రెండవ ఉత్తమమైన సత్యం: బాధ యొక్క అసలైన కారణాలు

మొదటి ఉత్తమమైన సత్యం మనందరం అనుభవించే నిజమైన బాధలను వివరిస్తుంది. ఈ బాధలన్నింటికి ముగింపు పలకాలంటే వాటి నిజమైన కారణాలను మనం సరిగ్గా గుర్తించాలి. మనం ఎదుర్కునే అసలైన సమస్య ఏమిటంటే, అసంతృప్తిని మరియు సంతృప్తి చెందని, స్వల్పకాలిక ఆనందాన్ని ఎప్పుడూ అనూహ్యంగా అనుభవించడం మరియు వాటి ఉత్పన్నతను శాశ్వతం చేసుకోకుండా ఉండడం. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, నియంత్రణలో లీ రిపీట్ అయ్యే ఈ ఒడిదుడుకులను అనుభవించే పరిమిత శరీరాలు మరియు మనస్సుల రకాలను కూడా మనం కొనసాగిస్తాము. "నీకు తల లేకపోతే తలనొప్పి వచ్చేది కాదు" అనే సామెత లాగా ఉంటుంది. వినడానికి వింతగా అనిపించినా అందులో కొంత నిజం ఉంది. తలనొప్పికి మాత్రమే కాదు, తలనొప్పి వచ్చే మిగతా తలలకు కూడా అసలైన కారణాన్ని బుద్ధుడు కనిపెట్టాడు. ప్రవర్తనా కారణం, ప్రభావం మరియు వాస్తవికత గురించి మనకు తెలియకపోవడం లేదా అజ్ఞానమే నిజమైన కారణాలు అని ఆయన చెప్పారు.

మనం ఎలా ఉనికిలో ఉన్నామనే దాని గురించి అవగాహన లేకపోవడం

ఇప్పుడు, 21 వ శతాబ్దం ప్రారంభంలో, తప్పుడు సమాచారం విచ్చలవిడిగా ఉన్న సమయంలో మనం నివసిస్తున్నాము మరియు చాలా మంది "ప్రత్యామ్నాయ సత్యాలు" అని పిలువబడే వాటిని నమ్ముతారు. వేలాది సంవత్సరాల క్రితం బుద్ధుడు అన్ని బాధలకు నిజమైన కారణమని గ్రహించిన దాని వివరణ ఉంది - దీన్నే అజ్ఞానం అని పిలుస్తారు. ఈ అజ్ఞానం ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలియకపోవడాన్ని సూచించదు. దానికి బదులుగా, ఇది మన ప్రవర్తన యొక్క దీర్ఘకాలిక ప్రభావాల గురించి అజ్ఞానం మరియు గందరగోళం మరియు దానిలో ఉండే రియాలిటీ గురించి అజ్ఞానం మరియు గందరగోళం, ముఖ్యంగా మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి చెప్తుంది. పరిస్థితిని ఇంకా దిగజార్చేది ఏమిటంటే, మన తప్పుడు అభిప్రాయాలు పూర్తిగా నిజమని మనం నమ్మడం. 

ఇంకాస్త పరిశీలిద్దాం. మనందరం "నేను, నేను, నేను" అని మాట్లాడే గొంతుని అనుభవిస్తాము. దాని ఆధారంగా, శరీరానికి, మనస్సుకు భిన్నంగా "నేను" అని పిలువబడే ఒక అస్తిత్వం ఉందని మనం నమ్ముతాము, అదే ఆ మాటలను పలుకుతుంది. ఈ అయోమయమైన నమ్మకం బలపడుతోంది, ఎందుకంటే "నాకు" ఏమి జరుగుతుందో మన మనస్సులో కంప్లైంట్ చేసినప్పుడల్లా లేదా "నేను" తర్వాత ఏమి చేయబోతున్నానని ఆలోచించినప్పుడల్లా, "నేను" అని పిలువబడే ఒక నిర్దిష్ట గొంతు ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, దాని గురించి మనం ఆందోళన చెందుతున్నాము. నిజానికి, మనం ఉనికిలో ఉన్నాము; బుద్ధుడు దాన్ని ఖండించలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే, మనం ఉన్నట్లు అనిపించే లాగా మనం ఉనికిలో లేము. ఆ విషయం మనకు తెలియదు. మనం ఈ ప్రత్యామ్నాయ రియాలిటీని బలంగా నమ్ముతున్నాము కాబట్టి మనం పూర్తిగా గందరగోళానికి గురయ్యాము. 

మనల్ని మనం సురక్షితంగా భావించడానికి అభద్రతాభావం మరియు అనవసరమైన ప్రయత్నం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు ప్రవర్తనలు 

మన గురించి ఈ అపోహలో ఏదో లోపం ఉందనడానికి స్పష్టమైన సంకేతం ఏమిటంటే, అది రియాలిటీకి అనుగుణంగా ఉందని మనం నమ్మినప్పుడు, మనం అభద్రతా భావాన్ని అనుభవిస్తాము. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించే వ్యర్థమైన ప్రయత్నంలో, మనల్ని మనం నిరూపించుకోవాలి. అలా అనిపించడం వల్ల ఇబ్బంది కలిగించే భావోద్వేగాలు వస్తాయి:

  • మనకు సురక్షితమైన అనుభూతిని కలిగించే ఏదైనా పొందాలనే కోరిక 
  • శత్రుత్వం మరియు కోపం మన నుంచి దేనినైనా దూరం చేస్తాయి, అదే విధంగా, మనం సురక్షితంగా భావిస్తాము.
  • అమాయకత్వంతో మన చుట్టూ గోడలను కట్టుకుంటా, అలా వాటి లోపల మనం సురక్షితంగా ఉంటాము.  

ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మనశ్శాంతిని మరియు సొంత నియంత్రణను కోల్పోయేలా చేస్తాయి, ఇది మన ఇంతకుముందు ధోరణులు మరియు అలవాట్ల ఆధారంగా ఏదైనా చెయ్యాలనే లేదా చెప్పాలనే ఉద్దేశాన్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు, ఒక బలవంతపు కర్మ ప్రేరణ మనల్ని నిజంగా చెయ్యడానికి లేదా చెప్పడానికి ఆకర్షిస్తుంది.  

మన భావోద్వేగ ఒడిదుడుకులకు నిజమైన కారణాలుగా అజ్ఞానం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు ప్రవర్తన

పని యొక్క కారణ మరియు ప్రభావం మన ప్రవర్తన యొక్క స్వల్పకాలిక ఫలితాలపై దృష్టి పెట్టవు, కానీ దీర్ఘకాలిక ప్రభావాలపై దృష్టి పెడతాయి. ఉదాహరణకు, మన గురించి అభద్రతా భావంతో, మన సోషల్ మీడియా పోస్ట్ లకు "లైక్ లు" కావాలనే కోరికతో, వాటిని పొందడం మన ఉనికిని ధృవీకరిస్తుంది మరియు మనకు సొంత-విలువ యొక్క భావాన్ని ఇస్తుంది. మీరు సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేస్తుంటే, మీ సొంత అనుభవాన్ని గమనించండి. మీరు ఎన్ని "లైక్ లు" వచ్చాయో చూడటానికి మీ ఫోన్ ను పద్దాక చెక్ చెయ్యాలనే బలవంతపు కోరిక రోజులో ఎంత తరచుగా వస్తుంది? మీ పోస్ట్ ను ఎవరైనా "లైక్" చేసినప్పుడు ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఆ తర్వాత మళ్ళీ మీరు మీ ఫోన్ ను మళ్లీ ఎప్పుడు చెక్ చేస్తారు? మీకు ఎప్పుడైనా కావలసినన్ని "లైక్స్" వచ్చాయా? రోజంతా మీ ఫోన్ ను తప్పనిసరిగా చెక్ చెయ్యడం ఒక సంతోషకరమైన మానసిక స్థితి లాగా ఉంటుందా? "లైక్ లను" కోరుకోవడం యొక్క దీర్ఘకాలిక ప్రభావం అసంతృప్తి యొక్క బాధ అని ఇది స్పష్టమైన ఉదాహరణ. కావలసినన్ని "లైక్స్" తో సంతృప్తి చెందే ఒక నిర్దిష్టమైన "నేను" ఉంది అనే తప్పుడు భవనపై ఇది ఆధారపడి ఉంటుంది.

ప్రేమ లాంటి మంచి ప్రేరణ ఉన్నప్పటికీ, దానితో మనం పెరిగిన పిల్లలకు సహాయం చేసినప్పటికీ, ఉపయోగకరంగా ఉండటం లేదా అవసరం అని అనిపించడం వల్ల మన గురించి మంచి అనుభూతి కలుగుతుందనే అమాయకమైన అపోహపై ఆధారపడి ఉంటే, దీని నుంచి మనం అనుభవించే ఏ ఆనందం ఎప్పటికీ సంతృప్తిగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మన భావోద్వేగ ఒడిదుడుకులకు నిజమైన కారణాలు మనం మరియు ఇతరులు ఎలా ఉన్నాము అనే దాని గురించి మనకు తెలియని అపోహలు, అలాగే అవి ప్రేరేపించే భావోద్వేగాలు మరియు బలవంతపు కోరికలు మరియు బలవంతపు ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి.

మన నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మను శాశ్వతం చెయ్యడానికి నిజమైన కారణాలుగా అజ్ఞానం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు ప్రవర్తన

అజ్ఞానం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు, కర్మ ప్రేరణలు కూడా మన ఉనికిని, ప్రస్తుతం మరియు భవిష్యత్తు జీవితాలలో, ఒక పరిమిత శరీరం మరియు మనస్సును ఆధారం చేసుకుని, దుఃఖం మరియు సంతృప్తి చెందని ఆనందం యొక్క బాధలను అనుభవించడానికి నిజమైన కారణాలు అని బుద్ధుడు బోధించాడు. ఈ భావాల పట్ల మన అయోమయ ఆలోచనా విధానాలే మన నియంత్రణలో లేని రిపీట్ అయ్యే ఉనికికి, మన "సంసారానికి" నిజమైన కారణం అని బుద్ధుడు గట్టిగా చెప్పాడు.

స్వల్పకాలిక ఆనందం ఉత్పన్నమైనప్పుడు, అది ఎప్పటికీ పోకూడదని మనకు దాహం వేస్తుంది, అయినా కానీ అది ఎప్పటికీ నిలవదు కాబట్టి అది వ్యర్థం అవుతుంది. మన౦ దుఃఖంలో ఉన్నప్పుడు, అది శాశ్వతంగా పోవాలనే కోరిక మనకు ఉ౦టు౦ది, అయితే మన బలవంతపు ప్రవర్తన ఇంకా ఎక్కువగా రావడానికి ఇది కారణమౌతు౦ది. మనకు ఏమీ అనిపించకుండా బలమైన పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా, లేదా మనమేమీ అనుభూతి చెందని లోతైన ఏకాగ్రత స్థితికి పడిపోయినా, అది అనవసరంగా తగ్గదు అనే స్థితికి మనం వెళ్తాము. 

అ౦తేకాక, "నేను" అనే ఒక నిర్దిష్టమైన అస్తిత్వ౦లా, "పేద నేను" అనే ఆలోచనలతో, "ఈ స౦తోష౦ ను౦చి దూరంగా పోవాలని నేను కోరుకు౦టున్నాను; నేను ఈ దుఃఖం నుంచి విడిపోవాలని అనుకుంటున్నాను; ఏమీ లేదనే ఫీలింగ్ రాకూడదని కోరుకుంటున్నాను" అని ఉంటుంది. "నేను" అనే మన అయోమయ భావనపై ఈ ఆలోచన మరియు మనం చనిపోతున్నప్పుడు మన భావాల పట్ల ఈ భావోద్వేగాలు వచ్చినప్పుడు, అవి ఒక కర్మ ప్రేరణను ప్రేరేపించి అయస్కాంతం లాగా, మన మనస్సులను మరియు ఈ భావోద్వేగాలను పునర్జన్మ స్థితి యొక్క శరీరం వైపు ఆకర్షిస్తాయి, అలా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇది కొంతవరకు మనుగడ ప్రవృత్తి యొక్క బౌద్ధమత వెర్షన్ లాంటిది.

బాధ యొక్క నిజమైన కారణాలలోని నాలుగు అంశాలు

మన అయోమయ ఆలోచనలే మన నిజమైన బాధలకు అసలైన కారణాలు. అసలు విషయం ఏమిటంటే, మన బాధల నియంత్రణలో లేని రిపీట్ అయ్యే వాటిని మనం కొనసాగిస్తాము. దీనికి నాలుగు కోణాలు ఉన్నాయి, ముఖ్యంగా మనం పునర్జన్మను పదే పదే తీసుకోవడం గురించి. ఈ అంశాల నుంచి, అవి సాధారణంగా బాధకు నిజమైన కారణాలు ఎలా అయ్యాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు:

  • మొదటిది, మనం ఎలా ఉనికిలో ఉన్నామో తెలియకపోవడం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు కర్మ ప్రేరణలు మన బాధలన్నింటికి నిజమైన కారణాలు. మన బాధ ఏ కారణం వల్లనో, జ్యోతిష్య స్వరూపం వల్లనో, దురదృష్టం వల్లనో రాదు.
  • రెండవది, మన బాధలు పదే పదే రిపీట్ కావడానికి అవే మూలం. ప్రతి పరిస్థితిలో, బాధ ఎప్పుడూ ఒక కారణం నుంచి మాత్రమే కాకుండా, అనేక కారణాలు మరియు పరిస్థితుల కలయిక నుంచి వస్తుంది.
  • మూడవది, అవి మన బాధలకు బలమైన అంతర్గత కారణాలు. మన బాధ బయటి మూలాల నుంచి కాదు, సర్వ శక్తిమంతుడైన దేవుని నుంచి కూడా వస్తుంది.
  • నాలుగవది, అవి మన బాధలు అసలు రావడానికి పరిస్థితులు. బాధలు ప్రాపంచిక పనుల నుంచి రావు, కానీ వాటి పట్ల మనకు ఉండే గందరగోళ వైఖరుల నుంచి వస్తాయి.

సారాంశం

మన రిపీట్ అయ్యే సమస్యలకు, బాధలకు నిజమైన కారణాలు – మనలో ఎవరూ ఇంకా నిరంతరం కోరుకోనివి –  మన గురించి తప్పు రియాలిటీ యొక్క మన స్వంత అంచనాలు, అవి కేవలం కల్పన అని మనకు తెలియకపోవడం మరియు అవి సృష్టించే ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు ప్రవర్తన అని తెలిసిన తర్వాత, ఈ ఇబ్బందికరమైన భావోద్వేగాలను మరియు బలవంతపు ప్రవర్తనను శాశ్వతంగా వదిలించుకోవడానికి కష్టపడటం అర్ధరహితం కాదా?

Top