గ్రేడెడ్ బౌద్ధమత మార్గాన్ని ఎలా మరియు ఎందుకు మనం అనుసరించాలి?

లామ్-రిమ్ అంటే ఏమిటి మరియు అది బుద్ధుని బోధనల నుంచి ఎలా వచ్చింది?

గ్రేడెడ్ మార్గం, లామ్-రిమ్ అనేది ప్రాథమిక బౌద్ధమత బోధనలను మన జీవితాలలో పొందడానికి మరియు అన్వయించుకోడానికి ఒక మార్గం. బుద్ధుడు 2,500 సంవత్సరాల క్రితం సన్యాసుల సమాజంలో తర్వాత సన్యాసినుల సంఘంతో జీవించాడు. ఆయన నియమిత వర్గాలకు బోధించడమే కాకుండా, ఎప్పుడూ అక్కడి ప్రజల ఇళ్లకు ఆహ్వానించబడేవాడు, అక్కడ ఆయనకు భోజనం పెట్టేవారు, ఆ తర్వాత అతను అక్కడ ఉపన్యాసం చేసేవాడు.

బుద్ధుడు ఎప్పుడూ "నైపుణ్య సాధనాలు" అని పిలువబడే వాటితో బోధించాడు, ఇది ఇతరులకు అర్థమయ్యే విధంగా బోధించే తన పద్ధతిని సూచిస్తుంది. తెలివితేటలు మరియు ఆధ్యాత్మిక వికాసం యొక్క అనేక విభిన్న స్థాయిలు ఉన్నాయి మరియు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి ఇవి అవసరం. ఇది బుద్ధుడు చాలా విభిన్న స్థాయిలలో అనేక రకాల అంశాలను బోధించడానికి దారితీసింది.

బుద్ధుని అనుచరులలో చాలా మందికి ఈ అపూర్వమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ సమయంలో ఏదీ రాసి లేదు మరియు బోధనలను సన్యాసులే గుర్తుంచుకునేవారు, అలా వాళ్ళ తర్వాతి తరాలకు నోటితోనే బోధించేవారు. చివరికి బోధనలు రాయటం జరిగి సూత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇది జరిగిన శతాబ్దాల తర్వాత, ఎందరో గొప్ప భారతీయ గురువులు ఈ విషయాలను క్రమబద్ధీకరించి అన్నింటికీ వ్యాఖ్యానాలు రాయడానికి ప్రయత్నించారు. టిబెట్ వెళ్ళిన భారతీయ గురువులలో ఒకరైన అతిషా పదకొండవ శతాబ్దంలో ఈ ప్రదర్శన యొక్క నమూనా అయిన లామ్-రిమ్ ను రూపొందించాడు.

అతిషా నమూనా ప్రతి ఒక్కరూ బుద్ధుని స్థితి వైపు తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి ఒక పద్ధతిని అందించింది. సూత్రాలను చదివినంత మాత్రాన ఆ బోధనలను ఎక్కడ ప్రారంభించాలో, జ్ఞానోదయం ఎలా పొందాలో స్పష్టమైన ఆధ్యాత్మిక మార్గం ఉండదు. మెటీరియల్ అంతా ఉంటుంది, కానీ వాటన్నిటినీ ఒక చోట ఉంచడం అంత సులభం కాదు.

ఆ బోధనలను గ్రేడెడ్ క్రమంలో ప్రదర్శిస్తూ లామ్-రిమ్ ఇదే పనిని చేస్తుంది. అతిషా తర్వాత, టిబెట్ లో అనేక విభిన్నమైన, మరింత విస్తృతమైన వెర్షన్లు రాయబడ్డాయి. పదిహేనవ శతాబ్దంలో సోంగ్ ఖాపా గారు రాసిన వెర్షన్ ను మనం పరిశీలిస్తాము, ఇది బహుశా ఆ బోధనల అతిపెద్ద వివరణగా ఉంటుంది. సోంగ్ ఖాపా రచనలో ఒక విశిష్ట లక్షణం ఏమిటంటే, ఇందులో సూత్రాలు మొదలుకుని ఉల్లేఖనాలు మరియు భారతీయ వ్యాఖ్యానాలు ఉన్నాయి, కాబట్టి అతను ఊరికే ఏదీ చెప్పలేదని మనం నమ్మవచ్చు.

మరొక విశిష్టమైన లక్షణం ఏమిటంటే, సోంగ్ ఖాపా గారి అన్ని రకాల అంశాలు చాలా విస్తృతమైన, లాజికల్ ప్రదర్శనలను అందిస్తాయి, అలా లాజిక్ మరియు హేతుబద్ధత ఆధారంగా బోధనల వేలిడిటీపై మనకు ఇంకా బలమైన విశ్వాసం లభిస్తుంది. సోంగ్ ఖాపా గారి ప్రత్యేక లక్షణం ఏమిటంటే, అత్యంత కష్టమైన అంశాలను వదిలేసే రచయితల లాగా కాకుండా, వాటిపై కూడా ఈయన దృష్టి పెడతారు.

నాలుగు టిబెటన్ బౌద్ధమత సంప్రదాయాలలో, సోంగ్ ఖాపా గారితో ఉద్భవించిన దానిని "గెలుగ్ పా" సంప్రదాయం అంటారు.

ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి, దాన్ని ఎలా నిర్మి౦చుకోవాలి?

ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా నిర్మి౦చాలి అని. భారతదేశంలో సాధారణంగా అనేక విభిన్న పద్ధతులు దీని కోసం బోధించబడ్డాయి. ఉదాహరణకు, ఏకాగ్రతను పెంపొందించే పద్ధతులు బుద్ధుని కాలంలోని ఇతర భారతీయ సంప్రదాయాలన్నింటిలో సాధారణంగా ఉండేవి. ఇది అతను కనుపెట్టిన లేదా తయారు చేసిన విషయమేమీ కాదు. మనల్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలనే విషయంలో ఏకాగ్రతను, ఇతర అంశాలను మన ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా తీసుకురావచ్చో చూడాల్సిన అవసరం ఉందని అందరూ అంగీకరించారు.

బుద్ధుడు, సహజంగానే మనల్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనేక అంశాలను అర్థం చేసుకోవడానికి భిన్నమైన వివరణలను చెప్పాడు, కాని నిజంగా నిర్దిష్టమైనది అతని ఆధ్యాత్మిక లక్ష్యాలపై అవగాహన. ఈ ఆధ్యాత్మిక లక్ష్యాల యొక్క ప్రధాన సూత్రం, మరియు వివిధ గ్రేడ్లలో ఉంచబడింది, మన ప్రేరణ మాత్రమే.

ఈ సాహిత్యానికి ఇవ్వబడిన పదం లామ్-రిమ్, "లామ్" ను "మార్గం" అని అనువదించారు మరియు "రిమ్" ఈ మార్గం యొక్క గ్రేడెడ్ దశలను సూచిస్తుంది. ఇవే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం గ్రేడింగ్ మార్గంలో అభివృద్ధి చేసుకోవాల్సిన వివిధ మానసిక స్థితులు. మనం ప్రయాణం చేసేటప్పుడు; రొమేనియా నుంచి భారతదేశానికి వెళ్లాలనుకుంటే, భారతదేశం మన అంతిమ లక్ష్యంగా ఉండాలి. కానీ దానికన్నా ముందు మనం టర్కీ, ఇరాన్ లాంటి దేశాల గుండా ప్రయాణించి భారతదేశాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

ఆధ్యాత్మిక ప్రేరణ: మన జీవితాలకు అర్థాన్ని ఇవ్వడం

లామ్-రిమ్ లో గ్రేడింగ్ చేయబడినది సాధారణంగా మన ప్రేరణ, ఇది బౌద్ధమత ప్రదర్శన ప్రకారం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రేరణ అనేది మనకు ఉన్న ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా మన ఆశయంతో ముడిపడి ఉంటుంది, అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనల్ని ప్రేరేపించే భావోద్వేగం కూడా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకోడానికి ఒక కారణం ఉంటుంది, అలాగే మనల్ని అక్కడికి నడిపించే ఒక భావోద్వేగం కూడా ఉంటుంది.

ఇది మన జీవితాలలో పూర్తిగా అర్థవంతంగా ఉంటుంది; మన జీవితంలో వివిధ దశలలో మనకు వివిధ లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మనం చదువుకోవాలని అనుకుంటాము లేదా ఒక జీవిత భాగస్వామిని కలవాలని అనుకుంటాము లేదా ఒక మంచి ఉద్యోగాన్ని పొందాలని అనుకుంటాము. పాజిటివ్ భావోద్వేగాలు మరియు నెగెటివ్ భావోద్వేగాలు ఇందులో ఉండవచ్చు మరియు ఇది ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఏదేమైనా, ఈ పెరిగే ప్రేరణల యొక్క ప్రదర్శన మన సాధారణ జీవితాలకు వర్తించేది.

మన ఆధ్యాత్మిక ప్రేరణలలో కూడా ఇలాగే ఉంటుంది. ఇవి మన జీవితానికి పూర్తిగా సంబంధించిన మానసిక స్థితులు. మన జీవితాలతో మనం ఏం చేస్తున్నాం? అవును, "ప్రపంచ స్థాయి" అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ మనకు మన కుటుంబాలు, ఉద్యోగాలు మొదలైనవి ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో మనం ఏమి చేస్తున్నాము? ఇద మనం జీవించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. మన జీవితంలోని ఈ రెండు అంశాలు పరస్పరంగా విరుద్ధమైనవి, ప్రత్యేకమైనవి కావు, కానీ అవి ఏదో విధంగా సామరస్యంగా కలిసి ఉండడం చాలా ముఖ్యం.

సామరస్యంగా ఉండటమే కాదు, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితం మన సాధారణ ప్రాపంచిక జీవితాన్ని గడపడానికి శక్తిని ఇవ్వాలి, అయితే మన ప్రాపంచిక జీవితం మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆచరించగల సోర్స్ లను అందించాలి. లామ్-రిమ్ యొక్క ఈ గ్రేడెడ్ దశల ద్వారా మనం నేర్చుకునే ప్రతి దాన్ని మన జీవితంలో ఉపయోగించుకోవాలి.

మంచి వ్యక్తిగా మారడం

అయితే ఇక్కడ ప్రదర్శించిన బౌద్ధమత ఆచారంతో మనం ఏమి చేస్తున్నాం? సాధారణంగా బౌద్ధమత అభ్యాసాన్ని మనం కొన్ని పదాల్లో సంక్షిప్తీకరించవచ్చు. సరళమైన భాషలో చెప్పాలంటే, మనం మంచి వ్యక్తులుగా మారడానికి కృషి చేస్తున్నాము. "మంచి వ్యక్తి" అనే ఈ పదం తీర్పుగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఎటువంటి తీర్పు సూచించబడలేదు. అది అసలైన పాయింట్ కాదు. మనమందరం కొన్నిసార్లు కోపం, దురాశ, స్వార్థం లాంటి వినాశకరమైన ప్రవర్తన మరియు నెగెటివ్ భావోద్వేగాలను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాము.

ఈ రకమైన లక్ష్యాన్ని పెట్టుకునే ఏకైక మత తత్వశాస్త్రం లేదా ఆచరణగా బౌద్ధమతం ఏ విధంగానూ ప్రత్యేకమైనది కాదు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం, హిందూ మతం, మరియు మానవతావాదంలో కూడా ఇదే కనిపిస్తుంది. ఇది అన్ని చోట్లా ఉంది. బౌద్ధమత పద్ధతులు, ఈ ఇతర పద్ధతుల మాదిరిగానే, గ్రేడెడ్ పద్ధతిలో మంచి వ్యక్తిగా మారడానికి ఒక విధానాన్ని అందించడం ద్వారా ఈ రకమైన లక్ష్యాన్ని సాధించడానికి మనకు సహాయపడతాయి.

"మంచి వ్యక్తి" గా మారడానికి, మనం ముందుగా ఇతరులకు హాని కలిగించే వినాశకరమైన మార్గాల్లో వ్యవహరించడం మానెయ్యాలి. దీనికోసం మనం కొంత సొంత నియంత్రణను పాటించాలి. లోతైన స్థాయిలో, మనం ఇలా చేసిన తర్వాత, కోపం, దురాశ, మమకారం, అసూయ, ద్వేషం మొదలైన వాటిని అధిగమించడంపై దృష్టి పెట్టవచ్చు. ఇలా చెయ్యడానికి, ఈ నెగెటివ్ భావోద్వేగాలు ఎలా వస్తాయో మరియు అవి ఎలా పనిచేస్తాయో మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా, ఈ ఇబ్బందికరమైన భావోద్వేగాలను తగ్గించడానికి లేదా తొలగించడానికి సహాయపడే కొన్ని రకాల అవగాహనను మనం  అభివృద్ధి చేసుకుంటాము.

అప్పుడు మన స్వార్థాన్ని, స్వార్ధపూరిత ఆలోచనా విధానాన్ని గుర్తించి ఈ కలవరపరిచే భావోద్వేగాలన్నింటిలో అంతర్లీనంగా ఉన్న వాటిపై మనం ఇంకా లోతుగా ఆలోచించి పని చెయ్యవచ్చు. "నేను ఎప్పుడూ నా స్వంత మార్గాన్ని కలిగి ఉండాలి" అని మనం మాములుగా అనుకుంటాము. మనకు ఆ దారి దొరకనప్పుడు, మనకు అప్పుడు బాగా కోపం వస్తుంది. ప్రతిదీ మనం కోరుకున్న విధంగా ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటాము, అది అలానే ఎందుకు ఉండాలి? మనం అలా కోరుకోవడం తప్ప ఇంకే కారణం ఉండదు. అందరూ అలానే ఆలోచిస్తారు, మనమందరం సరైన వాళ్లను కాదు.

కాలక్రమేణా, ఈ అత్యంత ప్రాధమిక సమస్యను అధిగమించే స్థాయిలో మనం పనిచేస్తాం. మన స్వార్థాన్ని విశ్లేషించినప్పుడు, అది మన "నేను" మరియు నా "ఆత్మ" అనే భావనపై ఆధారపడి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, మనం ఎలా ఉన్నామనే మన భావన "నేను ఏదో ప్రత్యేకమైన వాడిని" అనే ఆలోచనపై ఆధారపడి ఉంటుంది, మనం ఈ  విశ్వం యొక్క కేంద్రం, అందరి నుంచి స్వతంత్రంగా ఉండే అతి ముఖ్యమైన వ్యక్తి అని అనుకుంటూ. మనం ఈ భావనను పరిశోధించాలి ఎందుకంటే స్పష్టంగా అది చాలా తప్పుగా మరియు తేడాగా ఉంది. గ్రాడ్యుయేట్ మార్గం సరిగ్గా దీన్నే ప్రస్తావిస్తుంది.

ప్రేరణ యొక్క అభ్యుదయ స్థాయిలు: ధర్మ-లైట్

బుద్ధుడు బోధించిన పద్ధతులు ఈ రకమైన లక్ష్యాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాథమికంగా, వినాశకరమైన ప్రవర్తన, కోపం మరియు స్వార్థం లాంటి నెగెటివ్ భావోద్వేగాలను తొలగించుకోడానికి మనకు ఒక కారణం ఉంది. ఈ కారణం బహుశా మనం వీటితో వ్యవహరించినప్పుడు, అది మంచిగా ఉండదని మరియు మనకు మరియు ఇతరులకు సమస్యలను కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. మనకు ఈ సమస్యలు వద్దు!

ఈ సమస్యలను కలిగించే వాటిని  కూడా మనం గ్రాడ్యుయేట్ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు. నేను కొన్ని విధాలుగా ప్రవర్తిస్తే, అది ఇప్పుడు సమస్యలు మరియు ఇబ్బందులను కలిగిస్తుంది. ఉదాహరణకు, మనం ఎవరితోనైనా పెద్ద గొడవకు దిగి వారిని గాయపరిచినట్లయితే, మనం కూడా గాయపడతాం లేదా జైలుకు పంపబడతాం. లోతైన స్థాయిలో, మన విధ్వంసక ప్రవర్తన యొక్క దీర్ఘకాలిక ప్రభావాలను కూడా మనం చూడవచ్చు, ఎందుకంటే మనం ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఇబ్బందులను నివారించాలనుకుంటున్నాము. దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ, మన కుటుంబానికి, ప్రియమైన వారికి, స్నేహితులకు మరియు సమాజానికి సమస్యలను సృష్టించకుండా ఉండొచ్చు. ఇవన్నీ ఈ జీవితపు హద్దుల్లోనే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్లాలంటే గ్లోబల్ వార్మింగ్ లాంటి ఇబ్బందులు భవిష్యత్ తరాలకు రాకుండా చూడాలనుకోవడం లాంటి అంశాలను బాగా లోతుగా ఆలోచించవచ్చు.

ఈ ఇన్ని ప్రేరణలతో, మనం తర్వాతి వాటిని అభివృద్ధి చేసినప్పుడు ముందు ఉన్న వాటిని వదులుకోకూడదు. దానికి బదులుగా, అవి చేరిపోయి జోడించబడతాయి. ఇది గ్రేడెడ్ మార్గం యొక్క సాధారణ సూత్రం. పైన వివరించిన ప్రతి దాన్ని నేను "ధర్మ-లైట్" అని పిలుస్తాను. ఇది పునర్జన్మ ప్రస్తావన లేకుండా కేవలం ఈ జీవితం పరంగా బౌద్ధమత బోధనల, "ధర్మాన్ని" అందిస్తుంది. కోకాకోలా లైట్ మరియు నిజమైన, చక్కెరతో నిండిన కోకా-కోలాకు సమాంతరంగా "ధర్మ-లైట్" మరియు "నిజమైన విషయం ధర్మం" అనే పదాలను నేను రూపొందించాను.

ఈ జీవితాన్ని మెరుగుపరచడానికి మాత్రమే ఆలోచిస్తూనే పునర్జన్మకు సందేహం యొక్క ప్రయోజనాన్ని ఇవ్వడం

"ధర్మం" అనేది బుద్ధుని బోధనలను సూచించే సంస్కృత పదం. "లైట్" అంటే దానిలో ఏదైనా తప్పు ఉందని కాదు, కానీ ఇది బలమైన, నిజమైన వెర్షన్ కాదని అర్ధం. టిబెటన్ సంప్రదాయాలలో మనకు కనిపించే లామ్-రిమ్ యొక్క వాస్తవ ప్రదర్శన నిజమైన విషయం, కానీ ఇది ప్రారంభంలో మనలో చాలా మందికి చాలా ఎక్కువ అనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం మనం పునర్జన్మను పూర్తిగా నమ్ముతున్నామని, అన్ని విషయాలలో పునర్జన్మ ఉందనే ప్రాతిపదికపై ఉంటాయని మనం అనుకుంటాము. ఈ ఆలోచన నుంచి, మన భవిష్యత్తు జీవితాలలో ఇబ్బందులను నివారించి వాటిని మెరుగుపరచుకోవడానికి మనం పనిచేయడం ప్రారంభిస్తాము.

భవిష్యత్తు జీవితాలపై మనకు నమ్మకం లేకపోతే, వాటిని మెరుగుపరచడానికి మన ప్రేరణలో మనం నిజాయితీగా ఎలా ఉండగలం? అది అసాధ్యం. గతం, భవిష్యత్ జీవితాల గురించి మనకు ప్రశ్నలు ఉన్నప్పుడు, వాటిని మనం నమ్మనప్పుడు లేదా అర్థం చేసుకోనప్పుడు, మనం ధర్మ-లైట్ తో ప్రారంభించాలి. మన ఆధ్యాత్మిక సాధనలో మనం నిజానికి దేన్నీ లక్ష్యంగా పెట్టుకున్నామో అనే దాని గురించి మనం నిజాయితీగా ఉండాలి.

మనలో చాలా మందికి, మనం బహుశా ఈ జీవితాన్ని కొంచెం మెరుగ్గా మార్చాలని అనుకుంటున్నాము. అది పూర్తిగా సరైన లక్ష్యమే. ఇది ఒక ప్రారంభం మరియు చాలా అవసరమైన దశ. అయితే, మనం ఈ ధర్మ-లైట్ యొక్క స్థాయిలో ఉన్నప్పుడు, అది నిజమైన విషయం కాదు ధర్మ-లైట్ అని ఒప్పుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండింటిని సరిగ్గా అర్ధం చేసుకోకుండా, ఈ బౌద్ధమతాన్ని కేవలం ఒక చికిత్స లేదా సొంత సహాయం యొక్క ఇంకొక రూపం అని పరిమితం చేస్తాము. ఇది పరిమితం చెయ్యడం లాగా మరియు బౌద్ధమతానికి సరిగ్గా న్యాయం చేసినట్టు ఉండదు.

అసలు ధర్మం అంటే ఏమిటో కూడా మనకు అర్థం కాకపోతే, అది నిజమని నమ్మడం గురించి ఆలోచించకుండా దాన్ని అంగీకరించాలి. మనం ఓపెన్ మైండెడ్ గా ఉండాలి, "భవిష్యత్తు జీవితాల గురించి, మోక్షం గురించి వారు చెప్పేది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం నేను ధర్మ-లైట్ స్థాయిలో పనిచేస్తాను. నేను ఇంకా అభివృద్ధి చెంది, బాగా అధ్యయనం మరియు ధ్యానం చేస్తున్నప్పుడు నేను నిజమైన ధర్మం గురించి ఇంకా బాగా అర్థం చేసుకుంటాను." బుద్ధుని పట్ల గౌరవం, ఆ విషయాలను బోధించినప్పుడు అతను అర్థం పర్థం లేని మాటలు మాట్లాడలేదనే నమ్మకం ఆధారంగా ఇది పూర్తిగా చెల్లుబాటు అయ్యే మరియు దృఢమైన విధానం అవుతుంది.

భవిష్యత్తు జీవితాలను మరియు ముక్తిని నిర్వచించే వివరించే కొన్ని ఆలోచనలు మనకు ఉన్నాయని అంగీకరించవచ్చు. ఉదాహరణకు, ఇది పూర్తిగా తప్పు కావచ్చు మరియు బౌద్ధమతం వీటి వివరణలను అంగీకరించకపోవచ్చు. కాబట్టి, మనం దేన్ని అర్థం చేసుకున్నామో, లేదా ఏది హాస్యాస్పదంగా అనిపిస్తుందో, అది బుద్ధుడికి కూడా హాస్యాస్పదంగా అనిపించవచ్చు ఎందుకంటే అది పూర్తిగా తప్పు అవగాహన. ఉదాహరణకు, ఒక శరీరం నుంచి ఎగిరి మరొక శరీరంలోకి ప్రవేశించే రెక్కలు ఉన్న ఆత్మ లాగా మనం ఉన్నామనే విషయాన్ని బుద్ధుడు అంగీకరించడు. మనమే సర్వ శక్తిమంతుడైన దేవుడు అవుతామనే ఆలోచనను కూడా బుద్ధుడు అంగీకరించడు.

ప్రారంభం లేని పునర్జన్మను ఆలోచించడంలో ఉండే ప్రయోజనాలు

ఈ గ్రేడెడ్ మార్గంలో వివరించిన చాలా పద్ధతులను ధర్మ-లైట్ లేదా రియల్ థింగ్ ధర్మ మార్గంలో అప్లై చెయ్యవచ్చు. అయితే, కొన్ని పద్ధతులు నిజంగా భవిష్యత్తు జీవితాలను అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, ప్రతి ఒక్కరి పట్ల సమానమైన ప్రేమను పెంపొందించుకోగలగడం, మరియు ప్రారంభం లేని పునర్జన్మలు ఉన్నాయని మరియు పరిమిత సంఖ్యలో జీవులు ఉన్నాయని గుర్తించడం ఒక పద్ధతి. ఈ ప్రారంభ దశ నుంచి, ప్రతి జీవి ఏదో ఒక సమయంలో మన తల్లి మరియు ప్రతి ఒక్కరి తల్లి అని లాజికల్ గా తెలుస్తుంది. ప్రతి ప్రాణికి తల్లిగా కూడా మనం ఉన్నాం. ఈ లాజిక్ కి గణిత పరమైన రుజువును ఒకరు ఇవ్వవచ్చు, ఆరంభం లేదు, పరిమిత సంఖ్యలో జీవులు ఉన్నాయని. అనంతమైన కాలం, అనంతమైన జీవులు రెండూ ఉంటే, అది ఈ విధంగా పనిచేస్తుందని మనం నిరూపించలేము.

అవును, ఇది రిలేట్ చేసుకోవడానికి చాలా కష్టమైన విషయం, ప్రత్యేకించి అనంతమైన మునుపటి పునర్జన్మల పరంగా మనం ఎప్పుడూ ఆలోచించకపోతే. అనంతమైన పునర్జన్మ ఆధారంగా, సమస్త జీవులు మనకు చూపించిన మాతృ ప్రేమను, దాన్ని అభినందిస్తూ, ప్రతిఫలంగా దయగా, ప్రేమగా ఉండాలని కోరుకోవడం గురించి మనం ఆలోచించవచ్చు. దాని ఆధారంగానే మొత్తం డెవలప్‌మెంట్ జరిగింది. ఈ ప్రక్రియలో ఒక భాగం ఏమిటంటే, ఈమె లేదా ఆ వ్యక్తి ఎప్పుడు మన తల్లి అనేదే దానికి సంబంధించిన విషయం. పది నిమిషాలు, పది రోజులు, పదేళ్ళలో మన అమ్మని మనం చూడకపోయినా ఆమె ఎప్పటికీ మన అమ్మే. అలాగే, పది జన్మలలో ఆమెను మనం చూడకపోయినా, ఆమె ఎప్పటికీ మన తల్లిగానే ఉంటుంది. పునర్జన్మను మనం నమ్మితే ఇది ఎంతగానో ఉపయోగపడే ఆలోచనా విధానం. ఈ నమ్మకం లేకుండా, ఇది నాన్‌సెన్స్.

మనుషుల గురించి మాత్రమే కాకుండా దోమల గురించి మనం ఆలోచించినప్పుడు ఇది వర్తిస్తుంది. ఈ దోమ పూర్వజన్మలో మన తల్లిగా ఉండేది ఎందుకంటే పునర్జన్మలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు అని. దీనికి ధర్మ-లైట్ వెర్షన్ కూడా ఉంది, ఇక్కడ ఎవరైనా మమ్మల్ని ఇంటికి ఎలా తీసుకువెళ్లవచ్చు, మనల్ని ఎలా చూసుకోవచ్చు మరియు మనకు ఆహారం ఎలా ఇవ్వవచ్చు అని. ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యాన్ని ఉంది; మనం ప్రయాణించేటప్పుడు, అసలు మనకు తెలియని వాళ్ళు చాలా మంచిగా ఉంటారని మరియు మనకు ఆతిథ్యం ఇవ్వటం మనం చూడొచ్చు. వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరూ మన పట్ల ఒక తల్లిలా వ్యవహరించవచ్చు. ఒక పిల్లవాడు పెద్దవాడు అయినప్పుడు, మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయపడగలడు. ఇది కొంచెం చిన్నది అయినప్పటికీ చాలా సహాయపడుతుంది, ఎందుకంటే మనం చూసే ఈ దోమ నన్ను ఇంటికి తీసుకువెళ్తుందని మరియు ఒక తల్లిలా చూసుకుంటుందని అనుకోవడం కష్టం అవుతుంది.

ఇది ధర్మ-లైట్ మరియు నిజమైన విషయం అయిన ధర్మ స్థాయిలలో పద్ధతులను ఎలా అప్లై చెయ్యవచ్చో వివరిస్తుంది. ఈ రెండూ వారి స్వంత మార్గాల్లో బాగా సహాయపడతాయి, కానీ ధర్మ-లైట్ వెర్షన్ పరిమితమైనది. నిజమైన విషయం అయిన ధర్మం చాలా అవకాశాలను అందిస్తుంది. మనం ఏ స్థాయికి వాటిని అన్వయించుకున్నా, దానిని మన జీవితంలో ఉపయోగించుకోవడమే ముఖ్యమైన విషయం. మనం ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు, లేదా పొడవైన క్యూలో వేచి ఉన్నప్పుడు, ఇతరులపై కోపం లేదా అసహనం వచ్చినప్పుడు, వారందరినీ మనం మన తల్లిలా చూడవచ్చు. దీన్ని మనం గత జన్మలో లేదా ఈ జన్మలో కూడా అనుకోవచ్చు, మరియు ఇది మన కోపాన్ని శాంత పరచడానికి మరియు సహనం పెంచడానికి సహాయపడుతుంది. మన అమ్మ నిజంగా క్యూలో మన కంటే ముందు ఉంటే, ఆమె ముందు వెళ్లడం గురించి మనం అస్సలు పట్టించుకోమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నిజానికి, ఆమెను ముందు వెళ్లనివ్వడం మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా, మనం ఈ అవగాహనలను ఉపయోగించడానికి ప్రయత్నించవచ్చు. కేవలం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ మానసిక స్థితిని పెంపొందించుకోవడం కాకుండా, మన జీవితంలో కూడా వీటిని పెంపొందించుకోవాలి.

ధ్యానం అనేది మన గురించి మనం చేసుకునే పద్ధతి

ధర్మ ప్రక్రియ మనపై మనం పని చేసుకోవడం అని చెప్పినప్పుడు, దీని అర్థం ఇదే. మన ఒక గదిలో నిశ్శబ్దమైన వాతావరణంలో ధ్యానం చేసినప్పుడు, ఈ రకమైన అవగాహన మరియు ఈ పూర్తి పాజిటివ్ మానసిక స్థితిని సృష్టించడం మనం సాధన చేస్తాము. ఇతరుల గురించి ఆలోచించడానికి మరియు వారి పట్ల నిర్మాణాత్మక దృక్పథాలను పెంపొందించుకోవడానికి మనం మన ఊహా శక్తిని ఉపయోగిస్తాము. ఇది సాంప్రదాయ పద్ధతి కానప్పటికీ, మన ధ్యానంలో వ్యక్తుల చిత్రాలను చూడటం పూర్తిగా సరైనదని నేను అనుకుంటున్నాను. వాళ్ల దగ్గర 2500 సంవత్సరాల క్రితం వ్యక్తుల చిత్రాలు లేవు, మరియు ఈ ప్రక్రియకు మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో సమస్య ఉందని నేను అనుకోను.

ఒక నిర్దిష్ట సానుకూల మానసిక స్థితితో మనకు తగినంత పరిచయం ఏర్పడిన తర్వాత, దాన్ని మన జీవితంలో అన్వయించుకోడానికి ప్రయత్నిస్తాము. దాని ఉద్దేశం అంతా అదే. మీరు కుషన్ మీద కూర్చొన్నప్పుడు ప్రేమపూర్వకమైన ఆలోచనలు పొందుతారు, కానీ మీ కుటుంబం మరియు సహోద్యోగులపై కోపం తెచ్చుకోవడం ఆశించిన ఫలితం కాదు. కాబట్టి, మన ధ్యాన అభ్యాసాన్ని జీవితం నుంచి తప్పించుకునేదని ఎప్పుడూ అనుకోకూడదు, ఇక్కడ మన కోసం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాము. అన్ని రకాల నమ్మశక్యం కాని విషయాలను ఆలోచిస్తూ ఏదో ఒక ఫాంటసీ ల్యాండ్ లోకి వెళితే అది కూడా తప్పించుకోవడమే అవుతుంది. ధ్యాన అభ్యాసం చాలా భిన్నంగా ఉండాలి; జీవితంలోని సమస్యలను ఎదుర్కోవటానికి మనం శిక్షణ తీసుకుంటున్నాము.

ఇదే కష్టమైన పని, మరియు ఇది సులభమైనదని భావించి లేదా ప్రకటనల ద్వారా మనల్ని మనం మోసం చేసుకోకూడదు. స్వార్థాన్ని మరియు మన ఇతర విధ్వంసక భావోద్వేగాలను అధిగమించడం సులభం కాదు ఎందుకంటే అవి చాలా లోతైన అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఉన్న ఏకైక మార్గం ఆ వస్తువుల పట్ల మన ఆలోచనలను మార్చుకోవడం మరియు ఈ విధ్వంసక మానసిక స్థితులకు మూలమైన గందరగోళాన్ని వదిలించుకోవడం.

సారాంశం

బౌద్ధమతాన్ని ఆచరించడాన్ని ధర్మ-లైట్ మరియు నిజమైన విషయం అయిన ధర్మంగా విభజించవచ్చు. ధర్మ-లైట్ తో, జీవితం మనపై విసిరే సమస్యలను మెరుగ్గా ఎదుర్కోగల మానసిక సాధనాలతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడం ద్వారా ఈ జీవన నాణ్యతను మెరుగుపరచాలని అనుకుంటున్నాము. ధర్మా-లైట్ లో ఎటువంటి తప్పు లేదు, కానీ కోకాకోలా లైట్ లాగా ఇది రుచికరంగా ఉండదు.

సాంప్రదాయకంగా, లామ్-రిమ్ బోధనలు ధర్మ-లైట్ గురించి మనం చర్చించిన ఏ ఆలోచనను సూచించవు, ఎందుకంటే ఇది గతం మరియు భవిష్యత్తు జీవితాలపై నమ్మకాన్ని సూచిస్తుంది. అయినా కానీ, మన జీవితాలను మెరుగుపరుచుకోవాలని మరియు మంచి వ్యక్తులుగా మారాలని అనుకోవడం నిజమైన ధర్మాన్ని ఆచరించే మార్గంలోని మొదటి అడుగు.

Top