పవిత్రమైన దలైలామా గారి సందేశం

21వ శతాబ్దం గడుస్తున్న కొద్దీ, ఇంటర్నెట్ అనేది ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకు సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ఒక మంచి విస్తృతమైన మరియు ముఖ్యమైన మాధ్యమంగా మారుతుంది. బౌద్ధమత బోధనలు, దాని చరిత్ర మరియు టిబెటన్ సంస్కృతికి సంబంధించిన అనేక ఇతర విషయాలకు సంబంధించిన సమాచారానికి కూడా ఇది అందిస్తుంది. ఈ ఇంటర్నెట్ పుస్తకాలు, మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోట అనేక మందికి ప్రధాన సమాచార రిసోర్సుగా మారింది.

అపార్థాలు చేసుకోవడం, మతోన్మాదం సర్వసాధారణమైన ఈ ప్రపంచంలో, చదువు అనేది ఇలాంటి విభేదాలను అంతం చేసే ఒక అత్యంత శక్తివంతమైన సాధనం. అందుకోసం నేను డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్ గారి ఈ మల్టీ-లాంగ్వేజ్ వెబ్‌సైట్, www.berzinarchives.com ని బౌద్ధమతం మరియు టిబెటన్ సంస్కృతి యొక్క వివిధ పాఠశాలలు మరియు విషయాలకు సంబంధించిన విస్తృత శ్రేణి ఆర్టికల్స్ ను ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచడానికి విలువైన విద్యా సాధనంగా ఉపయోగించాలని అనుకుంటున్నాను.

2007, జనవరి 26
పవిత్రమైన దలైలామా గారు

Top