వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళుతుంటే, మరణ దేవుడు ఒకరి వయస్సు పట్ల వివక్ష చూపిస్తాడని మనం ఎలా చెప్పగలం? అందుకే వయసుతో సంబంధం లేకుండా మనం ధర్మాన్ని ఆచరించాలి, వృద్ధాప్యంలోనే కాదు. ధర్మం ఒక్కటే ప్రయోజనకరమైనది.

మీ ప్రాక్టీస్ మాత్రమే ఒక నమ్మదగిన స్నేహితుడు. ప్రజలు విశ్వసనీయంగా ఉండరు. ఒక వ్యక్తి యొక్క సంపద పంట చెడు పరిస్థితులలో వడదెబ్బ వల్ల నాశనమైనట్లే, మీరు ఇంతకు ముందు జాగ్రత్తగా చూసుకుని ఆధారపడిన వారి నుంచి కూడా ఎటువంటి ప్రతిస్పందన పొందకపోవడం జరుగుతుంది. మనం పేదవాళ్లం అయినప్పుడు అందరూ మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. ఇది ప్రాథమిక మానవ స్వభావం. మనం ముసలి వాళ్లం, పేదవాళ్లం అయినప్పుడు ప్రజలు మనల్ని పట్టించుకోరు. మనం ధనవంతులు మరియు ప్రసిద్ధులైనప్పుడు, ప్రజలు ఎప్పుడూ మన దృష్టినే కోరుకుంటారు. ఎవరైనా ధనవంతులు అయినప్పుడు, ప్రజలు వచ్చి అతని కీర్తికి దోహదపడినట్లు నటిస్తారు. ప్రజలు మీ సంతోషాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ బాధలను పంచుకోరు. వాళ్ళు మీ నుంచి ఏమీ పొందలేనప్పుడు, మిమ్మల్ని వదిలేస్తారు. బుద్ధుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించి పేదలు, నిరుపేదలపై ఎక్కువ శ్రద్ధను చూపించాడు.

మీరు మంచి వాళ్ళు కాదని మీ అత్యంత నమ్మకమైన స్నేహితుడికి ఎవరైనా చెబితే, వాళ్ళు వాళ్ళ మనస్సును మార్చుకుంటారు. కేవలం కొన్ని మాటలు ఆ తర్వాతి రోజు మిమ్మల్ని అసహ్యించుకునేలా చేస్తాయి. ఇది ఈ సామెతను రుజువు చేస్తుంది: "ఇంతకు ముందు కొన్ని అంగుళాలు చేరుకోగలిగిన దాన్ని ఇప్పుడు ఒక గజం ద్వారా చేరుకోలేకపోవచ్చు" అని. అంటే కేవలం కొన్ని పదాలు దగ్గరగా ఉన్న వారిని దూరం చేస్తాయి. ధర్మంలో ఒక స్థిరమైన మిత్రుడిని మనం వెతుక్కోవాలి. స్నేహితులు ఒకరితో ఒకరు మంచిగా ఉండి మీ తప్పులు మరియు బలహీనతలను ఎత్తి చూపడానికి సంకోచిస్తారు. కానీ శత్రువు మన తప్పులను ఎత్తి చూపి బాగా సహాయకారిగా ఉంటాడు.

కొంతమంది జీవితాంతం డబ్బులు సంపాదిస్తారు, దాని ఫలితంగా, వాళ్ళు చాలా మార్పు చెందుతారు మరియు చాలా బాధలను అనుభవిస్తారు. అలా చాలా బాధలు వస్తాయి కాబట్టి, మనం డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. డబ్బులలో ఆనందం కనిపిస్తుంది కానీ అది నిజం కాదు. మన సంపద ఆకర్షణ ఒక పురుగు లేదా సీతాకోకచిలుకకు మంట వైపు ఉండే ఆకర్షణ లాంటిది: అది చాలా దగ్గరగా వెళితే, కాలిపోతుంది. ధనవంతులు సంతోషంగా, అందంగా, మంచి ఇల్లు ఉండి డబ్బు గురించి ఎటువంటి బాధలు లేనట్లు కనిపిస్తారు. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ మనం ఈ పరిస్థితిలో పూర్తిగా మునిగిపోయినప్పుడు, దాని కష్టాలు మరియు నెగెటివ్ లను చూస్తాము. ఉదాహరణకు, కొంతమంది మతాన్ని వారు ధనవంతులైన తర్వాత, మతం పట్ల ఆసక్తిని కోల్పోతారు మరియు వారి మనస్సు ఎక్కువ సంపదను కూడబెట్టడంపై దృష్టి పెడుతుంది. మనం ఎప్పుడూ సద్గుణాన్ని కూడబెట్టడంలో అలసిపోతాము, కానీ ఎక్కువ సంపదను కూడబెట్టడానికి ఎప్పుడూ అలసిపోము.

క్లుప్తంగా చెప్పాలంటే, మన జీవితంలో అశాశ్వతం మరియు మరణం తప్పక వస్తుంది, కాబట్టి మనం దానికి సిద్ధంగా ఉండాలి. మరణం ఎప్పుడు వస్తుందో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది వచ్చిన తర్వాత, దాన్ని తిప్పికొట్టడం అసాధ్యం. ధనవంతులు దానికి లంచం ఇవ్వలేరు, అందమైన వాళ్ళు దాన్ని ఆకర్షించలేరు మరియు కండలు ఉన్న వాళ్ళు దానితో కుస్తీ చెయ్యలేరు. కొన్ని చోట్ల డబ్బుతో వీసా పొడిగింపు లేదా రెసిడెన్సీ పర్మిట్ లను కొనుక్కోవచ్చు కానీ మన ఆయుష్షు పొడిగింపును కొనుక్కోలేము.

మనం మరణ దేవుడి చేత పట్టుబడినప్పుడు, పుట్టినప్పటి నుంచి మనతో ఉన్న శరీరాన్ని మనం విడిచిపెట్టాలి. మనం వెచ్చని మంచం మీద చనిపోయినా, మన స్పృహ పోయినప్పుడు, మన బంధువులు, స్నేహితులు మరియు సంపదను తిరిగి చూసే అవకాశం ఒక్క క్షణం కూడా మనకు ఉండదు. ఇది జీవిత సత్యం మరియు మనం దాని కోసం సిద్ధంగా ఉండాలి. మనం కూడబెట్టుకున్నవన్నీ వదిలేసి, ప్రతి కష్టాన్నీ అవిశ్రాంతంగా భరిస్తూ ఉండాలి. మన నిర్మాణాత్మక, విధ్వంసక పనుల సామాను, భారాన్ని, బాధ్యతను మన వీపుపై మోస్తూ ఈ జీవితాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. కొందరు ముసలి తల్లిదండ్రులు తమ పిల్లలు, మనవరాళ్లకు ఇళ్లను కట్టిస్తారు, కానీ వాళ్ళు చనిపోయినప్పుడు, దాన్ని నిర్మించినందుకు, పురుగులను చంపినందుకు వినాశకరమైన ప్రవర్తన యొక్క భారాన్ని వారి వీపుపై మోస్తారు, మరోవైపు పిల్లలు ఆ ఇంట్లో ఉండడం చూసి ఆనందిస్తారు. అందువల్ల, అటువంటి పనుల ద్వారా, మనం నెగెటివ్ కర్మ యొక్క భారాన్ని కూడబెట్టుకుంటాము.

మనం బార్డో యొక్క ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణించినప్పుడు మరియు మరణ దేవుడి సైనిక దళాలచే పట్టుబడినప్పుడు లేదా ఆపబడినప్పుడు, మంచి సంపదను కూడబెట్టడానికి మనం చేసిన ప్రయత్నాల యొక్క నిష్ప్రయోజనాన్ని మనం గ్రహిస్తాము. ఆ సమయంలో మనకు ఎంత పశ్చాత్తాపం ఉన్నా పెద్దగా ఏ ప్రయోజనం ఉండదు. ఒక సామెత ఉంది: "ముందుగానే ఆలోచించగలిగే వ్యక్తి, వివేకవంతుడు; తర్వాత పశ్చాత్తాపపడితే, అతను మూర్ఖుడు" అని. తెలియని ప్రదేశంలో అపరిచితుడికి నిజమైన మార్గదర్శి ధర్మం; సుదూర ప్రయాణానికి అనుమతి ఇచ్చేది ధర్మం; మనల్ని సురక్షితంగా సముద్రం అవతలి ఒడ్డుకు చేర్చే వ్యక్తి ధర్మం. ఈ రోజు నుంచి, మీ శరీరాన్ని, మాటను మరియు మనస్సును ధర్మానికి అప్లై చేసుకోండి.

మన స్వంత ఆనందాన్ని పొందడం మన స్వంత శక్తిలో ఉన్నప్పటికీ, మనం అలా చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే మనకు ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక ధార్మిక వ్యక్తికి, చనిపోయే సద్గుణం లేని వ్యక్తికి చాలా తేడా ఉంది. రెండవ వ్యక్తి స్పృహ లేకుండా బాధతో మరణిస్తాడు. ఇంతకుముందు వాడు ప్రశాంతంగా మరణిస్తాడు మరియు ఒక క్షణం ముందుగానే సిద్ధంగా ఉంటాడు, తన సంపదను పేదలకు, బంధువులకు, ఆశ్రయం కోరుకున్న వారికి పంచుతాడు. ఒక ధార్మిక వ్యక్తిలా ఉండటానికి, ఈ బోధనల నుంచి మనం సాధ్యమైనంత వరకు అన్నిటినీ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనం తప్పుడు ఆలోచనలు ఉండి ఆహారం, నిద్ర మరియు సంపదలన్నింటినీ వదులుకోకూడదు, దానికి బదులుగా ఆధ్యాత్మికత మరియు భౌతిక ఆందోళనల బ్యాలెన్స్ ను కలిగి ఉండాలి మరియు సాధ్యమైనంత ఉత్తమంగా సాధన చెయ్యడానికి ప్రయత్నించాలి.

ధర్మ సాధన అంటే దుస్తులు ధరించడం మరియు ఆచారాలను పాటించడం కాదు, మంచి దయగల హృదయాన్ని కలిగి ఉండటం. ఒక టిబెటన్ మహిళ చనిపోయి, నరకానికి వెళ్లి, మరణ దేవుడిని కలుసుకోవడం గురించి ఒక కథ ఉంది. శారీరకంగా తాను హాని చేసినప్పటికీ, మానసికంగా మంచి ఆలోచనతోనే అలా చేశానని ఆమె అతనికి చెప్తుంది. దీంతో అతను ఆమెను తిరిగి అదే పాత రూపంలో తన జీవితంలోకి పంపుతాడు. మన పనులు బయటకు ఎలా కనిపించినా మంచి దయగల హృదయం కలిగి ఉండవలసిన అవసరాన్ని ఇది చూపిస్తుంది.

ఒక సామెత ఇలా చెప్తుంది: "ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడేవారు, దాన్ని తక్కువగా సాధన చేస్తారు" అని. అతిషా ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పి అతను ఒక వ్యక్తిని కలిసినప్పుడల్లా, "మీకు మంచి హృదయం ఉందా?" అని అడిగేవాడు. డ్రోమ్టోన్ పా అతిషా మరణ వార్త విన్నప్పుడు, ఆ సమయంలో అతను అతిషాతో లేనందుకు చాలా బాధపడ్డాడు. అయితే, అతిషా తన శిష్యులకు మంచి హృదయం ఉంటే, అది ఆయనను చూసినట్లే ఉంటుందని ఒక సందేశాన్ని ఇచ్చాడు. మనం ఇతరులకు సహాయం చేయలేకపోయినా వాళ్లకు హాని చెయ్యకుండా మనల్ని మనం నియంత్రించుకోగలిగితే, అది మన స్థాయిలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే కదంప బోధనను గుర్తుంచుకోవడం మంచిది. ఎవరినీ అసంతృప్తికి గురి చెయ్యకుండా ఉండండి.

ఒకరి శ్వాస ఇంకా ఆగనప్పటికీ, పాజిటివ్ సామర్థ్యాన్ని కూడబెట్టడానికి మరియు ఒకరి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి అవకాశం మరియు శక్తి ఉంటుంది. మీరు ఒకే సమయంలో మీ స్వంత ఉత్తమ స్నేహితుడిగా మరియు మీ స్వంత బద్ధ శత్రువుగా ఉంటారు. భవిష్యత్తులో మీకు కలిగే ఆనందం మీపైనే ఆధారపడి ఉంటుంది. ధర్మ సాధన లేకుండా చనిపోయే వ్యక్తి చనిపోతున్న ఒక కుక్కతో సమానం, ముఖ్యంగా బార్డోలో. నువ్వు మనిషిగా పుట్టావన్న తేడా ఏమీ ఉండదు. ధర్మాన్ని ఆచరించని చక్రవర్తికి, వీధిలో చనిపోయే కుక్కకు ఏ తేడా లేదు. అవి చనిపోయినప్పుడు, ఆ కుక్క తక్కువ నెగెటివ్ కర్మను సృష్టించిందని తెలుస్తుంది. అందువల్ల, సాధన యొక్క ప్రారంభంలో, మధ్యలో మరియు ముగింపులో అశాశ్వత గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అత్యంత సాక్షాత్కారం పొందిన, అనుభవజ్ఞులైన గురువులు కూడా అశాశ్వతం గురించి ధ్యానిస్తారు.

అన్ని జీవుల పాదముద్రలలో, ఏనుగు పాదముద్ర పెద్దది. అన్ని ఆలోచనలలో, ఉత్తమమైనది అశాశ్వతానిదే.

తన బ్లాక్ మేజిక్ గురువు వల్ల తాను తెచ్చిపెట్టిన మరణాన్ని చూసి మిలారెపా ధర్మంలోకి ప్రవేశించాడు. తన భార్య చనిపోయినప్పుడు గంపోపా ధర్మంలోకి ప్రవేశించాడు. అదే విధంగా బుద్ధుడు మొదటిసారి మరణాన్ని చూసినప్పుడు ధర్మంలోకి ప్రవేశించి ఈ బాధకు పరిష్కారం కనిపెట్టాలని ప్రేరణను పొందాడు. అశాశ్వతాన్ని కేంద్ర మార్గంగా సూచిస్తారు (మధ్యమాక లేదా మధ్య మార్గంతో గందరగోళానికి గురికాకూడదు). ఈ జీవితం పట్ల మమకారాన్ని అడ్డుకుని, మొత్తం సాధన గురించి పాజిటివ్ ఆలోచనలను ఏర్పరచుకునే పనిని కలిగి ఉన్న కేంద్ర మార్గం ఇది. "కేంద్ర మార్గంగా” అశాశ్వతంపై ఈ రేఖకు ఇంకా లోతైన వివరణ ఉంటుంది. దీన్ని మధ్యమాక పరంగా కూడా వివరించవచ్చు. అశాశ్వతమే మధ్యమాక తత్వశాస్త్రంలో అంతర్దృష్టిని పెంపొందించడానికి పునాది, ఇది తప్పుడు స్వంత భావనలను తొలగిస్తుంది మరియు సాంప్రదాయిక ఆత్మ యొక్క రియాలిటీలో మనల్ని ఉంచడానికి సహాయపడుతుంది.

మనస్సును పరధ్యానాల నుంచి వేరుచేసి ధర్మం మీద కేంద్రీకరించగలిగిన తర్వాత, మనం ఈ క్రింది వాటిని చెయ్యాలి. ఈ లోకంలో ఆచరణ సంప్రదాయాలు చాలా ఉన్నప్పటికీ, ధర్మ సాధనను మనం పూర్తిగా స్వీకరించిన తర్వాత, బుద్ధుల బోధనల యొక్క సంపూర్ణ సారాన్ని సుస్థిరమైన సోంగ్ ఖాపా సంప్రదాయం ద్వారా మూడుసార్లు అనుసరించడానికి ప్రయత్నించడం మంచిది. దీని కోసం, వివరణ మరియు ఆచరణ రెండూ ఉన్న సూత్రం మరియు తంత్రం యొక్క కలయిక, ఏకీకృత పద్ధతులను మనం అనుసరించాలి. దీన్ని అనుసరించడానికి, మనం మార్గం యొక్క స్వభావం, దశలు మరియు విభజనలను తెలుసుకోవాలి మరియు వాటిని సరిగ్గా అనుసరించాలి. ఉదాహరణకు, మనం సూత్రానికి ముందు తంత్రాన్ని అభ్యసించకూడదు, లేదా విలువైన మానవ పునర్జన్మ, సురక్షితమైన దిశ (ఆశ్రయం), ఆధారపడటం మొదలైన వాటి గురించి తెలుసుకోకుండా బోధిచిత్తను అధ్యయనం చెయ్యకూడదు.

పరిపూర్ణమైన మార్గానికి, దానికి అవసరమైన బోధనలకు సంబంధించిన ప్రవృత్తులను రోజురోజుకూ మన మనస్సుల్లో నాటడానికి మనం ప్రయత్నించాలి. ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువ అమ్మడానికి ప్రయత్నించే వ్యాపారుల లాగానే, సాధ్యమైనంత ఎక్కువ పాజిటివ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలైనంత ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి. అసలైన సాధనలో, సూత్రం మరియు తంత్రానికి సాధారణమైన మార్గాల యొక్క సంక్షిప్త టెక్స్ట్ లో మనం నిమగ్నం అవ్వవచ్చు, ఉదాహరణకు ఫౌండేషన్ ఫర్ గుడ్ క్వాలిటీస్, ఇది సాధారణంగా గుర్తుంచుకోబడుతుంది, నెమ్మదిగా చదువుతూ ధ్యానం చెయ్యబడుతుంది మరియు జోర్చో ప్రాథమిక అభ్యాసంలో కూడా దీన్ని చూడవచ్చు. అలాంటి ఇంకొక గ్రంథం గ్రేడెడ్ పాత్ యొక్క సంక్షిప్త పాయింట్లు, ఇది ఆరు దూరదృష్టి ఆలోచనలను సూచిస్తుంది. ఈ వచనం ది ఫౌండేషన్ ఫర్ గుడ్ క్వాలిటీస్ లాగా స్పష్టంగా ఉండదు, కానీ మూడు రకాల నైతిక స్వంత-క్రమశిక్షణను కలిగి ఉంటుంది, ఇందులో ఆరు దూరదృష్టి ఆలోచనలు ఉన్నాయి. ఈ రకమైన దృష్టి ధ్యానం కోసం మనం ఉపయోగించగల ఇంకొక టెక్స్ట్ ది గురు పూజ - లామా చోపా యొక్క లామ్-రిమ్ గ్రేడెడ్ దశల భాగం. క్షణకాలపు ధ్యానం అనేది మనం నేర్చుకున్న దాన్ని సమీక్షించడానికి ఒక సమర్థవంతమైన పద్ధతి మరియు దాన్ని మన మనస్సులో సమిష్టిగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ప్రతిదీ ఎక్కడ ఉందో చూడటానికి ఒక పటాన్ని సమీక్షించడం లేదా మొత్తం మైదానంలోని పర్వతం నుంచి పై నుంచి చూసే దాన్ని కలిగి ఉండటం లాంటిది.

ఇప్పుడు లామ్-రిమ్ యొక్క అనుభవాన్ని పొందడం కష్టం అవ్వొచ్చు, కానీ ప్రతిరోజూ క్షణకాలపు ధ్యానం చేయడం వల్ల మన మనస్సులో పూర్తి బోధనలను తీసుకునే సూచనలను పెంచుతుంది. మనం లామ్-రిమ్ మీద ధ్యానం చేసేటప్పుడు, ఆ సూచనలలో ఇచ్చిన సరైన పద్ధతిని మనం అనుసరించాలి. ముందుగా, మనం బోధిచిత్త యొక్క ప్రేరణను సెట్ చెయ్యాలి మరియు చివరికి దానికి అంకితం అవ్వాలి. సెషన్ ప్రారంభంలో మన ప్రేరణను సెట్ చేసేటప్పుడు, మనం మిగతా వాళ్ళ కోసం ధ్యానంలో నిమగ్నమయ్యామని అనుకోవాలి. ఇది కుదరకపోతే కనీసం మనం త్యాగం అయినా చెయ్యాలి. మన ధ్యానం ముగిశాక, పరిమిత జీవుల సంతోషం కోసం మరియు వారు బుద్ధత్వాన్ని సాధించడానికి మనం సృష్టించిన పాజిటివ్ సామర్థ్యాన్ని అంకితం చెయ్యాలి. ఇటువంటి అభ్యాసంలో పాల్గొని మీ విలువైన మానవ జీవితం యొక్క అర్ధాన్ని తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. "అర్ధాన్ని తెలుసుకోవడం" మూడు స్థాయిల వివరణను కలిగి ఉంటుంది: గొప్ప, మధ్యస్థ మరియు చిన్న. ఈ జన్మలో గొప్పది బుద్ధుడిగా అవ్వడం, మధ్యలోది అన్ని రకాల ఇబ్బంది పెట్టే భావోద్వేగాల నుంచి విముక్తిని పొందడం, మరియు చిన్నది తక్కువ స్థాయి పునర్జన్మల నుంచి విముక్తి పొందడం.

అంకితభావం

దీని నుంచి నిర్మించబడిన పాజిటివ్ శక్తి ద్వారా, మనం బాధ యొక్క మూలాలను నాశనం చెయ్యగలం: శాశ్వతం, అనుబంధం మరియు విరక్తిని గ్రహించడం లాంటివి. సంసారంలోని బాధలకు మూలమైన నిజమైన ఉనికిని గ్రహించే శక్తులను మనం ముఖ్యంగా నాశనం చెయ్యగలగాలి. ప్రతి ఒక్కరూ గొప్ప పవిత్రమైన అమరత్వ స్థితిని అంటే బుద్ధత్వాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను.

ధర్మం విజయం పొందుతున్నప్పుడు చేసే వందలాది నైతిక పనుల కంటే ధర్మం క్షీణించిన ఒక రోజులో ధర్మాన్ని ఆచరించడం చాలా మంచిది. ధర్మ సాధన అంటే మంచి హృదయాన్ని కలిగి ఉండడం, దయతో, కరుణతో మరియు ఇతరులకు హాని చెయ్యకుండా ఉండడం. గురువుల దయను తిరిగి అప్పచెప్పే మార్గం ఇదే. ఒకరి హృదయంలో ద్వేషాన్ని ఉంచుకుని కరుణతో ఉన్నట్లు నటించే బదులు ధర్మాన్ని ఆచరించడమే ఉత్తమమైనది. మిలారెపా ఇలా చెప్పాడు, "మీ సంతోషం కోసం మాత్రమే కాకుండా ఇతరుల సంతోషం కోసం కూడా పని చెయ్యండి. తండ్రి-గురువుకు రుణం తీర్చుకునే మార్గం ఇదే.

ప్రారంభకులకు ధర్మంలోకి ప్రవేశించడానికి ఉత్తమమైన మార్గం ముందు పది విధ్వంసక పనుల గురించి తెలుసుకుని వాటి నుంచి నియంత్రించుకోవడం. అప్పుడు నెమ్మదిగా సాధనను అలవరచుకుని అతను ధ్యానంలో చేరవచ్చు. మొదటి నుంచి ధ్యానంలో చేరడం నిరాశను కలిగిస్తుంది, మరియు గందరగోళానికి దారితీస్తుంది అలా ధ్యానం పట్ల విరక్తిని మొదలవుతుంది. ఇది అస్సలు హాని కలిగించనిది, అత్యంత దృఢమైనది, మరియు ధర్మ సాధనకు పునాది కానిది. పది నిర్మాణాత్మక పనుల యొక్క నీతిని ఆచరించేటప్పుడు, మనం నైతిక ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి, మన పనులు ఇతరులపై ఎలా ప్రభావం చూపిస్తాయో అనే దానిపై శ్రద్ధ, బుద్ధిపూర్వకత మరియు అప్రమత్తతను పెంపొందించుకోవాలి. మనం మనకు నచ్చే పనులు మాత్రమే చెయ్యకుండా, మనం ధరించే దుస్తులు, చేసే పనులు, ఆలోచించే విషయాలు, అవి ఇతరులపై చూపే ప్రభావాల గురించి ఆలోచించాలి. మరీ ముఖ్యంగా మనం ఎవరికీ హాని తలపెట్టకూడదు.

Top