బౌద్ధమతాన్ని స్టడీ చెయ్యడం, మరియు మన జీవితంలో ఆ బౌద్ధమత బోధనలను నిజంగా పాటించడం రెండు వేర్వేరు విషయాలు. బౌద్ధమతాన్ని మేధోపరంగా స్టడీ చేసినంత మాత్రాన అది మీ జీవితానికి ఉపయోగపడదని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. డాక్టర్. అలెగ్జాండర్ బెర్జిన్, పండితుడు మరియు అభ్యాసకుడు, తనకు విద్యా మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలలో ఉన్న అనుభవం గురించి మాట్లాడారు.

స్పుత్నిక్ జనరేషన్

నేను 1944 సంవత్సరంలో అమెరికాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాను. మా కుటుంబంలో ఎక్కువగా డబ్బులు ఉండేవి కాదు, అందరూ పనులు చేసే వాళ్ళే, ఎవరూ పెద్దగా చదువుకోలేదు కూడా. ఏదేమైనా, చిన్న వయస్సు నుంచే, నాకు ఆసియా విషయాలపై చాలా బలమైన ఆసక్తి ఉండేది. దీన్ని నా కుటుంబం ప్రోత్సహించలేదు, కానీ వద్దని కూడా చెప్పలేదు. ఆ రోజుల్లో, ఆసియా గురించి ఎక్కువ సమాచారం దొరికేది కాదు. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను ఒక స్నేహితుడితో కలిసి యోగా చెయ్యడం ప్రారంభించాను మరియు బౌద్ధమతం, భారతీయ ఆలోచన, చైనీస్ ఆలోచన మొదలైన వాటి గురించి నాకు దొరికిన వాటన్నిటినీ చదివాను.

అమెరికాలో "స్పుత్నిక్ జనరేషన్" అని పిలిచే దానిలో నేను ఒకడిని. స్పుత్నిక్ క్షిపణి అంతరిక్షంలోకి పంపబడినప్పుడు, రష్యా కంటే చాలా వెనుకబడి ఉన్నామని అనుకుని మన అమెరికా చాలా బాధ పడింది. నాతో సహా పాఠశాలలోని పిల్లలందరినీ సైన్స్ చదవమని ప్రోత్సహించారు, అలా మేము రష్యాను వెంబడించగలమని అనిపించింది. అలా 16 ఏళ్ల వయసులో కెమిస్ట్రీ చదవడానికి నేను రట్జర్స్ యూనివర్సిటీకి వెళ్లాను. రట్జర్స్ యూనివర్శిటీ న్యూజెర్సీలో ఉంది, అక్కడ నేను పెరిగాను, కల్మిక్ మంగోల్ బౌద్ధ గురువు అయిన గెషే వాంగ్యాల్ బహుశా నాకు 50 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నప్పటికీ, అతని గురించి నాకు ఏమీ తెలియదు.

నా స్టడీస్ లో భాగంగా, నేను ఆసియన్ స్టడీస్ లో ఒక అదనపు కోర్సు తీసుకున్నాను, ఇది బౌద్ధమతం ఒక నాగరికత నుంచి మరొక నాగరికతకు ఎలా వెళ్ళింది మరియు ప్రతి నాగరికత దాన్ని భిన్నంగా ఎలా అర్థం చేసుకుంది అనే దాని గురించి చెప్తుంది. నాకు కేవలం 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, అది నాపై ఎంత బలమైన ప్రభావాన్ని చూపిందంటే నేను, "బౌద్ధమతం ఒక నాగరికత నుంచి మరొక నాగరికతకు వెళ్ళే పూర్తి ప్రక్రియలో నేను కూడా ఉండాలనుకుంటున్నాను" అని చెప్పాను. నా జీవితాంతం ఎలాంటి మార్పులు లేకుండా నేను దీన్నే అనుసరించాను.

Top