కరుణను ఎలా పెంపొందించుకోవాలి

How zo develop compassion clay banks unsplash

మనందరం కరుణతో కూడిన సామర్థ్యంతో జన్మించాం. ఇతరులు వారి బాధలు మరియు అవి వచ్చే కారణాల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారు. మనకు మరియు ఇతరులకు మంచి ప్రయోజనాలను తీసుకురావడానికి మనం ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

కరుణను అభివృద్ధి చేయడం ప్రారంభించడానికి ఉత్తమ మార్గం మన నిజ జీవితంలో మరియు ఆన్‌లైన్లో మనం ఎదుర్కునే వ్యక్తులకు మరియు కొన్ని జంతువులకు మన పరిధిని పరిమితం చేయడం. నెమ్మదిగా, ప్రతి ఒక్కరినీ ఇందులో చేర్చడానికి మన కరుణను విస్తరించడానికి శిక్షణ ఇస్తాము: మనకు నచ్చిన వారిని, అపరిచితులను మరియు మనకు నిజంగా నచ్చని వాళ్లని కూడా. మన కరుణలో ఈ మొత్తం ప్రపంచం వచ్చేంత వరకు మనం ఇలా చేస్తాము - అవును, బొద్దింకలను కూడా కలిపి!

కరుణ భావోద్వేగ మరియు హేతుబద్ధమైన భాగాన్ని కలిగి ఉంటుంది. భావోద్వేగ పరంగా, ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల పరస్పర ఆధారాన్ని మనం మెచ్చుకోవాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు మనం అనుభవించేవన్నీ - ఆహారం, దుస్తులు, వస్తువులు, ఇళ్లు, వాహనాలు మొదలైనవి - ఇతరుల కష్టం నుంచే వస్తాయి. మిగతా వాళ్ళు లేకపోతే, మనకు రోడ్లు, కరెంట్, ఇంధనం, నీళ్లు లేదా ఆహారం ఏమీ ఉండవు. ఇదొక్కటే సహజంగా మనల్ని కృతజ్ఞతా భావంతో, సంతోషకరమైన మానసిక స్థితికి గురిచేస్తుంది. ఇది మనం "హృదయాన్ని కదిలించే ప్రేమ" అని పిలువబడే దానికి దారితీస్తుంది. ఈ కృతజ్ఞతా భావాన్ని మనం ఎంత ఎక్కువగా ఉంచుకుంటే, ఒక బిడ్డకు ప్రమాదం జరిగితే ఆ తల్లి ఎంత బాధపడుతుందో మనం కూడా ఆ విధంగా ఉండగలుగుతాం. ఇతరుల దురదృష్టాన్ని చూసి మనం బాధపడతాం, కానీ వారిపట్ల మనం జాలి పడము. వాళ్ళ సమస్యలు మనవే అన్నట్లుగా సానుభూతి చూపిస్తాం.

మన కరుణను అందరికీ సమానంగా అందించడానికి హేతుబద్ధమైన ఆధారం చాలా స్పష్టంగా ఉంది. అయినప్పటికీ ఇది చాలా మంది పట్టించుకోని విషయం: ప్రతి ఒక్కరూ సమానంగా సంతోషంగా ఉండాలని మరియు దుఃఖం, బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారు. ఎవరైనా మనకు దగ్గరగా ఉన్నా, దూరమైనా, ఏం చేసినా ఈ రెండు వాస్తవాలే నిజమవుతాయి. ఎవరైనా మీకు చెడు చేస్తే, వారు అజ్ఞానం, గందరగోళం మరియు భ్రమతో ఉండి చేస్తారు. దానితో వారికి లేదా సమాజానికి ఉపయోగం ఉంటుందని తప్పుగా ఆలోచించి అలా చేస్తారు. వాళ్ళు సహజంగా చెడ్డ వాళ్ళు అని కాదు; ఎవరూ సహజంగా "చెడ్డ వాళ్ళు" కాదు. కాబట్టి, వారిపట్ల జాలి చూపించడం సరైనదే. ఎందుకంటే మనం బాధపడటం ఎలాగైతే నచ్చదో, వాళ్ళకు కూడా అలా నచ్చదు.

కరుణ ధ్యానం

కరుణను పెంపొందించడానికి ఇచ్చే శిక్షణలో దాని తీవ్రత దశల వారీగా పెరుగుతూ వస్తుంది. ముందుగా మనకు నచ్చిన వారి బాధల గురించి, ఆ తర్వాత మాములుగా ఉండే వాళ్ళ గురించి, చివరిగా మనకు నచ్చని వాళ్ళ బాధల గురించి ఆలోచిస్తాము. చివరికి మనం ప్రతి ఒక్కరి బాధలపై, ప్రతి చోటా, సమానంగా దృష్టి పెడతాము.

ప్రతి దశలో మనకు మూడు భావాలు వస్తాయి:

  • వాళ్ళు తమ బాధల గురి౦చి, అవి వచ్చే కారణాల ను౦డి విముక్తులైతే ఎ౦త అద్భుత౦గా ఉ౦టు౦దో కదా?
  • వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి; వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలని నేను బాగా కోరుకుంటున్నాను.
  • వారిని విడిపించడానికి నేను ఏమైనా సహాయం చెయ్యగలనా?

అందుకని, కరుణలో ఇతరులకు సహాయం చెయ్యాలని, ఎదుటి వాళ్ళు తమ సమస్యల నుంచి విముక్తి పొంది వారి అసంతృప్తిని అధిగమించాలని ఆలోచన ఉంటుంది. అసలైన పద్ధతులతో సమస్యలను పరిష్కరించవచ్చు, దీని అర్ధం ఏమిటంటే ఏ పరిస్థితి నిరాశాజనకంగా ఉండదు. కాబట్టి, బౌద్ధమతంలో కరుణ అనేది ఒక చురుకైన మానసిక స్థితి, ఇది ఏ క్షణంలోనైనా, ఇతరులకు ప్రయోజనం అందించేలా పనిచెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది.

Top