ఈ బోధనలు బాధలపై ఒక అనుభవజ్ఞుడైన వృద్ధుడి సలహాల నుంచి విలువైన గురువు గంగ్ టాంగ్ రింపోచే (1762-1823) గారి నుంచి వచ్చాయి. ఇందులో అనేక ఉపమానాలను ఉన్నాయి, అవి గ్రంథం ఆధారంగా వచన రూపంలో కథ రూపంలో వెళ్తూ ఉంటాయి. బోధన యొక్క ముఖ్యమైన విషయం త్యాగం మరియు స్వేచ్ఛగా ఉండాలనే సంకల్పాన్ని పెంపొందించడానికి సహాయపడటం మరియు ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం బోధిచిత్త జ్ఞానోదయం పొందడానికి పునాది వెయ్యడం.
కర్మ శక్తి నుంచి, ఇబ్బంది పెట్టే భావోద్వేగాల నుంచి నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ గుర్తులను వదిలేసి, దాని ఫలితంగా వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం లాంటి బాధలను అనుభవించని కల్మషం లేని బుద్ధుడికి నివాళులు.
సంసారం యొక్క విశాలమైన, ఒంటరి, అడవి మైదానం మధ్యలో ఒక ముసలాయనను యవ్వనం మరియు ఆరోగ్యం గురించి గర్వంగా ఉన్న ఒకతను కలవడానికి వచ్చాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
"హేయ్ ముసలాయన, నువ్వు మిగతా వాళ్ళ కంటే వేరేగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, చూస్తున్నావు మరియు మాట్లాడుతున్నావు?"
ఆ మాటకు ముసలాయన ఇలా జవాబిచ్చాడు, "నేను వేరే విధంగా ఉన్నాను, కదులుతున్నాను, మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకుంటే, నువ్వు పైన ఆకాశంలో ఎగిరి మళ్ళీ తిరిగి అదే భూమి మీద దిగి నాతో మాట్లాడుతూ నా మాటలు వింటున్నట్లు నీకు అనిపించడం లేదా."
కొంతమంది యువకులు వృద్ధాప్యం కేవలం ముసలి వాళ్ళకే వస్తుందని తమకు ఎప్పటికీ రాదని భావిస్తుంటారు. వాళ్ళు చాలా అహంకారంతో మరియు వృద్ధులతో సంబంధాలను కలిగి ఉండటానికి ఓపికను కలిగి ఉండరు.
ఆ ముసలాయన ఇలా మాట్లాడుతూ, "కొన్నేళ్ళ క్రితం, నేను నీ కంటే చాలా బలంగా, అందంగా, చురుకుగా ఉన్నాను. నేను ఇప్పుడున్న విధంగా ఏమీ పుట్టలేదు. నేను పరిగెత్తితే గుర్రాలను కూడా అందుకోగలను" అని చెప్పాడు.
చాలా మంది వృద్ధులు ఇలా మాట్లాడుతారు. ప్రస్తుత రోజులు పాత రోజుల లాగా మంచిగా అస్సలు ఉండేవి కాదు.
"నేను ఏదైనా పట్టుబడితే, సంచార జాతులకు చెందిన యాక్ లను కూడా వట్టి చేతులతో పట్టుకోగలను. నా శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేది, నేను ఆకాశంలో పక్షిలా కదలగలిగేవాడిని. నా శరీరం చాలా ఫిట్ గా ఉంటుంది, నేను ఒక యవ్వన దేవుడిలా కనిపించేవాడిని. నేను మెరిసే రంగు దుస్తులు, బంగారు, వెండి ఆభరణాలు ధరించి, టన్నుల కొద్దీ రుచికరమైన ఆహారం, స్వీట్లు తిని, శక్తిమంతమైన గుర్రాలపై ప్రయాణించాను. ఆడుకోకుండా, నవ్వకుండా, ఎంజాయ్ చేయకుండా నేనెప్పుడూ ఒంటరిగా కూర్చోలేదు. నేను అనుభవించని ఆనందం అంటూ ఏమీ లేదు.
ఆ సమయంలో, నేను నా జీవితం యొక్క అశాశ్వతం గురించి లేదా నా మరణం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడున్న విధంగా వృద్ధాప్య బాధలు అనుభవించాలని కూడా అనుకోలేదు."
ఒకప్పుడు నేను నివసిస్తున్న ప్రాంతంలో ఒక యువకుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఎప్పుడూ సుఖాల్లో మునిగిపోతూ ఉండేవాడు. అతను మెల్లమెల్లగా ముసలివాడు అయ్యాడు, శరీరం వంగిపోయింది, ఆదాయం తగ్గింది. “అతని వృద్ధాప్యం ఇంత తొందరగా వస్తుందని" అనుకోలేదని తన స్నేహితులతో చెప్పాడు.
"స్నేహితులు, పార్టీలు, మంచి సమయాన్ని గడపడం అనే పరధ్యానంతో జీవించడం, మీ నవ్వు శబ్దం మీద వృద్ధాప్యమే మిమ్మల్ని జయిస్తుంది."
గెషే కంపా గారు "వృద్ధాప్యం నెమ్మదిగా వస్తున్నందుకు మనం కృతజ్ఞులై ఉండాలి. అన్నీ ఒకేసారి వస్తే అది భరించలేనంతగా ఉంటుంది. ముప్పై ఏళ్ళ వయస్సులో నిద్ర పోయి ఉదయాన్నే లేవగానే ఎనభై ఏళ్ళు అనిపిస్తే మనల్ని మనం చూసి తట్టుకోలేము. మన వృద్ధాప్యాన్ని మనం అర్థం చేసుకోలేము. మనం ఎలా ముసలివాళ్ళం అవుతాం అనేది పూర్తిగా రహస్యమైనది. అకస్మాత్తుగా, మనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు, దాన్ని అంగీకరించడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటికే చాలా ఆలస్యమవుతుంది. మరణానికి కొన్ని గంటల ముందు ధర్మ సాధన చేయడం మంచిదని చెప్పినప్పటికీ, తంత్రంలో పాల్గొనడానికి మనకు శారీరకంగా దృఢమైన శరీరం కావాలి. కాబట్టి యుక్త వయస్సులోనే తాంత్రిక సాధనను ప్రారంభించడం చాలా ముఖ్యం."
"మనం బాగా ముసలివాళ్ళం అయ్యాక అద్దంలో చూసుకున్నప్పుడు మనల్ని మనం అసహ్యించుకుంటాం. ఆ సమయంలో మన శరీరాలు, మరియు మనస్సులు బలహీనపడతాయి. మన శరీరం తల నుంచి కాలి వరకు క్షీణించడం ప్రారంభిస్తుంది. ఎప్పుడూ ఒక దీక్షను అందుకున్నట్లు తలలు వంగి ఉంటాయి.
“నా తలపై ఉండే తెల్లని వెంట్రుకలు శుద్ధికి సంకేతం కాదు. ఇది మరణ దేవుడు నోటి నుంచి వచ్చిన మంచు బాణం, ఇది నా తలపై పడింది. నా నుదుటిపై ఉన్న గీతలు తల్లి పాలు తాగుతున్న పసిబిడ్డపై ఉండే మచ్చలు కావు. ఇది నేను ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు జీవించానో అని మరణ దేవుడి లెక్క. నాకు మెల్లకన్ను వచ్చినప్పుడు, అది నా కళ్ళలో పొగ వచ్చినందుకు కాదు. ఇది నా ఇంద్రియ శక్తుల లోపంతో నిస్సహాయంగా మారిన సంకేతం. నేను నా చెవి దగ్గర చేతులు పెట్టి వినడానికి బాగా ప్రయత్నం చేసినప్పుడు, అది నేను సీక్రెట్ గా మాట్లాడుతున్నానని కాదు. ఇది నా వినికిడి లోపించిందని సంకేతం.
“నేను ముక్కులోంచి చిమ్ముతున్నప్పుడు, అది నా ముఖంపై చేసుకునే ముత్యపు అలంకరణ కాదు. వృద్ధాప్యపు ఎండల వల్ల యవ్వనపు ఉత్తేజపు మంచు కరిగిపోతోందనడానికి ఇది సంకేతం. నా దంతాలను కోల్పోవడం చిన్న పిల్లాడిలా కొత్త సెట్ ను పెట్టుకోవడానికి సంకేతం కాదు. మరణ దేవుడు దూరంగా పెట్టిన తినే ఆహారాన్ని అరిగిపోకుండా చెయ్యడానికి ఇది సంకేతం. నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ లాలాజలం బయటకు వస్తుంటే అది నేను భూమిపై నీటిని చల్లి శుభ్రం చేయడానికి అని కాదు. ఇది నేను చెప్పబోయే అన్ని మాటలకు ముగింపుకు సంకేతం. నేను అసంబద్ధంగా మాట్లాడినప్పుడు మరియు మాటలతో తడబడినప్పుడు, నేను ఒక వింత విదేశీ భాష మాట్లాడుతున్నానని కాదు. నా జీవితకాలంలో నేను చెప్పిన కబుర్లతో అలసిపోయిన నా నాలుకను ఇది సూచిస్తుంది.
“నా రూపం వికృతంగా మారినప్పుడు, నేను ఒక కోతి ముసుగు వెనుక దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నానని కాదు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరం యొక్క పూర్తి క్షీణతకు సంకేతం. నా తల చాలా వణుకుతుంటే, నేను మీతో విభేదిస్తున్నానని కాదు. ఇది మరణ దేవుడు నా తల మీద కర్రను ఉపయోగించి అపారమైన శక్తితో కొట్టిన సంకేతం. నేను వంగి నడుస్తుంటే, నేను ఏదో పోగొట్టుకున్న సూదిని వెతుకున్నానని కాదు. ఇది నా శరీరంలోని భూమి మూలకం పాడయ్యిపోతుందని ఒక స్పష్టమైన సూచన.
“నేను చేతులు, మరియు మోకాళ్లపై లేచినప్పుడు, నేను నాలుగు కాళ్ల జంతువును అనుసరించడం లేదు. ఇలా ఎందుకంటే నా కాళ్ల సపోర్ట్ ఇప్పుడు సరిపోవట్లేదు అని అర్ధం. నేను కూర్చుంటే ఏదో బ్యాగ్ కింద పడేసినట్టు ఉంటుంది. నా స్నేహితులపై నాకు కోపం వచ్చిందని కాదు. ఇది నా శరీరంపై నియంత్రణ కోల్పోవడం.
“నేను నెమ్మదిగా నడుస్తున్నప్పుడు, నేను గొప్ప రాజులా నడవడానికి ప్రయత్నించడం లేదు. ఇలా ఎందుకంటే నేను నా శరీరంలో పూర్తి సమతుల్యతను కోల్పోయాను అని అర్ధం. నా చేతులు వణుకుతున్నప్పుడు, నేను ఏదో సాధించాలనే అత్యాశతో చేతులు కదుపుతున్నానని అర్ధం కాదు. మరణ దేవుడు నా నుంచి అన్నీ లాక్కుంటాడనే భయానికి ఇది సంకేతం. నేను తక్కువ ఆహారమే తినడం అనేది నేను అప్పుల్లో లేదా పీనాసి వాడినని చూపించదు. ఇది నా జీర్ణ శక్తి తగ్గిపోయిందని సంకేతం. నేను తేలికపాటి దుస్తులను ధరిస్తే, ఇది అథ్లెట్లను అనుసరించే ప్రయత్నం అని కాదు. ఇలా ఎందుకంటే నా శరీర బలహీనత ఏ బట్టలనైనా ధరించడం భారంగా ఉండేలా చేస్తుంది.
“శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు, నేను ఒక మంత్రాన్ని చదువుతూ ఒకరిని నయం చేస్తున్నానని కాదు. ఇది నా శరీరంలోని శక్తుల బలహీనత మరియు అలసటకు సంకేతం. నేను చాలా తక్కువ పని చేస్తున్నప్పుడు లేదా నాకు తక్కువ పనే ఉన్నప్పుడు, అది ఉద్దేశపూర్వకంగా నా పనులను నియంత్రిస్తున్నాను అని కాదు. దీనికి కారణం ఒక ముసలివాడు చేయగలిగింది ఇంతే అని అర్ధం. నేను చాలా మతిమరుపుతో ఉన్నప్పుడు, ఇతరులు ముఖ్యం కాదని నేను అనుకోవడం మరియు వారిని చిన్నచూపు చూడటం అని కాదు. ఇది నా జ్ఞాపకశక్తి యొక్క స్పృహ క్షీణతకు ఒక సంకేతం.
“ఓ యువకుడా, నన్ను ఆటపట్టించి ఎగతాళి చెయ్యకు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నది నాకు ఒక్కడికి మాత్రమే జరగదు. ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవిస్తారు. నువ్వు వేచి ఉండి చూడు; మూడు సంవత్సరాలలో, వృద్ధాప్యం యొక్క మొదటి కొద్ది మంది దూతలు నీ దగ్గరకు వస్తారు. నేను చెప్పేది నువ్వు నమ్మవు లేదా ఇష్టపడవు, కానీ నువ్వే నీ అనుభవం నుంచి నేర్చుకుంటావు. ఈ ఐదు తరాలలో నా అంత ముసలివాడిగా జీవించడం నీ అదృష్టం. నేను బతికినన్ని రోజులు నువ్వు బ్రతికినా నాలాగా నువ్వు మాట్లాడలేవు.”
ఆ మాటలకు యువకుడు "ఇలా వికృతంగా, నిర్లక్ష్యానికి గురై కుక్కల ఊబిలో కూరుకుపోయి బతకడం కంటే చచ్చిపోవడమే మంచిది" అని బదులిచ్చాడు.
ఆ ముసలాయన నవ్వాడు. "యువకుడా, ఎక్కువ కాలం జీవించాలని, సంతోషంగా ఉండాలని కోరుకునే నువ్వు చాలా అజ్ఞానుడివి, మూర్ఖుడివి, కానీ వృద్ధాప్యం అలా కాదు. మరణం సులభమైనది అని అనిపించవచ్చు, కానీ అది అంత సులభం కాదు. ప్రశాంతంగా, సంతోషంగా మరణించాలంటే, తప్పుగా నైవేద్యాలను స్వీకరించని లేదా పది పాజిటివ్ పనుల నైతికతను బ్రేక్ చెయ్యని మరియు ధర్మం, ధ్యానం మరియు ధ్యానాన్ని వింటూ ఎక్కువ సంపాదించిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడు చావు చాలా సులభం అవుతుంది.
"అయితే నాకు అలా అనిపించడం లేదు. నేను నిర్మాణాత్మకంగా ఏదైనా చేశాననే నమ్మకం నాకు లేదు. నేను మరణానికి భయపడుతున్నాను మరియు నేను జీవించి ఉన్న ప్రతి రోజుకు కృతజ్ఞుడిని. ప్రతిరోజూ బతికి ఉండాలనేది నా బలమైన కోరిక.”
ఆ యువకుడు మనసు మార్చుకుని , "ముసలోడా, నువ్వు చెప్పేదంతా నిజమే. వృద్ధాప్య బాధల గురించి ఇతరులు చెప్పిన విషయాలు అన్నీ నేను నీలో చూసాను. వృద్ధాప్యాన్ని నువ్వు నాకు చూపించడం నా మనస్సుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృద్ధాప్యంలో పడే బాధను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఓ వివేకవంతుడా, వృద్ధాప్యం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఏవైనా పద్ధతుల గురించి విన్నట్లయితే, వాటిని రహస్యంగా ఉంచుకోకు; నాతో వాటిని పంచుకో."
ఆ ముసలాయన సంతోషంతో ఇలా అన్నాడు, "ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంది. అది తెలిస్తే దాన్ని ఫాలో అవ్వడం సులువు. కొద్దిపాటి శ్రమతో ఈ బాధ నుంచి మనం త్వరగా విముక్తి పొందవచ్చు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయినా, వృద్ధాప్యం తర్వాత చాలా తక్కువ మంది మరణిస్తారు. చాలా మంది వృద్ధాప్యానికి చేరుకునే అవకాశం లేక చిన్నవయసులోనే మరణిస్తున్నారు. ఈ పద్ధతులు బుద్ధుని బోధనలలో ఉన్నాయి. అవి ముక్తి మరియు జ్ఞానోదయాన్ని పొందడానికి అనేక పద్ధతులను కలిగి ఉంటాయి, మరో మాటలో చెప్పాలంటే పునర్జన్మను పొందకూడదు, ముసలి వాళ్ళగా అవ్వకూడదు, అనారోగ్యానికి గురికాకూడదు లేదా మరణించకూడదు; కానీ మనం వాటిని ఇంకా ఆచరించలేదు."
ఒకప్పుడు ఒక ఆశ్రమంలో ఒక లామా ఉండేవాడు. అతను మఠంలో ఒక జూనియర్ సభ్యుడు, మరియు చాలా మంది సన్యాసులు అతన్ని పట్టించుకోలేదు. ఆ ఆశ్రమం భవిష్యత్తు గురించి చర్చించేందుకు వాళ్ళు సమావేశమయ్యారు. శవాలను బంధించడానికి తాళ్లు, షీట్లు సిద్ధం చెయ్యాలని చెప్పాడు. ఇది చెడు శకునం అని అందరూ చెప్పి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు వాళ్ళందరూ ఆ మఠానికి సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఏం చెయ్యాలనే దానిపై చర్చించారు. అశాశ్వతం గురించి ధ్యానించమని చెప్పాడు. ఇలా చెప్పి వాళ్ళకు ఒక గొప్ప బోధను అందించాడు. ఆ తర్వాత చాలా మంది దలైలామాలు ఆయనను ప్రశంసించారు. భవిష్యత్తు కోసం సన్నద్ధం కావాలంటే, మనం చావుకు సిద్ధపడాలి.
“ప్రతి ఒక్కరూ అమరత్వాన్ని మరియు దాన్ని పొందే పద్ధతులను కోరుకుంటారు. కానీ పుట్టడం, చనిపోకుండా ఉండటం అసాధ్యం. శాక్యముని బుద్ధుడితో సహా వేలాది మంది సంపూర్ణ జ్ఞానులు కూడా చనిపోయారు. గతంలోని బోధిసత్వులు, గొప్ప గురువుల పేర్లు మాత్రమే మనకు మిగిలాయి. ప్రపంచ చరిత్రలోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. గొప్ప చారిత్రక కలిగిన వ్యక్తులందరూ మరణించారు మరియు మనకు వారి శిథిలాలు మాత్రమే మిగిలాయి. అందువల్ల, మనకు రాబోయే మరణం యొక్క రియాలిటీని మనం మరచిపోకూడదు. ప్రస్తుతం ఉన్న గొప్ప గురువులు కూడా చనిపోతారు. ఈ రోజు పుట్టిన పిల్లలందరూ వందేళ్లలో చనిపోతారు. నువ్వు కూడా యువకుడా, నువ్వొక్కడివే శాశ్వతంగా బ్రతుకుతావని ఎలా అనుకోగలవు? కాబట్టి నువ్వు మరణానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడటం మంచిది.
“దీర్ఘాయుష్షును డబ్బుతో కొనలేము లేదా శారీరక సుఖం ద్వారా పొందలేము. మీకు ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం ఉండి, జీవితం నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుంటే, శారీరకంగా పెద్దయ్యాక, మీకు ఎక్కువ ఆనందం మరియు మానసిక యవ్వనం ఉంటుంది. మీరు గొప్ప శారీరక సుఖాన్ని అనుభవిస్తూ ఒక ఖాళీ జీవితాన్ని గడిపినట్లయితే, మీరు పెద్దయ్యాక, అంతే దుఃఖంలో ఉంటారు. మరణం గురించి ఆందోళన చెందకుండా మనస్సు మరల్చడానికి ఒక టూరిస్ట్ గా నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరోవైపు, నీకు కొద్దిగా ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ, నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, సంతోషకరమైన ఇంటికి తిరిగి వచ్చిన కొడుకుగా నువ్వు అనుకుంటావు. నువ్వు మరణంతో విసిగిపోరు, కానీ ఒక సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎదురు చూస్తావు.
ఒకసారి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఇలా అన్నారు, "నా భవిష్యత్తు జన్మలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి; నేను కంగారు పడను. మరణం ఎప్పుడైనా రావచ్చు, నేను దాన్ని స్వాగతిస్తున్నాను."
"మరణ బాధ అనివార్యం కాబట్టి, దాని గురించి మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనం కేవలం కూర్చొని డిప్రెషన్ లో ఉండలేము. మనుషులుగా మనకు అనేక పద్ధతులను ప్రయత్నించే తెలివితేటలు ఉన్నాయి. బుద్ధుడు కూడా నీకు చాలా స్పష్టమైన బోధనలను ఇవ్వలేడు యువకుడా. నేను నా హృదయం నుంచి మాట్లాడుతున్నాను. ఇది నా నిజమైన హృదయపూర్వక సలహా అయినప్పటికీ, నా మాటలపై మాత్రమే నువ్వు ఆధారపడకు; వాటిని నువ్వు కూడా విశ్లేషించుకో. అశాశ్వతానికి సంబంధించిన అభ్యాసాలను నువ్వే చేసుకో. 'ఇతరుల అభిప్రాయాలు అడగండి, కానీ నిర్ణయాన్ని మీరే తీసుకోండి' అనే సామెత ఉంటుంది. నువ్వు నీ కోసం నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మందికి అవకాశం ఇస్తే, చాలా మంది నీకు వేరే వేరే సలహాలు ఇస్తారు.
ఆ యువకుడు ఇలా అన్నాడు, "మీరు చెప్పేవన్నీ చాలా నిజం మరియు ప్రయోజనకరమైనవి. కానీ, వచ్చే కొన్ని సంవత్సరాల పాటు నేను ఈ పనులు చెయ్యలేను. నాకు వేరే పని ఉంది. నాకు పెద్ద ఆస్తి, సంపదలు ఉన్నాయి. నేను చాలా వ్యాపారం చెయ్యాలి మరియు నా ఆస్తిని చూసుకోవాలి. కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను, ఆ తర్వాత ఆ ఆచారాలను పాటిస్తాను" అని.
ఆ ముసలాయన చాలా అసంతృప్తి చెంది, "ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ శూన్యం, అర్థరహితంగా అయిపోతాయి. నాకు ఇవే ఉండేవి, కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా అర్ధవంతంగా చెయ్యాలనే కోరిక ఉంది; కానీ నేనెప్పుడూ ఏమీ చెయ్యలేదు, ఇప్పుడు ముసలి వాడిని అయ్యాను. నువ్వు చెప్పేది ఎంత వ్యర్థమో నాకు తెలుసు. కొన్నేళ్లలో చెయ్యాల్సిన పనులు ఎప్పటికీ ముగియవు. నువ్వు వాటిని ఎప్పుడూ పక్కన పెడుతూ ఉంటావు. ఆ చేయాల్సిన పనులు ముసలివాడి గడ్డం లాంటివి. ఈ రోజు షేవ్ చేస్తే, రేపు మళ్ళీ పెరుగుతుంది. రేపటి వరకు వాయిదా వేస్తూనే నీ జీవితం ముగిసిపోతుందని నీకు తెలుస్తుంది. ఈ ధర్మ ఆచారాన్ని వాయిదా వెయ్యడం అందరినీ మోసం చేసింది. నువ్వు అసలు ఎప్పటికీ ధర్మాన్ని ఆచరిస్తావనే నమ్మకం నాకు లేదు. అందుకని, మనం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకోవటం పూర్తిగా వృధా. నీ ఇంటికి వెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నన్ను కాసేపు ధ్యానం చేసుకోనివ్వు" అని అన్నాడు.
ఆ యువకుడు చాలా ఆశ్చర్యపోయి కొంచెం బాధ పడతాడు. "నాతో ఇలాంటి మాటలు మాట్లాడాలని అసలు నువ్వు ఎలా అనుకుంటావు? ఈ జన్మలో భౌతిక పనులు ఎంత త్వరగా పూర్తవుతాయో చెప్పు?" అని అడిగాడు.
ఆ ముసలాయన నవ్వుతూ, "నువ్వు నన్ను ఈ ప్రశ్నలు అడిగావు, కాబట్టి ఏదైనా సాధించడానికి ఎంత సమయం పడుతుందో నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు నీ పనిని పూర్తి చేశావా లేదా అని అస్సలు పట్టించుకోని మరణ దేవుడు దక్షిణ దిశలో నివసిస్తాడు. అతనికి ఏది కావాలంటే అది చేస్తాడు. నువ్వు అతనితో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండి, జీవితంలో ఏదైనా సాధించడానికి అతని అనుమతి పొందగలిగితే, నువ్వు విశ్రాంతితో ఉండవచ్చు. లేకపోతే నువ్వు ఎప్పటికీ రిలాక్స్ కాలేవు. ఒక కప్పు టీ తాగుతూ, వాకింగ్ చేస్తున్నప్పుడు, ఆహారం టేబుల్ మీద ఉన్నప్పుడు జనం చనిపోతుంటారు.
"ఇది ప్రతి ఒక్కరికీ, గొప్ప గురువులకు కూడా జరుగుతుంది. వారి చాలా బోధనలు అసంపూర్ణంగా ఉన్నాయి ఎందుకంటే అవి రాయడం పూర్తికాకముందే వాళ్ళు మరణించారు. కాబట్టి మరణ దేవుడు వచ్చినప్పుడు, 'నాకు చాలా ఆస్తి ఉంది మరియు చాలా పనులు ఉన్నాయని' మీరు చెప్పలేరు. మీరు అన్నిటిని వదిలెయ్యాలి. ఈ విషయంలో మనం పూర్తిగా శక్తిహీనులం. మన ఆయుష్షును మనం తెలుసుకోలేం. అందువల్ల, మీరు ఏదైనా చెయ్యగలిగితే, దాని ప్రాక్టీస్ ఇప్పుడే ప్రారంభించండి. అది అర్థవంతంగా ఉంటుంది; లేకపోతే, మీ భవనాలు అన్నీ అర్థరహితమే. కానీ ఈ రోజుల్లో మీకు ఏది ప్రయోజనం అందిస్తుందనే దాని గురించి చాలా తక్కువ మంది నిజం చెబుతారు. నిజాయితీగా సలహాలు వినే వ్యక్తులు కూడా చాలా అరుదు.
ఆ యువకుడు బాగా చలించిపోయి, ఆ వృద్ధుని పట్ల ఎంతో గౌరవాన్ని పెంచుకుని, కొన్ని అడుగులు వెనక్కి వేసి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. "బంగారు పతాకాలతో చుట్టుముట్టిన లామాలు, గెషెలు, యోగులు మీరు చెప్పినంత లోతైన బోధనలను చెప్పలేదు. నువ్వు ఒక సాధారణ ముసలివాడిలా కనిపిస్తావు, కానీ నువ్వు ఒక గొప్ప ఆధ్యాత్మిక స్నేహితుడివి. నువ్వు చెప్పినవన్నీ నా శక్తి మేరకు ఆచరిస్తాను, భవిష్యత్తులో నాకు ఇంకా బోధనలు ఇవ్వు.
ముసలాయన దాన్ని అంగీకరిస్తాడు. అతను "నాకు పెద్దగా తెలియదు, కానీ నేను చాలా విషయాలను అనుభవించాను. వాటి నుంచి నేను నీకు పాఠాలు నేర్పగలను. అత్యంత కష్టమైన విషయం ఏమిటంటే, ఒక ప్రారంభాన్ని చేసి ధర్మంలో స్థిరపడటం. ముసలివాడైన తర్వాత ధర్మాన్ని ఆచరించడం మొదలు పెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు నీ చిన్న వయసులోనే ప్రారంభించడం చాలా ముఖ్యం.
"యవ్వనంలో ఉన్నప్పుడు, నీ జ్ఞాపకశక్తి తాజాగా ఉంటుంది; నీకు మంచి తెలివితేటలు మరియు సాష్టాంగ నమస్కారాల ద్వారా పాజిటివ్ శక్తిని పెంపొందించే శారీరక బలం ఉన్నాయి. తంత్రం పరంగా, నీ శక్తి మార్గాల బలం యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. చిన్న వయస్సులోనే, నువ్వు భౌతిక ఆస్తులపై దురాశ మరియు మమకారం యొక్క అవరోధాన్ని అధిగమించి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నం కాగలిగితే, అది చాలా మంచిది. ఒకసారి నువ్వు ధర్మాన్ని స్వీకరించి, దాని అవసరమైన విషయాలను అర్థం చేసుకుని, దాన్ని అర్ధం చేసుకున్నాక, మీరు చేసే, చెప్పే, ఆలోచించే ప్రతిదీ ధర్మమే అవుతుంది.”
మిలారెపా మరియు రా లోత్వా కూడా అదే చెప్పారు, "నేను తినేటప్పుడు, నడిచేటప్పుడు, కూర్చొన్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు – అన్నీ ధర్మ అభ్యాసాలే" అని.
“ధర్మంలో కఠినమైన నియమాలు ఉండవు. కాబట్టి, ఎక్కువ ఆలోచనలు లేదా చంచలమైన మనస్సును లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడే ప్రారంభించండి మరియు ధర్మం పట్ల మీ ఆసక్తిని కొనసాగించుకోండి. ప్రతి నిమిషం మనస్సును మార్చుకోవద్దు. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని - శరీరం, మాట మరియు మనస్సు - ధర్మ సాధనకు అంకితం చెయ్యండి.
ఇప్పుడు ఆ ముసలాయన ధర్మం అంటే ఏమిటో ఆ యువకుడికి చెప్తాడు, "ముందుగా, ఒక మంచి అర్హత కలిగిన ఆధ్యాత్మిక గురువును కనిపెట్టి నీ ఆలోచనలు మరియు పనులతో అతనికి నిన్ను నువ్వు పూర్తిగా అంకితం చేసుకో. నువ్వు ఇతరులకు ఎంత సహాయం చేస్తావనేది సరైన ఆధ్యాత్మిక గురువును కనిపెట్టడం మరియు అతనితో నువ్వు పెంచుకునే హృదయపూర్వక నిబద్ధత సంబంధంపై ఆధారపడి ఉంటుంది."
ఈ విషయాన్ని అతిషా గారు బాగా నొక్కి చెప్పారు. తన గురువులలోని 155 మంది పట్ల తనకు అంతే హృదయపూర్వక నిబద్ధత ఉందని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు.
"అప్పుడు, నువ్వు మాట్లాడే నీ మాటలను గమనించి పది నిర్మాణాత్మక పనులను ఆచరించాలని ప్రతిజ్ఞ చెయ్యాలి. మీ కళ్లకు నచ్చినట్లుగా వాటిని కాపాడుకోవాలి. ఒక అడవి ఏనుగు గొలుసును విడిపించుకున్నట్లుగా ఈ జీవితంతో మీ అనుబంధాన్ని తెంచుకో. అప్పుడు వినడం, ఆలోచించడం, ధ్యానం చెయ్యడం లాంటి ఈ మూడు పనులను కలిపి చెయ్యి. వీటన్నింటికీ ఏడు కాళ్ల సాధనతో సపోర్ట్ చెయ్యి. ఇది పాజిటివ్ శక్తిని పెంపొందించడానికి, యోగ్యతను సంపాదించడానికి ఒక మార్గం. ఇలా చేయడం వల్ల బుద్ధ స్వభావం మీ చేతివేళ్ల దగ్గరే ఉంటుంది" అని చెప్పారు.
ఒక అర్హత కలిగిన శిష్యుడికి అర్హత కలిగిన గురువు మార్గనిర్దేశం చేస్తే, బుద్ధత్వాన్ని తన చేతుల్లోనే మలచుకోవచ్చని ఐదవ దలైలామా గారు అన్నారు. మీకు అర్హత కలిగిన గురువు మరియు తన బోధనలను ఆచరించే అర్హత కలిగిన శిష్యుడు ఉంటే, బుద్ధ స్వభావం మీకు బయట కనిపించదు; అది మీ లోపలే ఉంటుంది. అయితే ఇక్కడ గురువుకు సరైన అర్హతను కలిగి ఉండాలి.
"ఇదే సంతోషం; ఇదే ఆనందం. ఓ ప్రియమైన కుమారుడా, ఈ విధంగా సాధన చేస్తే నీ కోరికలన్నీ నెరవేరతాయి."
మనస్సును సరైన విధంగా మార్చుకోవడానికి ఈ బోధనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి ఒక కఠినమైన మనస్సును మృదువుగా మారుస్తాయి. ఒక సామెత ఇలా చెప్తుంది, "వెన్న కోసం ఒక లెదర్ బ్యాగ్ లాగా ఉండకు. నీటి వాగులో గులకరాయిలా ఉండకు" అని. లెదర్ బ్యాగ్ లోపల ఎంత వెన్న ఉన్నా అది మెత్తగా మారదు. ఒక రాయి ప్రవాహంలో ఎంతసేపు ఉన్నా అది కూడా మృదువుగా మారదు.
ఆ రోజు నుంచి ఆ యువకుడు ఎనిమిది ప్రాపంచిక, చిన్న పిల్లల భావాలతో కలిసి ఉన్న స్వచ్ఛమైన ధర్మాన్ని ఆచరించాడు.
మనం కూడా దాన్నే ప్రయత్నించాలి. మనం ఎన్ని ఎక్కువ బోధనలు వింటే, వాటిని మనం ఇంకా ఆచరించి, పెంపొందించుకోవాలి తప్ప, ఎప్పటికీ మెత్తబడని ప్రవాహంలో గులకరాళ్లలా ఉండకూడదు.
ఆ ముసలాయన ఇలా చెప్పాడు, "నేను ఈ బోధలను నా ఆధ్యాత్మిక గురువుల ను౦చి విన్నాను, అవి కూడా నా స్వంత అనుభవ౦ మీద ఆధారపడి ఉన్నాయి. ఇది అపరిమితమైన ప్రాణులకు వారి సంతోషం కోసం ప్రయోజనం అందించాలని కోరుకుంటున్నాను" అని.
రచయిత యొక్క ముగింపు:
నేను పెద్దగా ధర్మాన్ని ఆచరించకపోయినా, జీవించే వాళ్ళ స్వభావాల వైవిధ్యం వల్ల ఈ బోధనలు కొందరికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. పరిమిత జీవుల మనసులకు సహాయం చెయ్యాలనే ఆశతో మరియు చిత్తశుద్ధితో, స్వచ్ఛమైన ప్రేరణతో దీన్ని రాశాను. అశాశ్వతానికి సంబంధించిన ఈ బోధనలు నేను చెప్పాలనుకున్న ఆసక్తికరమైన కథ మాత్రమే కాదు, ఇవి ఆర్యదేవుడు రాసిన నాలుగు వందల శ్లోకాల ఆధారంగా రూపొందినవి.