ఆశ్రయం: జీవితంలో ఒక సురక్షితమైన మరియు అర్థవంతమైన మార్గం

25:53
ఆశ్రయం పొందడం అనేది బౌద్ధమత బోధనలకు మరియు ఆచారాలన్నిటికి ఒక పునాది. దీన్ని "బౌద్ధమత మార్గానికి ఒక ప్రవేశ ద్వారం" అని పిలుస్తారు. ఆశ్రయం పొందడం అంటే మనపై మనం పని చేసుకోవడం అని అర్థం, ఇది మన జీవితాలకు సురక్షితమైన మరియు అర్థవంతమైన మార్గాన్ని ఇచ్చే ఒక చురుకైన ప్రాసెస్. బుద్ధుడు నేర్పించిన పద్ధతులను అనుసరించి మనం గందరగోళం, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బలవంతపు ప్రవర్తన నుంచి బయటపడి అన్ని మంచి లక్షణాలను పెంపొందించుకుంటాము. బౌద్దులందరూ ఇదే చేశారు, మంచి జ్ఞానోదయం పొందిన గురువులు కూడా ఇదే చేశారు, వారి అడుగుజాడల్లో నడుస్తూ మనం ఇలాగే చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము.

మన జీవితాల్లో బౌద్ధమత అభ్యాసం గురించి ఉండే గందరగోళాన్ని తొలగించడం

మన జీవితంలో ఆశ్రయం యొక్క సంబంధం గురించి మాట్లాడమని నన్ను అడిగారు. ఇది పదవ శతాబ్దం చివరలో టిబెట్ కు వెళ్ళిన గొప్ప భారతీయ గురువు అయిన అతిషా గారి ఉదాహరణను గుర్తుకు తెచ్చింది. భారతదేశం నుంచి వెళ్లిన బౌద్ధమతం టిబెట్ లో క్షీణించిన తర్వాత దానిని పునరుద్ధరించడానికి సహాయపడిన గొప్ప గురువులలో ఆయన ఒకడు. ఆ సమయంలో టిబెట్ లో పరిస్థితి ఏమిటంటే, ముఖ్యంగా తంత్రం మరియు మరింత అధునాతన బోధనల గురించి చాలా అపార్థాలు ఉన్నాయి. నిజానికి అక్కడ అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరు. నిజానికి, బోధనలను స్పష్టంగా వివరించే ఉపాధ్యాయులు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. అనువదించబడిన గ్రంథాలు చాలానే ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువ మంది చదవలేకపోయారు మరియు కాపీలు కూడా ఎక్కువ లేవు. వారు అవి చదువగలిగినప్పటికీ, వాటిని అర్ధం చేసుకోవడానికి చాలా కష్టం అయ్యేది.

ఈ పరిస్థితికి సహాయం చెయ్యడానికి, పశ్చిమ టిబెట్ లోని ఒక రాజు కొంతమంది విద్యార్థులను భారతదేశానికి పంపాడు. వాళ్లతో పాటు ఒక గొప్ప బౌద్ధమత గురువును టిబెట్ కు రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళు కాలినడకన ప్రయాణించి, భాషలు నేర్చుకుని, వాతావరణాన్ని మేనేజ్ చేసుకోవాల్సి వచ్చేది. వారిలో చాలా మంది వస్తున్నప్పుడు లేదా భారతదేశంలో ఉన్నప్పుడే మరణించారు. ఏదేమైనా, వారు భారతదేశానికి చెందిన ఈ గొప్ప గురువు అయిన అతిషాను టిబెట్ కు తీసుకురాగలిగారు. ఆయన అక్కడ చాలా సంవత్సరాలు ప్రధానంగా ఆశ్రయం మరియు కర్మ గురించి భోదించారు. నిజానికి ఆయనను "ఆశ్రయం మరియు కర్మ లామా" అని పిలిచేవారు. అదే టిబెటన్లు ఆయనకు పెట్టిన పేరు.

అతిషా ఉదాహరణ ఈ రోజుల్లో చాలా సముచితమైనది. ఈ రోజుల్లో కూడా, బౌద్ధమతం మరియు దాని అభ్యాసం గురించి చాలా గందరగోళం ఉంది. ఇంకా, తంత్రం మరియు ఇతర అధునాతన బోధనల గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. ప్రజలు ప్రాథమిక బౌద్ధమత బోధనల యొక్క జ్ఞానం లేకుండా వీటిని నేర్చుకోవడానికి వెళ్తున్నారు. బౌద్ధమతాన్ని ఆచరించడం అంటే ఏదో ఒక మాయా పని చెయ్యడం అని వాళ్ళు భావిస్తారు. ఆశ్రయం యొక్క ఔచిత్యాన్ని మరియు ప్రాముఖ్యతను మరియు అది మన జీవితంలో తీసుకొచ్చిన తేడాను తక్కువగా చూడటంతో, వారికి అసలు విషయం అర్ధం అవ్వలేదు.

జీవితంలో మన పరిస్థితి ఎలా ఉన్నా, బౌద్ధమత అభ్యాసం మన కోసం మనం పని చేసుకోవడానికి మరియు ఒక మంచి వ్యక్తిగా మారడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక హాబీ లేదా ఆట లాగా, ప్రతిరోజూ ఒక అరగంట లేదా వారానికి ఒకసారి మనం బాగా అలసిపోయినప్పుడు ఒక చిన్న సెషన్ లాగా చేసేది కాదు. దీనికి బదులుగా, ఇది మనం ఎప్పుడూ చెయ్యడానికి ప్రయత్నించే ఒక ఆచరణాత్మక విషయం - ఎప్పుడూ మనపై మనం పని చేసుకోవడానికి ఉండేలాగా. దీని అర్థం మన లోపాలను మరియు మన మంచి లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత చెడు శక్తిని బలహీనపరిచే మంచి పద్ధతులను బలోపేతం చేసుకోవడానికి. చివరిగా అన్ని లోపాలను వదిలించుకొని అన్ని మంచి గుణాలను సంపూర్ణంగా పొందడమే ఇక్కడి లక్ష్యం. ఇది కేవలం మన సొంత ప్రయోజనాల కోసం కాదు, వాటి నుంచి మనం మన జీవితంలో సంతోషాన్ని పొందుతాము. ఇది ఇతరులకు బాగా సహాయం చెయ్యడానికి, మరియు ఇతరుల ప్రయోజనం అందించడం కోసం ఉంటుంది. బౌద్ధమత ఆచారం అంటే ఇదే. ఈ లక్ష్యాలను సాధించడంలో ఉండే పద్ధతులే దీన్ని స్పష్టమైన బౌద్ధమతంగా చూపిస్తాయి. ఆశ్రయం అంటే మనం ఆ పద్ధతులను ఎడాప్ట్ చేసుకుని వాటిని మన జీవితంలో అవలంబించుకోవడం.

ఆశ్రయం పాసివ్ గా ఉండదు

బుద్ధుడు, ధర్మం, సంగం అనే మూడు విలువైన రత్నాలలో ఆశ్రయం బౌద్ధ బోధనలన్నింటికీ కేంద్ర బిందువు. నిజానికి, ఆశ్రయం పొందడం అనేది బౌద్దుడా కాదా అనే విభజన రేఖగా గుర్తించబడుతుంది. వివరంగా చెప్పాలంటే, ధర్మం మన కోసం పని చేసే పద్ధతులను మరియు మనమందరం సాధించగల లక్ష్యాన్ని సూచిస్తుంది; ఈ పద్ధతులను బోధించి, ఆ లక్ష్యాన్ని సాధించిన వారే బౌద్దులు; సంఘం అనేది దానిలో కొంత భాగాన్ని సాధించిన వారిని సూచిస్తుంది. "ధర్మం" అనే పదానికి "నివారణ చర్యలు" అని అర్థం వస్తుంది - మనకు మరియు ఇతరులకు సమస్యలు రాకుండా నిరోధించడానికి మనం తీసుకునే చర్యలు. అవి మనల్ని మనం రక్షించుకోవడానికి తీసుకునే చర్యలు.

అసలు సంస్కృత పదానికి సాధారణంగా "ఆశ్రయం" అని అనువదించబడినప్పటికీ, శరణ, అంటే "రక్షణ" అని అర్థం. దీనిని "ఆశ్రయం" కోసం కూడా ఉపయోగించవచ్చు, అయితే మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దీని అర్థం ధర్మం యొక్క అర్థానికి సరిపోతుంది. మనకు రక్షణ కల్పించే ఏదో ఒక బయటి దానికి మనల్ని మనం సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. బౌద్ధమత సందర్భంలో, "ఆశ్రయం పొందడం" అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది; మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి.

నా ఉపాధ్యాయులు ఎప్పుడూ ఉపయోగి౦చే ఈ క్రింది ఉదాహరణను పరిశీలి౦చ౦డి. వర్షం పడుతోందని అనుకోండి, దగ్గరలో ఒక గుహ ఉంది. "నేను ఈ గుహలో ఆశ్రయం పొందుతాను; నేను ఆశ్రయం కోసం ఈ గుహలోకి వెళ్తాను" అని చెప్పి, బయట వర్షంలో నిలబడి ఈ వాక్యాన్ని రిపీట్ చేస్తూ ఉంటే, దీని వల్ల ఏ ఉపయోగం ఉండదు. మనం నిజంగా ఆ గుహలోకి వెళ్లాలి. అదే విధంగా "నేను బుద్ధుడు, ధర్మం, సంఘంలో ఆశ్రయం పొంది వారి వద్దకు వెళ్తాను" అని చెప్పి దాన్ని పాటించకపోతే, అది కూడా మనకు ఏమీ సహాయపడదు. సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు కావలసిన పనులను మనమే చెయ్యాలి. అందుకే నేను "సురక్షిత దిశ" మరియు "మన జీవితాలలో సురక్షితమైన దిశను పెట్టుకోవడం" అనే వాటిని ఉపయోగిస్తాను.

ఆ గుహ విషయం తీసుకుంటే, మనం కేవలం ఆ గుహలోకి వెళ్లి అక్కడే నిలబడితే సరిపోదు, కేవలం లోపలికి వెళ్లడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటి నుంచి మనల్ని ఏదో వచ్చి కాపాడుతుంది అని అనుకోకూడదు. బుద్ధుడు, ధర్మం మరియు సంఘం సూచించే సందేశాన్ని చేరుకోవడానికి మనం ఎప్పుడూ కష్టపడుతూ ఉండాలి. బుద్ధుడు, ధర్మం, సంఘం యొక్క ఆశ్రయంలోకి వస్తే సరిపోతుందని భావించినప్పుడు, దీనిని వ్యక్తిగత రక్షకుడు అనే క్రైస్తవ ఆలోచనతో కలపడం మరియు బుద్ధుడు ఏదో విధంగా వచ్చి మనల్ని రక్షించబోతున్నాడని అనుకోవడం చాలా సులభం. ఆ విషయంలో బుద్ధుడు దేవుడితో సమానం, సంఘం సాదువులతో సమానం. అన్నింటికీ మించి, చాలా పాశ్చాత్య సమాజాలు క్రైస్తవ ప్రభావాల యొక్క విషయాలను కలిగి ఉన్నాయి. అలాంటి ఆలోచనతో ఏదో ఒక అతీత శక్తి మనల్ని అద్భుతంగా కాపాడాలని ప్రార్థిస్తాం. బౌద్ధమత పదజాలాన్ని ఉపయోగించాలంటే, అది మన అన్ని సమస్యలు మరియు బాధల నుంచి మనల్ని అద్భుతంగా కాపాడేది అవుతుంది.

అదే నిజమైతే మనం చేయాల్సిందల్లా టిబెటన్ భాషలో బౌద్ధమత పేరును సంపాదించడం, ఒక ఎరుపు రంగు తీగను ధరించడం, మంత్రంలోని కొన్ని పదాలను చదవడం, గట్టిగా ప్రార్థించడం. అప్పుడు మనం ఏదో విధంగా రక్షించబడతాం. ముఖ్యంగా మనం టిబెటన్ భాషలో ప్రార్థనలు, అభ్యాసాలను చదువుతున్నట్లయితే, వాటిలో మనకు ఒక పదం అర్థం కాకపోతే, దానికి మరింత మార్మిక శక్తి ఉందని మనం అనుకోవచ్చు. డ్జోంగ్సర్ ఖైంట్సే రింపోచే అనే గొప్ప లామా ఇటీవల బెర్లిన్ కు వచ్చారు, నేను అక్కడే ఉంటున్నాను. ఆయన చెప్పింది చాలా లోతైన విషయం. టిబెటన్లు తమ ఆచారాలన్నింటినీ జర్మన్ భాషలో, టిబెటన్ అక్షరాలతో అనువదించాల్సి వస్తే, వారు చెప్పే దాని గురించి వారికి ఏమాత్రం తెలియదని, వాస్తవానికి ఎంత మంది టిబెటన్లు బౌద్ధమతాన్ని ఆచరిస్తారో తనకు ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పారు. అవును, ఆ మాట విని అక్కడ అందరూ నవ్వారు. కానీ మనం దాని గురించి ఆలోచిస్తే, అది నిజంగా చాలా లోతైన విషయం, కదా? మన సమస్యలన్నింటినీ ఏదో ఒక మాయా, మార్మిక పరిష్కారాన్ని అందించే విషయంలో ఆశ్రయం పొందాల్సి వచ్చే ఏ ధోరణినైనా అధిగమించడం చాలా ముఖ్యం, ఒక రకంగా చెప్పాలంటే మనం చేయాల్సిందల్లా ఒక గొప్ప శక్తికి లొంగిపోవడమే.

ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే: "నా జీవితంతో నేను ఏమి చేస్తున్నాను?" "నా జీవితం ఎక్కడికి వెళ్తుంది?" అని ఆలోచించడం. మనలో చాలా మంది మన జీవితం ఎక్కడికీ పోదని తెలుసుకుని ఉండవచ్చు; కేవలం ఇది ఒక సర్కిల్ లో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. పునర్జన్మ విషయంలో మనం లోతైన సర్కిల్ గురించి చెప్పనవసరం లేదు, కానీ మన జీవితం ఎక్కడికి వెళ్ళనట్లు అనిపిస్తుంది, మరియు అర్ధం లేనట్లుగా ఉంటుంది. అసలు మనం ఎందుకు బ్రతికి ఉన్నాం? అలా అనిపించడం చాలా బాధాకర స్థితి, కదా? ఇది చాలా సంతోషకరమైన స్థితి కాదు. కాబట్టి, మన జీవితానికి ఏదో ఒక అర్థవంతమైన దిశ, ఏదో ఒక లక్ష్యం లాంటిది ఉండాలి. అది మన జీవితంలో మనమే పెట్టుకోవాల్సిన విషయం. ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్. మన జీవితంలో ఏదో ఒక అర్థవంతమైన ఉద్దేశ్యం లేదా లక్ష్యం ఉంటే, మనం ఏమి చేస్తున్నామో మనకు తెలుస్తుంది. ఇది మనకు కొంచెం సురక్షితంగా అనిపిస్తుంది, కదా?

జీవితంలో ఒక అర్థవంతమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం

మన జీవితంలో మనం ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోగలం? మాములుగా, మనం ప్రస్తుతం ఉన్న అసంతృప్తికరమైన పరిస్థితిని బట్టి ఆ లక్ష్యాన్ని పెట్టుకుని దాని నుంచి బయటపడటానికి పని చేస్తాము. అత్యంత ప్రాథమిక స్థాయిలో, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మరియు ఎవరూ దుఃఖంలో ఉండాలని కోరుకోరు. ఇది బౌద్ధమతంలో ఇవ్వబడిన ఒక సూత్రం, మరియు దానిలో కొంత జీవసంబంధమైన నిజం ఉంటుంది. మనం బాధలను తొలగించుకోవాలని అనుకుంటాము, బాధ పడకుండా ఉండాలని కోరుకుంటాం. ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటాం. కీటకాలు, పురుగులు కూడా అదే కోరుకుంటాయి కదా? అదే మన లక్ష్యం.

మనం ఎంత బాధను, అసంతృప్తిని చూస్తున్నామన్నదే ఇక్కడి ప్రశ్న. మనం లక్ష్యంగా పెట్టుకున్నది ఆ సమస్యనే కాకుండా, మనకున్న మిగతా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తోందా? ఉదాహరణకు, మన సమస్యలు పేదరికం మరియు ఆర్థిక ఇబ్బందులు కావొచ్చు. కాబట్టి మంచి ఉద్యోగం తెచ్చుకుని బాగా డబ్బులు సంపాదించడం మన లక్ష్యం. మంచి ఉద్యోగం కాకపోతే, ఒక పెద్ద నేరస్థుడుగా మారి త్వరగా ధనవంతుడు అవ్వొచ్చు. ఏది ఏమైనా ఎక్కువ డబ్బులను సంపాదించడం ముఖ్య . కానీ చాలా డబ్బులు ఉన్న వ్యక్తులను చూస్తే, వారితో నిజాయితీగా మాట్లాడితే, ఈ వ్యక్తులు అస్సలు సంతోషంగా లేరని మనకు తెలుస్తుంది. వారి దగ్గర ఎప్పుడూ సరిపడినంత డబ్బులు ఉండవు. వారికి ఎన్ని లక్షలున్నా ఇంకా కావాలని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడూ సంతృప్తి చెందరు.

ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఒక బిలియన్ డాలర్లు ఉన్నాయని అనుకుందాం, కానీ ప్రపంచంలోని ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఇప్పుడు ఆ డబ్బులు అర బిలియన్ డాలర్లుగా అయ్యాయి. వాళ్ళు ఇకపై ఎటువంటి విరాళాలు ఇవ్వరు లేదా ఏ విధమైన దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అర బిలియన్ డబ్బులు మాత్రమే ఉన్నాయి మరియు వాళ్ళు ఒక అభద్రతా భావానికి లోనవుతారు. వాళ్ళు ఆ డబ్బును ఎవరితోనైనా షేర్ చేసుకునే ముందు దానిని పొదుపు చేసి, ఒక బిలియన్ వరకు కూడబెట్టాలని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడూ స్టాక్ మార్కెట్ రిపోర్టులను చూస్తూ ప్రతిరోజూ తమ దగ్గర ఉన్న డబ్బులో కొంత భాగాన్ని కోల్పోతామని ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రజలు తమ ఇంటి నుంచి వస్తువులను దొంగిలించడానికి లేదా వారి పిల్లలను కిడ్నాప్ చేస్తారనే భయంతో వారు ప్రైవేట్ గార్డులను మరియు ఇతర భద్రతా పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. లాటిన్ అమెరికాలోని సంపన్నులకు ఇది సాధారణమే. అంతే కాకుండా, ప్రజలు తమ డబ్బు కోసం తప్పితే వాళ్లతో స్నేహంగా ఉండరు అని అనుకుంటారు.  తమతో ఎవరు మంచిగా ఉన్నట్టు అనిపిస్తే అది వాళ్ళ డబ్బు కోసమే అని ఎప్పుడూ అనుమానిస్తుంటారు. సహజంగానే, వాళ్ళ పేదరికంలో ఏ సమస్యలు లేనప్పటికీ, చాలా డబ్బులు వచ్చాక ఈ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి.

ప్రాపంచిక లక్ష్యాలకు అస్థిరమైన ప్రాతిపదిక ఉంటుంది

బౌద్ధమతంలో చాలా డబ్బుతో పాటు అనేక ఇతర "ప్రాపంచిక లక్ష్యాలు" పేర్కొనబడ్డాయి. అయితే "ప్రాపంచిక" అనే పదానికి ఇంగ్లీష్ లో ఒక అర్థం ఉంది మరియు అది ఒక రకమైన తీర్పుగా అనిపిస్తుంది. అది అసలు విషయం కాదు. "ప్రాపంచిక" అని అనువదించబడిన టిబెటన్ పదం యొక్క రెండు అక్షరాలు - జిగ్-టెన్ - అసలైన అర్థాన్ని చెప్తాయని నా గురువు సెర్కాంగ్ రింపోచే గారు వివరించారు. అవి ఒక ఆధారం (టెన్) ఉన్నది విడిపోయే (జిగ్) దాన్ని సూచిస్తాయి. సరిగ్గా లేని ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే, అది మనకు శాశ్వత ఆనందాన్ని తెచ్చిపెట్టదు. ఇది ఇంకా సమస్యలను తెచ్చిపెడుతుంది, ఎందుకంటే దీనికి దృఢమైన పునాది ఉండదు.

ఉదాహరణకు, ఒక అద్భుతమైన కుటుంబాన్ని కలిగి ఉండటం, చాలా మంది పిల్లలను పెంచడం, వారు మన ముసలి వయసులో మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారని, మరియు మనం చాలా సంతోషంగా మరియు సురక్షితంగా ఉంటామని భావించడం మన జీవితంలో లక్ష్యం అనుకుందాం. అవును, ఇది ఎప్పుడూ అంత బాగా పనిచెయ్యదు, కదా? ఫేమస్ అవ్వడానికి ప్రయత్నించడం ఇంకొక ఉదాహరణ. మనం ఎంత ఫేమస్ అవుతామో; అంత ఎక్కువ మంది మనల్ని ఇబ్బంది పెట్టి మన సమయాన్ని వృధా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక ముసుగు లేకుండా బయటకు వెళ్లలేని సూపర్ స్టార్ లను మనం చూస్తున్నాం, ఎందుకంటే ప్రజలు వారిని చుట్టుముట్టి వారి దుస్తులను చింపెయ్యాలని అనుకుంటారు. నిజానికి సూపర్ స్టార్ కావడం చాలా నరకం.

మనం మన జీవితాలను సీరియస్ గా పరిశీలిస్తే, కేవలం ఒక రకమైన సౌకర్యవంతమైన భౌతిక పరిస్థితిని కలిగి ఉండటం లేదా మన చుట్టూ ఉన్నవారితో భావోద్వేగపరంగా మంచిగా ఉండటం మన జీవితంలో అన్ని సమస్యలను అధిగమించడానికి అంతగా సహాయపడదు. ఎందుకంటే మనలో ఇంకా కోపం, మమకారం, దురాశ, అసూయ, అహంకారం, అమాయకత్వం ఇలా అన్నీ ఉన్నప్పటికీ, "ప్రాపంచిక" స్థాయిలో మనం ఎంత విజయం సాధించినా మనకు ఇంకా సమస్యలు ఉంటాయి.

ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు

బౌద్ధమతం భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది మరియు "ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు" ఉన్నప్పుడు భవిష్యత్తులో మనకు వచ్చే అన్ని బాధలు మరియు భయంకరమైన విషయాలను చర్చిస్తుంది మరియు వాటి ఆధారంగా మనం మొండిగా వ్యవహరిస్తాము మరియు నెగెటివ్ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాము. బౌద్ధమత ప్రదర్శన భయంకరమైనది మరియు మనకు ఏది మంచిదో తెలిస్తే దీన్ని నివారించాలి, ఎందుకంటే నెగెటివ్ సామర్థ్యం సమస్యలను మరియు అసంతృప్తిని తెచ్చిపెడుతుంది.

కానీ, చాలా మంది పాశ్చాత్యులు భవిష్యత్తు జీవితాలను నమ్మరు లేదా వాటిపై నమ్మకం పెట్టుకోరు, మనం ఈ విషయాన్ని ఈ జన్మ గురించే ఆలోచించవచ్చు. ఇప్పుడు మన స్వంత జీవితాలనే చూస్తే, లోతుగా పరిశోధిస్తే, మన భావోద్వేగ సమస్యలకు నిజమైన మూలాలు మన లోపలే ఉన్నాయని తెలుస్తుంది. బయట ఉండేవి కేవలం ప్రేరేపించే పరిస్థితులు మాత్రమే. నిజానికి మనలో ఉండే ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు - కోపం, మమకారం, దురాశ మొదలైనవి మన మనశ్శాంతి, మరియు ఆనందాన్ని పోగొడుతున్నాయి. అవే మనలో ఉన్న మంచి గుణాలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయి. మనం ఎవరికైనా సహాయం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు, అది ఒక మంచి లక్షణం. కానీ ఆ సమయంలో మనం వారిపై కోప్పడతాము. మనం వారికి మంచి సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము, కాని వాళ్ళు దాన్ని తీసుకోరు లేదా మనతో వాదిస్తారు, అప్పుడు మనం సహనాన్ని కోల్పోతాము. ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు నిజంగా ఎవరికీ సహాయం చేయనివ్వకుండా చేస్తాయి.

మన పిల్లలలో మనం మన సహనాన్ని కోల్పోతున్నప్పుడు వారికి ఏది మంచిదో మనకు తెలిసి వాళ్ళు మనం చెప్పినట్లు చెయ్యడం లేదని భావించినప్పుడు వారిపై కోపం తెచ్చుకుంటాము. ఇది మన పిల్లలతో ఒక కష్టమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది, కదా? మనం దాని గురించి ఏదొకటి చెయ్యకపోతే, అది ఇంకా అధ్వాన్నంగా తయారవుతుందని గ్రహించాలి. మనకు అంత శక్తి లేకపోవడం వల్ల మనం పెద్దయ్యాక కొంచెం మృదువుగా మారవచ్చు, కానీ మన కోపం మరియు ఇలాంటి విషయాలు వాటికవే పోతాయని దీని అర్థం కాదు. అవి పోవు.

ఈ అవకాశాలకు సంబంధించి మనం అభివృద్ధి చేయవలసిన దానికి బౌద్ధమతంలో ఉపయోగించే పదం "భయం". కానీ "భయం" అనేది మన భాషలలో చాలా కష్టమైన పదం. దానికి మంచి పేరు లేదు. కొన్నిసార్లు నేను "డ్రెడ్" అనే పదాన్ని ఉపయోగిస్తాను, కానీ దీనిని ఇతర భాషల్లోకి అనువదించడం సులభం కాదు. “డ్రెడ్" అంటే "ఇది జరగాలని నేను అస్సలు అనుకోవడం లేదు" అనే అర్థంతో ఉంటుంది. ఉదాహరణకు, మనం పనిలో నిజంగా ఒక బోరింగ్ మీటింగ్ కు వెళ్లాలి. మీటింగ్ అంటే మనకు భయం లేదు, కానీ దానికి వెళ్లడానికి ఇష్టపడం. మనకు నిజంగా అక్కడికి వెళ్లాలని ఉండదు.

కానీ, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, భయంకరమైన భవిష్యత్తు పునర్జన్మ భయం గురించి మాట్లాడుతున్నామా, లేదా దయనీయమైన వృద్ధాప్యం లేదా ఇంకా దేని గురించి అయినా భయపడుతున్నామా అనే రెండు రకాల భయాలను మనం చూడాలి. భయంతో బయటపడే మార్గం మనకు ఏదీ కనిపించదు, అప్పుడు మనం నిస్సహాయంగా ఫీలవుతాం. ఇది మనల్ని చాలా దిగ్బ్రాంతికి గురిచేస్తుంది, కదా? ఇది ఒక అనారోగ్యకరమైన భయం అని నేను అనుకుంటున్నాను, అయినా కానీ ఎప్పుడూ మనం దాన్నే అనుభవిస్తాము. కానీ ఆశ్రయం సందర్భంలో చర్చించబడిన భయం వేరే రుచిని కలిగి ఉంటుంది ఎందుకంటే సమస్యలను నివారించడానికి ఒక మార్గం ఉందని మనం తెలుసుకుంటాము. అందువల్ల, ఇది నిరాశాజనకమైనది కాదు, మరియు మనం నిస్సహాయంగా ఉండము. కానీ, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మన భయానక పరిస్థితి నుంచి మనల్ని రక్షించే ఏదో ఒక అతీత శక్తి లేదా జీవి ఉంటుందని అనుకోకూడదు. మనం చేయాల్సిందల్లా ప్రార్థించి మన భయం నుంచి విముక్తి పొంది రక్షించబడటమే.

ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం రక్షించుకోవచ్చు. మన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను పోగొట్టడానికి సహాయపడేది ఏది? అన్నీ సాధ్యపడేలా చేసేది ఏది? ఈ కలవరపరిచే భావోద్వేగాలన్నీ సమస్యలను కలిగిస్తాయి - మన కోపం, దురాశ, మమకారం మొదలైనవి. – ఇవన్నీ వాస్తవికత యొక్క గందరగోళం నుంచి వస్తాయి. ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలన్నీ నిజానికి మనస్సు యొక్క సహజ లక్షణం కాదు. అవి మళ్ళీ రాకుండా శాశ్వతంగా తొలగించవచ్చు. వాటిని "నిజంగా ఆపవచ్చు" అని ధర్మం సూచిస్తుంది.

మనస్సు లేదా మానసిక పనులు

బౌద్ధమతంలో మనం మనస్సు గురించి మాట్లాడేటప్పుడు, దాన్లోకి వివరంగా వెళ్ళకుండా, మనం మానసిక పనుల గురించి మాట్లాడుతున్నాము. ఇది మనం నిద్రపోతున్నప్పుడు జరిగే వ్యక్తిగత, క్షణ క్షణపు మానసిక చర్య. మనస్సు అనేది ఆ మానసిక పనుల యొక్క ఆత్మాశ్రయ అనుభవ కోణాన్ని సూచిస్తుంది, మెదడు శాస్త్రం దాని శారీరక ఆధారాన్ని వివరిస్తుంది. ఏదేమైనా, ఆ మానసిక పనుల యొక్క ప్రాథమిక స్వభావం గందరగోళం లేదా కోపం ఈ విషయాలలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రాథమికంగా, ప్రతి క్షణంలో ఏమి జరుగుతుందో, వర్ణించడానికి అది మన మానసిక హోలోగ్రామ్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు, భౌతిక ఆలోచన నుంచి, ఫోటాన్లు కళ్లలోకి వస్తాయి మరియు న్యూరోట్రాన్స్మిటర్ల ద్వారా మెదడుకు వెళ్ళే ఒక రకమైన విద్యుత్ ప్రేరణగా మారతాయి. మెదడు ఏదో విధంగా దాని నుంచి అంతర్గత హోలోగ్రామ్ ను తయారు చేస్తుంది. దీన్నే "చూడటం" అని అంటారు. కదా? నిజానికి, ఇది సాలెపురుగు కంటి లేదా ఈగ కంటి కణాలకు భిన్నంగా మానవ కంటి కణాల ద్వారా వస్తే వేరేలా ఉంటుంది. అదే విధంగా, మనం "ధ్వని తరంగాలు" అని పిలువబడే ప్రకంపనలతో కూడిన ఇలాంటి ప్రక్రియ ద్వారా మనం వినికిడిని అనుభవిస్తాము. మానసిక హోలోగ్రామ్ లు ఏదైనా అర్ధాన్ని కలిగి ఉండవచ్చు లేదా కేవలం ఆలోచనతో ఉండవచ్చు.

చూడటంలో, ఈ ప్రాసెస్  ఫోటాన్లు కెమెరాలోకి వచ్చి కొన్ని విద్యుత్ ప్రేరణలుగా అనువదించబడి, ఆ తర్వాత చిత్రాన్ని తయారు చేయడంలా ఉంటుంది. ఇది అలా కాదు, ఎందుకంటే ఏ మానసిక హోలోగ్రామ్ ఉత్పన్నం అయినా అది ఒక రకమైన "అభిజ్ఞా ప్రమేయాన్ని" కలిగి ఉంటుంది. మీరు స్పృహలో ఉన్నా లేదా అపస్మారక స్థితిలో ఉన్నా, దేని గురించి అయినా అవగాహన ఉన్నా లేకపోయినా ఇది ఒక రకమైన అభిజ్ఞా లక్షణం.

మెంటల్ యాక్టివిటీ కూడా కంప్యూటర్ లో ఉన్నంతగా ఉండదు. మనం ఈ చిన్న కీలను నొక్కుతాము మరియు కొంత విద్యుత్ ప్రేరణ ఆ యంత్రంలోకి వెళుతుంది, ఆ యంత్రం ఏదో విధంగా ఈ ఇన్ పుట్ న స్క్రీన్ పై లేదా స్పీకర్ పై చూపిస్తుంది. కృత్రిమ మేధస్సుతో అది సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ కు ఒక రకంగా కొంత అభిజ్ఞా అవగాహన ఉందని చెప్పవచ్చు. కానీ కంప్యూటర్ అనేది ఒక జీవితో సమానం కాదు. కంప్యూటర్ నుంచి మనల్ని వేరు చేసేది మన మానసిక పనులతో సంబంధం ఉన్న కొంత స్థాయి ఆనందం లేదా అసంతృప్తిని అనుభవించడం. కంప్యూటర్ అలా చెయ్యలేదు. కంప్యూటర్ కి ఏదీ సంతోషంగా లేదా అసంతృప్తిగా అనిపించదు. "ఓ డియర్, నాకు అంతర్గత దోషం వచ్చింది, నేను రీబూట్ చేసినప్పుడు, నేను పనిచేస్తున్న ఫైల్ ను డిలీట్ చేసాను" అని ఇది అనుకుని దాని గురించి అసంతృప్తి చెందదు. ఇది అలా ఉండదు, కదా? మరోవైపు, అలాంటిది జరిగినప్పుడు మనం చాలా బాధపడతాము.

ఈ మానసిక పనులు మన జీవితంలో ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. ఒక రకమైన మానసిక హాలోగ్రామ్, దానితో ఒక రకమైన మానసిక ప్రమేయం, మరియు కొంత ఆనందం లేదా దుఃఖం యొక్క భావన ఏర్పడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా, హోలోగ్రామ్ చీకటిగా ఉంటుందేమో అని ఆ ప్రమేయం తెలియదు. కానీ ఇంకా కొంచెం అవగాహన ఉంటుంది, లేకపోతే మనం అలారాన్ని వినలేము. ఇది పూర్తిగా ఆగిపోయి ఉండదు. మనం కలలు కననప్పుడు ఏదో ఒక రకమైన అనుభూతి, భావన, సంతోషం లేదా అసంతృప్తి ఉంటుంది. మనకు ఒక కల వస్తే, కోపం, దురాశ ఈ విషయాలతో పాటు ఏదో ఒక సంతోషం లేదా అసంతృప్తి భావన ఉంటుంది. కానీ ఎప్పుడూ జరుగుతున్న ఈ మొత్తం ప్రక్రియలో ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాల అవసరం ఉండదు.

మన మానసిక పనుల యొక్క ప్రాథమిక స్వచ్ఛతను బాగా విశ్వసించడానికి మనం చాలా కష్టమైన ఆలోచనలను దాటవచ్చు. అలా చెయ్యడానికి ఇది సందర్భం కాదు. కానీ మనం దాని గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే, మన మానసిక కార్యకలాపాల్లోని అన్ని ఇబ్బంది పెట్టే విషయాలను వదిలించుకోవడం సాధ్యమని మనకు నమ్మకం కలుగుతుంది.

అన్నింటికీ మించి, ఇబ్బంది పెట్టే భావోద్వేగం యొక్క అర్ధం, మన మనశ్శాంతిని మరియు సొంత నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది. దీని వల్ల కోపం, దురాశ మొదలైన వాటి ఆధారంగా మనం అన్ని రకాల ఇబ్బందుల మార్గాల్లో చెడుగా వ్యవహరిస్తాము మరియు ఇది చాలా సమస్యలను సృష్టిస్తుంది. ఉదాహరణకు, మనం సొంత నియంత్రణను కోల్పోతాము మరియు నిజంగా ఆలోచించకుండా ఎవరైనా చెప్పే విషయాలపై అరుస్తాము మరియు తర్వాత మనం అన్న మాటకి నిజంగా పశ్చాత్తాపపడతాము. ఏదేమైనా, ఇది అసంతృప్తి చెందడానికి "ప్రతికూల సామర్థ్యాన్ని" పెంచుతుంది.

మనం నిజంగా భవిష్యత్తు సమస్యలను నివారించాలనుకుంటే, ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు గందరగోళాన్ని వదిలించుకోవాలి. నిజానికి వాటిని వదిలించుకోవడం సాధ్యమే ఎందుకంటే అవి మనస్సు యొక్క సహజ స్వభావంలో భాగం కాదు. అంతే కాకుండా, ప్రతి క్షణం మనకు ఉండే ఈ రకమైన మానసిక పనుల గురించి ఆలోచిస్తే, ఆ విషయాలను అర్థం చేసుకోవడం సాధ్యపడుతుంది. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోగలం. ప్రేమ మరియు కరుణ వంటి ఇతర పాజిటివ్ లక్షణాలను కూడా మనం కలిగి ఉండవచ్చు. ఈ పాజిటివ్ లక్షణాలు బాగా అభివృద్ధి చెందగల విషయాలు.

ఇప్పుడు, తేడా ఏమిటి? ఆందోళన కలిగించే విషయాలు గందరగోళంపై ఆధారపడి ఉంటాయి. అవగాహన వంటి సానుకూల అంశాలు వాస్తవికతపై ఆధారపడి ఉంటాయి. ఒక మంచి ఉదాహరణ: "నేను విశ్వానికి కేంద్రం. నేను చాలా ముఖ్యమైన వాడిని. నాకు ఎప్పుడూ ఒక దారి ఉండాలి. నేనెప్పుడూ అందరి దృష్టినీ ఆకర్షించాలి" లాంటివి ఆలోచించడం. అందువల్ల, మనం దృష్టి కేంద్రంగా లేనప్పుడు మరియు మన మార్గం లభించనప్పుడు, మనకు కోపం వస్తుంది. ఒక కుక్కలాగా మనం ఎవరినైనా చూసి మొరగడం లేదా అరవడం చేస్తుంటాం. "నేను అనుకున్న విధంగా నువ్వు చెయ్యలేదు" అని. అదంతా గందరగోళం మీద ఆధారపడి ఉంటుంది. రియాలిటీ ఏమిటంటే, మనందరం ఆ స్థితిలో ఉన్నాము మరియు మనందరం సమానమే. ప్రతి ఒక్కరూ వారి స్వంత మార్గాన్ని పొందాలని కోరుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. రియాలిటీ ఏమిటంటే మనం ఏదో ఒక విధంగా అందరితో కలిసి జీవించడం నేర్చుకోవాలి.

నిజమైన అడ్డంకులు

ఎంతగా పరిశోధించినా మన అయోమయం పోదు. అది అబద్ధం. మరోవైపు, సరైన అవగాహన అనేది ధృవీకరించదగిన విషయం. ఇది నిజం. ఆ కారణంగా, అవగాహన బలంగా ఉంటుంది మరియు గందరగోళాన్ని అధిగమిస్తుంది. ఏకాగ్రతతో, క్రమశిక్షణతో ఎప్పుడూ వాస్తవికతను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, గందరగోళం మళ్లీ రాకుండా ఉంటుంది. అది ఆగిపోతుంది.

ఇదే ఆశ్రయం యొక్క కేంద్ర బిందువు. మన జీవితంలో ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నాం? మనకు ఎలాంటి లక్ష్యం ఉండబోతోంది? ఆ లక్ష్యం ఈ గందరగోళానికి "నిజమైన అడ్డంకి" ని పూర్తిగా వదిలించుకోవడం ఎలా అని. ఈ జన్మలో అయినా, వచ్చే జన్మలో అయినా మన సమస్యలకు అసలు కారణం ఈ గందరగోళమే. దీనిని పూర్తిగా, శాశ్వతంగా వదిలించుకోవడం సాధ్యమే, ఎందుకంటే ఇది మన మానసిక పనుల యొక్క సహజ లక్షణం కాదు. సరైన అవగాహన ఉంటే దీన్ని వదిలించుకోవచ్చు. గందరగోళం లేకుండా, మనకు ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు ఉండవు మరియు మనకు సమస్యలు మరియు బాధలు రావు.

ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ కలవరపరిచే దాన్ని శాశ్వతంగా వదిలించుకోవచ్చు, మరొకటి, మన పాజిటివ్ కోణాన్ని పెంచవచ్చు మరియు అభివృద్ధి చేసుకోవచ్చు. పాజిటివ్ సైడ్ అనేది సరైన అవగాహన. దీనిని సాధారణంగా "నాలుగు ఉత్తమమైన సత్యాలు" అని అనువదించిన సందర్భంలో లేదా బుద్ధుడు బోధించిన నేపధ్యంలో ఉంచవచ్చు. మొదటి నిజం ఏమిటంటే, మనకు ఉన్న అనేక విభిన్న సమస్యలను ప్రస్తావిస్తూ, మనకు నిజమైన బాధ ఉంటుంది. ఆ తర్వాత, మనకు నిజమైన కారణాలు ఉన్నాయి, ఇది మన గందరగోళం. మూడవది ఏమిటంటే, వీటన్నింటికీ నిజమైన ముగింపును సాధించడం సాధ్యపడుతుంది, అలా ఇది మళ్లీ పెరగకుండా ఉంటుంది. చివరగా, "నిజమైన మార్గం" అని పిలువబడే దాని ద్వారా మనం దీన్ని సాధిస్తాము. కానీ, "మార్గ౦" అనే పదాన్ని ఉపయోగి౦చడ౦ ద్వారా మన౦ దాన్ని "ఒక మార్గ౦లా పనిచేసే ఒక అవగాహనగా" అర్థ౦ చేసుకోవాల్సిన అవసర౦ ఉ౦ది. అవగాహనే ఈ నిజమైన అడ్డంకులకు దారితీస్తుంది, మరియు ఇది అన్ని ఇబ్బందికరమైన వాటిని వదిలించుకోవడం వల్ల కలిగే అవగాహన.

స్పష్ట౦గా, మన జీవిత౦లో మన౦ ఉండాలనుకునే దిశ ఇదే – నిజమైన గమ్యాలను, నిజమైన మార్గాన్ని చేరుకునే దిశ. ఇది ధర్మ ఆశ్రయం. మన గురించి మనం పని చేస్తున్నాం అని చెప్పేటప్పుడు, దీన్ని ఉపయోగించినప్పుడు, అది దీన్నే సూచిస్తుంది.

ఈ ఇబ్బందికరమైన వైపు నుంచి బయటపడటానికి మనం ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తున్నాము మరియు ఈ పాజిటివ్ సైడ్ కోసం మన సామర్థ్యాన్ని గ్రహించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న విధంగానే కొనసాగితే, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినా, ఇంతమంది స్నేహితులు ఉన్నా, చాలా ఫేమస్ అయినా మనకు సమస్యలు వస్తాయనే భయంతో ఇలా చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇంకా అత్యాశ, అభద్రతా భావానికి లోనవుతాం. మనకు ఇంకా కోపం వస్తూనే ఉంటుంది. మనం దాని గురించి భయపడుతున్నాము, కానీ దాన్ని నివారించడానికి ఒక మార్గం ఉందని తెలుసుకోవాలి. మనం అగ్నికి ఆహుతి అవుతామేమోనని భయపడవచ్చు, కానీ మనం జాగ్రత్తగా ఉంటే, గాయపడకుండా ఉండగలం. అక్కడ ఒక భయం ఉంది, కానీ ఇది ఆరోగ్యకరమైన భయం. మనం ఇక్కడ మతిస్థిమితం గురించి మాట్లాడటం లేదు.

ముఖ్యంగా మన బంధువుల మీద ఫ్రెండ్స్ మీద కోపంతో అరిస్తే, మనం ముసలివాళ్ళం అయ్యాక ఏం జరుగుతుంది? ఒంటరి వృద్ధురాలిగా లేదా వృద్ధుడిగా ఉండిపోతాము, ఎవరూ మనల్ని చూడటానికి ఇష్టపడరు, ఎవరూ మనల్ని పట్టించుకోరు, ఎందుకంటే మనం వాళ్లను అంత బాధ పెట్టాము. మనం చేసింది అంతా తిట్టడం మరియు అరవడమే, కాబట్టి మనతో ఉండాలని ఎవరు కోరుకుంటారు? ఎవరూ ఉండరు. దీనికి పరిష్కారం మనల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం లేదా బ్యాంకులో తగినంత డబ్బు ఉంచుకుంటే అది మనకు నర్సింగ్ హోమ్ లో ఉపయోగపడుతుందని కాదు, ఎందుకంటే మనం ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది. చాలా సరళమైన భాషలో చెప్పాలంటే మనం నిజంగా చేయాల్సిందల్లా మన వ్యక్తిత్వాలపై పనిచేయడం.

ప్రతి ఒక్కరూ మార్పును సాధించగలరు

మన వ్యక్తిత్వాలు స్థిరంగా ఉన్నాయని, మనం ఇలానే ఉన్నామని మనం ఎంత తరచుగా భావిస్తాం? "నాకు ఎక్కువ కోపం ఉంది మరియు నువ్వు దానితో ఉండడం నేర్చుకుంటే మంచిది" అని. అది పని చెయ్యదు కదా? ఈ ఇబ్బందికరమైన వాటిని వదిలించుకోవడం మరియు మన మంచి లక్షణాలన్నింటినీ గ్రహించడం సాధ్యమే. మన గురించి మనం పని చేసుకోకపోతే ఏమవుతుందో అనే భయం, ఈ ఇబ్బందికర అంశాలను వదిలించుకోవడం, పాజిటివ్ ఆలోచనలను పెంచడం, బలోపేతం చేయడం సాధ్యమేనన్న ఆత్మవిశ్వాసంతో మన జీవితంలో ఈ సురక్షితమైన దిశను నిర్దేశించుకుంటాం.

"మహాయాన" విశాల మార్గంలో దీన్ని చెయ్యాలనుకుంటే, మనం దీనికి కరుణను జోడిస్తాము. అసలు ఎవరి మీదైనా కోపం వస్తే ఎలా సహాయపడగలం అనేది మహాయాన విధానం. మనం నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాము మరియు మనం నిజంగా వారి పట్ల కోపంగా ఉండటం లేదా అనుబంధం లేదా అసూయ మరియు ఈ ఇతర విషయాలతో దాన్ని పూర్తిగా పాడు చెయ్యబోతున్నామని భయపడతాము. ఈ కలవరపరిచే భావోద్వేగాలను మరియు గందరగోళాన్ని వదిలించుకోవాలి, అప్పుడే మనం ఇతరులకు బాగా సహాయం చెయ్యగలం. ఈ భావనతోనే మనం నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాము, కానీ మనం నిజంగా ఎక్కువ చెయ్యలేమని భయపడతాము. మనకు కావల్సినంత ఓపిక, అవగాహన ఉండదు. మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని భయపడుతున్నాం. మన పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అవుతామనే భయం కూడా ఉంటుందేమో. అది చాలా భయంకరంగా ఉంటుంది, కదా? ఆ భయమే మన జీవితాలలో సురక్షితమైన, దృఢమైన దిశానిర్దేశం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది.

నిజంగా, ఈ ధర్మ పని మన జీవితానికి చాలా సముచితమైనది. ఆశ్రయం పరంగా, ఇది మన పరిస్థితి మరియు సమస్యల గురించి చాలా నిజాయితీగా ఉంటుంది. మనందరికీ అవి ఉన్నాయి. మనందరికీ ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు ఉన్నాయి. అదేం ప్రత్యేకత కాదు. కొన్ని అన్ని రకాల వైవిధ్యాలతో మిగతా వాటికన్నా బలంగా ఉండవచ్చు, కానీ మనందరికీ ఈ భావోద్వేగ ఇబ్బందులు ఉన్నాయి. మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పడిన వ్యక్తి గురించి మనం ఇక్కడ మాట్లాడటం లేదు. ఎక్కువ మంది సాధారణంగా భావించే దాని గురించి మనం మాట్లాడుతున్నాము. కానీ ఇక్కడ ప్రమాదం ఏమిటంటే, కొన్నిసార్లు మనకు కోపం రావడం, కొన్నిసార్లు అత్యాశ, స్వార్థం మరియు అసూయ పడటం మొదలైనవి మనం సాధారణంగానే భావిస్తాము. ఇది మామూలు విషయమే అని అనుకుంటాం, ఫర్వాలేదు. సరే, ఇది సరైనది కాదు, ఎందుకంటే ఇది మనకు మరియు మనం సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఇతరులకు సమస్యలను కలిగిస్తుంది అని.

మన లక్ష్యం కేవలం మన కోపంతో ఎలా జీవించాలో నేర్చుకోవడం లేదా అది ఇంకా లోపల జరుగుతున్నా వాటిని అదుపులో ఉంచడం కాదు. దాన్ని బలహీన పరచడం కూడా మన లక్ష్యం కాదు, ఈ ఇబ్బందికరమైన విషయాలన్నింటినీ పూర్తిగా వదిలించుకోవాలి. మనం కొన్ని సమయాల్లో కొద్దిగా అవగాహనను పెంచుకోవాలని అనుకోవడం లేదు, వాస్తవికతపై పూర్తి అవగాహనను పెంపొందించుకోవడం, మనం ఎలా ఉన్నామో, ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారో, ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవడం మరియు అన్నింటినీ ఎప్పుడూ పట్టించుకోవడం. మానసిక పనుల స్వభావం స్వచ్ఛమైనది మరియు మంచి లక్షణాల సామర్థ్యాలను కలిగి ఉన్నందుకు ఇది పూర్తిగా సాధ్యమవుతుంది.

బుద్ధుని స్థాయి యొక్క మంచి లక్షణాలు

సురక్షితమైన దిశను లేదా ఆశ్రయాన్ని సూచించే వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు, బుద్ధుడు, ధర్మం మరియు సంఘం గురించి మాట్లాడతాడు. ఈ మూడింటిని అర్థం చేసుకోవడానికి అనేక స్థాయిలు ఉన్నాయి: ప్రతి ఒక్కటి స్పష్టమైన స్థాయి, లోతైన స్థాయి మరియు వాటిని సూచించేదాన్ని కలిగి ఉంటాయి. ముందుగా ఒక్కొక్క దానిలో కనిపించే మంచి గుణాలేంటో చూద్దాం.

బుద్ధుని శరీరానికి అసాధారణమైన శారీరక మరియు చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు, బుద్ధులు తక్షణమే ఎక్కడికైనా వెళ్ళగలరు, వారి శరీరాలను అనంత రూపాలుగా గుణించగలరు, అన్ని చోట్లా ఒకే సమయంలో ఉండగలరు, మొదలైనవి. ఇదంతా చాలా అద్భుతం మరియు నమ్మడానికి అంత సులభం కాదు. అంతే కాకుండా, ఒక బుద్ధుడు మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరూ దానిని వారి స్వంత భాషలో అర్థం చేసుకుంటారు మరియు వారు ఎంత దూరంలో ఉన్నా కానీ వారు బుద్ధుడిని స్పష్టంగా వినగలరు. అంతకు మించి, బుద్ధుడు అందరినీ సమానంగా ప్రేమించి, అన్నిటినీ ఏక కాలంలో అర్థం చేసుకునే సర్వజ్ఞుడు.

మళ్ళీ, ఇదంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ నమ్మడం కష్టం. కాబట్టి, బుద్ధుల గురించి మనం ఈ స్థాయిలో ఆలోచిస్తే, తప్పుగా అర్ధం అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఏదో అద్భుతమైన దివ్యమైన జీవి అని, దాదాపు ఒక దేవుడిలా కనిపిస్తుంది, కదా? అయితే సర్వజ్ఞుడు కావడం వల్ల బుద్ధుడికి ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరి టెలిఫోన్ నెంబరు తెలియదని కాదు, కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి అలా అవ్వడానికి కారణాలు ఏమిటో, వారిని ప్రభావితం చేసే అన్ని అంశాలు బుద్ధుడికి తెలుసు. ఒక బుద్ధుడు ఒక వ్యక్తికి ఏదైనా బోధించినప్పుడు, అన్ని పర్యవసానాలు ఎలా ఉంటాయనే అవగాహనతో, ఆ వ్యక్తిపై మాత్రమే కాకుండా, ఈ వ్యక్తి సంభాషించే ప్రతి ఒక్కరిపై ప్రభావం ఉంటుంది. దాని ఫలితంగా, బుద్ధుడికి ప్రతి ఒక్కరికి బోధించడానికి ఉత్తమమైన పద్ధతి తెలుసు. ఇది చాలా బాగుంటుంది, కదా? అలా చెయ్యగలిగితే చాలా బాగుంటుంది.

మనకు సహాయం చెయ్యడానికి ఉత్తమమైన విషయం ఏమిటో బుద్ధుడు అర్థం చేసుకుంటాడని మరియు అతనికి అన్నీ తెలుసని మనకు కొంత నమ్మకం ఉంటుంది. బుద్ధుడు నా భాషను మాట్లాడతాడు మరియు నాకు అవసరమైనప్పుడల్లా నా దగ్గరకి వస్తాడు. బుద్ధుడిని దేవుడిగా భావించే దిశలో మనం వెళుతుంటే, ఇప్పుడు అది కాస్త వ్యక్తిగతంగా మారుతోంది. "అతను నాకు వ్యక్తిగతంగా సహాయం చెయ్యగలడు. అతను నన్ను అర్థం చేసుకుంటాడు. నన్ను అతనిలా ఎవరూ అర్థం చేసుకోరు, కానీ బుద్ధుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు" అని. బుద్ధుడికి అందరిపై సమాన ప్రేమ ఉంటుందని మనకు తెలుసు. "గ్రేట్. అయితే అందరికంటే ఆయనకు నాపై ఎక్కువ ప్రేమ ఉంటేనే నేను ఇష్టపడతాను. అయినా కానీ ఓకే." బుద్ధుడికి అందరిపై సమాన ప్రేమ ఉంటుంది మరియు మనం ఏమి చేసినా పర్వాలేదు అనిపిస్తుంది. మనం బుద్ధుడికి ప్రార్థన చేయనవసరం లేదు, నైవేద్యాలు సమర్పించాల్సిన అవసరం లేదు. బుద్ధుడు మీకు ఎలాగూ సహాయం చేస్తాడు. కాబట్టి, ఇది చాలా చీప్. మనం ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దానికి తోడు బుద్ధుడికి చాలా ఓపిక ఉంది కాబట్టి, మనం వేరే గురువు దగ్గరకు వెళ్ళినా అతను అసూయ పడడు, ఎప్పుడూ కోపగించుకోడు, మెరుపులతో నన్ను చంపడు. ఇది చాలా సురక్షితం.

తెలిసో తెలియకో ఇది సాధారణ తప్పిదం. మనం బుద్ధుడిని ప్రత్యామ్నాయ దైవంగా చూస్తాము, ఇది బేరసారం మరియు సురక్షితమైనది. బోధనలలో, బుద్ధుడు మిమ్మల్ని నిరాశపరచడని, చెప్పబడుతుంది. ఇది చాలా మంచిది. కానీ బుద్ధుడు మన పాదం నుంచి ముళ్లను తీసి మన బాధను తగ్గిస్తాడని మనం చదవవచ్చు. బుద్ధులు సర్వశక్తిమంతులు కారు. కానీ మనం దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇది బుద్ధుని యొక్క స్పష్టమైన స్థాయి, ఒకరి సాధారణ ఆలోచనా విధానం. కానీ లోతైన అవగాహన లేకుండా దానిని ఆ స్థాయిలో వదిలేయడం వల్ల బుద్ధుడిని ప్రత్యామ్నాయ వ్యక్తిగత దేవుడిగా పరిగణించే ప్రమాదం ఉంటుంది, మనల్ని రక్షించబోయే దేవుడి లాగా.

విగ్రహాలు, పెయింటింగ్స్ ద్వారా బుద్ధులకు ప్రాతినిధ్యం వహిస్తారు. సరే, వారు అందంగా ఉన్నారు, కానీ మనం దానిని సనాతన క్రైస్తవ చిహ్నంతో గందరగోళం అయ్యేలా చేస్తామా? ముస్లిములు ఆరోపిస్తున్నట్టు మనం విగ్రహారాధనలో ఉన్నామా? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నిజంగా మనం విగ్రహం ముందు నమస్కరించాలా? బుద్ధుని గురించి మన అవగాహనను ఈ స్థాయిలో వదిలేస్తే సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. అపార్థానికి ఆస్కారం ఉంటుంది అని. కొంత మందికి, బుద్ధుని గురించి ఆ విధంగా ఆలోచించడం చాలా సహాయపడుతుంది, కానీ అది లోతైన అవగాహన కాదు. ఈ స్థాయిలో, విగ్రహాలు మరియు పెయింటింగ్ లతో ప్రాతినిధ్యం వహించే దేవుని లాంటి వ్యక్తి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మనం వారిని ఆరాధిస్తాము.

ధర్మం యొక్క స్పష్టమైన స్థాయి యొక్క మంచి లక్షణాలు

ధర్మం యొక్క స్పష్టమైన స్థాయి అన్నీ బోధనలే. ఇదే బుద్ధుడు తనలో తాను గ్రహించినది మరియు బోధించినది. దీన్ని అర్థం చేసుకోవడానికి సాధారణ మార్గం ఏమిటంటే, మనకు మన వ్యక్తిగత దేవుడైన బుద్ధుడు ఉన్నాడు మరియు మనకు మన గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర బైబిల్ లేదా ఖురాన్ కు బదులు బుద్ధుని గ్రంథాలు ఉన్నాయి. ఇది నా బౌద్ధ బైబిల్ వంటిది మరియు అందులోని ప్రతి పదాన్ని నేను పవిత్రంగా భావిస్తాము. అవును, మనం దాన్ని గౌరవించాలి, కానీ బుద్ధుడు ఇలా చెప్పాడు: "నేను చెప్పినదాన్ని గౌరవంతో నమ్మవద్దు, కానీ బంగారం కొనుగోలు చేసినట్లు మీరే పరీక్ష చేసుకోండి." బుద్ధుడు తాను బోధించిన విషయాలను విమర్శించమని తన అనుచరులను ప్రోత్సహించాడు. కానీ మనం బద్ధకంతో ఉన్నప్పుడు, ప్రతి దాన్ని విశ్లేషించడానికి మరియు చెక్ చెయ్యడానికి మనం ఇష్టపడము. మన రోజువారీ జీవితంలో, ఈ స్థాయిలో, బుద్ధుడు మనల్ని ప్రేమిస్తాడు, బుద్ధుడు మనల్ని అర్థం చేసుకుంటాడు మరియు పవిత్ర గ్రంథంలోని అన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి మరియు మనం వాటిని అనుసరిస్తాము. ఖచ్చితంగా, ఇది మన జీవితంలో ఒక స్థానాన్ని కలిగి ఉండవచ్చు, కానీ ఇది నిజమైన బౌద్ధమతం కాదు. ఇప్పుడు, ఇది కొంత మందికి పని చెయ్యవచ్చు, కానీ బౌద్ధమతాన్ని క్రైస్తవ మతం యొక్క వేరే వైవిధ్యంగా మార్చడం ఉద్దేశం కాదు.

స్పష్టమైన సంఘం యొక్క మంచి లక్షణాలు

మరి సంఘం సంగతేంటి? దురదృష్టవశాత్తూ పాశ్చాత్య దేశాలలో మనం వెళ్ళే ధర్మ కేంద్ర సభ్యులందరినీ మన "సంఘం" అని సంబోధించడం అలవాటు అయిపోయింది. సంస్కృతం లేదా టిబెటన్ భాషలో ఈ పదం యొక్క ఉద్దేశ్యం ఖచ్చితంగా అది కాదు. కానీ, చాలా మందికి, "సంఘం" అంటే మన స౦ఘ సభ్యులు, మన బౌద్ధ చర్చి అని మాత్రమే అర్థ౦ అవుతుంది. ఈ సభ్యుల్లో కొందరు బాగా కలత చెందిన వ్యక్తులు అయితే, మనం నిజంగా వారిని ఆశ్రయిస్తామా? ఇప్పుడు, మనకు కొంత సహాయం, కొంత ఫీడ్ బ్యాక్ మరియు మిగతా వాటిని ఇవ్వగల ఒకే రకమైన లక్ష్యం ఉన్న వ్యక్తుల ఆధ్యాత్మిక సమాజాన్ని కలిగి ఉండే ప్రాముఖ్యతను తగ్గించాలని నేను అనుకోవడం లేదు. ఇది చాలా ముఖ్యమైనది, కానీ ఇది ఆశ్రయం యొక్క వస్తువు కాదు.

సంఘం యొక్క మరొక స్థాయిలో, బౌద్ధమత సన్యాసులు మరియు సన్యాసినులు దీన్ని ఒక సన్యాసి సంఘంగా అర్థం చేసుకోవచ్చు. కానీ, మళ్ళీ, సన్యాసులు మరియు సన్యాసినుల యొక్క ఖచ్చితమైన ఉదాహరణలు మనకు ఎప్పుడూ దొరకవు, కదా? దుస్తులు ధరించే కొందరు చాలా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ, వారు సన్యాసులుగా మారడం ద్వారా తమపై తాము పని చేసుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు సన్యాసులు, సన్యాసినులు జీవితంలోని కష్టాల నుంచి తప్పించుకోవడానికి, నా స్నేహితుడు చెప్పినట్లు ఉచిత భోజనం కోసం ఇలా చేస్తున్నారు!

సంఘంలో మరో స్థాయి కూడా ఉంది. ఈ తాంత్రిక గురువుల నుంచి నిజానికి సంఘం ఈ "తాంత్రిక దేవతలు" అని పిలువబడే చెన్రెజిగ్, తారా, మంజుశ్రీ మొదలైనవారు అని మనం వినవచ్చు. ఇప్పుడు మనం పవిత్ర తల్లిని లేదా సెయింట్ తారాను ప్రార్థించడం ప్రారంభించవచ్చు, మరియు ఆమె మనల్ని రక్షిస్తుంది. నేను పిలిచే ఈ బుద్ధ విగ్రహాలు, తాంత్రిక దేవతలు అని పిలువబడే ఈ సాధువులు ఏ విధంగానూ మధ్యవర్తులుగా ఉండి బుద్ధ దేవుడికి దగ్గర కావడానికి సహాయపడరు.

బుద్ధుడు, ధర్మం మరియు సంఘం యొక్క లోతైన అర్థం

బుద్ధుడు, ధర్మం, సంగం అనే లోతైన అర్థాన్ని మనం పరిశీలిస్తే, ధర్మం యొక్క లోతైన అర్థం ఈ గందరగోళానికి నిజమైన అడ్డంకులు, మరియు నిజమైన సాక్షాత్కారాలు లేదా మానసిక కొనసాగింపుపై నిజమైన మార్గాలు అని మనం కనిపెడతాం. అదే అసలైన ధర్మం. దాన్ని మన మానసిక స్థితిగతుల్లో సాధించగలిగితే మనల్ని బాధల నుంచి కాపాడుతుంది. అన్ని గందరగోళాలు, కలవరపరిచే భావోద్వేగాలు, వైఖరులు, సమస్యలు పోయి, అక్కడి అన్ని సాక్షాత్కారాలతో మనం ఈ స్థితిని సాధించవచ్చు. దీన్ని సంపూర్ణంగా మనమే ఎలా సాధించాలో నేర్పినవారే బుద్ధులు. సంఘం నిజానికి "ఆర్య సంఘము" అని పిలువబడే వాళ్లను సూచిస్తుంది వాళ్ళు కొన్నింటిని సాధించారు, కాని ఈ నిజమైన సాక్షాత్కారాలన్నిటినీ కాదు. నిజానికి మనల్ని మనం వదిలించుకోవాల్సిన అనేక స్థాయిలు మరియు గందరగోళాలు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవటానికి క్రమంగా బలమైన సాక్షాత్కార స్థాయిలు ఉన్నాయి. వాటిని వదిలించుకునే ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. వాటన్నిటినీ వదిలించుకోవడం, పూర్తి ప్యాకేజిని ఆర్య సంఘం ఇంకా సాధించలేదు, కానీ కొన్నింటిని సాధించే మార్గంలో ఉంది.

మన జీవితంలో, బుద్ధులు, ఆర్య సంఘం, ఈ గొప్ప భారతీయ టిబెటన్ గురువులు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇది మనకు చాలా ఆశను ఇస్తుంది. దలైలామా వంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని మనం చూస్తాం లేదా కలుస్తాం. అతను ఎలా అయ్యాడు? ధర్మం ద్వారా. అతను బుద్ధుడా కాదా అనేది రిలవెంట్ కాదు. మనం అతనిలా మారగలిగితే చాలా బాగుంటుంది. ధర్మ క్షేత్రంలో దాదాపు దేనినైనా బోధించగల అతని సామర్థ్యం గురించి నేను మాట్లాడటం లేదు, లేదా అతను నిపుణుడు, పండితుడు మరియు అత్యంత గొప్పవాడు అని అనడం లేదు. అతను ఉంచే షెడ్యూల్ మాత్రమే కాదు, నిరంతరం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, ఇతరులకు బోధించడానికి మరియు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంతకుమించి అతను చైనాకు ప్రజా శత్రువులలో నంబర్ వన్ అని చెప్పక తప్పదు. వంద కోట్ల మందికి పైగా ప్రజలు మిమ్మల్ని డెవిల్ గా భావించి, మీ ప్రజలకు అన్ని రకాల భయంకరమైన పనులు చేసి, ఇప్పటికీ వారి పట్ల ప్రేమ, జాలి కలిగి ఉంటే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? అతను కలత చెందడు, మరియు అతను చేసే ప్రతి పనిని సంతోషకరమైన, ప్రశాంతమైన మనస్సుతో చెయ్యగలడు. ఇది నమ్మశక్యంగా లేదు కదా? ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను వదిలించుకుని, సాక్షాత్కారం పొందకపోతే మనం వాటిని ఎలా సాధించగలం? అది సాధ్యం కాదు. అతను బుద్ధుడా కాదా అనేది రిలవెంట్ కాదు.

బుద్ధుని లక్షణాలన్నిటినీ మనం స్వయంగా చెప్ప లేకపోవచ్చు, కానీ కనీసం దలైలామా గారి లక్షణాలను మనం చూడవచ్చు. ఇది చాలా స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తికి ఈ స్థాయికి చేరుకోవడం సాధ్యమైతే, మనస్సు స్వభావం స్వచ్ఛమైనదని, ఇన్ని సామర్థ్యాలు ఉన్నాయని పరిగణనలోకి తీసుకుంటే, మనం అలా చేయకపోవడానికి కారణం ఏదీ ఉండదు. అందరూ అలా చేయకపోవడానికి ఏదీ ఆపలేదు. సహజంగా, దీనికి చాలా కష్ట పడాల్సి ఉంటుంది, కానీ ఇది సాధ్యమే మరియు ఆ దిశలో వెళ్లడం చాలా ఉపయోగకరమైనది. దలైలామా గారు బుద్ధుడితో పోలికను కలిగి ఉంటే, ప్రస్తుతం బోధిస్తున్న కొందరు గొప్ప లామాలకు దలైలామా గారి అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ, సంఘానికి సమానంగా, వారికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అది కూడా చాలా స్ఫూర్తిదాయకమే.

దలైలామాకు, మరియు ఇతర గొప్ప గురువులకు ఉన్న సారూప్యత ఏమిటి? కోపం, దురాశ, ద్వేషం, ఈర్ష్య, ఇలా రకరకాల విషయాలను వారు వదిలించుకున్నారు. అవగాహన, కరుణ, సహనం లాంటి గొప్ప మంచి లక్షణాలను పొందారు. ఈ వివిధ లామాలు సాధించగల విభిన్న గ్రేడేషన్లను మనం చూస్తాము. నేను చెబుతున్నట్లుగా, బుద్ధుడు, లేదా మిలారెపా మరియు ఇతర చారిత్రక వాళ్ళ గురించి ఆలోచించడం కంటే ఇది చాలా సజీవ ఉదాహరణ (వాళ్లతో మనకు పరిచయం ఉంటే). అవి మంచి కథలు అని మనకు అనిపించవచ్చు, కానీ అలాంటి వారు ఎవరైనా ఉన్నారని మనం నిజంగా నమ్ముతున్నామా? గురువు రింపోచే కమలం నుంచి జన్మించాడని మనం చదివాము ఆ విషయాన్ని మనం నిజంగా నమ్మగలమా? దాన్ని రిలేట్ చేసుకోవడం కష్టం అవ్వొచ్చు. కానీ, దానికి బదులుగా, ఈ ప్రతికూల లక్షణాలు లేకపోవడం మరియు ఈ సానుకూల లక్షణాల ఉనికిపై మనం దృష్టి పెట్టవచ్చు, దలైలామా మరియు ప్రస్తుతం ఇక్కడ బుద్ధుడు మరియు సంఘం వంటి ఈ గొప్ప గురువులు ఉదాహరణగా ఉన్నారు. మనమూ ఆ పని చెయ్యగలం, ఇదే ధర్మం, ఈ నిజమైన అడ్డంకులు, నిజమైన మార్గాలు సాధించదగిన లక్ష్యాలని మనం గ్రహిస్తాం. దీన్ని మనం చేయడం సాధ్యమే మరియు ఇది మన జీవితంలో మనం పెట్టుకోగల సురక్షితమైన, స్థిరమైన మరియు అర్థవంతమైన దిశను ఇస్తుంది.

మన జీవితంలో ఆశ్రయం లేదా సురక్షిత దిశ

బుద్ధుడు, ధర్మం మరియు సంఘం యొక్క ఈ దిశను మన జీవితంలో ఉంచడం అంటే ఆచరణాత్మక స్థాయిలో అర్థం ఏమిటి? అంటే మనం ఎప్పుడూ మన కోసమే పని చేసుకుంటూ ఉంటాం. అలా చేసినప్పుడు, ఉదాహరణకు, మనం బాధపడినప్పుడు, కోపం వచ్చినప్పుడు, లేదా స్వార్థపూరితంగా వ్యవహరించినప్పుడు, దాని గురించి ఇంకా అవగాహన వస్తుంది. మనం దాన్ని గమనిస్తాము. అప్పుడు మనల్ని మనం నిందించుకుని, "నేను చాలా చెడ్డవాడిని, నేను చాలా భయంకరంగా ఉన్నాను, ఎందుకంటే నాకు బాగా కోపం వస్తుంది" అని శిక్షించుకుంటాము. అలా చెయ్యకూడదు. ఇది సాధారణంగా జీవితంలో ఒక భాగం మాత్రమే అని అనుకోవాలి. అలాంటప్పుడు, మనం దానిని గమనించి, ఆలోచించాలి. మన బాధాకరమైన భావోద్వేగాల గురించి తెలుసుకోవడం మరియు వాటిని  వదిలించుకోవాలనుకోవడం కూడా వారి శక్తిని బలహీన పరుస్తుంది.

కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, మన జీవితంలో, ఈ ఇబ్బందికరమైన నెగెటివ్ విషయాలు వచ్చినప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏమిటంటే, కొన్ని పద్ధతులను నేర్చుకుని వాటిని అధిగమించడానికి ప్రయత్నించడం. కోపం వస్తే సహనాన్ని పెంపొందించుకోవాలి. ఎవరైనా నా పట్ల భయంకరమైన రీతిలో ప్రవర్తిస్తున్నప్పుడు, వారు చాలా అసంతృప్తిగా ఉన్నారని ఇది సూచిస్తుంది. వాళ్లని ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంది. కోపగించుకోడానికి బదులుగా, వారి పట్ల కొంచెం జాలి చూపాలి.

స్పష్టంగా చెప్పాలంటే, మనం కోపంగా ఉన్నాము అని కాదు. మరోవైపు మనల్ని మనం చిన్న పిల్లాడిలా చూసుకోవడం లేదు, ఫర్వాలేదు అని చెప్పడం సరైనది కాదు. కానీ మన కోపాన్ని అధిగమించడానికి మన వంతు ప్రయత్నం చేయబోతున్నాము, ఎందుకంటే అలా చేయడం సాధ్యమేనని మనం గ్రహించాము. బహుశా మనం దాన్ని అంత త్వరగా వదిలించుకోలేము, కానీ ఇది మన జీవితాంతం పని చెయ్యాలనుకునే దిశ. నిజానికి వీటిని వదిలించుకోవడం సాధ్యమేనని మనకు తెలుసు కాబట్టి మనం దీన్ని చేయబోతున్నాము. ఈ దిశగా ముందుకు సాగడం ఆదర్శవాద ఆలోచన యొక్క ఉపయోగం లేని ప్రయత్నం కాదు.

మనం కష్టమైన పరిస్థితిని ఎదుర్కున్నప్పుడు, మనకు కొంచెం సహనం, లేదా కొంచెం అవగాహన లేదా కొంచెం దయతో కూడిన భావన ఉన్నప్పుడు, ఇది పెరిగే విషయం అని మనం గ్రహించాలి. దీన్ని మరింత పటిష్టంగా, దృఢంగా మార్చుకోవచ్చు. అది సాధ్యమే. ఇతరులు సాధించారు మరియు మనం కూడా సాధించగలము. ఇతరుల గురించి ప్రత్యేకమైనది ఏమీ లేదు, మన గురించి ప్రత్యేకమైనది ఏమీ లేదు. ఇది మన ఆశ్రయం, ఇది జీవితంలో మనకు సురక్షితమైన దిశ, ఎందుకంటే మనం ఈ దిశలో ఎంత ఎక్కువగా వెళితే, కష్టాల మరియు సమస్యల నుంచి మనల్ని మనం అంతగా రక్షించుకోవచ్చు.

సారాంశం

ఆశ్రయం అంటే ఏమిటి, ఈ సురక్షితమైన దిశ అంటే ఏమిటి మరియు దానిని మన జీవితంలో పాటించడానికి కారణాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇది బౌద్ధమత ఆచరణలో అత్యంత ముఖ్యమైన, అత్యంత ప్రాథమిక విషయంగా పరిగణించబడుతుంది. చాలా మంది దీన్ని చిన్నచూపు చూస్తారు, ఇది నిజంగా సిగ్గుచేటు. మన జీవితంలో ఈ దిశ ఉందా లేదా అనేది అత్యంత ముఖ్యమైన మార్పుగా భావించబడుతుంది మరియు మన జీవితంలో అతిపెద్ద మార్పును కలిగిస్తుంది. ఆశ్రయం అంటే మనం ఒక వేడుకకు వెళ్లడం కాదు, మన జుట్టు యొక్క చిన్న భాగాన్ని కత్తిరించుకుని టిబెటన్ పేరు పొంది, మెడలో ఎరుపు తీగను ధరించి ఆ క్లబ్ లో చేరడము కాదు. ఇది నిజంగా మొత్తం సమస్యను చిన్నదిగా చేసి, చాలా అర్థరహితమైన విషయంగా మారుస్తోంది.

మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఇదే: "ఆశ్రయం పొందిన వ్యక్తిగా మరియు బౌద్దుడుగా, నేను నిజంగా నా జీవితంలో ఈ దిశను పాటిస్తున్నానా? నా జీవితంలో ఈ క్లబ్ లో చేరడం తప్ప ఇంకేమైనా ప్రాముఖ్యత ఉందా? ఆశ్రయం పొందడం మన జీవితాలలో గణనీయమైన మార్పును తీసుకురాకపోతే, ఇది నిజంగా మనం పని పాటించాల్సినదేనా అని. ఈ పునాది లేకుండా అధునాతన పద్ధతులను అనుసరించడం విజయాన్ని తెచ్చిపెట్టదు.

Top