పునర్జన్మ అంటే ఏమిటి?

ఇతర భారతీయ మతాల లాగానే, బౌద్ధమతం మళ్ళీ జన్మించడం లేదా పునర్జన్మ నిజంగా ఉందని చెప్తుంది. ఒక వ్యక్తి యొక్క మానసిక కొనసాగింపు, దాని ప్రవృత్తులు, ప్రతిభ మొదలైన వాటితో, గత జన్మల నుంచి వచ్చి భవిష్యత్తులోకి వెళుతుంది. ఒకరి పనులు మరియు వారు చేసుకున్న వాటిని బట్టి, ఒక వ్యక్తి వివిధ రకాల జీవ రూపాల్లో పునర్జన్మను పొందవచ్చు, మంచి లేదా అధ్వాన్నంగా ఉండవచ్చు: మానవుడు, జంతువు, కీటకాలు మరియు దెయ్యం మరియు ఇతర అదృశ్య స్థితులుగా. మమకారం, కోపం మరియు అమాయకత్వం లాంటి వారి ఇబ్బంది పెట్టే వైఖరుల శక్తి మరియు వాటి ద్వారా ప్రేరేపించబడిన వారి బలవంతపు ప్రవర్తన కారణంగా అన్ని జీవులు నియంత్రణలో లేని పునర్జన్మను అనుభవిస్తాయి. గత ప్రవర్తనా విధానాల కారణంగా మనస్సులో వచ్చే నెగెటివ్ ప్రేరణలను అనుసరిస్తే, వినాశకరమైన చర్యలకు పాల్పడితే, దాని ఫలితంగా బాధ మరియు అసంతృప్తిని అనుభవిస్తారు. మరోవైపు నిర్మాణాత్మక పనుల్లో నిమగ్నమైతే ఆనందాన్ని పొందుతారు. కాబట్టి, వరుస పునర్జన్మల్లో ప్రతి వ్యక్తి యొక్క ఆనందం లేదా దుఃఖం ప్రతిఫలం లేదా శిక్ష కాదు, కానీ ప్రవర్తనా కారణం మరియు ప్రభావం యొక్క నియమాల ప్రకారం ఆ వ్యక్తి యొక్క ఇంతకుముందు పనుల ద్వారా అది సృష్టించబడుతుంది.

పునర్జన్మను మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ఏదైనా నిజం అని మనకు ఎలా తెలుస్తుంది? బౌద్ధమత బోధనల ప్రకారం, ఒక విషయాన్ని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు: సూటిగా గ్రహించడం ద్వారా మరియు ఊహ ద్వారా. ఒక ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేయడం ద్వారా, సూటిగా గ్రహించడం ద్వారా మనం ఏదైనా ఉనికిని ధృవీకరించవచ్చు. ఉదాహరణకు, ఒక మైక్రోస్కోప్ నుంచి చూడటం ద్వారా, సరస్సు నీటి చుక్కలో అనేక చిన్న సూక్ష్మజీవులు ఉన్నాయని మన ఇంద్రియాల ద్వారా మనకు తెలుస్తుంది.

అయితే కొన్ని విషయాలను సూటిగా తెలుసుకోవడం కుదరదు. ఉదాహరణకు, అయస్కాంతం మరియు ఇనుప సూది యొక్క ప్రవర్తనను అంచనా వెయ్యడానికి మనం లాజిక్, హేతుబద్ధత మరియు ఊహపై ఆధారపడాలి. పునర్జన్మను సూటిగా ఇంద్రియ అవగాహన ద్వారా నిరూపించడం చాలా కష్టం. ఏదేమైనా, వారి గత జీవితాలను గుర్తుంచుకునే మరియు వారి వ్యక్తిగత వస్తువులను లేదా వారికి ఇంతకు ముందు తెలిసిన వ్యక్తులను గుర్తించగల వ్యక్తులకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. పునర్జన్మ ఉనికిని మనం ఊహించవచ్చు, కాని కొంతమంది ఈ నిర్ధారణను అనుమానించవచ్చు మరియు ఒక ట్రిక్ ని అనుమానించవచ్చు.

గత జన్మ జ్ఞాపకాలను పక్కన పెడితే పునర్జన్మను అర్థం చేసుకోవడానికి లాజిక్ వైపు మనం వెళ్లవచ్చు. కొన్ని అంశాలు రియాలిటీకి అనుగుణంగా లేకపోతే వాటిని బౌద్ధమతం నుంచి తొలగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని దలైలామా గారు చెప్పారు. ఇది పునర్జన్మకు కూడా వర్తిస్తుంది. నిజానికి ఆ సందర్భంలోనే ఆయన ఈ మాటను చెప్పారు. పునర్జన్మ లేదని శాస్త్రవేత్తలు నిరూపించగలిగితే, అది నిజమని నమ్మడం మనం మానుకోవాలి. ఏదేమైనా, శాస్త్రవేత్తలు దానిని తప్పు అని నిరూపించలేకపోతే, వారు లాజిక్ ని మరియు కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి ఉంచిన శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తారు కాబట్టి, వారు అది ఉందో లేదో పరిశోధించాలి. పునర్జన్మ లేదని నిరూపించడానికి, వారు దాని ఉనికిని కనుగొనవలసి ఉంటుంది. "నా కళ్లతో చూడలేను కాబట్టి పునర్జన్మ లేదు" అని చెప్పినంత మాత్రాన పునర్జన్మ ఉనికి కనిపించదు. అయస్కాంతం మరియు గురుత్వాకర్షణ లాంటి మన కళ్లతో చూడలేని అనేక విషయాలు ఉన్నాయి.

Top