లింగ్ రింపోచే గారి సందేశం

ఇంటర్నెట్ లో సమాచారం అనేది చాలా సులభంగా మరియు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, బౌద్ధమతం మరియు టిబెటన్ సంస్కృతి యొక్క అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న ప్రపంచంలోని ఎంతో మంది ప్రజలు తమ మొదటి సోర్సుగా దీన్నే ఎంచుకుంటున్నారు. చదువులో ఇంకా ముందంజలో ఉండాలనుకునేవారు అర్హత కలిగిన ఉపాధ్యాయులను వెతుక్కుంటూ, అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్లకు తోడుగా ఈ ఇంటర్నెట్ ఒక ముఖ్యమైన సోర్సుగా ఉపయోగపడుతుంది. కొంత మందికి అంత అదృష్టం ఉండకపోవచ్చు మరియు వేరే కారణాల వల్ల అర్హత కలిగిన గురువులు దొరకకపోవచ్చు. వాళ్లకు ఒకవేళ ఎవరన్నా దొరికినా కానీ అక్కడ ఉండే ఆర్థిక లేదా సంస్థాగత కారణాల వల్ల వాళ్లను ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళ కోసం, ఈ ఇంటర్నెట్ లోని బోధనలు చాలా అవసరమైన సోర్సుగా మారుతున్నాయి.

బౌద్ధమతం మరియు టిబెటన్ సంస్కృతి గురించి అనేక సైట్లతో ఈ ఇంటర్నెట్ నిండిపోయి ఉంది. కొన్ని ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి మరికొన్ని దురదృష్టవశాత్తు సరిగ్గా నమ్మదగినవి కావు. ఇలాంటి పరిస్థితిలో, అలెక్స్ బెర్జిన్ గారు బెర్జిన్ ఆర్కైవ్స్ అనే వెబ్‌సైట్ ను తయారు చేసి, అందులో నమ్మదగిన సమాచారాన్ని వివిధ భాషలలో ఉచితంగా అందుబాటులో ఉంచడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా వీటి గురించి తెలియని వాళ్లకు ఈ మెటీరియల్స్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చాలా గొప్పది – నిజంగానే వీళ్ళు నిర్లక్ష్యం చెయ్యబడ్డారు.

అలెక్స్ నా పూర్వీకుడు అయిన యోంగ్జిన్ లింగ్ రింపోచే యొక్క విద్యార్థి మరియు అనువాదకుడు. ఈ జీవితంలో కూడా మేము ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించుకుంటాం. సమాచారం మరియు ఆధ్యాత్మిక శిక్షణను అందించడానికి సాంప్రదాయ మరియు ఆధునిక పద్ధతులను తెలివిగా మరియు దయతో నేర్పించడం ద్వారా, ఈ ప్రపంచంలో శాంతి మరియు ఆనందం నెలకుంటుందని ఆశిద్దాం.

2009, మే 19
లింగ్ రింపోచే

Top