అలెగ్జాండర్ బెర్జిన్ గారు ఎవరు?

అలెగ్జాండర్ బెర్జిన్ (పుట్టుక 1944) గారు USAలోని న్యూజెర్సీలో పుట్టి పెరిగారు. ఆయన 1962 లో రట్జర్స్ మరియు ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో బౌద్ధమతంపై తన అధ్యయనాన్ని ప్రారంభించారు, మరియు సంస్కృతం మరియు భారతీయ అధ్యయనాలు మరియు దూర ప్రాచ్య భాషలు (చైనీస్) డిపార్ట్‌మెంట్ ల మధ్య జాయింట్ గా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 1972 లో PhD పట్టాను పొందారు. బౌద్ధమతం ఒక ఆసియా నాగరికత నుంచి ఇంకొక ఆసియా నాగరికతకు బదిలీ చెయ్యబడిన ప్రాసెస్ మరియు దాన్ని అనువదించి స్వీకరించిన విధానం నుంచి ప్రేరణను పొంది, అప్పటి నుంచి, సాంప్రదాయ బౌద్ధమత మరియు ఆధునిక పాశ్చాత్య సంస్కృతులను అనుసంధానించడంపై అతని దృష్టి మళ్లింది.

డాక్టర్. బెర్జిన్ గారు 29 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నారు, ముందు ఒక ఫుల్బ్రైట్ స్కాలర్ గా, ఆ తర్వాత అతను స్థాపన కోసం సహాయం చేసిన ట్రాన్స్ లేషన్ బ్యూరోలో, ధర్మశాలలోని లైబ్రరీ ఆఫ్ టిబెటన్ వర్క్స్ & ఆర్కైవ్స్ లో ఉన్నారు. భారతదేశంలో ఉన్నప్పుడు, ఆయన నాలుగు టిబెటన్ బౌద్ధమత సంప్రదాయాలకు చెందిన గురువులతో కలిసి తన అధ్యయనాన్ని కొనసాగించారు; అయితే ఆయన ప్రధాన గురువులు దలైలామా, సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే, గెషే గావాంగ్ ధార్గే గార్లు. వారి పర్యవేక్షణలో ఉండి ప్రాక్టీస్ చేస్తూ, గెలుగ్ సంప్రదాయానికి చెందిన ప్రధాన ధ్యాన రిట్రీట్లను పూర్తి చేశారు.

తొమ్మిదేళ్ల పాటు, ఆయన సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారికి ప్రధాన వ్యాఖ్యాతగా ఉన్నారు, అతని విదేశీ పర్యటనలలో అతనితో పాటు మరియు అతని స్వంత బౌద్ధమత గురువుగా ఉండటానికి అతని వద్ద శిక్షణను తీసుకున్నారు. గురువు గారైన దలైలామా గారికి అప్పుడప్పుడు వ్యాఖ్యాతగా పనిచేసి, ఆయన కోసం అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులను చేపట్టారు. వీటిలో చెర్నోబిల్ రేడియేషన్ ప్రమాద బాధితులకు టిబెట్ వైద్య సహాయం; మంగోలియాలో బౌద్ధమతం పునరుద్ధరణకు సహాయపడటానికి వ్యవహారిక మంగోలియన్ భాషలో ప్రాథమిక బౌద్ధమత గ్రంథాల తయారీ ఉన్నాయి; మరియు ఇస్లామిక్ ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలలో బౌద్ధ-ముస్లిం సంభాషణ ప్రారంభాన్ని చేపట్టారు.

1980 నుంచి, డాక్టర్. బెర్జిన్ గారు ప్రపంచం మొత్తం పర్యటించారు, 70 కి పైగా దేశాలలోని యూనివర్సిటీలు మరియు బౌద్ధమత కేంద్రాలలో బౌద్ధమతంపై ఉపన్యాసాలు ఇచ్చారు. కమ్యూనిస్టు ప్రపంచంలో, లాటిన్ అమెరికా అంతటా, మరియు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో బౌద్ధమతాన్ని బోధించిన మొదటి వారిలో ఆయన ఒకరు. తన ప్రయాణాలలో, అతను బౌద్ధమతాన్ని నిర్వచించడానికి మరియు రోజువారీ జీవితంలో దాని బోధనల ఆచరణాత్మక ఉపయోగాన్ని చూపించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవారు.

ఒక గొప్ప రచయిత మరియు అనువాదకుడు అయిన డాక్టర్. బెర్జిన్ గారు 17 పుస్తకాలను ప్రచురించారు. ఇందులో ఆధ్యాత్మిక గురువుకు సంబంధించినవి, కాలచక్ర దీక్షను తీసుకోవడం, సమతుల్య సెన్సిటివిటీని అభివృద్ధి చెయ్యడం మరియు గురువు గారైన దలైలామా గారితో కలిసి మహాముద్ర యొక్క గెలుగ్-కాగ్యు సంప్రదాయం ఉన్నాయి.

1998వ సంవత్సరం చివరిలో, డాక్టర్. బెర్జిన్ తాను రాసిన పుస్తకాలు, వ్యాసాలు మరియు అనువాదాల యొక్క సుమారు 30,000 పేజీల ప్రచురించని వ్రాతప్రతులు, తాను అనువదించిన గొప్ప గురువుల బోధనల ప్రతిరూపాలు, మరియు ఈ గురువుల నుంచి పొందిన అన్ని బోధనల నోట్స్ తో పాశ్చాత్య దేశాలకు తిరిగి వచ్చారు. ఇతరులకు ఈ మెటీరియల్ యొక్క ప్రయోజనాన్ని అందించాలని, దాన్ని పోగొట్టకూడదని గట్టిగా నిశ్చయించుకుని, అతను దీనికి "బెర్జిన్ ఆర్కైవ్స్" అని పేరు పెట్టి జర్మనీలోని బెర్లిన్ లో స్థిరపడ్డారు. అక్కడ గురువు గారైన దలైలామా గారి ప్రోత్సాహంతో ఈ విస్తారమైన మెటీరియల్ ను ఇంటర్నెట్ లో, వీలైనన్ని ఎక్కువ భాషల్లో ప్రపంచానికి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నారు.

అలా బెర్జిన్ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ డిసెంబరు 2001 లో ఆన్‌లైన్‌లోకి వచ్చింది. ఇది డాక్టర్. బెర్జిన్ యొక్క ప్రస్తుత ఉపన్యాసాలను కలుపుకుని ఇప్పుడు (2015 లో) మొత్తం 21 భాషలలో అందుబాటులో ఉంది. వాటిలో చాలా వాటికి, ముఖ్యంగా ఆరు ఇస్లామిక్ ప్రపంచ భాషలకు, ఇదే ఈ రంగంలో ఏకైక మార్గదర్శక వర్క్. ఈ వెబ్‌సైట్ యొక్క ప్రస్తుత వెర్షన్ (2021 లో 32 భాషలలో అందుబాటులో ఉంది) సాంప్రదాయ బౌద్ధమత మరియు ఆధునిక ప్రపంచాల మధ్య ఒక బ్రిడ్జిని నిర్మించడానికి డాక్టర్. బెర్జిన్ యొక్క జీవితకాల నిబద్ధతలో ఉన్న తర్వాతి స్టెప్. ఈ బ్రిడ్జి సహాయంతో బోధనలకు మార్గనిర్దేశం చేసి దానితో ఆధునిక జీవితానికి వాటి సంబంధాన్ని చూపించి ఈ ప్రపంచానికి ఒక భావోద్వేగ సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడతాయని ఆయన ఆలోచన.

Top