ప్రారంభ స్థాయి ప్రేరణ

Initial level motivation

నిజమైన విషయం అయిన ధర్మంలోని మూడు స్థాయుల ప్రేరణలు

లామ్-రిమ్ మూడు స్థాయుల ప్రేరణలను అందిస్తుంది:

  • ప్రారంభ స్థాయి - ఇందులో మన తర్వాతి జన్మలో మాత్రమే కాకుండా, భవిష్యత్తు జన్మలలో కూడా మనకు మంచి పునర్జన్మలు ఉన్నాయని నిర్ధారించే విషయంలో మనం ఆలోచిస్తాము.
  • మధ్య స్థాయి - ఇందులో నియంత్రణలో లేని మళ్ళీ రిపీట్ అయ్యే పునర్జన్మ నుంచి సంపూర్ణ విముక్తిని పొందడం మన ప్రేరణగా ఉంటుంది; మనం విముక్తి పొందాలని కోరుకుంటాం.
  • ఆధునిక స్థాయి - ఇందులో మనం నియంత్రణలో లేని మళ్ళీ రిపీట్ అయ్యే పునర్జన్మ నుంచి విముక్తి పొందడానికి సహాయపడటానికి, సంపూర్ణ జ్ఞానోదయం పొందిన బుద్ధుని స్థితిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాము.  

ఈ అన్ని స్థాయిలు పునర్జన్మ యొక్క ఊహపై ఆధారపడి ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, ఈ మూడు స్థాయులకు మెటీరియల్లో ప్రదర్శించిన ప్రతి పద్ధతిని ధర్మ-లైట్ స్థాయిలో కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్రేరణలను మనం చిన్నచూపు చూడాల్సినవి కాదు, ఎందుకంటే మనం వాటిని చిత్తశుద్ధితో అభివృద్ధి చేయగలిగితే అవి నిజంగా చాలా గొప్పవి.

మన అమూల్యమైన మానవ జీవితాన్ని మెచ్చుకుని మన పట్ల మనకున్న జాలిని అధిగమించడం

ప్రారంభ స్థాయి ప్రేరణతో, మనం గ్రహించవలసిన మొదటి విషయం మనకు ఉన్న ఈ "విలువైన మానవ జీవితం" అని పిలువబడే దాన్ని మెచ్చుకోవడం. ధర్మ-లైట్ స్థాయిలో కూడా, "ఏంటో నేను" అనే భావాలను మరియు దాని నుంచి వచ్చే నిరాశా నిస్పృహలను అధిగమించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మన౦ ఎలా౦టి భయానక పరిస్థితులలో ఉండే వాళ్ళమో అని ఆలోచిస్తా౦, అలాంటి పరిస్థితుల్లో మన౦ లేకపోతే అది ఎ౦త అద్భుతంగా ఉంటుందో అర్థ౦ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తా౦.

ప్రామాణిక ప్రదర్శనలో కనిపించే భయంకరమైన పరిస్థితుల యొక్క పెద్ద లిస్ట్ ఉంది, కానీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం సాధారణ పదాలలో దాని గురించి ఆలోచించగలము. ఉదాహరణకు, మనం యుద్ధ ప్రాంతంలో నివసించనందుకు, కరువులో లేనందుకు, ఆకలితో చనిపోనందుకు, మన పిల్లలను పోషించుకోలేని స్థితిలో లేనందుకు మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచిస్తాం. నిర్బంధ సమాజంలో తీవ్రమైన డిక్టేటర్ ప్రభుత్వంలో జీవించడం లేదనే అదృష్టం గురించి మనం ఆలోచిస్తాం. ఇది రొమేనియాలో వృద్ధులకు ఇక్కడ సంబంధం కలిగి ఉండటం సులభం కావచ్చు. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా తీవ్రంగా వికలాంగులం కాకపోవడం ఎంత అదృష్టం. అలాగే, ఒక బౌద్ధమత విధానంలో ప్రతి ఒక్కరూ అడుగు పెట్టి చంపాలని కోరుకునే బొద్దింక అవ్వకపోవడం ఎంత అదృష్టమో అని కూడా మనం భావిస్తాము.

ఈ రకమైన ఆలోచన యొక్క అనేక పొడిగింపులు ఉన్నాయి, మరియు మనం నిజంగా మన గురించి ఆలోచించినప్పుడు, మనకు ఈ స్వేచ్ఛలు ఉన్నందుకు మనం నిజంగా చాలా అదృష్టవంతులం. వీటి నుంచి మనకు స్వేచ్ఛ ఉండటమే కాదు, మనం ఎప్పుడైనా వాటిని కోల్పోవచ్చు అని మనం తెలుసుకోవాలి, ఉదాహరణకు అల్జీమర్స్ వ్యాధితో. ప్రస్తుతం, భయంకరమైన ఆర్థిక సంక్షోభం ఉంది మరియు పరిస్థితులు దీని కంటే ఇంకా అధ్వాన్నంగా తయారవ్వొచ్చు. నిజానికి మనం ఉన్న స్థితిని వివరించడానికి ఉపయోగించే పదం "ఉపశమనం", దీని అర్ధం ఇది నిజంగా చెడు పరిస్థితుల నుంచి విరామం పొందడం మాత్రమే. ఈ ఉపశమనం ఎప్పుడైనా ముగిసిపోవచ్చు.

ఈ స్వేచ్ఛలను పక్కన పెడితే, మన జీవితాన్ని సుసంపన్నం చేసే వివిధ అంశాలను పరిశీలించాలి. ఉదాహరణకు, మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. మనలో చాలా మంది అనారోగ్యానికి గురి కావచ్చు, కానీ ఈ సమయంలో మనం బాగానే ఉన్నాం. బుద్ధుడు బోధించిన ఈ బోధనలు నేటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనం నేర్చుకోవడానికి చాలా మంది టీచర్లు, మరియు పుస్తకాలు ఉన్నాయి. మనకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో, మనకు ఉన్న స్వేచ్ఛలను మరియు అవకాశాలను మనం గుర్తించాలి మరియు మనం ఎంత అదృష్టవంతులమో నిజంగా లోతుగా అభినందించాలి.

మన అమూల్యమైన అవకాశాలను వృధా చేసుకోకుండా ఉండటానికి మరణం మరియు అశాశ్వత గురించి ఆలోచించడం

మనకున్న అమూల్యమైన జీవితం శాశ్వతంగా ఉండదని అర్థం చేసుకోవడమే ప్రారంభ దశలో తర్వాతి విషయం. ఇది మన జీవితంలో పరిస్థితులు మారుతాయనే నిజానికి మాత్రమే పరిమితం కాదు, మనమందరం నిజంగా చనిపోతాము అనే విషయానికి కూడా. కాబట్టి, మరణం గురించి మనకు చాలా ధ్యానాలు ఉన్నాయి. చాలా మంది ప్రజలు, అనేక సమాజాలలో, మరణాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తారు, ఇది ఒక నిషేధించబడిన విషయం. ఏదో ఒక సమయంలో మనం చనిపోతామనే నిజాన్ని అంగీకరించము. ఇందులో మన ప్రియమైన వారు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరూ మరియు మనము కూడా ఉన్నాము. ఇదే రియాలిటీ.

మనం ఖచ్చితంగా చనిపోతాం అనే నిజానికి సహాయం చెయ్యడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటివరకు జీవించిన ప్రతి ఒక్కరూ మరణించారు, కాబట్టి మనలో ఏంటి ప్రత్యేకత? లేదా వారి నుంచి మనం వేరుగా ఏమైనా ఉన్నామా? మరణానికి అసలైన కారణం పుట్టడమే కాబట్టి మనం పుడితే, చచ్చిపోతాం. శరీరం చాలా బలహీనంగా ఉంటుంది మరియు మనం పెద్దయ్యే కొద్దీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఇది మనం ఎప్పుడూ ఉండేంత బలంగా ఉండదు, కానీ చాలా సులభంగా హాని కలిగి గాయపడుతుంది. దీన్ని లాజికల్ గా మనం ఒప్పుకోవాలి, అప్పుడు అది నెమ్మదిగా భావోద్వేగ స్థాయిలోకి వెళ్తుంది.

మనం కచ్చితంగా చనిపోతాం అని మనకు తెలిసినా, ఇక్కడ రెండో పాయింట్ ఏమిటంటే ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. చావడానికి మనం ముసలివాళ్ళం, జబ్బులతో ఉండాల్సిన అవసరం లేదు; చాలా మంది యువకులు మరియు ఆరోగ్యవంతులు వృద్ధులు మరియు వ్యాధిగ్రస్తుల కంటే చాలా ముందుగానే చనిపోతున్నారు. ఈ మధ్యే ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది, కానీ ఆ విమానం ఎక్కేటప్పుడు ఎవరూ ఊహించలేదు అది కూలిపోతుందని. మనల్ని ఎప్పుడైనా బస్సు ఢీ కొట్టవచ్చు. 54 ఏళ్ల నా ప్రాణ స్నేహితుడు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది కూడా రెండు వారాల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు.

మరణం ఏ క్షణంలోనైనా రావచ్చు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. చావు అనేది మన పని లేదా మన భోజనం లేదా మనం చేసేది పూర్తి చేసే వరకు ఆగదు. "ఒక్క నిమిషం ఆగు, నేను ఈ పనిని పూర్తి చేస్తాను" అని చావుకు చెప్పలేము. మరణం వచ్చినప్పుడు, అది ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు మన జీవితం ముగుస్తుంది. మన సమయం ముగిసిన తర్వాత, దాన్ని పొడిగించడానికి మనం ఇంకేమీ చెయ్యలేము. మీరు చావుకి లంచం ఇవ్వలేరు. మన శరీరాన్ని ఒక లైఫ్ సపోర్ట్ మెషీన్ పై ఉంచుకోవచ్చు, కానీ కూరగాయల లాగా ఆ పరిస్థితిలో ఉండటం వల్ల ఉపయోగం ఏముంది, అప్పుడు కూడా, మన జీవితం ఏదో ఒక సమయంలో ముగుస్తుంది.

మరణం గురించి మూడవ అంశం ఏమిటంటే, మనం చనిపోయే సమయంలో మనకు ఏది సహాయపడుతుందో తెలుసుకోవడం. డబ్బు, స్నేహితులు, కుటుంబ సభ్యులను మన వెంట తీసుకెళ్లలేము. ఒక పిరమిడ్ కట్టించి దానిలో మన శవంతో పాటు అన్నిటిని పెట్టినా అవి మనం చనిపోయాక మనతో కలిసి రావు. బౌద్ధమత ఆలోచనా విధానం నుంచి, మనం చనిపోయినప్పుడు నిజానికి మనకు సహాయపడేవి మానసికంగా మనం నిర్మించుకున్న పాజిటివ్ అలవాట్లు అని మనం చెప్పగలము.

బహుశా మన౦ చాలా మంచి పనులు చేసి, ఇతరులకు సహాయపడి ఉ౦డవచ్చు, లేదా మన కోపాన్ని, స్వార్థాన్ని తగ్గి౦చుకోవడానికి ఆధ్యాత్మిక మార్గ౦లో వెళ్లి మన౦ ఎ౦తో పురోగతిని సాధి౦చి ఉ౦డవచ్చు. ఇది మన మానసిక స్థితిపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ధర్మ-లైట్ ఆలోచన నుంచి, మనం పశ్చాత్తాపం పడకుండా చనిపోవచ్చు మరియు ఒక విలువైన, పాజిటివ్ జీవితాన్ని గడిపామని భావించవచ్చు, ప్రత్యేకించి మనం ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకుంటే, లేదా సమాజానికి కొంత సహాయపడినట్లయితే. "నేను ఒక మంచి, విలువైన జీవితాన్ని గడిపాను" అనే మనశ్శాంతి, భావన మరియు ఆలోచన మనకు ఉంటుంది.

నిజమైన ధర్మం పరంగా, మానసికంగా ఈ పాజిటివ్ అలవాట్లు, ధోరణులు మరియు ప్రవృత్తులు మన తర్వాతి జీవితంలో కొనసాగుతాయని కొంచెం నమ్మకంతో మరణించవచ్చు. "రాబోయే జన్మలో, నేను విలువైన మానవ పునర్జన్మను పొందుతాను. నేను మంచి పాజిటివ్ ప్రవృత్తులు ఉన్న ఒక పిల్లవాడిగా జన్మిస్తాను" అని అనుకుంటూ మనం చచ్చిపోతాం. దీన్ని పిల్లలతో కలిసి మనమే చూడవచ్చు. కొంతమంది పిల్లలు, చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, ఎప్పుడూ ఏడుస్తూ కోపంగా ఉంటారు, మరికొందరు ప్రశాంతంగా మరియు ఇతరుల పట్ల దయగా ఉంటారు. ఇది వారు పూర్వజన్మలో ఏర్పరచుకున్న పాజిటివ్ అలవాట్ల ఫలితమే. మనం చనిపోతున్నప్పుడు ఒక ప్రశాంతమైన మానసిక స్థితి ఉంటే అప్పుడు అది చాలా సహాయపడుతుంది. బ్యాంకులో ఉన్న మన డబ్బు మనకు ఏ మాత్రం ప్రశాంతతను ఇవ్వదు, ఎందుకంటే మరణ సమయంలో అది కేవలం కంప్యూటర్ తెరపై అంకెలు లాగానే ఉండిపోతుంది.

మరణంపై ధ్యానం

పై విషయాల వల్ల, మనకు మరణ ధ్యానం ఉంటుంది, ఇక్కడ ఈ రోజుని మనం మన చివరి రోజు అని ఊహించుకుంటాము. మనం ఎప్పుడైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాము. ఈ రోజు నేను చనిపోతే నా జీవితాన్ని ఎలా గడిపానో అని నాకు పశ్చాత్తాపం ఉంటుందా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం డిప్రెషన్ కి గురికావడమే కాదు, ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని, ఇప్పుడు మనకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి. ఈ ధ్యానం యొక్క మొత్తం లక్ష్యం అదే. నేను ప్రతిరోజూ పెద్ద వాడిని అవ్వడమే కాదు, నేను నా మరణానికి దగ్గరగా వెళ్తున్నాను. ప్రతిరోజూ గడిచే కొద్దీ, మనం జీవించడానికి ఒక రోజు తగ్గుతుంది. సమయం వెళ్లిపోతోంది మరియు మనకు ఎంత సమయం మిగిలి ఉందో తెలియదు. అందుకని, మన సమయాన్ని వృథా చేసుకోకుండా, మన జీవితాలను ఉత్తమంగా ఉపయోగించుకోవాలని మనం కోరుకుంటున్నాము. నిజంగా మన జీవితాలను వృధా చేసుకున్నామని, ఇంకా చాలా సాధించగలమని గ్రహించే మానసిక స్థితితో చనిపోవడం చాలా భయంకరమైన పరిస్థితి.

"నేను నా అవకాశాలను వృధా చేసుకోను" అనే మానసిక స్థితిని సమతుల్యమైన రీతిలో ఏర్పరచుకోవాలి. మతోన్మాదులుగా మారడం, భయంతో జీవించడం, పని లేదా ధ్యానం చెయ్యకుండా ఎప్పుడూ భయపడుతూ ఉండడం మానుకోవాలి. మనకు నిజంగా అవసరమైతే విశ్రాంతి తీసుకోవాలి, అలా మేము తర్వాత పని చెయ్యడానికి బలాన్ని పొందుతాము. నాకు ఇష్టమైన మాట ఏమిటంటే: "మరణం ఎప్పుడైనా రావచ్చు. రిలాక్స్ గా ఉండండి." మీరు దీని గురించి ఆలోచిస్తే, ఇది నిజంగా చాలా అర్ధాన్ని ఇస్తుంది. అవును, మనం ఎప్పుడైనా చనిపోవచ్చు, కానీ దాని గురించి ఉన్మాదంగా మరియు మతోన్మాదిగా ఉండటం మనల్ని మనం ఓడించుకున్నట్టే.

మనకున్న ఈ అద్భుతమైన అమూల్యమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడమే ప్రధాన సందేశం. మనకు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు, మరియు మనం నిజంగా అలసిపోనప్పుడు, బద్ధకంతో ఉన్నప్పుడు మనతో మనం నిజాయితీగా ఉండవచ్చు. మన ప్రేరణను దృష్టిలో ఉంచుకోవడానికి బాగా ప్రయత్నించాలి.

సహజంగా, మరణ అవగాహన ధ్యానాలను ధర్మ-లైట్ మరియు నిజమైన విషయం అయిన ధర్మం రెండింటికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారని చెప్పడం మరియు అభినందించడం లేదా క్షమాపణ చెప్పడం లేదా ఎవరితోనైనా సర్దుబాటు చేయడం లాంటివి మనం చెయ్యకుండా వదిలేసినప్పుడు మనం వేచి ఉండాల్సిన పని లేదు. ఆ వ్యక్తి రేపు ఉండకపోవచ్చు, లేకపోతే రేపు మనం ఉండకపోవచ్చు. మరణ జ్ఞానం నుంచి మనం నేర్చుకోగలిగే ధర్మ-కాంతి పాఠం ఇదే. ఇది ఏ స్థాయిలోనైనా చాలా ప్రయోజనకరంగా మరియు సహాయకారిగా ఉంటుంది; మరణాన్ని వద్దనవద్దు, కానీ దానికి సిద్ధంగా ఉండండి. మన స్వంత మరణాలు మరియు అంత్యక్రియలను కూడా మనం ఊహించుకోవచ్చు, ఇది మనకు కొంచెం వాస్తవికంగా ఉండటానికి సహాయపడుతుంది. దాని మీద దృష్టి పెట్టకుండా చూసుకుని అనారోగ్యం లేదా నిరాశకు గురి కాకుండా ఉండండి!

మన మరణం తర్వాత వచ్చే పునర్జన్మ యొక్క అధ్వాన్న స్థితిని అనుభవించడానికి భయాన్ని అభివృద్ధి చేయడం

ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుని ముందుకు వెళతాం. ఇక్కడ, మనం అనుభవించగల చెత్త పునర్జన్మ స్థితుల యొక్క ప్రదర్శన ఉంటుంది, మరియు దీనిని ఎలా సీరియస్ గా తీసుకోవాలి అని ఉంటుంది. మళ్ళీ, ఇది అస్సలు సులభమైనది కాదు, ఎందుకంటే బౌద్ధమతంలోని ప్రదర్శనలో మన ప్రస్తుత వాటి కంటే ఘోరమైన జంతు పునర్జన్మలు లేవు, నిజానికి మనం చూడలేని కొన్ని రూపాలు కూడా ఉన్నాయి.

జంతువుల పునర్జన్మను మనం ఆలోచించినప్పుడు, ఇందులో అన్ని రకాల కీటకాలు, చేపలు మరియు అందుబాటులో ఉన్న ప్రతి జాతి మరియు రకపు జంతువులు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ జంతు రాజ్యంలో పునర్జన్మ పొందడం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జంతువుల పునర్జన్మల గురించి మనం ఆలోచిస్తే, ఒక భవనంలో నెయిల్ పాలిష్ వేసుకున్న కోడిపుంజు యొక్క జీవితాన్ని మనం ఊహించలేము. చాలా మందికి నచ్చని బొద్దింకలు మరియు ఎలుకలు, పెద్ద జంతువులు తినే చిన్న కీటకాలు మరియు చేపలు, మరియు మనుషులు పెంచి వధించే జంతువుల గురించి మనం ఆలోచిస్తాము.

భవిష్యత్తులో అటువంటి వాటి గురించి ఇక్కడ వచ్చే భావోద్వేగం ఎక్కువగా "భయం" అని అనువదించబడుతుంది, కానీ ఇది సరైన పదమో కాదో నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే ఇది నిరాశను సూచిస్తుంది, దాని గురించి మనం ఇంకేమీ చెయ్యలేము. ఏదేమైనా, దాన్ని నివారించడానికి మనం ఏమైనా చెయ్యవచ్చు, కాబట్టి నేను "భయం" అనే పదాన్ని ఉపయోగిస్తాను, అంటే మనం నిజంగా, అది జరగకూడదని చాలా బలంగా కోరుకుంటున్నాము.

ఉదాహరణకు, మనకు నిజంగా ఒక బోరింగ్ బిజినెస్ మీటింగ్ ఉందనుకోండి, దానికి మనం తప్పకుండా హాజరు కావాలి. అక్కడికి మనకు వెళ్లాలని అనిపించదు. ఇది బోరింగ్ గా మరియు చికాకుగా ఉంటుంది, కానీ వెళ్ళడానికి మనం భయపడము. ఇది మనం సృష్టించాల్సిన భావోద్వేగం. ఏ క్షణంలోనైనా కోల్పోగల ఈ అమూల్యమైన జీవితం మనకు ఉంటుంది, కాబట్టి మన తర్వాతి జీవితంలో బొద్దింక లాగా కాకుండా ఉండడానికి మనం దాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము. బొద్దింకగా ఉండటం నిజంగా భయంకరంగా ఉంటుంది మరియు అలా జరగడం మనకు నిజంగా నచ్చదు, కాబట్టి దాన్ని నివారించడానికి మనం ఏదొకటి చెయ్యాలి.

నిజమైన విషయం అయిన ధర్మంలో మనం జంతు, కీటక పునర్జన్మల గురించే కాకుండా దెయ్యం, నరలోక పునర్జన్మల గురించి కూడా మాట్లాడుతాం. వీటిని చేర్చడానికి మనం ఇబ్బంది పడకూడదు; ఈ వర్ణనలను కేవలం గదిలో దాచడం బౌద్ధమతానికి సరైనది కాదు. దానికి బదులుగా, మన౦ ఓపెన్ మై౦డెడ్ గా ఉ౦డి ఇలా అనొచ్చు, "నాకు అది నిజంగా అర్థ౦ కాలేదు."

మనుషులకు సంబంధం లేని పునర్జన్మ స్థితులను ఎలా అర్థం చేసుకోవాలి

మానసిక పనులతో లేదా మరో మాటలో చెప్పాలంటే, అనుభవించే ప్రతి క్షణంతో మనం దీని సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. ప్రతి క్షణం, మనకు ఒక మానసిక ఆలోచన వస్తుంది, అంటే ఏమిటో చూడటం, తెలుసుకోవడం లేదా ఆలోచించడం మొదలైనవి. ఆ అనుభవంలో ప్రతి క్షణం ఏదో ఒక రకమైన సంతోషం లేదా దుఃఖం ఉంటుంది. నిజానికి ఇదే మనల్ని కంప్యూటర్ల నుంచి వేరు చేస్తుంది. కంప్యూటర్ లోపల సమాచారం ఉంటుంది, దాన్ని ఒక విధంగా అర్ధం చేసుకుంటుంది. కానీ కంప్యూటర్ సంతోషం లేదా అసంతృప్తిని  అనుభవించదు, మరియు ఇది నిజంగా సమాచారాన్ని అనుభవించలేదు. మనకు సంతోషకరమైన మరియు బాధాకరమైన భావనలు ఉండటం అనేది అనుభవాన్ని నిర్వచిస్తుంది, మరియు ఆనందం మరియు అసంతృప్తి యొక్క స్పెక్ట్రం చాలా విస్తృతమైనది. మనం అనుభవించే స్పెక్ట్రం మొత్తం మన హార్డ్‌వేర్ పై ఆధారపడి ఉంటుంది; మరో మాటలో చెప్పాలంటే, మనకు ఉన్న శరీరం.

ఇది కేవలం సంతోషం, దుఃఖంలా మాత్రమే కాకుండా, మన వివిధ ఇంద్రియాల నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఇతరులకన్నా ఇంకా ఎక్కువ చూడగలరు, కొంతమంది ఇతరుల కన్నా బాగా వినగలరు మరియు కొంతమంది ఇతరులకన్నా వేడి మరియు చలిని బాగా తట్టుకోగలరు. జంతువులకు సంబంధించి, కుక్క మనుషుల కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలను వినగలదు ఎందుకంటే ఇది వేరే రకమైన శరీరాన్ని కలిగి ఉంది, అలాగే వివిధ హార్డ్‌వేర్లు ఉంటాయి. మానవ కళ్లతో చూడగలిగే దాని కంటే డేగ దాని కళ్లతో ఇంకా ఎక్కువగా చూడగలదు. వివిధ ఇంద్రియాల విషయంలో ఇలా ఉంటే, సుఖదుఃఖాలలో కూడా ఇలా ఎందుకు ఉండదు?

ఈ చర్చలో ఆనందం మరియు బాధను మనం చేర్చవచ్చు, అయినా కానీ అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. సంతోషం మరియు దుఃఖం మానసికంగా అనుభవించబడతాయి, కానీ ఆనందం మరియు బాధ భౌతికంగా ఉంటాయి. మన మానవ శరీరానికి సంబంధించి, శారీరక బాధ ఎక్కువగా ఉన్నప్పుడు, మనం స్పృహ తప్పి పడిపోతాము. భావోద్వేగ నొప్పితో, మనం షాక్ ని అనుభవిస్తాము మరియు మన శరీరం చచ్చుబడిపోతుంది.

మరోవైపు ఆనందం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఒక గాయాన్ని పరీక్షిస్తే, అది నిజంగా తీవ్రమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇది బాధాకరమైనది కాదు, కానీ నిజానికి అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడు దాన్ని గోకి దాన్ని పోగొడతాము. తీవ్రమైన దురదతో దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో వ్యవహరించడానికి ఇది ఒక మార్గం, అంటే దురదను ఆనందంగా చూడడం. ఇది చాలా అధునాతనమైనది మరియు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించి ఆనందించడం చాలా కష్టం, ప్రత్యేకించి ఈ గోకడం నొప్పిని కలిగిస్తే. అయినా అది సాధ్యమే. ఏదేమైనా, లైంగిక ఆనందంలో మనం ఆలోచిస్తే, అది ఎంత తీవ్రంగా ఉంటే, అంత త్వరగా భావప్రాప్తి మరియు క్లైమాక్స్ కు చేరుకోవాలని అనుకుంటాము, దాన్ని నాశనం చెయ్యడానికి.

కాబట్టి, మనకున్న ఈ మానవ శరీరం ఆనందం మరియు దుఃఖంలో ఒక నిర్దిష్ట భాగాన్ని మాత్రమే అనుభవించగలదని మనం చూడవచ్చు. జంతువులు దృష్టి మరియు ధ్వని లాంటి వివిధ ఇంద్రియ స్పెక్ట్రమ్ లలో ఎక్కువ వాటిని అనుభవించగలవని మనం చూడొచ్చు. అందుకని బాధ, ఆనందం, సంతోషం మరియు దుఃఖం యొక్క స్పెక్ట్రమ్ లలో ఎక్కువగా అనుభవించగల ఇతర రకాల హార్డ్‌వేర్లు ఉండవచ్చు. ఎందుకు ఉండకూడదు?

ఈ మానసిక పనుల గురించే మనం ప్రతి జీవితంలో మాట్లాడుకుంటుంది. తీవ్రమైన బాధ మరియు నొప్పి నుంచి అది అత్యంత తీవ్రమైన ఆనందం మరియు సంతోషం వరకు అన్నిటినీ పూర్తిగా అనుభవించలేకపోవడానికి ఎటువంటి కారణం లేదు. ఇది ప్రతి జన్మలో మనకు ఉన్న హార్డ్‌వేర్ కు సంబంధించిన విషయమే. బౌద్ధమతంలో వర్ణించబడిన మనం చూడలేని ఈ ఇతర జీవరాశులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నించడానికి మరియు కనీసం ఓపెన్ మైండెడ్ గా ఉండటానికి ఇది ఒక లాజికల్ మార్గం. మనం అమీబాలను చూడలేము, కానీ మైక్రోస్కోప్ ల శాస్త్రీయ అభివృద్ధితో, మనం వాటిని ఒక జీవ రూపంగా చూసి అవి ఉన్నాయని అంగీకరించవచ్చు. అలాగే, మనం దెయ్యాలను చూడలేకపోవచ్చు, కానీ మనస్సు అభివృద్ధితో ఇది సాధ్యపడుతుంది.

ధర్మ-లైట్ వెర్షన్ ఇతర విషయాలలో మానవ అనుభవాలను తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ నరకంలో ఉన్నట్లు అనుకోవచ్చు. ఇది వారిపట్ల సానుభూతిని పెంపొందించడానికి మరియు భవిష్యత్తులో అలా ఉండకూడదనే కోరికను కలిగించడానికి కూడా సహాయపడుతుంది. ధర్మ-లైట్ స్థాయిలో ఒక కారణంగా అది ఉన్నా ఏం పర్వాలేదు. అయితే, నిజమైన విషయం అయిన ధర్మం అంటే కేవలం మానవ అనుభవం గురించి మాత్రమే కాదు, మానసిక కొనసాగింపుకి ఆధారంగా మనం మరియు ప్రతి ఒక్కరూ పొందగల అనుభవాల గురించి మాట్లాడటం. ఈ మానసిక పనులు సంతోషం నుంచి దుఃఖం, ఆనందం నుంచి బాధ అనే రీతిలో ఎలాగైనా ఉండవచ్చు. మనం ఖచ్చితంగా పరిమితమైన మరియు భవిష్యత్తులో బాధాకరమైన అనుభవాలు మాత్రమే ఉండాలని కోరుకోవడం లేదు. ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

దాన్ని నివారించడానికి ఏదైనా మార్గం ఉందా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న! ముందుగా, మన జీవితాల్లో ఒక నిర్దిష్ట పాజిటివ్ దారిని మనం పెట్టుకోవాలి ఉంచాలి, ఇది ఈ అధ్వాన్నమైన పునర్జన్మలను నివారించడానికి మనకు సహాయపడుతుంది. నిజానికి, ఇది అలా చెయ్యడమే కాదు, మనల్ని ముక్తి మరియు జ్ఞానోదయానికి కూడా దారితీస్తుంది.

మన జీవితాలకు ఒక సురక్షితమైన దారిని చూపించడం: ఆశ్రయాన్ని పొందడం

"ఆశ్రయం" అనే పదం గురించి నాకు అంత ఆసక్తి ఏమీ లేదు, ఇది చాలా పాసివ్ గా ఉండడంతో కొంచెం తప్పు దోవ పట్టించేదిగా అనిపిస్తుంది, "ఓ బుద్ధా, నన్ను రక్షించు!" అలాగే మమ్మల్ని జంతువుల శరణాలయానికి తీసుకెళ్లమన్నట్లు లేదు. మనం చాలా యాక్టివ్ గా ఉండే దాని గురించి మాట్లాడుతున్నాము, పాసివ్ దాని గురించి కాదు. ఇది మన జీవితాలలో ఒక "సురక్షితమైన దిశను" ఇస్తుందని నేను చెప్తాను; ఈ దిశలో మనం వెళితే, అప్పుడు మనం అధ్వాన్నమైన పునర్జన్మలు, నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మలు మరియు ఇతరులకు సహాయం చేయలేకపోవడం లాంటి పరిస్థితి నుంచి మనల్ని మనం రక్షించుకుంటాము.

సాధారణంగా బుద్ధుని బోధనలుగా అనువదించబడే "ధర్మం" అనే పదం నిజానికి ఒక నివారణ చర్యను సూచిస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, బాధలను పోగొట్టడానికి వీటిని మనలో అన్వయించుకుంటాము. అధ్వాన్నమైన పునర్జన్మ, అసలైన పునర్జన్మ, మరియు ఇతరులకు పూర్తిగా సహాయం చేయలేకపోవడం అనే ఈ మూడు సమస్యలను అధిగమించడానికి మనం వీటిని మన జీవితంలో ఉంచుకుంటాము.

బుద్ధుడు సూచించిన దారి ఏమిటి? ఈ దారిలో నిజంగా బుద్ధుడే స్వయంగా నడిచాడు, ఇది అన్ని అడ్డంకులు, లోపాలు, ఇబ్బందులు మరియు విసిగించే భావోద్వేగాలను పూర్తిగా ఆపివేస్తుంది. అదే సమయంలో, బుద్ధుడు మనస్సులో ఉన్న అన్ని పాజిటివ్ సామర్థ్యాలను గ్రహించాడు. ఈ దారి గురించే మనం మాట్లాడుతున్నాం. బుద్ధుడు, ధర్మం మరియు సంఘం యొక్క విలువైన మరియు అరుదైన ఆభరణాల యొక్క సురక్షితమైన దారి గురించి మాట్లాడేటప్పుడు నిజానికి మన అర్థం ఇదే. ధర్మం అనేది బుద్ధుడు నిజంగా సాధించింది మరియు మనం కూడా దాన్ని ఎలా సాధించవచ్చు అనే అతని బోధనలు. దానిని సంపూర్ణంగా పొందిన వ్యక్తిని బుద్ధుడు అని పిలుస్తారు. సంఘం అనేది మఠంలో లేదా మన బౌద్ధ కేంద్రంలోని ప్రజలు కాదు, ఒక పూర్తి సన్యాస సమాజం. నిజానికి ఇది కూడా మన సురక్షితమైన దారి కాదు. మూడు రత్నాలలో భాగంగా, ఒక బుద్ధుడు సాధించిన దానిలో కొంత భాగాన్ని సంపూర్ణంగా సాధించిన అత్యంత సాక్షాత్కార జీవులను ఈ సంఘం సూచిస్తుంది.

దానికి అనుగుణంగా, మనం ముందుగా చేయాల్సింది ఇదే. మన జీవితాల్లో మనం నిజాయితీగా ఒక సురక్షితమైన దారిని పెట్టుకోవాలి; ఆ దిశగానే మనం పని చెయ్యాలి.  బుద్ధుడు ఏమి సాధించాడో, బుద్ధుడు పూర్తిగా చేసిన విధానాన్ని, సంఘం పాక్షికంగా చేసిన పొందిన దాన్ని సాధించడానికి మనం కష్టపడతాము. మన జీవితంలో ఈ దారిని పెట్టుకోవడం వల్ల ప్రతి స్థాయిలో చాలా పెద్ద తేడా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మన జీవితానికి నిజంగా అర్థం మరియు దిశ ఉంటుంది. మన లోపాలను వదిలించుకుని మన సామర్థ్యాన్ని గ్రహించడానికి మనం పని చేస్తున్నాము. అలా చేస్తే మనం మానసికంగా సంతోషంగా ఉంటాం, ఎందుకంటే అప్పుడు మనం, "జీవితం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో నాకు తెలియదు; నా జీవితానికి అర్థం లేదు" అని అనుకుంటాము. ఇది ఒక భయంకరమైన మానసిక స్థితి, మరియు ప్రజలకు ఇది ఉన్నప్పుడు, వారి జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. "డబ్బు ఆనందాన్ని కొనిపెట్టదు" అనేది నిజం ఎంతయినా కానీ.

విధ్వంసకర ప్రవర్తనను నివారించడం

ఇప్పుడు, మన జీవితంలో ఈ సురక్షితమైన దారి లభించింది. అలాగైతే, చెడు పునర్జన్మలను నివారించే మార్గం ఏమిటి? శారీరకంగా, మౌఖికంగా లేదా మానసికంగా అయినా కానీ వినాశకరమైన మార్గాల్లో వ్యవహరించకుండా ఉండటమే ఈ పద్ధతి. దీని అర్ధం కోపం, దురాశ, మమకారం, అమాయకత్వం, అసూయ, అహంకారం లాంటి ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావంతో ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని నివారించడానికి ప్రయత్నిస్తాము. ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉత్తమమైన మార్గం, ప్రారంభ స్థాయిలో, వినాశకరమైన పనులను చెయ్యకుండా ఉండడం.

అయితే, మనం దీన్ని బౌద్ధమత పద్ధతిలో చెయ్యాలి. సాధారణంగా, అన్ని మతాలు చంపడం మరియు దొంగిలించడం లాంటి వాటిని పాటించకూడదని బోధిస్తాయి, కాని విలక్షణమైన బౌద్ధమత ఆచారం ఇది చట్టం కాదు అని చెప్తుంది. ఒక దైవం కానీ, చట్టసభ కానీ, ప్రభుత్వం కానీ సృష్టించిన చట్టం ఏదీ లేదు. బౌద్ధమత నైతికత చట్టానికి విధేయతపై ఆధారపడి ఉండదు, "చట్టానికి లోబడి ఉండండి, లేకపోతే మీరు శిక్షించబడతారు" అని చెప్పదు. పౌర చట్టానికి సంబంధించి, మనం లంచాలు ఇవ్వొచ్చు లేదా శిక్ష నుంచి తప్పించుకోవడానికి మంచి న్యాయవాదిని కూడా నియమించవచ్చు. అలాగే, మనం చట్టానికి లోబడి ఉంటే, మనం మంచి వ్యక్తి అని కాదు, అలా ఉండకపోతే, మనం చెడ్డవాళ్ళం లేదా నేరస్థులం అని కాదు. విధేయత అనేది బౌద్ధమత నీతికి ఆధారం కాదు.

నిర్మాణాత్మక ప్రవర్తనలో నిమగ్నం అవ్వడం

బౌద్ధమతంలో నిర్మాణాత్మక ప్రవర్తన అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వినాశకరమైన ప్రవర్తనల పరంగా చూడటంతో మనం దీన్ని అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు, చంపడానికి లేదా ప్రాణాలను తియ్యడానికి ఒక మార్గం వేటాడటం. కానీ మనం ఎప్పుడూ వేటాడకపోతే, వేటపై ఆసక్తి అసలు లేకపోతే, మనం వేటాడకపోవడం అనేది ఒక మంచి విషయం అయినప్పటికీ అది నిర్మాణాత్మక ప్రవర్తనగా పరిగణించబడదు. నిర్మాణాత్మక ప్రవర్తన అనేది దోమను చంపడానికి దాన్ని కొట్టడానికి మనం ఎలాంటి ఫీలింగ్ ని పొందకపోవడం లాంటిది. నేను, నేను, నేను అని స్వార్ధంగా ఆలోచిస్తూ కోపంతో ప్రవర్తిస్తున్నామని అర్థమవుతోంది. అంతే కాకుండా, ఆ దోమను చంపితే, అది ఒక బలమైన అలవాటును సృష్టిస్తుందని మనకు తెలుసు, అలా ఎప్పుడైనా మనకు ఏదైనా నచ్చకపోతే దాన్ని చంపడానికి చూస్తాము. కాబట్టి దోమను చంపడానికి బదులుగా, దానిని ఒక కప్పులో పట్టి బయట వదలటం లాంటి ఒక మంచి మార్గాన్ని మనం చెయ్యవచ్చు. నిర్మాణాత్మక పని ఏమిటంటే, మనం నిజంగా చంపాలనుకున్నప్పుడు ఆ జీవిని చంపకుండా ఉండడమే. మనం కారణాన్ని, మరియు ప్రభావాన్ని అర్థం చేసుకుంటాం కాబట్టి దానికి దూరంగా ఉంటాం. ఈ రకమైన నిర్మాణాత్మక పని మన మనస్సులో బలమైన పాజిటివ్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

దోమను చంపకుండా దానికి ఆహారం పెట్టడం లాంటి నిర్మాణాత్మక పనులు ఇంకా మంచిగా ఉంటాయి. అది మన రక్తాన్ని కొద్దిగా రుచి చూడనివ్వచ్చు. ఎందుకంటే మనకు చాలా రక్తం ఉంది. నేను నిజంగా కొంత మందిని కలిశాను వాళ్ళు అలా నిజంగా చేస్తారు. మనం వేటాడటం లేదనే విషయం మనం అనుకున్నంత బలమైన పాజిటివ్ పని కాదు.

ప్రవర్తనా కారణాన్ని మరియు ప్రభావాన్ని అర్థం చేసుకోవడమే బౌద్ధమత నైతికత యొక్క ఆధారం

బౌద్ధమతంలో, నైతికత అనేది ఒక విధంగా ప్రవర్తిస్తే దాని పర్యవసానాలు అలాగే ఉంటాయని అర్థం చేసుకోవడం మరియు ఏది హానికరమో, ఏది సహాయపడుతుందో అని తెలుసుకోవడం. ఉదాహరణకు, మన౦ వినాశకర మార్గాల్లో ప్రవర్తిస్తే, అది మన౦ బాధ పడే లేదా ఇబ్బంది పడే మానసిక స్థితిని సృష్టిస్తు౦ది. మన ప్రాథమిక గందరగోళం వల్ల మనం ఇలా ప్రవర్తిస్తాము. ముందు, మనం మాదకద్రవ్యాలు లేదా మద్యానికి బానిస అయినప్పుడు, వినాశకరమైన విధంగా వ్యవహరించడం నిజానికి చెడ్డది అని మనకు తెలియకపోవచ్చు. అంతేకాక, మనం ఎప్పుడూ మత్తుగా ఉండి లేదా త్రాగితే, మన సమస్యలన్నిటిని పోగొట్టుకోగలమని మనం అనుకోవచ్చు.

కాబట్టి, నైతిక ప్రవర్తన యొక్క ఆధారాన్ని అర్థం చేసుకోవడంతో, మనం చెడుగా వ్యవహరించినప్పుడు, అది మనం చెడ్డ వారిగా ఉండటం వల్ల కాదు, మనం గందరగోళం వల్ల అని మనం గ్రహిస్తాము. ఇతరులు విధ్వంసకరంగా ప్రవర్తించినప్పుడు, వారు చెడ్డ వాళ్ళు మరియు శిక్షించబడటానికి అర్హులు అని కాదు, వారు చాలా ఇబ్బందుల్లో ఉండి బాధ పడుతున్నారని అర్ధం. వారు కరుణ యొక్క వస్తువులు అవుతారు, మరియు వారి ఇబ్బందులను తొలగించడానికి మనం వారికి సహాయపడాలని అనుకుంటున్నాము. అవును, అవకాశం ఉంటే, వాళ్ళు ఇతరులకు హాని కలిగించకుండా ఉండటానికి మనం వాళ్లను బంధించవచ్చు, కానీ సరైన మార్గాలను ఉపయోగించి మాత్రమే. మనం వారిని శిక్షించాల్సిన లేదా బాధపెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఒక విధంగా సహాయం చెయ్యడానికి ప్రయత్నించాలి. వారికి ఒక మానసిక స్థితి ఉంటుంది మరియు మనం ఇప్పుడు వారికి మార్చడానికి ప్రయత్నించకపోతే, వాళ్ళు ముందు ముందు చాలా చెడు పనులు చేసే అవకాశం ఉంటుంది.

ఏదేమైనా, ప్రారంభ దశలో, మనం ముఖ్యంగా మనపై దృష్టి పెట్టుకుని భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులను తప్పించుకోవాలని అనుకుంటున్నాము, ఇది ఈ జన్మలో ధర్మ-లైట్ విధానం కోసం లేదా భవిష్యత్తులో నిజమైన విషయం అయిన ధర్మ విధానం కోసం ఉంటుంది. ఈ స్థాయిలో, ఒక సురక్షితమైన దారిని కనిపెట్టుకుని, ఈ విలువైన మానవ జీవితాన్ని మనం ఈ విధంగా ఉపయోగించుకుంటాము. మనం ఈ జీవితానికి విలువ ఇస్తాము ఎందుకంటే మనం దాన్ని ఎలాగో చనిపోతామని తెలుసు, మరియు భవిష్యత్తులో మనకు విలువైన మానవ జీవితం ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాము. మనకు ఈ జీవితం అవసరం ఎందుకంటే మోక్షం మరియు జ్ఞానోదయ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ధర్మ-లైట్ అనేది నిజమైన విషయం అయిన ధర్మానికి ఒక మెట్టు అయినట్లే, మనం చూసిన ఈ ప్రారంభ స్థాయి మధ్యంతర మరియు అధునాతన స్థాయిలకు ఒక మెట్టు.

సారాంశం

మనకున్న ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని అభినందించడంతోనే ప్రారంభ స్థాయి ప్రేరణ మొదలవుతుంది. మనకు ఈ శరీరం ఉంది, మనకు అవకాశాలు ఉన్నాయి, అన్నింటికీ మించి, మనకు మానవ మేధస్సు ఉంది; మన మనస్సును దాని మీద ఉంచితే మనం సాధించ లేనిది అంటూ ఏదీ ఉండదు.

మనం ఇప్పుడు ఉన్న ఈ అద్భుతమైన పరిస్థితి శాశ్వతమైనది కాదు, ఎందుకంటే ఏదీ అలా ఉండదు. మనం ఎంత ధనవంతులం, ఎంత ఫేమస్, మనకు ఎంత మంది స్నేహితులు ఉన్నారు, మన శరీరం ఎంత దృఢంగా ఉంది అనేది ముఖ్యం కాదు, చివరికి మనకు వచ్చేది మరణమే. దీన్ని ఆపగలిగేది ఏదీ లేకపోవడమే కాదు, మన సమయం ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. నిజంగా మనం మరణాన్ని అర్ధం చేసుకుంటే, అప్పుడు మన సాధారణ జీవితం గడపడం అసాధ్యమని చెప్పబడుతుంది.

ఈ జీవితం ఏ క్షణంలోనైనా ముగిసిపోతుందని మనకు తెలిసినప్పుడు, మరణానికి మించి ఏముందో అని మనం ఆలోచించడం మొదలుపెడతాం. ఎందుకంటే ఈ విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి, వాటిలో చాలా భయానకమైనవి, మనం పునర్జన్మను పొందగలిగేవి, మన జీవితాలలో ఒక సురక్షితమైన దారిని చూపించేవి.

ఈ సురక్షితమైన దిశ భవిష్యత్తులో బాధను తెచ్చిపెట్టే చెడు పనులకు దూరంగా ఉండాలని మరియు భవిష్యత్తులో సంతోషాన్ని కలిగించే నిర్మాణాత్మక పనులలో పాల్గొనమని మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ విధంగా, మనం మంచి భవిష్యత్తు పునర్జన్మలను పొందుతాము.

Top