ధర్మాన్ని పాటించడం మరియు కష్టాలను అధిగమించడం

ధర్మం అనే సంస్కృత పదానికి టిబెటన్ భాషలో చో (చోస్) అని అర్థం ఉంది, అంటే పట్టుకోవడం లేదా నిలబెట్టుకోవడం. నిలబెట్టుకోవడం లేదా మెయింటైన్ చెయ్యడం అంటే ఏమిటి? కష్టాలను అధిగమించుకుని సుఖాన్ని పొందడం. ఈ ధర్మం మన కోసమే కాకుండా సమస్త జీవరాశులన్నిటికి సహాయపడుతుంది.

బాధలను గుర్తించడం

మనం అనుభవించే బాధలు రెండు రకాలు: మానవులుగా మనకు వెంటనే వచ్చేవి మరియు బయటి శక్తులు లేకుండా మనం చూడలేనివి. మొదటిది మనం పుట్టినప్పుడు వచ్చే నొప్పి, అప్పుడప్పుడు అనారోగ్యానికి గురయ్యే ఇబ్బంది నుంచి, వయసు పెరగడం మరియు దాని నుంచి వచ్చే బాధలు మరియు మరణ భయం.

చనిపోయిన తర్వాత వచ్చే బాధలు సామాన్యుడికి తెలియవు. మనం చనిపోయిన తర్వాత, బహుశా మనం మానవులుగా పునర్జన్మ పొందుతామని అనుకుంటాము. అయితే, ఇది ఇలాగే ఉండాలని ఏమీ కాదు. అటువంటి పరిణామం సంభవిస్తుందని మనం అనుకోవడం లాజికల్ కారణం లేదు. లేదా మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మను అస్సలు పొందమని కూడా కాదు.

మనం తీసుకునే పునర్జన్మ విషయానికొస్తే, ఇది తెలుసుకోవడం చాలా కష్టం, ప్రస్తుతం మన జ్ఞాన పరిధిలో ఇది లేదు. ఈ జన్మలో మనం పాజిటివ్ కర్మను సృష్టిస్తే, భవిష్యత్తులో మనం ఒక సంతోషకరమైన పునర్జన్మను స్వీకరించగలము. అదే విధంగా, మనం ఎక్కువగా నెగెటివ్ కర్మను సృష్టిస్తే, మనం ఆ సంతోషకరమైన పునర్జన్మను పొందలేము, కానీ తక్కువ స్థితిలో ఎక్కువ కష్టాలను అనుభవిస్తాము. ఇది నిజం. పునర్జన్మ ఇలాగే పనిచేస్తుంది. మనం గోధుమ విత్తనం నాటితే, పెరిగేది గోధుమ మొక్క మాత్రమే. అలాగే ఒక వరి విత్తనాన్ని నాటితే వరి మొక్క మాత్రమే వస్తుంది. అదే విధంగా, నెగెటివ్ కర్మను సృష్టించడం ద్వారా మనం నరక జీవిగా, ఆకలితో ఉన్న దెయ్యం లాగా లేదా ఒక జంతువుగా మూడు కిందటి స్థితుల్లోని ఒకదానిగా పునర్జన్మ యొక్క విత్తనాలను నాటిన వాళ్ళము అవుతాము.

నరకం యొక్క నాలుగు వేర్వేరు స్థితులు లేదా ప్రపంచాలు (సంతోషం లేని ప్రాంతాలు): వేడి, చల్లని, పక్కన మరియు అక్కడక్కడ ఉండే నరకాలు. వీటిని ఇంకా విభజించడానికి, ఎనిమిది వేర్వేరు వేడి నరకాలు ఉన్నాయి. వీటిలో మొదటి దాన్ని పునరుజ్జీవన నరకం అంటారు. రిలేటివ్ గా చెప్పాలంటే, ఇది తక్కువ బాధలతో ఉండే దానిలో ఒకటి. ఇక్కడ అనుభవించిన దుఃఖం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి, మొదటి వేడి నరకంలో ఉన్న జీవులతో పోలిస్తే ఒక పెద్ద అగ్నిలో చిక్కుకున్న వ్యక్తి యొక్క బాధ చాలా తక్కువగా ఉంటుంది. పునరుజ్జీవన నరకానికి కింద ఉండే ప్రతి నరకం ఇంకా తీవ్రమైన దుఃఖాన్ని కలిగి ఉంటుంది.

నరక జీవుల బాధలు, ఆకలితో అలమటించే దెయ్యాల బాధలు మనకు తెలియకపోయినా, జంతువుల బాధలను మన కళ్లతో చూడవచ్చు. మనమే జంతువులుగా పునర్జన్మ పొందితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే, ఇక్కడే మన భారతదేశంలో మన చుట్టూ ఉన్న వీధి జంతువులను చూసి, వాటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. ధర్మమే మనల్ని ఇలాంటి వాటిల్లోకి వెళ్లకుండా, ఈ తక్కువ పునర్జన్మల బాధలను అనుభవించకుండా కాపాడుతుంది.

పునర్జన్మ చక్రం, నియంత్రణలో లేని రిపీట్ అయ్యే ఉనికి (సంసారం) మొత్తం బాధల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అన్ని బాధల నుంచి మనల్ని కాపాడేది ధర్మమే. అంతేకాకుండా, మహాయాన ధర్మం మనకు మాత్రమే కాకుండా, అన్ని పరిమిత జీవులకు (ఇంద్రియ జీవులకు) రక్షణను కల్పిస్తుంది.

ఆశ్రయం యొక్క సురక్షిత దారిని ఎంచుకోవడం

బౌద్ధమతంలో బుద్ధుడు, ధర్మం, సంఘం అనే మూడు ఆభరణాల గురించి మనం చాలా వింటూ ఉంటాం. వీటిలో మొదటిది ధర్మాన్ని బోధించే సంపూర్ణ జ్ఞానవంతులైన జీవులందరినీ కలిగి ఉంటుంది. నాలుగు ఉత్తమ సత్యాలను బోధించడం ద్వారా వారణాసిలో ధర్మ చక్రాన్ని ముందుగా వివరించిన బుద్ధ శాక్యముని మనకు అత్యంత ముఖ్యమైనవాడు. ఈ నాలుగు సత్యాలలో చివరిది - నిజమైన మార్గాలు - ముక్తిని సాధించడానికి ఆచరించవలసిన ధర్మం. ఇది ధర్మ రత్నం అని పిలిచే సురక్షితమైన దిశ యొక్క ఆశ్రయ వస్తువు.

ధర్మ ఆచరణలో రెండు విషయాలు ఉన్నాయి: సంసార బాధల మూలాన్ని గుర్తించడం మరియు ఈ మూలాన్ని నిర్మూలించడం. పునరావృత ఉనికికి మూలం ఏమిటి? ఇది నిజంగా ఉనికిలో ఉన్న ఆత్మ కోసం మరియు సందర్భం యొక్క నిజమైన ఉనికిని గ్రహించడం లాంటిది. మన బాధలన్నిటినీ తెచ్చిపెట్టే ఈ అవగాహన పట్ల ఒక వ్యతిరేకతను పెంపొందించుకోవాలి. ఈ నిజమైన ఉనికిని అర్థం చేసుకోవడానికి విరుగుడుపై అవగాహనను పెంపొందించుకోవాలి. ఈ విరుగుడు నిస్వార్థం లేదా అస్తిత్వం యొక్క జ్ఞానం (విచక్షణా అవగాహన). నిస్వార్థం గురించిన ఈ అవగాహనే మనకు బాధల నుంచి విముక్తిని అందిస్తుంది.

సంసారంలో మనం అనుభవించే బాధలు ఏ కారణం లేకుండా రావు. అవి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు వైఖరులు (భ్రమలు) మరియు అవి సృష్టించిన కర్మ వల్ల వస్తాయి. ఈ అన్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు, వైఖరులు మరియు కర్మ యొక్క మూలం ఆత్మను గ్రహించడం. దీనిని అర్థం చేసుకున్నప్పుడు, ఆత్మ కోసం ఈ అవగాహనకు వ్యతిరేకతను పొందాలని మనం అనుకుంటాము. మన మానసిక స్థితికి వ్యతిరేకతను మనం ఇంకా ఎందుకు అభివృద్ధి చేసుకోలేదు? నిస్వార్థతను మనం ఎందుకు అర్థం చేసుకోలేదు? మరణం మరియు అశాశ్వతం గురించి మనకు సరైన అవగాహన లేకపోవడమే ఒక కారణం.

మరణం మరియు అశాశ్వతం

జననం యొక్క ఆఖరి ఫలితం మరణమే. మనం ఖచ్చితంగా చనిపోతాం. మరణంతో ముగియని జీవితం ఏ జీవికి ఉండదు. మరణం సంభవించకుండా ఆపడానికి ప్రజలు అనేక పద్ధతులను ఉపయోగిస్తారు, కానీ అది అసాధ్యం. ఏ మెడిసిన్ మనల్ని మరణం నుంచి కాపాడదు.

"నేను చనిపోతాను" అని అనుకోవడం నిజంగా మరణం గురించి ఆలోచించే సరైన మార్గం కాదు. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ చనిపోతారు, కానీ దీని గురించి ఆలోచించడం అంత మంచి విషయం కాదు. ఇది సరైన పద్ధతి కాదు. అదే విధంగా మనం నాశనం అయిపోతున్నాం, క్షీణించబోతున్నాం, మన శరీరాలు కుళ్లిపోతామనే విషయాన్ని తలచుకోవడం సరైనది కాదు. మన పతనాన్ని ఎలా నిరోధించుకోవాలో అని మనం ఆలోచించాలి.

మరణ సమయంలో వచ్చే భయం మరియు ఆ భయాన్ని ఎలా తొలగించుకోవాలో అనే దాని గురించి ఆలోచిస్తే, అప్పుడు మరణంపై మన ధ్యానం ప్రభావవంతంగా ఉంటుంది. తమ జీవితంలో చాలా నెగెటివ్ కర్మలను తెచ్చుకున్న వ్యక్తులు మరణ సమయంలో చాలా భయపడతారు. చెంపల మీద నుంచి కన్నీళ్లు కారతాయి, నోరు పడిపోతుంది, బట్టల్లో విసర్జించుకుని పూర్తి ఆలోచనలో మునిగిపోతారు. జీవితంలో మనం చేసే నెగెటివ్ పనుల వల్ల కలిగే భయం లాంటివి మరణ సమయంలో కలిగే బాధకు స్పష్టమైన సంకేతాలు.

ప్రత్యామ్నాయంగా, మన జీవితకాలంలో నెగెటివ్ పనులకు దూరంగా ఉంటే, మరణ సమయం మనకు అప్రయత్నంగా ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లే పిల్లల్లానే ఈ అనుభవం ఆనందదాయకమైనది. మనల్ని మనం శుద్ధి చేసుకుంటే అప్పుడు ఆనందంగా చనిపోవచ్చు. పది నెగెటివ్ మార్గాలకు దూరంగా ఉండి, వాటికి వ్యతిరేకతను, పది నిర్మాణాత్మక పనులను పెంపొందించుకోవడం ద్వారా, మన జీవితం సులభంగా సాగి ముగుస్తుంది మరియు దాని ఫలితంగా మనం బాధా స్థితిలో పునర్జన్మను అనుభవించాల్సిన అవసరం ఉండదు. మరిన్ని అదృష్టవంతమైన పరిస్థితుల్లో మనకు పునర్జన్మ లభిస్తుందని మనం నమ్మవచ్చు. ఔషధ మొక్కల విత్తనాలను నాటడం ద్వారా ఔషధ గుణాలున్న చెట్లను, విషపూరితమైన చెట్ల విత్తనాలను నాటడం ద్వారా హానికరమైన పండ్లను ఉత్పత్తి చేస్తాం. నిర్మాణాత్మక పనులకు విత్తనాలు నాటితే అప్పుడు భవిష్యత్తులోని పునర్జన్మల్లో మనం ఆనందాన్ని అనుభవిస్తాం. మానసికంగా మరియు శారీరకంగా మనకు అదృష్టకరమైన పరిస్థితులు ఉంటాయి. ధర్మం యొక్క ఈ ప్రాథమిక బోధన - విధ్వంసక పనులను నివారించండి మరియు నిర్మాణాత్మకమైన వాటిని పెంపొందించుకోవడం - వీటిని బౌద్ధంలో చెప్పడం మాత్రమే కాకుండా, క్రైస్తవ మతంతో సహా అనేక ఇతర మతాలలో కూడా చెప్పబడింది.

మరణాన్ని, అశాశ్వతం గురించి మనం ఎలా ఆలోచిస్తాం? ఇంతకు ముందు చెప్పినట్లుగా, "నేను చనిపోబోతున్నాను" అని అనుకోవడం మంచి విషయం కాదు. మన౦ ఇలా ఆలోచి౦చాలి, "నేను ఈ పది వినాశకర పనులలో ఏదైనా చేసినట్లయితే, మరణ సమయంలో నాకు చాలా భయ౦, బాధలు ఎదురవుతాయి, దాని వల్ల నేను తీవ్రమైన దురదృష్టపు పునర్జన్మను పొ౦దుతాను. మరోవైపు, నా జీవితంలో నేను పాజిటివ్ శక్తిని (యోగ్యత) సృష్టించుకున్నట్లయితే, మరణ సమయంలో నేను భయం లేదా బాధను అనుభవించను మరియు మంచి అదృష్టవంతమైన స్థితిలో పునర్జన్మను పొందుతాను" అని. మరణం గురించి ఆలోచించడానికి ఇదే సరైన మార్గం.

ఈ ధ్యానం కేవలం నిరాశాజనకమైన ఆలోచన అవ్వాల్సినది కాదు, "నేను చనిపోతాను మరియు దాని గురించి నేను ఏమీ చేయలేను" అని ఉండకూడదు. లేకపోతే, మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందనే కోణంలో ఆలోచించాలి. "మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎలాంటి కారణాలను సృష్టించాను? నేను నా మరణాన్ని సంతోషంగా చేసుకోవచ్చా? ఎలా? నా భవిష్యత్తు పునర్జన్మలను నేను సంతోషంగా చేసుకోగలనా? ఎలా?" అని.

భవిష్యత్ పునర్జన్మల గురించి ఆలోచిస్తున్నప్పుడు, సంసారంలో దేనిని నమ్మకూడదని మనం గుర్తుంచుకోవాలి. మనం ఏ శరీరాన్ని తీసుకున్నా, అది చివరికి చనిపోవాల్సిందే. వంద, వేయి సంవత్సరాలు జీవించిన వాళ్ళ గురించి మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ, ఈ కథలు ఎంత అద్భుతంగా ఉన్నా చివరికి చావుని తప్పించుకున్న వ్యక్తి ఎవ్వరూ లేడు. మనం పొందే ఏ రకమైన సంసార శరీరం అయినా మరణానికి లోబడి ఉంటుంది.

లేదా మనం చావు నుంచి తప్పించుకోవడానికి వెళ్ళే చోటు కూడా ఏదీ లేదు. మనం ఎక్కడ ఉన్నా సమయం వచ్చినప్పుడు చచ్చిపోవాల్సిందే. అప్పుడు ఎన్ని మందులు, మంత్రాలు, సాధనలు చేసినా ప్రయోజనం ఉండదు. సర్జికల్ ఆపరేషన్లు మన శరీరంలోని కొన్ని రకాల వ్యాధులను నయం చెయ్యగలవు, కానీ మరణాన్ని మాత్రం నివారించలేవు.

మనకు ఎలాంటి పునర్జన్మ లభించినా అది మరణానికి లోబడి ఉంటుంది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మన పనుల యొక్క దీర్ఘకాలిక ప్రభావాలను మరియు జననం, జీవితం, మరణం మరియు పునర్జన్మ ప్రక్రియ ఎలా నిరంతరంగా సాగుతుందో ఆలోచించడం మనకు చాలా పాజిటివ్ కర్మను సృష్టించడంలో సహాయపడుతుంది.

మనం కొన్నిసార్లు ధర్మాన్ని ఆచరించాలని అనుకున్నప్పటికీ, దాన్ని రేపు లేదా ఆ తర్వాతి రోజుకి ప్లాన్ చేసుకుంటాము. కానీ, మనం ఎప్పుడు చనిపోతామో ఎవ్వరూ చెప్పలేరు. మనకు జీవించడానికి ఖచ్చితంగా వంద సంవత్సరాలు మిగిలి ఉందని తెలిస్తే, మన అభ్యాసాన్ని ప్రాక్టీస్ చెయ్యడానికి మనకు చాలా రోజులు ఉంటాయి. కానీ మనం ఎప్పుడు చనిపోతామో అసలు ఖచ్చితంగా చెప్పలేము. మన అభ్యాసాన్ని వాయిదా వేసుకోవడం చాలా మూర్ఖత్వం. కొందరు పుట్టక ముందే గర్భంలోనే చనిపోతారు, మరికొందరు నడవడం నేర్చుకోక ముందే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మరణిస్తారు. మనం దీర్ఘాయుష్షుతో జీవిస్తాం అని కూడా చెప్పలేము.

మన శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అది రాయి లేదా ఇనుముతో తయారయ్యి ఉంటే, అప్పుడు బహుశా అది స్థిరత్వాన్ని ఇచ్చి ఉండేది. కానీ మనం దీన్ని పరిశోధిస్తే, మానవ శరీరం చాలా బలహీనంగా ఉంటుందని తెలుస్తుంది. దానికి ఏదైనా సులభంగా గాయం జరిగే అవకాశం ఉంది. ఇది లెక్క లేనన్ని చిన్న మృదువైన భాగాలతో చేసిన ఒక సున్నితమైన చేతి గడియారం లాంటిది. ఇది నమ్మదగినది కాదు. మన మరణానికి కారణమయ్యే అనేక పరిస్థితులు ఉన్నాయి: ఫుడ్ పాయిజనింగ్, చిన్న కీటకం కాటు లేదా విషపూరిత ముళ్ల గుచ్చుకోవడం. ఇలాంటి చిన్నవి కూడా మనల్ని చంపెయ్యగలవు. మన జీవితాన్ని పొడిగించడానికి మనం ఉపయోగించే ఆహారం మరియు ద్రవం దానిని అంతం చేసేవిగా మారవచ్చు. మనం ఎప్పుడు చనిపోతామో, ఏ పరిస్థితులు మన మరణానికి కారణమవుతాయో కచ్చితంగా చెప్పలేము.

మనకు మనం నూరేళ్లు బతుకుతామని అనిపించినా, అందులోని చాలా సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయాయి మరియు మనం అసలు అంత గొప్పగా ఇంకా ఏమి సాధించలేదు. రైల్వే బోగీలో నిద్రపోతున్న మనిషిలా, గమ్య స్థానానికి దగ్గరగా, చావు గురించి తెలియక నిరంతరం దగ్గరవుతున్న మనిషిలా మరణాన్ని సమీపిస్తున్నాం. ఈ ప్రక్రియను ఆపడానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం ఎప్పుడూ మరణానికి దగ్గరగా వెళ్తూనే ఉంటాం.

మన జీవితకాలంలో ఎంత డబ్బు, నగలు, ఇళ్లు, బట్టలు కూడబెట్టినా అది చనిపోయే సమయంలో ఎలాంటి మార్పును కలిగించదు. మనం చనిపోతే ఈ ఖాళీ చేతులతో వెళ్లాల్సి ఉంటుంది. అతి చిన్న వస్తువును కూడా మనతో తీసుకెళ్లలేము. శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళాలి. శరీరం, మనస్సు వేరుపడి, మనస్సు ప్రవాహం దానంతట అదే కొనసాగుతుంది. మనతో పాటు మన ఆస్తినే కాదు, మన శరీరాలను కూడా మనతో తీసుకెళ్లలేము.

కర్మ

మరణానంతరం ఆత్మకు తోడుగా ఉండేది ఏమిటి? మన శరీరాలను, స్నేహితులను, ఆస్తులను విడిచిపెట్టాల్సి వస్తే, భవిష్యత్తు జీవితానికి మనతో పాటు ఏదైనా తోడుగా వస్తుందా?

మరణానంతర మన ఆత్మను అనుసరించేది ఒకటి ఉంది: ఈ జన్మలో మనం నిర్మించుకున్న కర్మ ఫలితాలు (విత్తనాలు). మనం పది నెగెటివ్ పనులలో ఏదైనా చేస్తే, ఆ నెగెటివ్ కర్మ ఫలితం లేదా కర్మ ఋణం మన భవిష్యత్తు పునర్జన్మల్లోకి మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు వస్తుంది. ఇతర జీవులను చంపడం ద్వారా, ఇతరుల ఆస్తులను దొంగిలించడం ద్వారా లేదా లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడటం ద్వారా, శరీరం యొక్క ఈ వినాశకరమైన పనుల నుంచి ప్రతికూల కర్మ ఫలితాలను మనస్సుపై పడతాయి. అబద్ధాలు చెప్పడం, ఇతరులపై దుష్ప్రచారం చేయడం, ఇతరులకు తిట్టడం, పిచ్చిగా మాట్లాడటం ద్వారా మరణ సమయంలో ఈ నెగెటివ్ పనుల ప్రతికూల కర్మ ఋణాలు మనతో పాటు వస్తాయి. మనకు ఎన్నో అత్యాశ ఆలోచనలు ఉండి, ఎప్పుడూ ఇతరుల ఆస్తులు పొందాలని కోరుకుంటే; ఇతరుల పట్ల మనకు చెడు ఆలోచన ఉంటే, వారికి హాని జరగాలని లేదా వారికి ఏదైనా చెడు జరగాలని కోరుకుంటే; లేదా "గతం లేదా భవిష్యత్తు జీవితాలు లేవు", "కారణం మరియు ప్రభావం లేదు," "ఆశ్రయం యొక్క సురక్షితమైన దిశ వంటిది ఏదీ లేదు" అనే వికృతమైన రీతిలో మనం ఆలోచిస్తే, మనస్సు యొక్క ఈ వినాశకరమైన పనులు నెగెటివ్ కర్మ ఫలితాలను సృష్టిస్తాయి, ఇవి మన మనస్సులను భవిష్యత్తు పునర్జన్మలలోకి నడిపిస్తాయి.

దీని రివర్స్ కూడా నిజమే. మనం పాజిటివ్ పనులు చేసి, నెగెటివిటి సృష్టించకుండా ఉంటే, అటువంటి పాజిటివ్ శక్తి యొక్క కర్మ ఫలితం మన మనస్సు ప్రవాహాలపై ప్రయాణించి మన భవిష్యత్ జీవితంలో మంచి పరిస్థితులను సృష్టిస్తుంది.

మనం నిజంగా ఉన్న పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు, పాజిటివ్ కర్మను సృష్టించడానికి మరియు దాని వ్యతిరేకతను తొలగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలని మనం నిశ్చయించుకుంటాము. మన భవిష్యత్ జీవితంలో తీర్చుకోవాల్సిన చిన్న కర్మ ఋణం కూడా వదలకుండా వీలైనంత ఎక్కువ ప్రతికూలత నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.

కారణం మరియు ప్రభావం యొక్క నియమంలో ఎటువంటి ప్రతి చర్యలు జరుగుతాయో మనం తెలుసుకోవాలి. ఎన్నో మంచి గుణాలున్నప్పటికీ తన మాటల్లో కఠినంగా వ్యవహరించిన వ్యక్తి గురించి ఒక అకౌంట్ ఉంటుంది. 'నువ్వు కుక్కలా మాట్లాడుతున్నావు' అంటూ మరొకరిని దూషిస్తాడు. దాని ఫలితంగా అతను ఐదు వందల సార్లు కుక్కగా పునర్జన్మ పొందుతాడు. కనిపించే ఒక చిన్న పని కూడా చాలా పెద్ద ఫలితాన్ని కలిగి ఉంటుంది.

అదే విధంగా, చాలా చిన్న పాజిటివ్ పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. బుద్ధుడికి వినయపూర్వకంగా నైవేద్యం సమర్పించుకున్న ఒక చిన్న పిల్లవాడు, వేలాది బౌద్ధ స్మారక చిహ్నాలను నిర్మించి, లెక్క లేనన్ని ఉత్తమమైన పనులను చేసి గొప్ప రాజు అశోకుడిగా పునర్జన్మ పొందిన కథ ఉంది.

త్యాగం మరియు కరుణ

మనం చేసిన వివిధ రకాల విధ్వంసక పనులు మరియు వాటి ఫలితాల గురించి ఆలోచించడం మన ఆరోగ్యం మరియు సంతోషాన్ని నిర్ధారించడానికి చాలా ప్రభావవంతమైన మార్గం. ఆ బాధల గురించి ఆలోచిస్తే మనమే మన నెగెటివ్ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ విధమైన దుఃఖాన్ని అనుభవించకూడదనే బలమైన కోరికను మనం పెంపొందించుకున్నాం, దీన్నే "త్యాగం" అని పిలుస్తారు.

ఈ రకంగా ఆలోచించడమే ఒక రకమైన ధ్యానం. ముందుగా, మన స్వంత బాధ యొక్క బుద్ధిని మనం పెంపొందించుకోవాలి; అప్పుడు మనం ఈ బుద్ధిని సకల జీవరాశులకు విస్తరింపచేయాలి. సమస్త జీవరాశులు బాధలు అనుభవించడానికి ఇష్టపడకపోయినా, బాధాకర పరిస్థితిలో ఎలా చిక్కుకుపోతాయో తెలుసుకోండి. ఈ రకమైన ఆలోచన మనల్ని కరుణ వైపు నడిపిస్తుంది. మన బాధలన్నిటి నుంచి విముక్తి పొందాలనే కోరికను మనం పెంపొందించుకోకపోతే, ఇతర జీవులు వాటి నుంచి విముక్తి పొందాలని మనం ఎలా అనుకోగలం? మన బాధలన్నిటినీ మనమే అంతం చెయ్యగలం, కానీ ఇది అంతిమంగా ప్రయోజనకరమైనది కాదు. సుఖాన్ని కోరుకునే సమస్త జీవరాశులకు  కూడా ఈ ఆశను మనం అందించాలి. మన మనస్సులకు శిక్షణ ఇచ్చుకుని ప్రతి ఒక్కరూ వారి బాధల నుంచి పూర్తిగా విముక్తి పొందాలని కోరుకోవచ్చు. ఇది చాలా విస్తృతమైన మరియు మంచి ప్రయోజనకరమైన ఆలోచనా విధానం.

ఇతర జీవుల గురించి మనం ఎందుకు ఆందోళన చెందాలి? ఎందుకంటే మనం ఇతరుల నుంచి చాలా పొందుతాము కాబట్టి. ఉదాహరణకు, మనం తాగే పాలు ఆవులు మరియు గేదెల నుంచి వస్తాయి, గొర్రెలు మరియు మేకల నుంచి వచ్చే ఉన్నితో చలి మరియు గాలి నుంచి మనల్ని రక్షించే వెచ్చని దుస్తులు వస్తాయి, మొదలైనవి. వారి బాధలను తొలగించే ఒక పద్ధతిని కనిపెట్టడానికి మనం ఎందుకు ప్రయత్నించాలో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

మనం ఎలాంటి ప్రాక్టీస్ చేసినా కానీ - మంత్ర పఠనం లేదా ఏదో ఒక రకమైన ధ్యానం చేసేటప్పుడు - మనం "ఇది అన్ని జీవులందరికి ప్రయోజనం అందించాలి" అనే ఆలోచనతో ఉండాలి. ఇది సహజంగానే మనకు కూడా ప్రయోజనం అందిస్తుంది. మన సాధారణ జీవిత పరిస్థితులు దీనికి ఒక ప్రశంసను ఇస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా స్వార్థపరుడిగా ఉంటూ ఎప్పుడూ తన సొంత ప్రయోజనాల కోసమే పని చేసుకుంటే, అతను నిజంగా ఇతరులకు నచ్చడు. మరోవైపు, దయతో ఎప్పుడూ ఇతరులకు సహాయం చెయ్యాలని ఆలోచించే వ్యక్తిని సాధారణంగా అందరూ ఇష్టపడతారు.

"అందరూ సంతోషంగా ఉండి, ఎవరూ బాధపడకూడదు" అనే ఆలోచన మన మానసిక స్థితిగతుల్లోకి వస్తుంది. దీన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ మన ఆలోచనల్లో అలవర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో ఈ విధంగా ఆలోచించిన వాళ్లు ఇప్పుడు గొప్ప బుద్ధులు, బోధిసత్వులు లేదా సాధువులు అయ్యారు; ప్రపంచంలోని నిజమైన గొప్ప పురుషులు మరియు మహిళలు అందరూ దాని మీదే ఆధారపడి ఉన్నారు. దాన్ని మనం కూడా సృష్టించుకునే ప్రయత్నం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో!

మన ప్రియమైన వాళ్లను రక్షించడానికి ఇతరులకు హాని చేసే కర్మ

ఎవరైనా మనకు హాని చెయ్యాలని ప్రయత్నించినప్పుడు మనల్ని మనం రక్షించుకోవద్దని సలహా ఇవ్వబడుతోందా?

ఈ ప్రశ్న చాలా విస్తృతమైన అంశాన్ని పరిచయం చేస్తుంది. ఎవరైనా మీ తలపై కర్రతో కొట్టినట్లయితే, మీ స్వంత నెగెటివ్ పనుల వల్ల మీరు దీన్ని అనుభవిస్తున్నారని ధ్యానం చేయడం ఉత్తమ ప్రతిస్పందన. ఈ వ్యక్తి కర్మ ఫలితాన్ని భవిష్యత్తులో కాకుండా ఇప్పుడు మీ మీద ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఆలోచించండి. ఈ నెగెటివ్ కర్మను అతను మీ మనస్సు ప్రవాహం నుంచి తొలగించినందుకు మీరు కృతజ్ఞతతో ఉండాలి.

నా రక్షణలో ఉన్న నా భార్య లేదా పిల్లలపై ఎవరైనా దాడి చేస్తే? నేను వాళ్లను ఎదిరించాలా? అలా చేయడం నెగిటివ్ పని అవుతుందా?

మీ భార్యా పిల్లలను కాపాడుకోవడం మీ బాధ్యత కాబట్టి మీరు వీలైనంత నైపుణ్యంతో రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. మీరు చాలా తెలివిగా ఉండాలి. దాడి చేసిన వ్యక్తికి హాని కలిగించకుండా వాళ్లను సంరక్షించడం ఉత్తమం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎటువంటి హాని కలిగించకుండా వాళ్లను రక్షించే పద్ధతిని కనిపెట్టాలి.

అతను నా పిల్లలకు హాని చెయ్యగలడు, కాని నేను అతనికి హాని చెయ్యలేను? క్రూరమైన పనుల నుంచి మన పిల్లలను రక్షించడం మన కర్తవ్యం కాదా? మన ప్రాణాలను అర్పించాలా?

ఈ పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కోవాలంటే మనకు ఎంతో ధైర్యం కావాలి. బుద్ధుని పూర్వ జన్మ గురించి ఒక కథ ఉంది, ఇందులో అతను నావికుడు, అతను ఒక సమాధి చేయబడిన నిధిని వెతుక్కుంటూ ఐదు వందల మంది టీమ్ తో కలిసి సముద్రం మీదకు వెళ్తాడు. ఈ టీమ్ లో ఒక వ్యక్తి చాలా అత్యాశ ఆలోచనలను కలిగి ఉన్నాడు. తను ఆ ఆభరణాలను దొంగిలించడానికి, ఐదు వందల మందిని చంపడానికి ప్లాన్ వేస్తాడు. భోధిసత్వుడు (పూర్వజన్మలో శాక్యముని బుద్ధుడు) ఈ విషయాన్ని తెలుసుకుని, పరిస్థితిని చెయ్యిజారనివ్వడం సరికాదని, ఒక మనిషి ఐదు వందల మందిని చంపకూడదని అనుకుంటాడు. అందుకని, ఈ ఒక్క వ్యక్తిని చంపి ఆ ఐదు వందల మందిని రక్షించాలనే చాలా సాహసోపేతమైన ఆలోచనకు వచ్చాడు, మరియు దాని పూర్తి బాధ్యతను అతనే స్వీకరించాడు. ఇతరులను రక్షించడానికి మీరు నరకంలో పునర్జన్మను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే, మీకు చాలా సాహసోపేతమైన ఆలోచన ఉంటుంది. అప్పుడు బుద్ధుడు చేసినట్లుగా మీరు కూడా అలాంటి పనులను చెయ్యవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో హత్యను ఒక నెగెటివ్ పనిగా పరిగణిస్తారా?

తల్లిదండ్రులను, పిల్లలను, బౌద్ధాన్ని, మూడు ఆయుర్దాయాలను కాపాడుకునే దిశలో ఏదైనా నెగిటివ్ పనికి పాల్పడితే దాని పర్యవసానాలను అనుభవించక తప్పదని నాగార్జున తన 'లెటర్ టు ఎ ఫ్రెండ్'లో రాశారు. దీని పర్యవసానాల గురించి మీకు తెలుసా లేదా అనే తేడా ఏమిటంటే, మీ భార్య పిల్లలను రక్షించడానికి నిస్వార్థంగా వాటిని మీరు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా. మీరు మీ శత్రువుకు హాని కలిగిస్తే, మీరు ఒక బాధాకరమైన పునర్జన్మను అనుభవిస్తారు. ఏదేమైనా, "ఆ కష్టాన్ని నేను స్వీకరిస్తాను, అప్పుడు నా భార్య మరియు బిడ్డ బాధపడరు" అని ఆలోచించి మీరు దీన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి.

అప్పుడు బౌద్ధమతం ప్రకారం, అది ఒక నెగెటివ్ పని అవుతుందా?

మీ భార్యా పిల్లలను రక్షించడం ఒక పాజిటివ్ నిర్మాణాత్మక పనే, కానీ శత్రువుకు హాని కలిగించడం నెగెటివ్ గా మరియు వినాశకరమైనదిగా ఉంటుంది. ఈ రెండింటి పర్యవసానాలను అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి.

నెగెటివ్ కర్మను ఎవరైతే సృష్టిస్తారో భవిష్యత్తులో వాళ్ళు బాధ పడతారు, కానీ మంచి పనులు చేస్తే ఆనందం మనతోనే ఉంటుందని మీరు చెప్పారు. పునర్జన్మను అనుభవించనవసరం లేదనే అర్థంలో, ఈ మంచి పనులు సంపూర్ణ మోక్షానికి దారితీస్తాయా?

మీరు మోక్షాన్ని పొందాలనుకుంటే, మీరు ఆ బోధనలను పూర్తిగా మరియు ఖచ్చితంగా అనుసరించాలి. ఉదాహరణకు, మీరు క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తున్నట్లయితే, మీరు క్రీస్తు బోధనలను పూర్తిగా అనుసరించాలి. అప్పుడు క్రైస్తవ రక్షణ మీకు కలుగుతుంది. యేసు తనకు తానే మనల్ని పాపముల నుంచి రక్షించలేడు; మనం కూడా ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే, యేసు పాపము చేయవద్దని ఎందుకు చెప్పేవాడు? యేసు బోధి౦చిన విషయాలను మన౦ కూడా సరిగ్గా అనుసరిస్తే, క్రైస్తవ రక్షణ సాధ్యమని, మరియు బుద్ధుని బోధనలను సరిగ్గా పాటిస్తే బౌద్ధ "మోక్షం" - ముక్తి - సాధ్యమవుతుంది అని నేను అనుకుంటున్నాను.

Top