సెర్కాంగ్ రింపోచే: నిజమైన గురువు లామా

జర్మనీకి వెళ్లే ముందు దలైలామా గారితో జరిగిన సంభాషణ

1998 ఏప్రిల్ లో, మంగోలియా, పాశ్చాత్య దేశాల్లో ఎన్నో రోజులు ఉపన్యాస యాత్ర మరియు మంచి రచనలు చేసిన తర్వాత నేను భారతదేశంలోని ధర్మశాలకు తిరిగి వచ్చాను. అక్కడ నేను 1969 నుంచి హిమాలయాల దిగువ ప్రాంతంలో నివసిస్తున్నాను, ఆ చోటులో దలైలామా గారి దగ్గర ఉన్న టిబెట్ శరణార్థుల కమ్యూనిటీని అధ్యయనం చేస్తూ వాళ్లతో పని చేస్తున్నాను. ఇప్పుడు నేను జర్మనీలోని మునిచ్ కు నా వస్తువులను తీసుకువెళ్లడానికి వచ్చాను, అక్కడ నేను నా పుస్తకాలను బాగా సమర్థవంతంగా రాసుకోగలను మరియు బౌద్ధమతాన్ని క్రమం తప్పకుండా బోధించగలను. నా నిర్ణయాన్ని గురువు గారికి చెప్పాలని, అతని సలహా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇతరులకు సరైన సహాయాన్ని అందించడానికి నా సమయాన్ని ఎలా, ఎక్కడ ఎంత సమర్థవంతంగా గడపాలో స్వయంగా నిర్ణయించుకోమని నా ఆధ్యాత్మిక గురువుగా నాకు సూచనలు ఇచ్చారు. ఆ అనుభవం నాకు అత్యంత నమ్మదగిన మార్గదర్శిగా ఉంది.

దాదాపు 29 ఏళ్ల క్రితం తొలిసారి గురువు గారిని కలిసినప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో దూర ప్రాచ్య భాషలు, సంస్కృతం, భారతీయ అధ్యయనాల విభాగాలలో నా Ph.D. రాయడానికి ఒక ఫుల్ బ్రైట్ స్కాలర్ గా ఇండియాకు వచ్చాను. ఆ రోజుల్లో, టిబెటన్ బౌద్ధమతాన్ని విద్యా పరంగా ఈజిప్టాలజీని పోలిన ఒక డెడ్ సబ్జెక్టుగా బోధించేవారు. నేను ఈ వాదనను అంగీకరించలేకపోయాను మరియు బౌద్ధుడిగా జీవించి ఆలోచించడం ఎలా ఉంటుందో ఊహిస్తూ చాలా సంవత్సరాలు అక్కడే గడిపాను. ఈ ప్రాచీన సంప్రదాయం ఇంకా బతికే ఉందని, దానిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టిన గురువు ఒకరు ఉన్నారని ఈ గురువు గారిని కలిసిన తర్వాత నాకు తెలిసింది మరియు చాలా సంతోషం కలిగింది.

కొన్ని నెలల తర్వాత, ప్రామాణిక బోధనలను నేర్చుకుని శిక్షణ తీసుకోవడానికి నన్ను అనుమతించమని ఆయనను కోరాను. నేను ఆయనకు సేవ చేయాలనుకున్నాను మరియు నాపై గొప్ప పని చేసుకుంటే మాత్రమే నాకు అది సాధ్యమవుతుందని తెలుసు. గురువు గారు దానికి అంగీకరించారు. చివరికి, అప్పుడప్పుడు ఆయన అనువాదకుల్లో ఒకరిగా చేరి సేవ చేసుకోవడానికి, మరియు ప్రప౦చవ్యాప్త౦గా ఉన్న ఆధ్యాత్మిక నాయకులతో, విద్యా సంస్థలతో ఆయనకు రిలేషన్స్ ఏర్పరచడానికీ సహాయ౦ చేసే గొప్ప అవకాశం నాకు లభి౦చి౦ది.

నా చోటుని యూరోప్ కు మార్చాలనే నా నిర్ణయాన్ని గురువు గారు అంగీకరించి నేను రాయబోయే తర్వాతి పుస్తకం గురించి అడిగారు. ఒక ఆధ్యాత్మిక గురువుతో నాకున్న అనుబంధం గురించి రాయాలనే నా కోరికను ఆయనకు చెప్పను. ధర్మశాలలో పాశ్చాత్య బౌద్ధమత గురువుల నెట్ వర్క్ లో మూడు సమావేశాలకు హాజరైన నాకు ఈ విషయంలో పాశ్చాత్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన అభిప్రాయం ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంత తక్కువ మంది ఉపాధ్యాయులు అర్హత కలిగి ఉండటమే ఆ ఇబ్బందులకు అసలు ప్రధాన కారణమని ఆయన చెప్పారు.

బౌద్ధమత గురువుగా మారడంపై సెర్కాంగ్ రింపోచే గారి సలహాలు

నేను ఆడియన్స్ రూమ్ ని విడిచిపెట్టినప్పుడు, నా మొదటి రెస్పాన్స్ ఒక బౌద్ధమత గురువుగా ఉండటానికి నా అర్హతలను ప్రశ్నించడం. కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలో ప్రవాసంలో ఉన్న మంచి టిబెటన్ గురువుల దగ్గర శిక్షణ పొందే అసాధారణ అవకాశం నాకు లభించింది. వీరిలో దలైలామా గారు మాత్రమే కాకుండా, ఆయన ముగ్గురు దివంగత గురువులు, అనేక టిబెటన్ సంప్రదాయాల నాయకులు కూడా ఉన్నారు. వారితో పోలిస్తే నాకు ఎలాంటి అర్హతలు లేవు. అయితే, 1983లో నా ప్రధాన గురువు అయిన, మాస్టర్ డిబేట్ పార్టనర్ సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారు నాకు ఇచ్చిన ఒక సలహా ఇంకా గుర్తుంది.

కారకాస్ కు ఒక సైడ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాను. రింపోచే గారి ప్రోత్సాహంతో, అక్కడ కొత్తగా ఏర్పడిన బౌద్ధమత సమూహానికి బోధించడానికి నేను ఒక ఆహ్వానాన్ని అంగీకరించాను - అదే నా మొదటి పరిచయం. న్యూజెర్సీలోని గెషే వాంగ్యాల్ గారి ఆశ్రమంలో రింపోచే గారు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. రష్యాకు చెందిన కల్మిక్ మంగోల్ అయిన గెషే వాంగ్యాల్ గారి 1967లో నేను కలుసుకున్న టిబెట్ సంప్రదాయం యొక్క మొదటి గురువు, అయినా కానీ అతనితో లోతుగా అధ్యయనం చేసే అవకాశం నాకు ఎప్పుడూ దొరకలేదు.

నేను తిరిగి వచ్చిన తర్వాత, నేను ఎలా అక్కడ ఎలా చేశానని దాని గురించి రింపోచే గారు ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. ఇది అతని సాధారణ శైలి మరియు ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అయితే వారం రోజుల తర్వాత, లండన్ లో డిన్నర్ చేసిన తర్వాత కిచెన్ టేబుల్ చుట్టూ రింపోచే గారు, "భవిష్యత్తులో, నువ్వు ఒక ప్రసిద్ధ గురువు అయినప్పుడు, నీ విద్యార్థులు నిన్ను ఒక బుద్ధుడిగా చూసినప్పుడు, నీకు జ్ఞానోదయం కాలేదని నీకు తెలిసినా, నీ గురువులు బుద్ధులు అనే నమ్మకాన్ని ఇది మార్చదు" అని చెప్పారు. ఆయన చెప్పింది ఇంతే, ఆ తర్వాత మేమిద్దరం మౌనంగా ఉండిపోయాం. ఆయన మాటల్లోని ఔచిత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు చాలా సంవత్సరాలు పడుతుంది.

రింపోచే గారి "నిజమైన గురువు" పై లామా జోపా గారి సాక్ష్యం

ఒకసారి పాశ్చాత్య దేశాలలో ప్రసిద్ధ టిబెటన్ బౌద్ధమత గురువు లామా జోపా రింపోచే గారు మీరు ఒక ప్రామాణిక లామాను కలవాలనుకుంటే, దానికి ఉత్తమ ఉదాహరణ సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారు అని చెప్పారు. లామా జోపా అనే టిబెటన్ పదాన్ని కేవలం సన్యాసిగా లేదా మూడు సంవత్సరాల తీవ్రమైన ధ్యాన అభ్యాసాన్ని పూర్తి చేసిన ఆచారాల ప్రదర్శన కర్తగా మాత్రమే ఉపయోగించడం లేదు. అతను దానిని కేవలం "పునర్జన్మ లామా" అనే అర్థంలో ఉపయోగించలేదు - అతని లేదా ఆమె పునర్జన్మకు డైరెక్ట్ చెయ్యగల మరియు రింపోచే లాంటి "విలువైన వ్యక్తి" అనే బిరుదును కలిగి ఉన్న వ్యక్తి. ఈ పదం యొక్క అసలు అర్థంలో అతను ఒక లామా అని అర్థం చేసుకున్నాడు, ఒక పూర్తి అర్హత కలిగిన ఆధ్యాత్మిక గురువు. అందువల్ల, అటువంటి ఉపాధ్యాయుడు అంటే ఏమిటో మరియు ఒక విద్యార్థిగా ఒకరితో ఎలా రిలేషన్ ను కలిగి ఉండాలో వివరించడం ప్రారంభించడానికి బహుశా ఒక ఉపయోగకరమైన మార్గం సెర్కాంగ్ రింపోచే మరియు అతనితో నా సంబంధాన్ని మౌఖికంగా వివరించడమే. చిత్రాలు మరియు జ్ఞాపకాల కలయిక ద్వారా నేను దీన్ని చేస్తాను.

Top