బౌద్ధ బోధనలు బుద్ధుని నుండి, సాక్షాత్కార గురువుల వంశం ద్వారా గుర్తించబడినప్పుడు అవి ప్రామాణికమైనవిగా పరిగణించబడతాయి. దీనిలో మనకు నమ్మకం ఉన్నప్పుడు, ఆయా బోధనలను అభ్యసించడానికి మనం ప్రయత్నిస్తాము, వాటిని మనం అర్థం చేసుకుని సరిగ్గా అన్వయించినప్పుడు, అవి మనం కోరుకున్న ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తాయని నమ్ముతాం.