రెండు జన్మలలో ఒక ఆధ్యాత్మిక గురువుతో ఉన్న అనుబంధం

ఒక ఆధ్యాత్మిక గురువుతో లోతైన అనుబంధం ఒక వ్యక్తి యొక్క జీవితకాలంలో అత్యంత ఉత్తేజకరమైన మరియు ముఖ్యమైన బంధం. ఇది ఆత్మవంచన, బాధ మరియు ఆధ్యాత్మిక నిరాశకు కూడా మూలం కావచ్చు. ఇది ఆ సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచడంపై ఆధారపడి ఉంటుంది. ఇది, మన స్వంత మరియు మన ఉపాధ్యాయుని అర్హతల గురించి, బంధం యొక్క లక్ష్యం గురించి మరియు సంబంధం యొక్క స్థితిగతులు మరియు సరిహద్దుల గురించి రియలిస్టిక్ ఆలోచనను కలిగి ఉండటంపై ఆధారపడి ఉంటుంది.

ఒక ఆధ్యాత్మిక గురువుకు సంబంధించినది ఒకటి రాశాను: అది ఆరోగ్యకరమైన సంబంధాన్ని నిర్మించడం (ఇథాకా: స్నో లయన్, 2000; రీప్రింట్: తెలివైన ఉపాధ్యాయుడు, తెలివైన విద్యార్థి: ఆరోగ్యకరమైన సంబంధం కోసం టిబెటన్ విధానాలు. ఇథాకా: స్నో లయన్, 2010). ఎందుకంటే నేను ప్రధానంగా నా ప్రధాన గురువులు - సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే, దలైలామా మరియు గెషే గావాంగ్ ధార్గేలతో నాకు లభించిన సంబంధాల నుంచి నేను గణనీయంగా ప్రయోజనం పొందాను మరియు నా ప్రపంచ బోధనా పర్యటనలలో నేను కలుసుకున్న చాలా మంది నిజాయితీగల ఆధ్యాత్మిక సాధకులకు తక్కువ అనుభవం ఉండటంతో నేను చింతించాను. లైంగిక, ఆర్థిక లేదా అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొన్న చాలా మంది, తమను తాము అమాయక బాధితులుగా గుర్తించారు. దుర్వినియోగ బోధకులపై మాత్రమే నిందలు మోపిన వారు, ఆధ్యాత్మిక గురువులందరికి, అప్పుడప్పుడు ఆధ్యాత్మిక మార్గానికి కూడా దూరమయ్యారు. మరికొందరు తమ అనారోగ్యకరమైన సంబంధాలను తిరస్కరిస్తూ జీవించారు మరియు సరైన "గురు-భక్తి" సాంప్రదాయిక ప్రమాణాల ప్రకారం ఎంత హానికరమైనదిగా అనిపించినప్పటికీ, గురువుల నుంచి అన్ని ప్రవర్తనలను సమర్థించడమే కాకుండా అది వీళ్ళను పవిత్రంగా మారుస్తుందని భావించారు. ఆరోగ్యకరమైన సంబంధం నుంచి పొందవలసిన పూర్తి ప్రయోజనాన్ని విద్యార్థులు పొందకుండా రెండు విపరీతాలు నిరోధించాయి.

విద్యార్థులు పాశ్చాత్యులు మరియు ఉపాధ్యాయులు టిబెటన్లు అయిన సందర్భాల్లో, సమస్యలకు ఒక మూలం సాంస్కృతిక అపార్థమే, అవతలి వాళ్ళు ఒకరి సాంస్కృతిక నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారనే అవాస్తవిక అంచనాలు పెట్టుకోవడం. విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధం యొక్క ప్రామాణిక పాఠ్య ప్రదర్శనలను వాటి అసలు సందర్భాల నుంచి బయటకు చూపించి వాటిని ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం మరియు సాంకేతిక పదాల అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, తరచుగా తప్పుదోవ పట్టించే అనువాదాల కారణంగా గందరగోళానికి ఇంకొన్ని కారణాలుగా ఉన్నాయి.

ఉదాహరణకు, లామ్-రిమ్ (గ్రేడెడ్ దశ) గ్రంథాలు సంబంధాన్ని "మార్గం యొక్క మూలం" గా చూపిస్తాయి మరియు దాన్ని వారి మొదటి ప్రధాన అంశంగా చర్చిస్తాయి. అయితే, దీని పాయింట్ ఏమిటంటే, ఒక చెట్టు దాని మూలాల నుంచి తన శక్తిని పొందుతుంది, దాని అర్ధం అది మూలం నుంచి ప్రారంభమవుతుందని కాదు. ఒక చెట్టు విత్తనం నుంచి ప్రారంభమవుతుంది, మరియు సోంగ్ ఖాపా గారు ఆ సంబంధాన్ని "మార్గం యొక్క విత్తనం" అని పిలవలేదు. ఏదేమైనా, అసలు లామ్-రిమ్ ప్రేక్షకులు బిగినర్లు ఏమీ కాదు. ఇందులో సన్యాసులు, సన్యాసినులు ఉండేవారు, వాళ్ళు తాంత్రిక సాధికారతను పొందడానికి ఒకచోట చేరారు మరియు వారు ప్రిపరేషన్ గా సూత్ర బోధనలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అధ్యయనం మరియు అభ్యాసంతో పాటు బౌద్ధమత మార్గానికి ఇప్పటికే కట్టుబడి ఉన్న వ్యక్తులకు, ఆధ్యాత్మిక గురువుతో మంచి అనుబంధం జ్ఞానోదయానికి పూర్తి మార్గాన్ని కనిపెట్టే ప్రేరణ పొందడానికి మూలం. పాశ్చాత్య ధర్మ కేంద్రాలకు కొత్తగా వచ్చినవారు అక్కడి ఆధ్యాత్మిక గురువులను బుద్ధులుగా చూసి మాత్రమే ప్రారంభించాలని ఎప్పుడూ చెప్పలేదు.

నా విషయానికొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుతో నాకు ఉన్న లోతైన సంబంధం ఆ గురువు యొక్క రెండు జన్మల వరకు విస్తరించి ఉంది. దివంగత మాస్టర్ డిబేట్ పార్టనర్ అయిన గురువు దలైలామా గారి అసిస్టెంట్ ట్యూటర్ అయిన సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారి శిష్యుడిగా, అనువాదకుడిగా, ఆంగ్ల కార్యదర్శిగా, విదేశీ టూర్ మేనేజర్ గా నేను తొమ్మిదేళ్లు గడిపాను. 1983 లో రింపోచే గారు మరణించాడు, సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ పునర్జన్మను పొందారు మరియు నాలుగు సంవత్సరాల వయస్సులో అతనిని గుర్తించి ధర్మశాలకు తీసుకువచ్చాము. కొన్ని నెలల తర్వాత మేము కలుసుకున్న క్షణంలో అతను మరియు నేను మా లోతైన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేసుకున్నాము. నేనెవరో మీకు తెలుసా అని ఒక అటెండర్ అడిగిన ప్రశ్నకు ఆ యువ తుల్కు ఇలా జవాబిచ్చాడు, "తెలివితక్కువగా మాట్లాడకు. అతనెవరో నాకు తెలుసు" అని. అప్పటి ను౦చి, రింపోచే గారు నన్ను తన ఆధ్యాత్మిక కుటు౦బ౦లో ఒక సన్నిహిత సభ్యునిగా చూసుకున్నారు - అది నాలుగేళ్ల పిల్లవాడు ఫేక్ చేయలేడు, కదా. మా లోతైన అనుబంధం గురించి నాకు ఎలాంటి సందేహాలు లేవు.

2001 వేసవి కాలంలో, నేను రింపోచే గారితో దక్షిణ భారతదేశంలోని అతని మఠం అయిన గాండెన్ జంగ్ట్సేలో ఒక నెల గడిపాను, అక్కడ అతను పదిహేడేళ్ల వయస్సులో, పండితుల శ్రేణిలోకి తన అధికారిక ప్రవేశానికి గుర్తుగా ఒక వేడుకలో గుమిగూడిన సన్యాసుల ముందు డిబేట్ ను నడిపారు. ఆ నెలలో, ఆయన తన గెషె శిక్షణలో ఏమి చదువుతున్నారో నేను అతని నుంచి బోధలను పొందాను మరియు తన పూర్వీకుల యొక్క మరొక సన్నిహిత పాశ్చాత్య శిష్యునికి అతను ఇచ్చిన ఒక వచనం యొక్క మౌఖిక ప్రసారం మరియు వివరణను అనువదించాను. నేను రింపోచే గారితో మరోసారి అనువదించడం ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పినప్పుడు, అతను "అవును, అది మీ కర్మ" అని జవాబిచ్చారు. పూర్వజన్మలో ఆయన నాకు ఇచ్చిన అనేక ధర్మాలను, ప్రాపంచిక సలహాలను ఆయనకు తిరిగి ఇచ్చే అనధికారిక ప్రక్రియను కూడా నేను చేపట్టాను.

రెండు జన్మలలో సెర్కాంగ్ రింపోచే గారితో నా సంబంధం నాకు ధర్మం మరియు పునర్జన్మపై ఎక్కువ నమ్మకాన్ని కలిగించింది, ఇది నేను అధ్యయనం మరియు ధ్యానం నుంచి పొందిన దానికంటే ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది. ఇది నిజంగా మార్గంలో నిరంతర ప్రేరణకు మూలం. ఆయన లేదా నేను అతని ప్రతి జీవితంలో ఒకరి పట్ల ఒకరు పోషించే పాత్రల గురించి మమ్మల్ని మేము మోసం చేసుకోము. మేము అప్పుడు ఉన్నదాని కంటే పూర్తిగా ఒకేలా లేదా భిన్నంగా అస్సలు ఉండము. ఒకరినొకరు బాగా గౌరవించుకుంటూ, అప్పుడప్పుడూ మన జీవితంలోని వివిధ దశల గురించి వాస్తవిక దృక్పథం ఆధారంగా, మనలో ప్రతి ఒక్కరూ బోధిస్తారు మరియు అన్నిటినీ నేర్చుకుంటారు. ఇది నాకు సహజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది.

ఒక స్టార్ ట్రెక్ యొక్క అభిమానిగా, నేను ఒరిజినల్ సిరీస్ మరియు నెక్ట్స్ జనరేషన్ రెండింటిలోనూ, కెప్టెన్ కిర్క్ ఆధ్వర్యంలో మరియు ఇప్పుడు కెప్టెన్ పికార్డ్ గా అతని పునర్జన్మ క్రింద యువ క్యాడెట్ గా శిక్షణ పొందుతున్న అనుభవంగా దీన్ని భావిస్తాను. నేను ఎదుర్కొంటున్న అసలైన ఛాలెంజ్ ఏమిటంటే, భవిష్యత్తులోని అన్ని జన్మలలో ఉండే వారికి సేవ చెయ్యడానికి కర్మను పొందడమే.

Top