న్యాయ, వైశేషిక తత్వశాస్త్రాల యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు

మిగతా భాషలు

మూలాలు (మొదలు)

క్రీ.శ 5 వ శతాబ్దంలో ప్రశస్తపాదుడు వివరించినట్లుగా, భారతీయ తత్వశాస్త్రం యొక్క వైశేషిక తత్వశాస్త్రం కనాడి మహర్షి యొక్క వైశేషిక సూత్రంపై ఆధారపడి ఉంది. క్రీ.శ 4 వ శతాబ్దంలో వాత్స్యాయన మహర్షి వివరించినట్లుగా, తర్వాతి న్యాయ తత్వశాస్త్రం గౌతముని యొక్క న్యాయ సూత్రాలపై ఆధారపడి ఉంది – దీన్ని బ్రాహ్మణ అక్షపద అని కూడా అంటారు.

వైశేషిక మరియు న్యాయ తత్వశాస్త్రాలు అనే రెండింటిలోనూ అనేక లక్షణాలు ఒకేలా ఉంటాయి. వైశేషిక అనేది ఈ సృష్టిలో ఉన్న అస్తిత్వాల రకాలను వివరిస్తుంది, మరియు న్యాయ అనేది ఆ అస్తిత్వాల ఉనికిని గుర్తించడంలో మరియు వాటిని రుజువు చెయ్యడంలో ఉండే రకాలను వివరిస్తుంది. సాంఖ్య తత్వశాస్త్రం 25 మూలకాలను విశ్వసించినట్లే, వైశేషిక తత్వశాస్త్రం 6 రకాల విషయాలను విశ్వసిస్తుంది, తర్వాత ఏడవ పదార్ధంగా, ‘శూన్యం’ అనేది జోడించబడింది. న్యాయ తత్వశాస్త్రంలో 16 విషయాలు పరిగణలోకి తీసుకోబడ్డాయి.  

"అస్తిత్వ రకం" అని అనువదించబడిన పదానికి అక్షరాలా "ఒక పదం యొక్క సందర్భ వస్తువు" అని అర్థం మరియు ఈ వర్గీకరణ స్కీమ్ లోని సభ్యులందరికి వారి కోసం పదాలు సూచించే విధంగా నిజంగా కనిపెట్టబడిన ఉనికిని కలిగి ఉంటాయి. వాటికి పదాలు, భావనలను ఇవ్వడానికి వాటి కారణాలుగా వివరించబడింది. అందువల్ల, ఈ అర్థంలో, అవన్నీ వాటికి ఉన్న పనిని చేస్తాయి, అయినప్పటికీ కొన్ని స్థిరంగా ఉండి, ప్రభావితం కాని విషయాలుగా ఉంటాయి. అవన్నీ కూడా వాటికవే సమృద్ధిగా ఉనికిలో ఉంటాయి, అవి నిజంగా ఉనికిలోని వివిధ విషయాలుగా ఉండటానికి మిగతా వాటిపై ఆధారపడవు, అయినా కానీ వాటికవే విడిగా ఉండలేకపోవచ్చు. కొన్ని రకాల అస్తిత్వాలు ఉదాహరణకు లక్షణాలు లాంటివి మిగతా వాటికి సహాయకారిగా పనిచేస్తాయి మరియు వాటిలో అంతర్లీనంగా ఉండే కొన్ని స్థిరమైన సంబంధాలకు కారణాలుగా పనిచేస్తాయి.

అస్తిత్వ రకాల లిస్ట్

వైశేషికలో ఉండే ఏడు రకాల అస్తిత్వాలు ఇవే:

(1) ప్రాథమిక విషయాలు

(2) లక్షణాలు

(3) పనులు

(4) సామాన్యమైనవి

(5) వ్యక్తిగతమైనవి

(6) అంతర్లీన, స్థిరమైన సంబంధాలు

(7) ఉనికిలో లేనివి.

న్యాయ తత్వశాస్త్రంలోని పదహారు రకాల అస్తిత్వాలు ఇవే:

(1) వస్తువులను తెలుసుకోవడానికి సరైన మార్గాలు

(2) సరిగ్గా అర్థమయ్యే విషయాలు - ఇందులో ఆరు వైశేషిక రకాల అస్తిత్వాలు ఉంటాయి.

(3) సందేహం

(4) రుజువుల యొక్క ఉద్దేశాలు లేదా లక్ష్యాలు

(5) రుజువులలో ఉపయోగించే ఉదాహరణలు

(6) రుజువుల స్థాపిత నిర్ధారణలు

(7) లాజిక్ సిలాజిజంలో సభ్యులు

(8) లాజిక్ - పరికల్పనలను విశ్లేషించడానికి

(9) లాజికల్ వివాదాల నిర్ణయాత్మక పరిష్కారాలు

(10) చర్చలు - నిజాన్ని కనిపెట్టడం

(11) వాదోపవాదాలు - కేవలం విజయాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్మాణాత్మక లేదా విధ్వంసకర వాదనలు

(12) కోపంతో కూడిన అభ్యంతరాలు - వినాశకరమైన వాదన

(13) సిలాజిజంలో అపోహలు

(14) మోసం - లాజిక్ లలో ఉపయోగించే మోసపూరిత మాయలు

(15) నిర్దిష్టమైన మరియు అందుబాటులో లేని అభ్యంతరాలు

(16) బలహీనమైన అభిప్రాయాలు - లాజికల్ రుజువును అప్పీల్ చేసే సందర్భాలు.

ఈ రెండు వైశేషిక ఆరు, మరియు వైశేషిక ఏడవ అస్తిత్వాలు కలిసిగట్టుగా అంగీకరించిన అస్తిత్వాల రకాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తొమ్మిది రకాల ప్రాథమిక విషయాలు

ఇక్కడ తొమ్మిది రకాల ప్రాథమిక విషయాలు ఉన్నాయి. అవి లక్షణాలు మరియు పనులకు బేస్ గా మరియు ఈ లక్షణాలు మరియు పనులతో వివిధ రకాల సంబంధాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి, కొంతవరకు ఇవి కర్రలతో కనెక్ట్ చెయ్యబడిన రెండు బంతుల లాగా ఉంటాయి:

(1) భూమి

(2) నీరు

(3) అగ్ని

(4) గాలి. ఈ నాలుగు పాక్షిక, శాశ్వత భౌతిక కణాలను సూచిస్తాయి (సం. పరమాణువులు). వ్యక్తిగత వస్తువులుగా వాటికి సమయం మరియు స్థానం ఉండవు, వాటిలోని స్థూల భౌతిక వస్తువులకు మాత్రమే సమయం మరియు స్థానం ఉంటాయి.

(5) అంతరిక్షం. అంతరిక్షం అనేది అశాశ్వతమైనది, పాక్షికమైనది, అనంతమైనది, సర్వవ్యాపితమైనది మరియు ఇందులో కణాలు అనేవి ఉండవు. 

(6) సమయం 

(7) స్థానం. సమయం మరియు స్థానం సర్వవ్యాప్త అస్తిత్వ రియాలిటీలు మరియు అవి కేవలం కొలవడం మాత్రమే చేస్తాయి.

(8) ఆత్మలు (సం. ఆత్మన్) లేదా వ్యక్తులు లేదా వ్యక్తిగత జీవులు. ఆత్మలు చాలా ఉంటాయి, మరియు ప్రతి ఒక్కటి సర్వవ్యాపితమైనది మరియు శాశ్వతమైనది. వాటికి స్పృహ అనేది ఉండదు.

(9) శారీరక మనస్సులు. భూమి, నీరు, అగ్ని మరియు గాలి లాంటి భౌతిక మనస్సు అనేవి ఒక రకమైన భౌతిక కణాలు, కానీ ఈ సందర్భంలో, అవగాహన యొక్క భౌతిక కణాలు (సం. చేతనలు). ఇంకొక మాటలో చెప్పాలంటే, అవగాహన అనేది శారీరకమైనది. ఇది వ్యక్తులను బయటి ప్రపంచంతో సంబంధాన్ని సృష్టిస్తుంది మరియు భావనల ద్వారా చేస్తుంది. కాబట్టి, భౌతిక మనస్సు కణాలు ఎప్పుడూ భావనాత్మక అవగాహనలే.

24 లక్షణాలు

ఇక్కడ 24 లక్షణాలు ఉన్నాయి, ఇవి నిర్దిష్ట ప్రాథమిక విషయాల యొక్క లక్షణాలను సూచిస్తాయి. ప్రతి ఒక్కటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాథమిక విషయాలకు సంబంధించినవి. ప్రతి ఒక్కటి వేరుగా ఉన్నప్పటికీ, ఏదీ దానికదే స్వతంత్రంగా ఉనికిలో ఉండలేదు.

ఈ 24 లో వివిధ రకాలు ఉన్నాయి, అవి:

(1) రంగు మరియు ఆకారం

(2) రుచి

(3) వాసన

(4) స్పర్శ అనుభూతి

(5) శబ్దం.

వీటి యొక్క వివిధ స్థాయిలు:

(6) బరువు

(7) విస్కాసిటీ లేదా లిక్విడిటీ

(8) జిడ్డు.

వివిధ రకాలు లేదా సందర్భాలు:

(9) సంఖ్య

(10) పరిమాణం లేదా సైజు

(11) విలక్షణత - వస్తువులలో ఉండే వ్యక్తిత్వం, ఒక దాన్ని ఇంకొక\ దాని నుంచి ప్రత్యేకమైనదిగా చూడడమే కాకుండా, పూర్తి గ్రూప్ లోని ముఖ్యమైన దాని నుంచి వేరేదిగా చూడడం.

(12) కలయిక, కలపడం లేదా కలిగి ఉండటం. లక్షణాలు లేదా పనుల కలయిక లేదా కలిగి ఉండటం మరియు కణాలు కలిసిపోవడం అనేది కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అవి ముందుగానే ఊహించబడే మరియు స్థిరమైనవి కావు; అవి క్షణికమైనవి.

(13) విచ్ఛిన్నం - ముందుగానే ఊహించబడే కలిసి ఉండే వాటి నుంచి లేదా తెలియకుండా వేటినైనా కలిగి ఉండడం.

(14) సామీప్యత - స్థలంలో లేదా సమయంలో

(15) సామీప్యత లేకపోవడం - స్థలంలో లేదా సమయంలో

ఇందులో ఉండే వివిధ రకాలు లేదా స్థాయిలు:

(16) ఇంద్రియ అవగాహన లేదా గ్రహించడం, ఇది ఈ ఐదు రకాల ఇంద్రియ చైతన్యాలను సూచిస్తుంది.

(17) సంతోషం

(18) దుఃఖం లేదా బాధ 

(19) దేనినైనా కోరుకోవడం లేదా ఆశించడం

(20) దేనిమీదైనా విరక్తి పొందడం

(21) ప్రయత్నం లేదా కృషి

(22) ప్రభావితం చేసే విషయాలు - వీటిలో (a) శారీరక కదలిక, ఇది భూమి, నీరు, అగ్ని మరియు గాలి కణాలపై భౌతిక మనస్సు కణం చేసిన కష్టం నుంచి ఉత్పన్నమయ్యేవి, (b) అలవాట్లు, ఇవి ఒక క్షణం చేతన ద్వారా ఉత్పత్తి చెయ్యబడే మరియు భవిష్యత్తు చైతన్య క్షణాన్ని ఉత్పత్తి చెయ్యగల సామర్థ్యం కలిగినవి, మరియు (c) ఒక స్థితి యొక్క తిరోగమనం, వికసించిన ఆకు లాంటి దాన్ని దాని మునుపటి స్థితికి తిరిగి తీసుకురావడం, ఇది ఇంతకు ముందు లాగా ఉంటుంది.

(23) నైతిక శక్తి (సం. ధర్మం), ఇది ఇప్పటి వరకు చూడని ఒక ఆనందాన్ని కలిగిస్తుంది.

(24) అనైతిక శక్తి (సం. అధర్మం) ఇది ఇప్పటి వరకు చూడని దుఃఖాన్ని, లేదా బాధను కలిగిస్తుంది.

టిబెటన్ సాంప్రదాయంలో, ఈ చివరి రెండు లక్షణాలను కలిపి ఒకటిగా చూస్తారు, దీన్ని "ఇప్పటి వరకు చూడని" (అద్రష్ట) అని పిలుస్తారు - ఇది ఆనందం లేదా దుఃఖాన్ని దాని ఇప్పటి వరకు చూడని ఫలితంగా ఉత్పత్తి చేసే కర్మ శక్తి. దీన్ని తర్వాత ఉష్ణోగ్రత లిస్ట్ కు జోడించబడింది.

ఆత్మలు మరియు వాటి తొమ్మిది అనూహ్యమైన లక్షణాలు

ఆత్మ లేదా వ్యక్తితో ముడిపడి ఉన్న తొమ్మిది లక్షణాలు:

(1) ఇంద్రియ అవగాహన లేదా గ్రహించడం

(2) సంతోషం

(3) అసంతృప్తి

(4) దేనినైనా కోరుకోవడం లేదా ఆశించడం

(5) దేనిమీదైనా విరక్తి పొందడం

(6) ప్రయత్నం లేదా కృషి

(7) ప్రభావితం చేసే విషయాలు, అంటే అలవాట్లను ప్రభావితం చేసేవి

(8) ఇప్పటి వరకు కనిపించని ఆనందానికి నైతిక శక్తి

(9) ఇంతవరకు కనిపించని దుఃఖానికి, బాధకు అనైతిక శక్తి.

ఆత్మ అనేది భౌతికమైనది కానప్పటికీ ఇది ఒక ప్రాథమిక విషయం. ఈ తొమ్మిది గుణాల సంబంధాలకు ఇదే ఆధారం. ఇది శరీరం (పదార్థ కణాలతో తయారు చెయ్యబడినవి), సెన్సార్లు (కాంతి-సెన్సార్లు, శబ్దం-సెన్సార్లు మొదలైనవి, ఉత్పన్న పదార్థ కణాలతో తయారు చెయ్యబడినవి), మరియు భౌతిక మనస్సు కణాలు (అవగాహన) కంటే భిన్నమైన ఒక లక్ష్యమైన అస్తిత్వం. స్వభావ రీత్యా, ఒక ఆత్మకు లేదా వ్యక్తికి ఈ తొమ్మిది లక్షణాలు ఉండవు, మరియు అవి పూర్తిగా ఉండవని గ్రహించడం ద్వారానే మనకు మోక్షం లభిస్తుంది.

ఎందుకంటే, స్వభావ రీత్యా, ఒక ఆత్మకు ఇంద్రియ అవగాహన లేదా గ్రహించే లక్షణం ఉండదు, ఇంద్రియ అవగాహనకు సాధనమైన భౌతిక మనస్సు కణాల ద్వారా మాత్రమే అది వస్తువులను గ్రహిస్తుంది. అందువల్ల, ఆత్మలు మనస్సు కణాల నుంచి వేరైన అస్తిత్వాలుగా మరియు పనుల నుంచి భిన్నమైన అస్తిత్వాలుగా ఉంటాయి; సాంప్రదాయకంగా, ఆత్మలు లేదా వ్యక్తులు ఆనందం మరియు దుఃఖం యొక్క అనుభవజ్ఞులు మరియు పనుల యొక్క ఏజెంట్లు.

ఇక్కడ అనేక రకాల ఆత్మలు ఉన్నాయి, మరియు ప్రతి ఒక్కటి పాక్షికమైనది, శాశ్వతమైనది మరియు స్థిరమైనది, ఇవి వేటి వల్ల కూడా ప్రభావితం కావు. వైశేషిక ప్రకారం, ప్రతి ఆత్మ సర్వవ్యాపితమైనది; కానీ న్యాయ తత్వశాస్త్రం ప్రకారం, ప్రతి ఆత్మ ఒక సూక్ష్మ కణం పరిమాణంలో ఉంటుంది. కున్క్యెన్ జమ్యాంగ్-జెపా గ్రంథాల ప్రకారం, భౌతిక మనస్సు కణంతో అస్థిర కలయిక లేదా విచ్ఛిన్నం యొక్క సంబంధాన్ని కలిగి ఉన్న ఆత్మ ఒక కణం యొక్క పరిమాణం అని న్యాయ తత్వశాస్త్రం చెప్పినప్పటికీ; సాధారణంగా, ప్రతి ఆత్మ సర్వవ్యాపితమైనదని ఇది అంగీకరించింది. 

ఆధ్యాత్మిక మార్గం యొక్క లక్ష్యం ముక్తిని సాధించడం, దీన్ని "సంపూర్ణ ఉపసంహరణ" (సం. అపవర్గం) అని అంటారు, అయితే స్వభావ రీత్యా, ఆత్మకు తొమ్మిది లక్షణాలు ఉండవని మరియు భౌతిక మనస్సు కణాలు (అవగాహన) లేదా పను లతో అసలు సంబంధాన్ని కలిగి ఉండదని గ్రహించబడింది. అందుచేత ఆత్మ పూర్తిగా ఈ స్థితిలో ఉండటం వల్ల సుఖదుఃఖాలను అనుభవించదు, ఎందుకంటే ఇది అవగాహన లేనిది; మరియు ఇది ఏమీ చెయ్యదు. సంపూర్ణమైన విముక్తిని సాధించే మార్గం ఒక వ్యక్తి యొక్క ఆత్మ స్వభావాన్ని గ్రహించడమే కాకుండా, ఒక ఆధ్యాత్మిక గురువు ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఉపవాసం, అభ్యంగనము మరియు బ్రహ్మచర్యం లాంటి నైతిక అభ్యాసాలను కూడా కలిగి ఉంటుంది.

ఇక్కడ వ్యక్తిగత జీవిత ఆత్మలు (సం. జీవత్వం) మరియు ఒకే, మహోన్నత, సర్వ వ్యాపిత, పాక్షిక, శాశ్వత, స్థిరమైన ఆత్మ (సం. పరమాత్మ) అయిన సృష్టికర్త దేవుడు ఈశ్వరుడు (శివుడు) ఉన్నారు. ఈ కనది మరియు గౌతముడి రెండు సంప్రదాయాలకు చెందిన పురాతన గ్రంథాలలో ఈశ్వరుని గురించి చెప్పనప్పటికీ, ప్రశస్తపాదుడు మరియు వాత్స్యాయనుల వ్యాఖ్యానాలలో అతని గురించి చర్చించడం జరిగింది. అయితే, ఈశ్వరుని యోగ సూత్రీకరణకు భిన్నంగా, న్యాయ మరియు వైశేషికల ప్రకారం, విశ్వంలో జరిగే ప్రతిదీ ఈశ్వరుని సంకల్పం నుంచే జరుగుతుందని చెప్పబడుతుంది.

ఐదు రకాల పనులు

ఐదు రకాల పనులు:

(1) ఎత్తడం

(2) కింద పెట్టడం

(3) సంకోచం

(4) పొడిగించడం

(5) వెళ్లడం.

సాధారణ స్వభావాలు

ఒక వస్తువు సాధారణ వర్గానికి చెందినదని గుర్తించగల స్వభావ లక్షణాలను సాధారణ స్వభావాలు అని అంటారు. ఈ కేటగిరీలకు చెందిన మరియు ప్రతి విషయంలో ఒకేలా ఉండే వ్యక్తిగత అంశాలను గుర్తించడం ద్వారా మాత్రమే వాటిని మనం భావనాత్మకంగా తెలుసుకోవచ్చు. వ్యక్తిగత అంశాలు సాధారణ స్వభావాలు సూచికలు లేదా బహిర్గతాలు (సం. వ్యంజక) లాంటివి.

సాధారణ స్వభావాలు రెండు రకాలు:

(1) సర్వ స్వరూపమైన సాధారణ స్వభావం (సం. సర్వసర్వగతం). ఇది సాధారణ స్వభావం యొక్క లక్షిత ఉనికిని సూచిస్తుంది. ఏడు రకాల అస్తిత్వాలలో, ఇది ప్రాథమిక విషయాలు, లక్షణాలు మరియు పనులకు మాత్రమే సంబంధించినది. ఇది సాధారణ స్వభావాలు, వ్యక్తిగత స్వభావాలు, అంతర్లీన సంబంధాలు లేదా ఉనికి లేని రకాలకు వర్తించదు. ఏడు రకాల అస్తిత్వాల యొక్క ఈ ద్విముఖ విభజన ఆబ్జెక్టివ్ అస్తిత్వాలు మరియు ఆధ్యాత్మిక అస్తిత్వాల యొక్క బౌద్ధమత సౌత్రంతిక విభాగాన్ని పోలి ఉంటుంది. న్యాయ-వైశేషిక మరియు సౌత్రంతిక రెండింటిలోనూ, రెండు సమూహాల తంత్రాలు నిజంగా ఉనికిని స్థాపించాయి, అయినా కానీ మొదటి సమూహం మాత్రమే నిష్పాక్షికంగా "వాస్తవమైనది".

(2) నిర్దిష్ట సాధారణ స్వభావాలు (సం. వ్యక్తిసర్వగత). ఇవి కొన్ని వస్తువులకు మాత్రమే వర్తిస్తాయి, అన్ని టేబుల్స్ కి మాత్రమే వర్తించే "టేబుల్" యొక్క నిర్దిష్ట సాధారణ లక్షణం లాంటిది.

వ్యక్తిగత స్వభావాలు

ఒక వస్తువుగా ఉనికిలో ఉన్న (కుండీ మరియు స్తంభం లాంటివి) వాటి యొక్క సర్వవ్యాప్త సాధారణ లక్షణం పరంగా లేదా ఒక నిర్దిష్ట సాధారణ లక్షణం పరంగా, ఉదాహరణకు, ఒక టేబుల్ గా ఉండటం (రెండు టేబుల్స్ లాంటివి) అనే రెండు విభిన్న లేదా వ్యక్తిగత వస్తువులను గుర్తించేటప్పుడు వ్యక్తిగత స్వభావాలు ఒక భావనాత్మక జ్ఞానం ద్వారా గ్రహించబడతాయి.

అంతర్లీన, శాశ్వత సంబంధాల యొక్క ఐదు రకాలు

అంతర్లీన, స్థిరమైన సంబంధాలలో ఐదు రకాలు ఉన్నాయి: అవి వీటి మధ్య సంబంధాలు:

(1) ప్రాథమిక విషయాలు (ఆత్మలు కాకుండా) మరియు వాటి లక్షణాలు: ఆత్మలు కాకుండా ఇతర ప్రాథమిక విషయాలు వాటి లక్షణాలకు ఆధారం (సం. ఆశ్రయ).

(2) ప్రాథమిక విషయాలు (ఆత్మలు కాకుండా) మరియు వాటి పనులు: ఆత్మలు కాకుండా ఇతర ప్రాథమిక విషయాలు కూడా వారి పనులకు ఆధారం.  

(3) నిర్దిష్ట వస్తువులు మరియు వర్గాలు

(4) అసలైన పదార్థాలు (భూమి, నీరు, అగ్ని, గాలి మరియు భౌతిక మనస్సుల యొక్క పాక్షిక కణాలను సూచిస్తాయి) మరియు వాటి అస్థిర సమ్మేళనాలతో తయారైన నిర్దిష్ట వస్తువులు

(5) శరీరం మరియు దాని అవయవాలు లాంటి పూర్తి మరియు దాని భాగాలు, లేదా సహజంగా కట్టుబడి ఉండే పదార్థ కారణాలు మరియు వాటి ఉత్పత్తులు, బంకమట్టి మరియు దానితో తయారైన జగ్ లాంటివి.

ఈ ఐదు జంటలు ఎప్పుడూ కలిసి ఉంటాయి.

అస్తిత్వంలో లేని వాటి యొక్క నాలుగు రకాలు

అస్తిత్వంలో లేనివి మొత్తం నాలుగు రకాలు:

(1) పూర్వపు అస్తిత్వం (సం. ప్రగభవ) - ఉదాహరణకు, ఒక కుండీని తయారు చెయ్యడానికి ముందు అది అస్తిత్వంలో లేకపోవడం.

(2) నశించిన అస్తిత్వం (సం. ప్రద్వంసభవ) - ఉదాహరణకు, ఒక కుండీ నశించిన తరువాత అది అస్తిత్వంలో లేకపోవడం.

(3) పరస్పర అస్తిత్వం (సం. అనోన్యభవ) - ఒక కుండీ ఒక స్తంభంగా, స్తంభం ఏమో ఒక కుండీగా ఉండటం లాంటి పరస్పర మినహాయింపులు.

(4) సంపూర్ణ అస్తిత్వం (సం. అత్యంతభవ) - అసలు ఎప్పటికీ లేని, ఎప్పటికీ ఉండని, ఎప్పటికీ అస్తిత్వంలో లేని ఒక వస్తువు యొక్క సంపూర్ణ ఉనికి లేకపోవడం. కొన్ని వివరణల ప్రకారం, ఈ రకమైన ఉనికి అనేది ఒక వస్తువు అది ప్రస్తుతం ఉన్న చోట కాకుండా మిగతా ఏ ప్రదేశాలలో పూర్తిగా లేకపోవడాన్ని సూచిస్తుంది.

Top