Study buddhism shantideva

శాంతిదేవుడు

శాంతిదేవుడు (8 వ శతాబ్దం) టిబెట్ యొక్క అన్ని సంప్రదాయాలలో కనిపించే బోధిసత్వ బోధనలకు భారతీయ మూలం, ముఖ్యంగా ఆరు పరమితాల (ఆరు పరిపూర్ణతలు) ఆచరణకు సంబంధించి.

శాంతిదేవుడు ఎనిమిదవ శతాబ్దంలో తూర్పు భారతదేశంలోని బెంగాల్ ప్రాంతంలోని ఒక చోటులో రాజకుమారుడిగా జన్మించాడు. అతను సింహాసనాన్ని అధిష్టించబోయే ముందు మంజుశ్రీ తన కలలోకి వచ్చింది, అప్పుడు ఆమె "ఈ సింహాసనం నీది కాదు" అని చెప్పింది. మంజుశ్రీ సలహాను తీసుకుని, ఆ సింహాసనాన్ని తీసుకోకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా మంది బౌద్ధేతర గురువులను కలుసుకుని చదువుకుని, తీవ్రమైన ధ్యానం చేసి ఏకాగ్రతతో ఉన్నత స్థితిని సాధించాడు. కానీ, శాక్యముని విషయంలో లాగానే, లోతైన ఏకాగ్రత స్థితిలోకి వెళ్ళడం బాధ యొక్క మూలాలను తొలగించదని అతను గ్రహించాడు. మంజుశ్రీపై ఆధారపడి, చివరికి బుద్ధులందరి జ్ఞానం యొక్క నిజమైన దర్శనాన్ని పొంది వాళ్ల నుంచి బుద్ధుని బోధనలను పొందాడు.

ఆ తర్వాత శాంతిదేవుడు ఆ అడవిని వదిలి సన్యాస విశ్వవిద్యాలయమైన నలందకు వెళ్ళాడు, అక్కడ మఠాధిపతి చేత సన్యాసిగా మారాడు. అక్కడ గొప్ప సూత్రాలను, తంత్రాలను క్షుణ్ణంగా అభ్యసించినా తన ఆచరణలన్నింటినీ దాచిపెట్టుకున్నాడు. అతను తినడం, నిద్రపోవడం, టాయిలెట్ కు వెళ్లడం తప్ప ఇంకేమీ చెయ్యలేదని అందరూ అనుకున్నారు. కానీ అతను ఎప్పుడూ స్పష్టమైన కాంతి ధ్యాన స్థితిలో ఉండేవాడు.

చివరకు, ఆ మఠంలోని సన్యాసులు అతను దేనికీ పనికిరాని వాడని భావించి అతన్ని పంపించేయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం అతను తనను తాను మూర్ఖుడిగా రుజువు అవుతాడని ఒక వచనంపై ఉపన్యాసం ఇవ్వమని అతనిని అడిగారు. మెట్లు లేని అత్యంత ఎత్తైన సింహాసనాన్ని ఆయన చేరుకోలేడని భావించి అలాంటి దాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ సింహాసనం శాంతిదేవుని స్థాయికి దిగి వచ్చింది అప్పుడు అతను దాన్ని సులువుగా ఎక్కగలిగాడు.

ఆ తర్వాత అతను భోధిసత్వ ప్రవర్తన, బోధిచార్యావతారం అనే బోధనను ప్రారంభించాడు. శూన్యత (శూన్యం) అనే తొమ్మిదవ అధ్యాయంలో ఒక నిర్దిష్ట శ్లోకానికి చేరుకున్నప్పుడు, అతను నెమ్మదిగా ఆకాశంలోకి లేచాడు. ఆ పద్యం:

(IX.34) ఒక (నిజంగా ఉనికిలో ఉన్న) పనిచేసే విషయం లేదా (నిజంగా ఉనికిలో ఉన్న) పనిచెయ్యని విషయం (దాని శూన్యత) ద్వంద్వ మనస్సు ముందు లేనప్పుడు, ఇతర ప్రత్యామ్నాయాలు అలా ఉండలేవు కాబట్టి, మానసిక లక్ష్యం (అసాధ్యం వద్ద) లేని (ఒక స్థితి) లో పూర్తి ప్రశాంతత ఉంటుంది.

ఆ తర్వాత, అందరికీ మిగిలిన వచనాన్ని చదువుతూ అతని స్వరం మాత్రమే వినిపించింది. అతను మాయమైపోయాడు. ఆ తర్వాత అక్కడి సన్యాసులు గుర్తుతెచ్చుకుని ఆ వచనాలను రాశారు.

శాంతిదేవుడు, తన బోధనలో నలందలో తాను వ్రాసిన మరో రెండు గ్రంథాలను ప్రస్తావించాడు: (1) శిక్షణల సంకలనం, శిక్షాసముకాయ మరియు (2) సూత్రాల సంకలనం, సూత్రసముకాయ, కాని అవి ఎక్కడ దొరుకుతాయో ఎవరికీ తెలియదు. చివరకు శాంతిదేవుడు ఒక సన్యాసి గది పైకప్పులో దాచినట్టు చెప్పడం ఒకరికి గుర్తుకు వచ్చింది. శాంతిదేవుడు మళ్ళీ తిరిగి రానని ఆ దర్శనంలో చెప్పాడు.

సూత్రాల సంక్షిప్త రూపం వాటి యొక్క ప్రధాన అంశాలను సంక్షిప్తీకరించగా, శిక్షణల సంక్షిప్త రూపం సూత్ర పద్ధతులను వివరించింది. రెండవ గ్రంధం యొక్క టిబెటన్ అనువాదం, అలాగే భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం కావడం, బుద్ధుని మాటలకు భారతీయ వ్యాఖ్యానాల టిబెటన్ అనువాదాల సంకలనం తెంగ్యూర్ లో కనిపిస్తుంది. కును లామా రింపోచే గారి ప్రకారం, సూత్రాల సంక్షిప్త రూపం టిబెటన్ భాషలోకి అనువదించబడింది, కాని ఇది తెంగ్యూర్ లో కనిపెట్టబడలేదు.

ముఖ్యంగా తొమ్మిదవ అధ్యాయంలో భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నమై ఉండటానికి అనేక వ్యాఖ్యానాలు రాశారు. టిబెట్ లోని బౌద్ధమత పాఠశాలలన్నింటికీ ఈ గ్రంథం కేంద్ర బిందువు కావడంతో టిబెటన్లు అన్ని సంప్రదాయాల నుంచి వచ్చినవారు అయ్యారు. గెలుగ్ సంప్రదాయంలో, సోంగ్ ఖాపా యొక్క మార్గపు గ్రేడెడ్ దశలు (లామ్-రిమ్ చెన్-మో) యొక్క గ్రాండ్ ప్రెజెంటేషన్ శిక్షణలు మరియు భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం కావడంపై ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా సొంత మరియు ఇతరుల మార్పిడిపై బోధనల కోసం. భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం కావడానికి సోంగ్ ఖాపా ప్రత్యేక వ్యాఖ్యానం రాయనప్పటికీ, మార్గం యొక్క గ్రేడెడ్ దశల యొక్క అతని గ్రాండ్ ప్రజెంటేషన్ దానిలో చర్చించిన అనేక అంశాలను కలిగి ఉంది. వివరణాత్మక మరియు ఖచ్చితమైన అర్థాల యొక్క అద్భుతమైన వివరణ యొక్క అతని సారాంశం (డ్రాంగ్-ఎన్జెస్ లెగ్స్-బ్షద్-స్నైయింగ్-పో) తొమ్మిదవ అధ్యాయంలోని అనేక అంశాలను కవర్ చేస్తుంది. చంద్రకీర్తి యొక్క "(నాగార్జున యొక్క రూట్ స్టాన్స్ ఆన్)] ది మిడిల్ వే" (డిబు-మా ద్గోంగ్స్-పా రబ్-గ్సాల్) ఉద్దేశాలను పూర్తిగా స్పష్టం చెయ్యడం కూడా దానిపై బలంగా ఆధారపడి ఉంది.

1978, జనవరి, భారతదేశం, బోధ్ గయాలో 14వ దలైలామా గారు రచించిన "భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం" అనే ఉపన్యాసం యొక్క సారాంశం. దీనిని డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్ గారు అనువదించి ఎడిట్ చేశారు.
Image source: himalayanart.org
Top