SEE అభ్యాసం: సార్వత్రిక విలువల శిక్షణా కార్యక్రమం

సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభ్యాసం, ఎమోరీ యూనివర్శిటీ, సంక్షిప్త ఫ్రేమ్‌వర్క్

సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభ్యాసం అంటే ఏమిటి?

సామాజిక, భావోద్వేగ మరియు నైతిక (SEE) అభ్యాసం అనేది భావోద్వేగపరంగా ఆరోగ్యకరమైన మరియు నైతికంగా బాధ్యత కలిగిన వ్యక్తులు, సామాజిక గ్రూపులు మరియు విస్తృత కమ్యూనిటీలను పెంపొందించే కార్యక్రమం. ఇది ముఖ్యంగా పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థలలో ఉపయోగించడం కోసమే సృష్టించబడినప్పటికీ, ఈ కార్యక్రమం ఇతర సందర్భాల్లో కూడా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఎమోరీ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ అండ్ కంపాషన్ బేస్డ్ ఎథిక్స్’ అభివృద్ధి చేసిన ఈ శిక్షణా కార్యక్రమం నైతికతపై సమగ్ర దృష్టిని పెడుతుంది. ఇక్కడ నైతికత అనేది ఏదో ఒక నిర్దిష్ట సంస్కృతి లేదా మతంపై ఆధారపడి ఉండదు, ఇది కరుణ, సహనం మరియు క్షమాగుణం లాంటి సార్వత్రిక, ప్రాథమిక మానవ విలువలపై ఆధారపడి ఉంటుంది. శారీరక మరియు భావోద్వేగ ఆరోగ్యానికి ముఖ్యమైన తమను మరియు ఇతరులను జాగ్రత్తగా చూసుకునే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు ఈ SEE అభ్యసన ప్రాక్టీస్ లు సహాయపడతాయి. ఇందులో పరస్పర ఆధారిత అవగాహనను పెంచడం మరియు విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చెయ్యడంపై కూడా దృష్టి ఉంటుంది, ఇది ఇంకా కష్టమైన ప్రపంచంలో ప్రపంచ పౌరులుగా అందరిని సిద్ధం చెయ్యడంలో సహాయపడుతుంది.

ఈ ప్రోగ్రామ్ "సార్వత్రిక విలువలు" పై ఆధారపడి ఉంటుంది మరియు దీన్ని దేశాలు మరియు సంస్కృతుల అంతటా అంతర్జాతీయంగా ఉపయోగించవచ్చు. ఇంగిత జ్ఞానం, సాధారణ అనుభవం మరియు సైన్స్ ఆధారంగా, వివిధ వ్యక్తుల మత మరియు సాంస్కృతిక విలువల నుంచి ప్రేరణను పొంది, ప్రదర్శించిన వర్గాలు మరియు ఆచారాలను ఉపయోగించడం లేదా వాటిని స్వీకరించడం సాధ్యమవుతుంది. ఈ కలిసి ఉన్న, సమగ్ర కార్యక్రమం అన్ని వయసుల ప్రజలకు సామాజిక, భావోద్వేగ మరియు నైతిక సామర్థ్యాలను బోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. గణితం, సైన్స్, విదేశీ భాషలు లేదా మరే ఇతర అకడమిక్ సబ్జెక్టును ప్రజలకు బోధించే విధానానికి ఇది వేరుగా ఉండదు. వ్యక్తులకు మరియు సమాజానికి ఎక్కువ ఆనందం మరియు సామరస్యానికి దారితీసే విలువలు మరియు సామర్థ్యాలను పెంపొందించడానికి విద్యను విస్తరించాలి.

మూడు డైమెన్షన్లు, మూడు డొమైన్లు

SEE లెర్నింగ్ అనేది మూడు డైమెన్షన్ లను కలిగి ఉంటుంది, ఇది పెంపొందించాలనుకునే సామర్థ్యాల రకాలను కలిగి ఉంటుంది:

  • అవగాహన
  • కరుణ
  • నిమగ్నత

ఆ తర్వాత, ఈ మూడు డైమెన్షన్లు మూడు వేర్వేరు డొమైన్లకు విస్తరించాయి:

  • వ్యక్తిగత
  • సామాజిక
  • ప్రపంచ

మూడు డైమెన్షన్లు

అవగాహన - మన ఆలోచనలు, ఫీలింగ్స్ మరియు భావోద్వేగాలపై అవగాహనను పెంపొందించుకోవడం. మన అంతర్గత జీవితం, ఇతరుల ఉనికి మరియు అవసరాలు, మరియు పరస్పర ఆధారపడడాన్ని, మన జీవితాలు మరియు మనం ఉన్న ఈ ప్రపంచంలో లక్షణంగా గ్రహించడానికి ఇది మనకు సహాయపడుతుంది. దీన్ని పెంపొందించడానికి అభ్యాసం మరియు శ్రద్ధ యొక్క శిక్షణ మనకు అవసరం.

కరుణ - ఇది మనతో, ఇతరులతో, మొత్తం ఈ మానవాళితో, దయ, సహానుభూతి మరియు వారి సంతోషం మరియు బాధల పట్ల శ్రద్ధతో సంబంధం కలిగి ఉండే విధంగా తీసుకునే శిక్షణ. దీనిలో సమర్థతకు విమర్శనాత్మక ఆలోచన, తన సొంత అవసరాలు మరియు కోరికలను అర్థం చేసుకోవడం మరియు ఒకరి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఏమి కావాలో గుర్తించే సామర్థ్యం అవసరం. అప్పుడు పరిధి ఇతరుల అవసరాలను కవర్ చెయ్యడానికి మరియు చివరిగా పూర్తి మానవాళి యొక్క అన్ని అవసరాలను గుర్తించడానికి విస్తరించబడింది.

నిమగ్నత - అవగాహన మరియు కరుణలో తీసుకున్న శిక్షణ నుంచి పొందిన పద్ధతులను ఆచరణలో పెట్టడం. ఇందులో వ్యక్తిగత, సామాజిక మరియు సామూహిక మంచికి అనుకూలమైన ప్రవర్తనలు మరియు వైఖరుల గురించి తెలుసుకోవడం ఉంటుంది. దీని కోసం సొంత నియంత్రణ, సామాజిక నైపుణ్యాలు మరియు ప్రపంచ పౌరుడిగా నిమగ్నమైన చర్య అవసరం.

ఈ మూడు కోణాలను ప్రాథమిక విలువలుగా అభివృద్ధి చెయ్యడం అంటే కేవలం జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు, వ్యక్తిగత స్థాయిలో దాని ప్రామాణికతను గ్రహించడం, ఆ తర్వాత వాటిని లోతుగా అన్వయించుకోవడం. దీనిలో అనేక దశలు ఉన్నాయి:

  • ప్రారంభంలో, మనం వినడం, చదవడం మరియు అనుభవించడం, ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవడం మరియు ప్రతి విలువపై అవగాహనను పెంపొందించుకోవడం ద్వారా నేర్చుకుంటాము.
  • విమర్శనాత్మక ఆలోచనను ఉపయోగించి, మనం వివిధ విధానాలతో ఆ విలువలను పరిశోధించి వాటిని మన సొంత పరిస్థితులకు అప్లై చేసుకుంటాము, ఇది "విమర్శనాత్మక అంతర్దృష్టికి" దారితీస్తుంది. ఇది మనం వ్యక్తిగత అంతర్దృష్టిని పొందే "అ-హా" సందర్భాలను సూచిస్తుంది, అలా ఇది మన మొదటి స్థాయి జ్ఞానాన్ని మన సొంత జీవితాలతో అనుసంధానిస్తుంది.
  • పదే పదే వీటిని తెలుసుకోవడం వల్ల విలువలను వ్యక్తిత్వ బలాలు, వ్యక్తిత్వ లక్షణాలుగా మారుస్తుంది. అ విలువలు ఆకస్మికంగా మారే వరకు ఇది నిరంతర అభ్యాసం, సంభాషణ మరియు డిబేట్ నుంచి వస్తుంది.

మూడు డొమైన్లు

వ్యక్తిగత – ఇతరులు మరియు విస్తృత సమాజం యొక్క అవసరాలను తీర్చడానికి, మనం ముందుగా మన సొంత అవసరాలను మరియు అంతర్గత భావాలు పట్టించుకోవడం నేర్చుకోవాలి. భావోద్వేగ విద్యను అభివృద్ధి చెయ్యడం ద్వారా ఇది వస్తుంది, ఇక్కడ మనం భావోద్వేగాలను గుర్తించగలిగి వాటి ప్రభావాలను అర్థం చేసుకోగలుగుతాము, ఇది మనకు మరియు ఇతరులకు హాని కలిగించే ప్రవర్తన నుంచి దూరంగా ఉంచుతుంది.

సామాజిక – మనుషులుగా, మనం స్వభావ రీత్యా సామాజిక జీవులము, మరియు మనం ఇతరులతో బాగా సంబంధాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అభ్యాసం, పరస్పర సంభాషణ మరియు నిమగ్నమైన అభ్యాసం ద్వారా మనం ఈ సామాజిక లక్షణాలను పెంపొందించుకోవచ్చు.

ప్రపంచ - పెరుగుతున్న ఈ సంక్లిష్ట ప్రపంచంలో, కరుణ ఒక్కటి ఉంటేనే సరిపోదు. మనం నివసిస్తున్న పరస్పర ఆధారిత ప్రపంచ వ్యవస్థలపై లోతైన అవగాహన కూడా మనకు అవసరం. పరిస్థితులను వేరే వేరే కోణాల నుంచి ఎలా చూడాలో తెలుసుకోవడం అనేది మన సమస్యలను పరిష్కారించుకోవడానికి ఒక మంచి ప్రక్రియగా చేస్తుంది, సమస్యలను చిన్నపాటి ముక్కలుగా విభజించే ధోరణిని ఇది దూరం పెడుతుంది.

అభ్యాస విషయాలు

అభ్యాస విషయాలు అనేవి పై మూడు విలువలను అన్వేషించడానికి, అంచనా వెయ్యడానికి మరియు అంతర్గతంగా వేరు చెయ్యడానికి ఉన్న మార్గాలు. అవి మన జ్ఞానం మరియు వాటి గురించి మన అవగాహనను ఒక దృఢమైన పునాదిపై సరిగ్గా నిర్మించడానికి అనుమతిస్తాయి. ఇందులో నాలుగు విషయాలు ఉన్నాయి:

  • క్లిష్టమైన ఆలోచన - లోతైన అవగాహనకు చేరుకోవడానికి లాజికల్ రీజనింగ్, బహుళ దృక్పథాలు, సంభాషణ మరియు చర్చల ద్వారా అంశాలు మరియు అనుభవాలను అన్వేషించడం.
  • ప్రతిబింబించే ప్రాక్టీస్ లు - నైపుణ్యాలను అంతర్గతీకరించడానికి నిర్మాణాత్మక మార్గంలో వ్యక్తిగత అనుభవాల వైపు దృష్టిని మళ్లించడం.
  • శాస్త్రీయ దృక్పథాలు - మన భావోద్వేగాలు మరియు ప్రపంచం యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవడం, సంస్కృతి లేదా మతానికి సంబంధించి నిష్పక్షపాతమైన విధానాన్ని అందించడం.
  • నిమగ్నమైన అభ్యాసం - సృజనాత్మక వ్యక్తీకరణ (కళలు, సంగీతం, రచన) లేదా పర్యావరణ అభ్యాసం (ప్రపంచంతో నేరుగా నిమగ్నం కావడం) లాంటి భాగస్వామ్య అభ్యాస వ్యూహాలతో నిమగ్నం కావడం, ఇది తర్వాతి పరివర్తనను అనుమతిస్తుంది.

ఈ నాలుగు అభ్యాస విషయాలు కరుణ సూత్రంపై ఆధారపడి ఉంటాయి, ఇది మూడు కోణాలకు కేంద్రంగా ఉంటుంది. ఎప్పుడూ కరుణను బలహీనతలో తప్పుగా చూస్తారు - ఇతరులు మన ఖర్చుతో వాళ్ళు కోరుకున్నది పొందడానికి అనుమతించడం లేదా బెదిరింపు లేదా ఇతర నెగెటివ్ ప్రవర్తనలను అనుమతించడం లాంటివి. SEE లెర్నింగ్ కరుణను ఒక ధైర్యవంతమైన కరుణ రూపంగా అర్థం చేసుకుంటుంది, ఇతరుల పట్ల శ్రద్ధ మరియు పరిశీలన యొక్క వైఖరిలో ఇది గొప్ప అంతర్గత బలం నుంచి వస్తుంది.

సారాంశం

SEE లెర్నింగ్ లో మనం మన సొంత ఆలోచనలు మరియు భావాల గురించి, అలాగే ఇతరులు మరియు వారి మానసిక జీవితం గురించి మంచి అవగాహనను పొందుతాము. భావోద్వేగ పరిశుభ్రత మరియు సొంత-సంరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకుంటాము, ఇతరుల పట్ల ధైర్యవంతమైన కరుణతో ప్రజలందరికీ విలువనిచ్చే సాధారణ మానవత్వాన్ని గుర్తిస్తాము. చివరిగా, ప్రయోజనకరమైన ప్రవర్తనను వినాశకరమైన ప్రవర్తన నుంచి వేరు చెయ్యగలగడం ద్వారా, మనం ఇతరులతో ఉత్పాదకమైన మరియు శ్రద్ధతో కూడిన సంబంధాలను కలిగి ఉంటాము, ఇది ఈ సామాజిక ప్రయోజనం కోసం ప్రపంచ స్థాయిలో నిమగ్నం కావడానికి మనకు సహాయపడుతుంది. అందువల్ల, SEE లెర్నింగ్ అనేది ఒక సమగ్ర కార్యక్రమం, ఇది మనల్ని విలువలు మరియు నైపుణ్యాల వైపు తీసుకెళ్తుంది, ఇది ఆత్మగౌరవం లాంటి ఒక ఆరోగ్యకరమైన భావాన్ని పెంపొందించడానికి, మన చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి మరియు బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా మారడానికి మనకు సహాయపడుతుంది.


మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే, SEE లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ యొక్క పూర్తి వెర్షన్ ను చదవండి మరియు సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ మరియు కంపాషన్-బేస్డ్ ఎథిక్స్ యొక్క మిగతా ప్రోగ్రామ్ ల గురించి తెలుసుకోండి.

Top