మొదటి ఉత్తమమైన సత్యం: నిజమైన బాధ

ఈ జీవితం యొక్క అసలైన నిజం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మరియు ఎవరూ దుఃఖంలో ఉండకూడదని కోరుకోవడం. ఎవరూ సమస్యలు, బాధలు కోరుకోరని మన అనుభవంతో సులభంగా అర్థమవుతుంది. అయినా కానీ, మన జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. నిజానికి, వాటిని నివారించడానికి మనం ఎంత ప్రయత్నించినా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. మన రోజువారీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడల్లా, దాన్ని ఎదుర్కోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఒక్కొక్కటిగా ఎదుర్కోవడం ఒక నిరంతర పని. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత, జీవితం గురించి ప్రతి ఒక్కరికి, ప్రతి చోటా నిజం అయిన అనేక నిజాలు ఉన్నాయని అతను అర్థం చేసుకున్నాడు. వీటిని మనం నాలుగు ఉత్తమమైన సత్యాలు అని పిలుస్తాం. బుద్ధుడు గ్రహించి బోధించిన మొదటి ఉత్తమమైన సత్యం ఏమిటంటే, మనమందరం ఎదుర్కొంటున్న అసలైన సమస్య ఏమిటంటే, ఆ సమస్య రావడాన్ని మనమే శాశ్వతం చేసుకుంటాము. మన కోసం మరిన్ని సమస్యలను సృష్టించడం మనం మానుకోకపోతే అవి రావడం కూడా ఎప్పటికీ ఆగదు. కాబట్టి, నిజమైన బాధ అంటే ఏమిటో సరిగ్గా గుర్తించడం మొదటి దశ.

సంతోషం మరియు దుఃఖం యొక్క ఒడిదుడుకులు

ఎన్నో రకాల సమస్యలు, బాధలను మనం ఎదుర్కొంటుంటాం. జీవితం నిరాశ మరియు ఒత్తిడితో కూడుకున్నది. మన కోసం సంతోషకరమైన జీవితాలను సృష్టించడానికి మనం తీవ్రంగా ప్రయత్నిస్తాము, కాని విషయాలు మనం అనుకున్న విధంగా జరగవు. మన సంబంధాలు చెడిపోవడం, ప్రజలు మనతో చెడుగా ప్రవర్తించడం, అనారోగ్యానికి గురికావడం, మన ఉద్యోగాలను పోగొట్టుకోవడం లాంటివి మనం ఎప్పుడూ కోరుకోకపోయినా అవి మనకు జరుగుతాయి. ఇలాంటివి జరగకుండా మనం ఎంత ప్రయత్నించినా అవి ఎలాగూ జరుగుతాయి. తరచుగా, మనం వాటి గురించి నిరాశ చెందుతాము లేదా వాటన్నిటినీ పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, కానీ ఇది సాధారణంగా విషయాలను ఇంకా దిగజార్చుతుంది. అప్పుడు మనం ఇంకా అసంతృప్తికి గురవుతాము.

మనం కొంత ఆనందాన్ని అనుభవించడంలో విజయం సాధించినప్పటికీ, ఆ ఆనందంలో ఒక సమస్య ఉంటుంది - అది ఎప్పటికి నిలవదు. ఇది మమ్మల్ని ఎప్పటికి సంతృప్తిపరచదు మరియు మనం ఇంకా కావాలని కోరుకుంటాము. నిజానికి, మనం ఈ "ఎక్కువ" ను వెంబడించడానికి చాలా సమయం మరియు శక్తిని ఖర్చు పెడతాము. సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేసేటప్పుడు మన యాటిట్యూడ్ గురించి ఆలోచించండి. మనకు "లైక్" వచ్చిన ప్రతిసారీ సంతోషం యొక్క కొద్దిపాటి డోపామైన్ రష్ మనలో ఉంటుంది, అది ఎంతకాలం ఉంటుంది? ఇంకా ఎన్ని "లైక్స్" వచ్చాయో అని మనం ఎంత త్వరగా చెక్ చేస్తాము? ఎక్కువ లైక్ లు లేనప్పుడు మనం ఎంత డల్ అవుతాం? అది చాలా బాధను ఇస్తుంది, కదా?

మనం ఒడిదుడుకులను అనుభవించే శరీరాలు మరియు మనస్సులను స్థిర పరుస్తాము

జీవితం ఎప్పుడూ సుఖాలు కష్టాలతో ఉంటుంది - కొన్నిసార్లు మనం సంతోషంగా మరియు గొప్పగా భావిస్తాము, కొన్నిసార్లు మనం విచారంగా మరియు అసంతృప్తిగా ఉంటాము. ఎప్పుడూ, మనం "అదే జీవితం" అని చెబుతాము మరియు ఆ పరిస్థితిని ఎక్కువ లోతుగా ఆలోచించము. కానీ మన జీవితాలు అలా ఉండాలని మనం నిజంగా కోరుకుంటున్నామా - తర్వాతి క్షణంలో మనం ఎలా ఉండబోతున్నామో తెలియదు? అదృష్టవశాత్తూ, బుద్ధుడు లోతుగా పరిశీలించి వీటన్నింటి వెనుక ఉన్న నిజమైన సమస్యను కనిపెట్టాడు. నిజమైన సమస్య, నిజమైన బాధ, మనకున్న శరీరాలు మరియు మనస్సుల రకాలు. అయస్కాంతంలా ఆకర్షించే ఈ ఒడిదుడుకులను అనుభవించడానికి మన శరీరాలు, మరియు మనస్సులే కారణం. మనం ఇంకా లోతుగా పరిశీలిస్తే, అసలు సమస్య, ఇలాంటి శరీరాలు మరియు మనస్సులను ఉండటం, మనం ఈ హెచ్చుతగ్గులను ఇప్పుడు మరియు వచ్చే వారానికి మాత్రమే కాకుండా, మనం చనిపోయే వరకు కూడా సృష్టిస్తూ ఉంటాము. అంతే కాదు, ఈ జన్మ లోనే కాకుండా, పునర్జన్మలో కూడా మన సమస్యలను మనం సృష్టించుకుంటామని బుద్ధుడు చెప్పాడు. పునర్జన్మ ఉనికిని మనం ఇంకా అర్థం చేసుకోకపోయినా, అంగీకరించకపోయినా, భవిష్యత్తు తరాలకు కూడా ఈ సమస్యలను ఎలా కొనసాగుతాయో మనం చూడవచ్చు. ప్రస్తుత వాతావరణ సంక్షోభంతో మన పనులు ఈ భూగోళంపై మన ఉనికికి మించిన సమస్యలను ఎలా సృష్టిస్తున్నాయి తెలుస్తుంది.

కాబట్టి, మన శరీరాలు మరియు మనస్సులతో అసలు ఉన్న సమస్య ఏమిటి? అవి పరిమితంగా ఉండటమే. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యానికి గురికావడం, క్షీణించడం వల్ల మన శరీరాలు పరిమితంగా ఉంటాయి. పాల సీసా లాగా, వాటి గడువు ముగుస్తుంది; కానీ, పాలతో పోలిస్తే అధ్వాన్నంగా, వాటికి గడువు ముగిసే స్పష్టమైన తేదీ ఉండదు. మన శరీరం  యొక్క ఎక్స్‌పైరీ డేట్ గురించి మనకు తెలియదు. శరీరం జీవించి ఉన్నప్పుడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనం ఎంత సమయం ఖర్చు పెట్టాలో ఆలోచించండి. దాన్ని శుభ్రం చెయ్యడం, దుస్తులు ధరించడం, తినిపించడం, టాయిలెట్ కు తీసుకెళ్లడం, వ్యాయామం చెయ్యడం, విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం, గాయపడినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం. అదంతా ఎంత సరదాగా ఉంటుంది? ఒక గొప్ప భారతీయ బౌద్ధమత గురువు చక్కగా చెప్పినట్లుగా, మనమందరం మన శరీరాలకు బానిసలం.

మన భావాలు, భావోద్వేగాలతో పాటు మన మనస్సు కూడా పరిమితమే. మన మనస్సులకు మనం అవగాహన కల్పించి శిక్షణను ఇవ్వాలి, అప్పుడు కూడా, మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. మనం ప్రతి దానిలో ఉండే పూర్తి చిత్రాన్ని చూడలేము - ఉదాహరణకు, గ్లోబల్ వార్మింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ పర్యావరణాలు మొదలైన వాటి పర్యవసానాలు, ఇవి కాకుండా మన జీవితంలో ఏమి జరుగుతుందో అనేది పక్కన పెడితే. దాని కన్నా మన శరీరాల లాగానే మన మనస్సులు కూడా వృద్ధాప్యంతో క్షీణిస్తాయి - మన స్వల్పకాలిక జ్ఞాపకశక్తి పోతుంది, మన మనస్సులు ఇంకా నెమ్మదిగా పనిచేస్తాయి మరియు మనం సులభంగా గందరగోళానికి గురవుతాము.

వీటన్నింటికీ మించి, మన భావాలు సులభంగా దెబ్బతింటాయి మరియు మన భావోద్వేగాలు చేదుగా మారతాయి, ఇది మనం స్పష్టంగా ఆలోచించనివ్వకుండా చేస్తుంది. కానీ వీటన్నిటిలో ఉండే నిజమైన సమస్య ఏమిటంటే, మన పరిమిత శరీరాలు, మనస్సులు, భావోద్వేగాలు వాటికి అవే స్థిరపరచుకుంటాయి; అవి అలాంటి మిగతా వాటిని తీసుకువస్తాయి.

మన పరిమిత శరీరాల నిజమైన బాధ యొక్క నాలుగు అంశాలు

బుద్ధుడు మన పరిమిత శరీరాల యొక్క నాలుగు అంశాలతో ఈ నిజమైన బాధను వివరించాడు. 

  • ముందుగా, అవి అశాశ్వతమైనవి. కొన్నిసార్లు మనం మంచి ఆరోగ్యంతో ఉండి మంచి అనుభూతిని పొందుతాము, కానీ చిన్న విషయం మన శరీరాలను సమతుల్యత లేకుండా చేస్తుంది అప్పుడు మనం అనారోగ్యానికి గురవుతాము మరియు భయంకరంగా ఫీల్ అవుతాము. మన శరీరాలు ఎంత లూస్ గా ఉన్నాయో చూడండి - చిన్న ప్రమాదం మనకు గాయం మరియు నొప్పిని కలిగిస్తుంది. ప్రతి క్షణం మనల్ని మరణానికి దగ్గరగా తీసుకెళ్తుందనేదే దీని సారాంశం. మన శరీరాలను ఎప్పుడూ ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుకోగలమని మరియు మనం వృద్ధాప్యంలో కూడా అదే ఆహారం తినగలమని మరియు చిన్నప్పుడు మనం చేసిన అదే పనులను చెయ్యగలమని మనం అనుకుంటాము. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. యవ్వనంగా ఉండటానికి మన అంతులేని పోరాటం మనకు ఆందోళన మరియు ఒత్తిడిని కలిగిస్తుంది.
  • రెండవది, మన శరీరాలలో సమస్యలు ఉన్నాయి. పెర్ఫ్యూమ్, మేకప్ వేసుకోవడం ద్వారా లేదా ఎక్కువ కండరాలను అభివృద్ధి చెయ్యడం ద్వారా మన శరీరం ఆకర్షణీయంగా కనిపిస్తే, మనం సంతోషంగా ఉన్నామని అనుకోవచ్చు. కానీ మనల్ని మనం ఎంత అందంగా చూపించుకోడానికి ప్రయత్నించినా, మనం అందంగా కనిపించడం లేదని లేదా మనం మన అందాన్ని కోల్పోతున్నామని ఆందోళన చెందుతుంటాం. మనం ఎంత మేకప్ వేసుకున్నా, లేదా ఎంత ఆరోగ్యకరమైన డైట్ ను ఫాలో అయినా మన శరీరంలో సమస్య ఏంటంటే మనం ఇంకా అనారోగ్యానికి గురవుతాం, ఇంకా ముసలివాళ్ళం అవుతాం, ఇంకా యాక్సిడెంట్ అయి గాయపడతాం.
  • మూడవది, మనం స్నానం చెయ్యకపోతే మన శరీరం దుర్వాసనతో ఉంటాయి, మనం పళ్ళను తోముకోకపోతే మన శ్వాస ఆగిపోతుంది మరియు మూత్రం మరియు మలం దుర్వాసనను వదులుతుంది. మనం కొన్నిసార్లు నమిలిన ఆహారాన్ని ఉమ్మి వేసి ఎవరికైనా ఇస్తే, దాన్ని శుభ్రంగా, తినడానికి మంచిదని ఎవరైనా అనుకుంటారా? ఇక్కడ సమస్య ఏమిటంటే, మన శరీరాల నుంచి మనల్ని విడదీసి "అందమైన శరీరం" అనే ఊహా ప్రపంచంలో జీవించగల "నేను" అని పిలువబడే స్వతంత్రంగా ఉనికిలో ఉన్న అస్తిత్వాలు కాదు. మనలో లోపాలున్నప్పటికీ ఈ శరీరాలతోనే మనం చిక్కుకుపోయాము, వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ బాధను అధిగమించడానికి మరియు ఇతరులకు సహాయం చెయ్యడానికి మన ప్రయత్నాలతో వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి.
  • నాలుగవది, మన శరీరాలను చూడటం ద్వారా తప్ప ఇతరులు నిజజీవితంలో మనల్ని చూడలేరు. ఇతరులు వీడియో గేమ్ లో మనల్ని చూడటానికి మనం ఆన్‌లైన్ లో ఒక అవతార్ ని సృష్టించవచ్చు, కానీ ఎవరైనా "వాస్తవ ప్రపంచంలో" మనల్ని కలిసినప్పుడు, వారు మన శరీరాలను అలాగే చూస్తారు. 60 ఏళ్ల వయసులో మనం 20 ఏళ్ల వయసులో ఎలా ఉన్నామో అలానే ఉంటామని మన మనస్సులో ఊహించుకుంటే, అందరూ మనల్ని చూస్తే వాళ్ళకు 60 ఏళ్ల నాటి శరీరమే కనిపిస్తుంది. మనం దాన్ని అర్థం చేసుకోకపోతే, అంగీకరించకపోతే, మనల్ని మనం మోసగించుకుంటునట్టే మరియు ఆ వయస్సుకు తగిన విధంగా వ్యవహరించడం ద్వారా సమస్యలను సృష్టిస్తాం.

సారాంశం

మన పరిమిత శరీరాలు నిజమైన బాధలకు ఉదాహరణలు, అవి అశాశ్వతమైనవి మరియు సమస్యాత్మకమైనవి, మనం వాటి నుంచి వేరు కాలేము, మరియు ఇతరులు మన వైపు చూసినప్పుడు, మనకు నచ్చినా నచ్చకపోయినా అవి కనిపిస్తాయి. ఆ రకమైన శరీరాన్ని కలిగి ఉండటమే ఒక సమస్య, కానీ బుద్ధుడు గుర్తించవలసిన నిజమైన బాధ ఏమిటంటే, అటువంటి శరీరాన్ని మనం మన జీవితకాలం కలిగి ఉంటాము, దీనితో మనం అంతులేని దుఃఖం మరియు సంతృప్తి చెందని ఆనందం మరియు ఆ ఆనందం యొక్క అంతులేని చక్రాన్ని అనుభవిస్తాము. నిజంగా మీకు కావలసింది అదేనా?

Top