స్వార్ధపు ఆలోచనా విధానాన్ని అధిగమించడానికి సలహా

మీరు మీ స్వంత నియమాలు, చట్టాలు మరియు రాజ్యాంగాలను రూపొందించుకుంటారు. ఇతరులు మీ పద్ధతులను అనుసరించకపోతే, మీరు వాళ్ళను పట్టుకుని శిక్షిస్తారు. కానీ, మీరే వాటిని అనుసరించకపోతే, మిమ్మల్ని మీరు ఏమీ చేసుకోరు. "మీ బలహీనతలను, మిమ్మల్ని మీరు ఒక శత్రువుగా చూడనంత వరకు మీరు ఏ సహాయాన్ని పొందలేరు" అని గెషే శర్మావా గారు చెప్తూ ఉండేవారు. మీ భావాలే మీకు చాలా ముఖ్యమైనవి అని మీరు అనుకుంటే, మీ దగ్గరకు ఎవరూ రాలేరు. బాగా సమర్థులైన లామాలు కూడా సొంత వ్యామోహం ఉన్నవారికి సహాయం చెయ్యలేరు, ఎందుకంటే లామాల సలహాలు స్వార్ధపు ఆలోచనలతో ఉన్న ధోరణులను విభేదిస్తాయి. గురువుల ద్వారా మీరు సరైన మార్గంలో నిర్దేశించబడాలంటే, ముందు స్వార్ధపు ఆలోచనా విధానాన్ని కలిగి ఉండటం అనేది తప్పు అని గ్రహించాలి. ఈ స్వార్ధపు ఆలోచనలతో, చెడు పనులు చెయ్యడానికి మీకు అన్ని కారణాలు ఉంటాయి, కాబట్టి మీరు చేసే పనులకు కారణాలను వెతుక్కోవాలి. గురువులు మాత్రమే కాదు, మీ సాధారణ స్నేహితులు కూడా మీకు సహాయం చెయ్యలేరు, ఎందుకంటే మీరు వారి సలహాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి.

ఇలాంటి స్వార్ధపు ఆలోచనలు మనలో ఉండటం ఒక లోపమని మనం గ్రహించాలి – బుద్ధుడికి మాత్రమే ఇలాంటివి రాలేదు. వీటిని మనలో ఉన్నట్టు గుర్తించి పూర్తిగా తొలగించడానికి మనం ప్రయత్నించాలి. ఒకవేళ మనలో ఇలాంటి స్వార్ధపు ఆలోచనలు ఉన్నాయని గ్రహించినా, అది మంచి విషయమే. మీరు విమర్శలను ఎదుర్కున్నప్పుడు, అది మీ స్వార్ధపు ఆలోచనల వల్లనే అని మీరు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గ్రహించలేకపోతే, మీకు కోపం వస్తుంది. ఒక ముల్లు మీకు గుచ్చుకుంటే దానికి మీరు కోపం తెచ్చుకుని దాన్ని కొడితే చివరికి నష్టపోయేది ఎవరు? మీరే. ఇప్పుడు చిన్న చిన్న విమర్శలను, అసహ్యాలను మనం భరించలేకపోతే, తక్కువ పునర్జన్మల బాధలను మనం ఎలా భరించగలం?

లక్ష్యసాధన లాంటి సహనాన్ని మనం పెంపొందించుకోవాలని గెషే చెంగవా గారు చెప్పారు. మనకు విమర్శలు వస్తే మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని అనుకుంటాం. అసలు ముందు ఆ లక్ష్యమే లేకపోతే ఏ బాణాన్ని మనం వెయ్యలేము. "మీరు ఉచ్చు కోసం మెడను బయట పెట్టారు" అనే సామెత ఒకటి ఉంది. మీరు ఏ తప్పు చెయ్యకుండా విమర్శించబడినప్పుడు, గత జన్మలలో మీరు ఇతరులను తక్కువ చేసి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒకసారి ఒక బుద్ధుని శిష్యుడు, అర్హత్ మూడు రకాల ప్రతిజ్ఞలకు సంబంధించి ఇబ్బందికరమైన భావోద్వేగాలను మరియు వైఖరులను వదిలించుకున్నాడు. అయినా కానీ, కొంతమంది అర్హత్ తన ప్రతిజ్ఞలను ఉల్లంఘించాడని, వారు అతనికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చాడని చెప్పారు. బుద్ధుడు దానికి బాధ పడి అర్హత్ ను ఆ ప్రతిజ్ఞలను ఉల్లంఘించకూడదు అని చెప్పాడు. అంతేకాక, అత్యంత జ్ఞానం కలిగిన శిష్యుడు తమ ప్రతిజ్ఞలను ఉల్లంఘించాడని ఆరోపించిన బౌద్దుడిని ఇకపై తాను పట్టించుకోనని, దానికి బదులుగా వారిని బౌద్ధమతానికి ఒక ముప్పుగా చూస్తానని బుద్ధుడు చెప్పాడు. మరికొందరైతే అర్హత్ ను ఎందుకు విమర్శించారని ప్రశ్నించారు. దానికి బుద్ధుడు ఇలా సమాధానమిచ్చాడు, “ఎందుకంటే అతను తన పూర్వజన్మలో, ఒక రాజు, అతను తన రాణిని బహిష్కరించడానికి కారణమయ్యాడు. దాని పర్యవసానం అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు” అని చెప్పాడు.

ఇతరులను విమర్శించడం, గాసిప్ చెయ్యడం మరియు నిందించడం చాలా విధ్వంసకరమైన ప్రవర్తన, ఎందుకంటే అలాంటివి మీ స్వంత పురోగతికి సహాయపడవు, కానీ అవి ఇతరులను బాధపెడతాయి మరియు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇద్దరు జ్ఞానవంతులు మాత్రమే ఒకరినొకరు అంచనా వేసుకోగలరని చెప్పబడుతుంది. నిజాలను లేదా అబద్ధాలను విమర్శించినా మనకు నెగెటివ్ కర్మలు వస్తాయి. లేదా, ఒక భోధిసత్వుడు ఏదైనా వింత పని చేసినందుకు విమర్శించే సందర్భంలో, ఒక మంచి కారణం వల్ల, దాని ఫలితం కూడా నెగెటివ్ గానే ఉంటుంది.

ఇతరులను ఎప్పుడూ విమర్శించే అలవాటు ఉన్నవారికి చాలా స్వార్ధం ఉంటుంది. కొంతమంది సన్యాసులు అనేక బోధనలు విన్నప్పటికీ, పూర్వజన్మలో వాళ్ళకు ఉన్న స్వార్ధపు ఆలోచన వల్ల వాటిని వారి అభ్యాసానికి అన్వయించరని నమ్మబడుతుంది. మన శత్రువులకు హాని కలిగించడం కూడా ఇలాంటి స్వార్ధపు ఆలోచనల ఫలితమే. 

ఒకసారి బుద్ధుని కాలంలో ఒక సన్యాసి తన దుస్తులకు రంగులు వేసుకుంటుండగా, ఎవరిదో కోతి కనిపించకుండా పోయింది. ఆ సన్యాసి కుండలో ఉన్న దుస్తులను తీసినప్పుడు, అది కోతి చర్మంగా ఉన్నట్లు కనిపించింది. అప్పుడు ఈ సన్యాసి కోతిని దొంగిలించి వండేసుకుని తిన్నాడని ప్రజలు ఆరోపించారు. ఆ సన్యాసిని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించారు. కొన్ని రోజుల తర్వాత, ఆ కోతి మళ్ళీ తిరిగి వచ్చింది మరియు ఆ సన్యాసి నిర్దోషి అని రుజువైంది. ఇలా ఎందుకు జరిగిందని సన్యాసి బుద్ధుడిని ప్రశ్నించగా, గత జన్మలో అతను ఇంకొక సన్యాసి కోతిని దొంగిలించాడని ఆరోపించాడని చెప్పాడు.

మనం సంతోషంగా, సౌకర్యవంతంగా ఉంటూ డబ్బు కూడబెట్టుకోడానికి ఎంత కష్టపడతామో, దొంగలకు టార్గెట్ గా కూడా మనల్ని మనం అదే విధంగా సిద్ధం చేసుకుంటాం. ఒక వ్యక్తి తన డబ్బులన్నింటినీ ఒక సంచిలో వేసి, అవి పోతాయనే భయంతో ఆ బ్యాగును పైకప్పుకు కట్టిన కథ ఒకటి ఉంది. ఒక రోజు ఆ బ్యాగ్ ఆ వ్యక్తి తలపై పడి గాయం అయ్యేలా చేసింది. స్వార్ధం అనేది మన ఆనందాన్ని తాత్కాలికంగానూ, పూర్తిగానూ అడ్డుకుంటుందనేది ఈ కథలోని పాయింట్. గత జన్మలన్నిటిలోనూ స్వార్ధపు ఆలోచనలను కలిగి ఉన్నాము కాబట్టి, ఇది మనకు ఉన్న అతిపెద్ద సమస్య అని మనం గ్రహించినప్పటికీ, దాన్ని వెంటనే మనం వదిలించుకోలేము.

అందువల్ల, మనం ఏ విమర్శకు ప్రతిస్పందించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా అది ఇతరుల తప్పు మరియు మన స్వార్ధపు ఆలోచనా విధానం వల్ల అని గ్రహించాలి. దీన్ని సరిగ్గా గ్రహించడం మన సహనాన్ని పెంపొందించడానికి మనకు సహాయపడుతుంది. "నిప్పు వేడిగా ఉంటుంది" అని చెప్పడం మామూలే, ఇందులో వింత ఏమీ లేదు. అదే విధంగా, ఒక వ్యక్తి విమర్శనాత్మకంగా ఉంటే మరియు వారి విమర్శ మీ స్వార్ధపు ఆలోచనలలో పాతుకుపోయిందని మీరు అర్థం చేసుకోగలిగితే - ఇది కూడా మామూలే. అటువంటి అవగాహన కోపాన్ని లేదా పిచ్చితనాన్ని తీసుకురాదు ఎందుకంటే అవతలి వ్యక్తి తప్పు అని రుజువు చేయాల్సిన అవసరం ఇక ఉండదు. మహాయాన సూత్రాల కోసం ఒక ఫిలిగ్రీలో ఇలా చెప్పబడుతుంది, "స్వార్ధం తనను మరియు ఇతరులను నాశనం చేస్తుంది మరియు నైతికతను కూడా నాశనం చేస్తుంది." దీని ప్రకారంగా మనం చేసే ప్రతి పని కిందటి, లేదా నరక లోకాలకు మార్గం సుగమం చేస్తుంది. బుద్ధులు, బోధిసత్వులు స్వార్ధాన్ని అసహ్యించుకుంటారు, ఎందుకంటే దాని నుంచి చాలా అసహ్యం ఏర్పడుతుంది, మరియు స్వేచ్ఛ లేకుండా కిందటి లోకాలలో పునర్జన్మ దొరుకుతుంది.

స్వార్ధపు ఆలోచనలు మనం ఇంతకుముందు చేసిన ప్రయత్నాలన్నింటినీ వృధా చేస్తాయి మరియు మన పురోగతిని అడ్డుకుంటాయి. అది మన జీవిత సంతోషాన్ని పోగొట్టే ఒక విషంగా మనం గుర్తించాలి. ఎప్పుడూ ఈ స్వార్ధపు ఆలోచనలను నాశనం చెయ్యడానికి ప్రయత్నించండి. మన అభ్యాసం ఏదైనప్పటికీ, వీటిని మనం తొలగించుకోవడానికి కష్టపడాలి. ఒక కదంప గెషే గారు తాను ఏదైనా గ్రంథాన్ని చదివినప్పుడల్లా, దానిలో చెప్పిన అన్ని చెడు లక్షణాలను తనవిగా, మరియు అన్ని మంచి లక్షణాలను ఇతరులకు చెందినవిగా భావిస్తాడు - అలా అతను ఇలాంటి స్వార్ధపు ఆలోచనలతో పోరాడుతాడు. ఇలాంటి ఆలోచనలను తగ్గించుకోకుండా బోధిచిత్తను పొందడం కష్టం. బోధిచిత్త, కరుణతో స్వార్ధం పట్ల వ్యతిరేకత బలపడి, కరుణ దాన్ని ఆక్రమించి మనలో కోరికలు తీర్చే వృక్షాన్ని ఏర్పరుస్తుంది. మీరు కరుణను అభ్యసిస్తే, కరుణ యొక్క పాజిటివ్ ప్రభావాలు స్వార్ధం యొక్క నెగెటివ్ ప్రభావాలను అధిగమిస్తాయి.

గెషే పోటోవా గారు ఇలా అన్నారు, “పెంపోలోని ఒక చోటులో, గెషే ఖమ్లుంగ్‌ పా కంటే ఎవరూ సంతోషంగా లేరు, మరియు ఇంకొక చోట, గెషే చంగావాకి అదే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈ స్వార్ధపు ఆలోచనలను తొలగించుకున్నారు." గెషే చంగావా చాలా పేదవాడు, తినడానికి అతని దగ్గర ఏమీ ఉండేది కాదు మరియు ధరించడానికి ఒక అతుకుల తోలు స్కర్ట్ మాత్రమే ఉండేది. అయినా కానీ, అతను ధనవంతుడిగా భావించి "ఇప్పుడు నేను పూర్తి విశ్వానికి సహాయపడగలను" అని చెప్పాడు. నిజమైన స్థాపిత ఉనికిని గ్రహించడం ద్వారా ఈ స్వార్ధపు ఆలోచనా విధానం ఏర్పడుతుంది మరియు ఇది బోధిచిత్త అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి. ఒక టెక్స్ట్ లో ఇలా చెప్పబడింది, "కోరికను తీర్చే రత్నం సమస్త ప్రాణుల పట్ల కరుణను కలిగి ఉండటం. ఈ విషయాన్ని గ్రహించకుండా మనల్ని మనం పక్కదారి పట్టించుకుంటాం. స్వార్ధానికి, అహంకారానికి వ్యతిరేకంగా కక్షలు పెట్టుకోవడానికి బదులుగా, మన నిజమైన శత్రువులను మన మిత్రులుగా భావిస్తాం." “అతి పెద్ద దెయ్యం, పిశాచి బయట ఏమీ కనిపించవు, కానీ మన శరీరంలోని దెయ్యాలు ఇంటి లోపల స్వార్ధం రూపంలో కనిపిస్తాయి" అని ఇంకొక టెక్స్ట్ చెబుతుంది.

బోధిచిత్తతో మన స్వార్ధపు ఆలోచనా విధానాన్ని నాశనం చేసుకోవచ్చు. స్వార్ధపు ఆలోచన వల్లే మనకు ఆ దుష్ట శక్తుల నుంచి హాని జరుగుతుంది - విమర్శలు, దూషణల నుంచి మనల్ని రక్షించుకునేలా చేసి, అనైతికంగా మార్చుతుంది. మన కోరికలను తీర్చుకోవడానికి మనం స్వార్ధంతో వ్యవహరిస్తాము మరియు మనల్ని మనం ప్రసన్నం చేసుకోవడమే మన ప్రధాన కర్తవ్యం అనుకుంటాం.

కొన్నిసార్లు ఇతరులను అసంతృప్తికి గురిచెయ్యకుండా ఉండలేము, కానీ స్వార్ధంతో, మనల్ని సంతృప్తి పరుచుకోడానికి ఒక ముఖ్యమైన పనిగా ఇతరులను తక్కువ చేసి, హాని కలిగిస్తాము. స్వార్ధం చాలా అహంకారాన్ని, అసూయను కలిగిస్తుంది. ఇంకొకరు ఏదైనా సాధిస్తే, "కంగ్రాట్స్" అని మీరు చెప్పినప్పటికీ, అలా మీకు జరగలేదని మీరు అసూయ పడతారు. స్వార్ధం లేకపోతే, అసూయపడటానికి బదులుగా, మీరు ఇతరుల లాభాలను ఆనందించడం ద్వారా పాజిటివ్ సామర్థ్యాన్ని కూడబెట్టుకుంటారు. మన జీవితంలో అనైతికతకు కారణం స్వార్ధం. మీకు బలమైన స్వార్ధపు వైఖరి ఉంటే, మీరు చాలా రక్షణాత్మకంగా ఉంటారు, ఇతరులతో గొడవలు పడతారు, తక్కువ సహనాన్ని కలిగి ఉంటారు మరియు ఇతరులు చేసే ప్రతిదీ మీకు చికాకుని కలిగిస్తుంది. ఇలాంటి రక్షణాత్మకత భావన వల్ల భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనైతికత ఎక్కువ ఉంటుంది. 

మరో కదమ్ గెషే నలభై ఏళ్ల వయస్సు వరకు దొంగగా ఉన్నాడు. అతనికి వ్యవసాయం చెయ్యడానికి కొన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ అతను దొంగగా మారాడు. పగటిపూట ఆ దారిగుండా వెళుతున్న వారిని దోచుకుంటూ, రాత్రివేళల్లో ఇళ్లలోకి చొరబడేవాడు. ఒక రోజు, అతను తన అలవాట్లను మార్చుకున్నాడు, ఆధ్యాత్మికంగా మారి అతని స్వార్ధపు ఆలోచనలను వదులుకున్నాడు. "ఇంతకు ముందు, నాకు ఆహారం దొరకలేదు, కానీ ఇప్పుడు నాకు చాలా నైవేద్యాలు లభిస్తాయి" అని అతను చెప్పేవాడు.

ఈ విషయాలన్నీ బోధిచిత్త అభివృద్ధి గురించి ఆలోచించడానికి ఉపయోగపడతాయి. మీరు పర్వతం సైజులో ఉన్న స్వార్ధపు ఆలోచనలతో ఒక గుహలో మిమ్మల్ని మీరు బంధించుకోవడం నిరుపయోగంగా ఉంటుంది. కానీ, మీరు మీ స్వార్ధపు ఆలోచనను తగ్గించగలిగితే, ఏకాంతంలో ఉండటం చాలా ప్రయోజనకరంగా అనిపిస్తుంది.

Top