నేను మొదటిసారిగా 1970, జనవరిలో బోధ్ గయాలో యోంగ్జిన్ లింగ్ రింపోచే గారిని కలిశాను, అక్కడ అతను శీతాకాల నెలలను గడుపుతూ అక్కడి టిబెటన్ ఆలయంలో వార్షిక బోధనలను ఇస్తూ ఉన్నారు. ఆ సమయానికి బోధ్ గయా ఇంకా అభివృద్ధి చెయ్యబడలేదు మరియు చాలా పేదరికంలో ఉండేది. ఒక కుష్టురోగుల గుంపు ఆ స్థూపం ఎదురుగా ఉన్న మట్టి రోడ్డుపై నిలబడి భిక్షాటన చేస్తూ కనిపించింది. అక్కడున్న కొద్దిమంది విదేశీయులలో ఒకరిగా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ గుంపులలో ఉన్న చిన్నపిల్లలు నా వెనుక దోమల గుంపులా వచ్చి, నా బట్టలు లాక్కుని, కొన్ని డబ్బుల నాణేల కోసం భిక్షాటన చేస్తూ , "బక్షీష్, మెమ్ సాహెబ్" అని పదే పదే అరుస్తూ ఉండేవారు. స్థానిక ఓపెన్ ఎయిర్ టాయిలెట్ గా ఉన్న ఒక చోటు వెనుక ఉన్న పొలంలో అడవి కుక్కలు, పందులు స్వేచ్ఛగా సంచరిస్తూ స్థూపం చుట్టూ తిరుగుతూ ఉండేవి. అది నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక సీన్.
ఆ సందర్భంలో, నేను యోంగ్జిన్ లింగ్ రింపోచే గారి నుంచి నా మొదటి చెన్రెజిగ్ దీక్షను స్వీకరించాను మరియు నా మొదటి భోధిసత్వ ప్రతిజ్ఞను తీసుకున్నాను. యోంగ్జిన్ రింపోచే గారి అసాధారణ ఉనికి ఆ హుందాతనాన్ని మరియు బలాన్ని ప్రసరింపజేస్తుంది, సన్యాస ద్వారాల బయట ఉన్న పరిసరాలు మరియు గందరగోళానికి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా బోధించే సమయంలో యోంగ్జిన్ రింపోచే గారి గొంతు బాగా ఆకట్టుకుంది. అది శ్వాస కోసం ఆగకుండా స్థిరమైన ప్రవాహంలా అప్రయత్నంగా, శ్రావ్యంగా ప్రవహించింది.
1971, సెప్టెంబర్ లో ధర్మశాలలో యోంగ్జిన్ లింగ్ రింపోచే గారితో నా తర్వాతి పరిచయం జరిగింది. నా గురువు గెషే గావాంగ్ ధార్గే గారు నన్ను దల్హౌసీ నుంచి షార్పా, ఖమ్లుంగ్ రింపోచే లతో కలిసి ఒక గొప్ప కార్యక్రమానికి హాజరయ్యేందుకు తీసుకువచ్చారు. ఆయనకు, అక్కడ గుమిగూడిన తాంత్రిక కళాశాలలకు గెలుగ్ సంప్రదాయానికి చెందిన ముగ్గురు ప్రిన్సిపాళ్ల అత్యున్నత తాంత్రిక సాధికారతలను గురువు గారి ఇద్దరు శిష్యులు ప్రదానం చేసేవారు. యోంగ్జిన్ లింగ్ రింపోచే గారు 13 దేవతలైన వజ్రభైరవ, గుహ్యసమజ దీక్షలను, క్యాబ్జే త్రిజాంగ్ రింపోచే గారితో చక్రసంవర లూయిపా దీక్షను అందించారు. నాకు తెలిసినంత వరకు, తన ఇద్దరు గురువుల నుంచి గురువు గారు బహిరంగంగా దీక్షలు స్వీకరించిన చివరి సందర్భం బహుశా ఇదే కావచ్చు. ప్రధాన శిష్యుడిగా దలైలామా గారు తన గురువుల ముందు కాస్త కిందటి సింహాసనంపై వారికి ఎదురుగా కూర్చున్నారు. అక్కడ హాజరైన ఏకైక పాశ్చాత్యుడిగా, సింహాసనాల ప్రక్కన ఉన్న అల్కోవ్ లో నేను కూర్చొన్నాను, అక్కడ ప్రస్తుతం రింపోచే గారు మరియు 1000 సాయుధ చెన్రెజిగ్ విగ్రహాలు ఉన్నాయి. నాకు సరిగ్గా అంతా కనిపిస్తూ ఉంది. తన గురువుల ముందు గురువు గారి గంభీరత, వినయం, గౌరవం ఆధ్యాత్మిక గురువుతో, తాంత్రిక గురువుతో సరైన మార్గంలో నిత్య ఆదర్శంగా నిలిచాయి.
తర్వాత కొన్నేళ్లలో, యోంగ్జిన్ రింపోచే గారి నుంచి నేను మరెన్నో బోధనలు మరియు దీక్షలను పొందాను. బోధ్ గయా ఆలయంలో వజ్రభైరవుడికి చేసినది నాకు మరిచిపోలేనిది. ఈ సందర్భంగా, యోంగ్జిన్ రింపోచే గారు తన చుట్టూ ఉన్న స్థలంలోని వివిధ లక్షణాలను చెప్తూ మండల ప్యాలెస్ గురించి వివరించారు. ఆ విజువలైజేషన్ ఆయనకు ఎంత క్లియర్ గా ఉందంటే ప్రేక్షకుల్లో కూడా అది మాకు ప్రాణం పోసినట్టు ఉండింది.
తన చుట్టూ ఉన్న వ్యక్తుల సామర్థ్యాన్ని పెంచే ఇది యోంగ్జిన్ లింగ్ రింపోచే గారి అద్భుతమైన లక్షణాలలో ఒకటి. "పెరుగుదల యొక్క జ్ఞానోదయ చర్య" అని పిలువబడే దానికి ఉదాహరణగా నేను ఎప్పుడూ దీన్ని ఉదాహరణగా చెప్తాను. నా టిబెటన్ భాష నా ఉపాధ్యాయులకు మౌఖికంగా అనువదించగలిగే స్థాయికి చేరుకోక ముందు, నేను యోంగ్జిన్ రింపోచే గారిని కలిసినప్పుడు, అతను చూపిన స్పష్టత మరియు ప్రేరణ ద్వారా, టిబెటన్ భాషలో అతని మాటలను నేను ఆ సమయంలో ఇతరుల కంటే బాగా అర్థం చేసుకోగలిగి ఆశ్చర్యపోయాను. మనసులోని స్పష్టతను నేరుగా నా మెదడులోకి ప్రవేశపెట్టినట్టు నాకు అనిపించింది.
నా టిబెటన్ భాషా నైపుణ్యాలు తగినంతగా మెరుగుపడిన తర్వాత, నేను అప్పుడప్పుడు యోంగ్జిన్ రింపోచే గారి కోసం అనువదించడం ప్రారంభించాను, అప్పుడు అతను ఇతర విదేశీయులకు ప్రైవేట్ బోధనలు ఇచ్చేవారు. వివిధ ఆచారాలకు సంబంధించిన వివరణలు కోరడంలో ఆయన చాలా ఉదారంగా ఉండేవారు, నాకు అవసరమైనప్పుడల్లా నా స్వంత ధర్మ ప్రశ్నలకు సమాధానం కోసం వెళ్ళేవాడిని. ఈ అరుదైన, అమూల్యమైన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నేను జాగ్రత్త పడ్డాను.
ఒకసారి, ఆయన ఇచ్చిన సంక్లిష్టమైన అవలోకితేశ్వర అభ్యాసం యొక్క వివరణ కోసం నేను అనువాదం చేస్తున్నప్పుడు, విద్యార్థులు గదిలోకి రాక ముందు యోంగ్జిన్ రింపోచే గారు నాతో ఇలా అన్నారు, ఈ వ్యక్తి ఈ బోధనలను ఆచరణలో పెట్టగలడా అని అతను ఆశ్చర్యపోయాడు. కానీ ఏదో ఒకటి వివరించడం సముచితమని ఆయన భావించారు. యోంగ్జిన్ రింపోచే గారు తర్వాత చాలా నైపుణ్యం కలిగిన వివరణ ఇవ్వడానికి ముందుకు సాగాడు, ఇది చాలా లోతుగా లేదా వివరంగా వెళ్ళలేదు, కానీ అభ్యాసాన్ని అన్వేషించడానికి వ్యక్తిని ఆ ప్రేరేపించడానికి సరిపోయింది. బోధనలు చేసేటప్పుడు, వాటిని సరైన చిత్తశుద్ధితో కూడిన ప్రేరణ ఉపాధ్యాయుడికి అత్యంత ముఖ్యమైన అంశం అని ఇది నాకు ఆదర్శాన్ని ఇచ్చింది. ఆ ప్రేరణతో, మీరు సహజంగానే వివరణను విద్యార్థి స్థాయి మరియు అవసరాలకు అనుగుణంగా స్కేల్ చేస్తారు. విద్యార్థి బోధనలను ఆచరణలో పెట్టాడా లేదా అనేది విద్యార్థి యొక్క బాధ్యత. పరిపూర్ణ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలనే ఈ ఉన్నత ప్రమాణాన్ని అందుకోవడం కష్టం.
మంజుశ్రీ యొక్క శక్తివంతమైన రూపమైన వజ్రభైరవుడి యొక్క మానవ ప్రతిరూపంగా, బుద్ధుడి ప్రతిరూపంగా, బౌద్దులందరి స్పష్టత, తెలివితేటలు మరియు జ్ఞానాన్ని కలిగి ఉన్న యోంగ్జిన్ లింగ్ రింపోచే గారు తన చుట్టూ ఉన్న ఈ శక్తివంతమైన స్పష్టత శక్తిని గుర్తించి స్థిరత్వం మరియు సహాయం యొక్క దృఢమైన శిలలా మారారు. ఈ రకమైన శక్తి, దాని సమక్షంలో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్న చిన్న పిల్లవాడిలా నటించడం లేదా ఆలోచించడం మానేసి, దానికి బదులుగా స్పష్టంగా, పదునైన మరియు భావోద్వేగంగా మరియు మానసికంగా ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉండటానికి కారణమవుతుంది.
ఈ లక్షణానికి ఉదాహరణగా, ఒకసారి నేను ధర్మశాలలోని అతని ఇంటికి యోంగ్జిన్ రింపోచే గారిని కలిసినప్పుడు నాకు ఇది గుర్తుంది. యోంగ్జిన్ రింపోచే గారు గదిలో ఒక మూలకు ఒక వైపు మంచం వేసుకుని కూర్చున్నారు మరియు నేను ఆ మూలకు మరొక వైపు మరొక చిన్న మంచం వేసుకుని కూర్చున్నాను. నా మెడిటేషన్ ప్రాక్టీస్ గురించి నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తుండగా, అకస్మాత్తుగా మా మధ్య నేలపై ఒక పెద్ద తేలు కనిపించింది. ఎప్పుడూ ఎంతో హుందాగా ఉండే యోంగ్జిన్ రింపోచే గారు తన చేతులను గాల్లోకి లేపి ఉద్వేగభరితమైన స్వరంతో అరిచారు, "ఓ డియర్, తేలు!" అని. అప్పుడు అతను కళ్ళను పెద్దవి చేసి నా వైపు చూసి, "నీకు భయం వెయ్యడం లేదా?" అని అడిగారు. నేను అతని కళ్ళలోకి తిరిగి చూసి, "వజ్రభైరవుడి ముందు నేనెలా భయపడగలను?" అని అన్నాను. అది నిజం, నేను భయపడలేదు. నా సమాధానం విని యోంగ్జిన్ రింపోచే గారు నవ్వారు. అప్పుడు అతని సహాయకుడు ఒక కప్పు, కాగితం ముక్కతో వచ్చి తేలు కింద కాగితాన్ని పెట్టి, కప్పును దాని మీద ఉంచి, దానిని బయటకు తీసుకెళ్లి పెరట్లో విడిచిపెట్టాడు. నా పాఠంలో భాగంగా యోంగ్జిన్ రింపోచే గారు ఈ మొత్తం సంఘటనను సృష్టించినట్లు నాకు అనిపించింది.
యోంగ్జిన్ లింగ్ రింపోచే గారి పట్ల చాలా మంది ప్రజలకు భయం మరియు విస్మయం ఉంటుంది, ఈ నమ్మశక్యం కాని బలమైన మరియు ఆకర్షణీయమైన వజ్రభైరవ శక్తి కారణంగా, యోంగ్జిన్ రింపోచే గారు ఈ ప్రతిస్పందన సరైనదని ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి నేను ఆయనతో కలిసి బోధ్ గయాలోని దేవాలయంలోని తన గదిలో ఉన్నప్పుడు, క్రింద సన్యాసులు నిర్వహిస్తున్న "సోగ్" పూజా కార్యక్రమం నుంచి ఒక యువ సన్యాసి ఒక ప్లేట్ నైవేద్యాలతో లోపలికి ప్రవేశించాడు. అంతటి మహా గురువు దగ్గరకు రావడానికి ఆ యువ సన్యాసి చాలా కంగారు పడిపోయి భయపడ్డాడు. అతను వెళ్ళిన తర్వాత, యోంగ్జిన్ రింపోచే గారు నవ్వుతూ నాతో ఇలా అన్నారు, "వాళ్ళందరూ నన్ను చూసి చాలా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కదా."
హృదయంలో ప్రశాంతమైన మంజుశ్రీతో భీకర వజ్రభైరవుడి లాగా, యోంగ్జిన్ లింగ్ రింపోచే గారు బయట స్థిరత్వానికి కఠినమైన, తీవ్రమైన పునాది లాంటి వారు, లోపల వెచ్చగా, దయగా మరియు అనంతమైన వివేకాన్ని కలిగి ఉన్నారు. ఆయన శిష్యుడిగా, అప్పుడప్పుడూ అనువాదకుడిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తాను.