10 బౌద్ధమత మూల విశ్వాసాలు

10%20basic%20buddhist%20beliefs
  1. ప్రతి ఒక్కరూ ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు, కానీ కొందరికి మాత్రమే దాని అర్థం మరియు దానిని ఎలా సాధించాలో తెలుసు.
  2. మన భావోద్వేగాలు మరియు ప్రవర్తనలు మనం ఏ విధంగా ఫీల్ అవుతామో దానిని ప్రభావితం చేస్తాయి. శిక్షణ తీసుకుని, ఈ నెగిటివ్ విషయాలను వదిలించుకుని ఆరోగ్యకరమైన మరియు పాజిటివ్ విషయాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మన జీవితం సంతోషంగా, మరియు సంతృప్తికరంగా ఉంటుంది.
  3. కోపం, భయం, దురాశ, మమకారం లాంటి ఇబ్బంది పెట్టె భావోద్వేగాలు మన మనశ్శాంతిని, స్వీయ నియంత్రణను కోల్పోయేలా చేస్తాయి. శిక్షణ తీసుకుని వాటి నియంత్రణలో ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
  4. కోపం లేదా అత్యాశతో మొండిగా ప్రవర్తించడం మనకు సమస్యలను తెచ్చిపెట్టి అసంతృప్తికి దారితీస్తుంది. శిక్షణ తీసుకుని, మనం ప్రశాంతంగా ఉంటూ స్పష్టంగా ఆలోచిస్తూ తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవచ్చు.
  5. ప్రేమ, కరుణ, సహనం మరియు అవగాహన వంటి పాజిటివ్ భావోద్వేగాలు మనల్ని ప్రశాంతంగా, ఓపెన్ గా మరియు స్పష్టంగా ఉండటానికి సహాయపడుతూ మనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. శిక్షణ తీసుకుని మనం వాటిని అభివృద్ధి చేసుకోవడం నేర్చుకోవచ్చు.
  6. స్వీయ-కేంద్రీకృత ప్రవర్తన మరియు ఆలోచనలు ఇతరుల నుంచి దూరం చేసి మనల్ని అసంతృప్తికి గురి చేస్తాయి. శిక్షణ తీసుకుని మనం వాటిని అధిగమించవచ్చు.
  7. మనందరం ఒకరితో మరొకరు ముడిపడి ఉన్నామని మరియు మన మనుగడ అందరిపై ఆధారపడి ఉందని గ్రహించడం మన హృదయాలను మరియు మనస్సులను ఓపెన్ అయ్యేలా చేస్తుంది, ఇతరుల పట్ల శ్రద్ధను పెంపొందించడానికి ఇది సహాయపడుతుంది మరియు మనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.
  8. మనం ఎక్కువగా ఇతరులలో చూసేది ఊహలపై ఆధారపడి ఉంటుంది. మన అంచనాలు వాస్తవికతకు అనుగుణంగా ఉన్నాయని మనం తెలుసుకున్నప్పుడు, మనం మనకు మరియు ఇతరులకు సమస్యలను సృష్టిస్తాము.
  9. మనం సరిగ్గా అర్ధం చేసుకుని, మనం ఇబ్బందులను తొలగించుకోవచ్చు మరియు వాస్తవాన్ని సరిగ్గా చూడవచ్చు. ఇది మన జీవితంలో ఏమి జరిగినా ప్రశాంతంగా మరియు తెలివిగా ప్రవర్తించడానికి వీలు కల్పిస్తుంది.
  10.  మంచి వ్యక్తిగా మారడానికి మన కోసం మనం కష్టపడటం ఒక జీవితకాలం పాటు ఉండే సవాలు, కానీ ఇదే మన జీవితంలో మనం చేయగలిగే అత్యంత అర్థవంతమైన పని.
Top