ధ్యానం: ముఖ్యమైన విషయాలు

ధ్యానంలో అనేక సాధారణ రకాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దానిలో సమర్థవంతంగా నిమగ్నం అవ్వాలంటే, మనం సృష్టించాలనుకుంటున్న మానసిక స్థితిని కచ్చితత్వంతో మరియు నిర్ణయాత్మకతతో తెలుసుకోవాలి. దేనిపై దృష్టి పెట్టాలి, ఈ కేంద్ర వస్తువుకు సంబంధించిన వివరాలు ఏమిటి, మన మనస్సులు దానితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి, ఈ స్థితిని అభివృద్ధి చేసుకోవడానికి ఏది సహాయపడుతుంది, ఏది ఆటంకం కలిగిస్తుంది, ఈ మానసిక స్థితిని సాధించిన తర్వాత దాని ఉపయోగం ఏమిటి మరియు అది దేనిని తొలగిస్తుంది అనే విషయాలు ఇందులో ఉన్నాయి. ధ్యానం చెయ్యడానికి సరైన పరిస్థితులు, సరైన భంగిమ మరియు సీటు, మరియు సెషన్లను ఎలా ప్రారంభించాలి మరియు ముగించాలి అనే విషయాలు కూడా ఉన్నాయి.

Top