బౌద్దులకు, "ధర్మం" అనే పదం బుద్ధుని బోధనలను సూచించడానికి ఉపయోగిస్తారు, ఇది మన ప్రస్తుత ఇబ్బందులు మరియు అసంతృప్తి నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి సరిగ్గా అర్ధం చేసుకోవటానికి సహాయపడుతుంది. లాటిన్ పదం "కలిసి బంధించడం" నుంచి వచ్చిన "మతం" అనే ఆంగ్ల పదం లాగా, “ధర్మం” సంస్కృతం "ధ్ర్" నుండి వచ్చింది, దీని అర్ధం గట్టిగా పట్టుకోవడం లేదా సపోర్ట్ చెయ్యడం అని అర్ధం. ముఖ్యంగా, మనం దీర్ఘకాలం అనియంత్రిత బాధలను అనుభవిస్తూ కుంగిపోకుండా, దురదృష్టకరమైన పరిస్థితులలోకి పడిపోకుండా ఉండటానికి ధర్మం మనకు బాగా సహాయం చేస్తుంది.
What is dharma

బుద్ధుని మొదటి ధర్మ బోధన

2,500 సంవత్సరాల క్రితం బుద్ధుడు బోధ్గయలో జ్ఞానోదయం పొందినప్పుడు, ధర్మం చాలా లోతైనది మరియు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాపంచిక సుఖాల పట్ల వ్యామోహం పొందిన ప్రజలు దీనిపై ఆసక్తి చూపరని భయపడి, అతను మొదట ఈ ధర్మాన్ని బోధించడానికి వెనకడుగు వేశారు. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ బుద్ధుని ముందు ప్రత్యక్షమై, జీవులకు ప్రయోజనం తెచ్చిపెట్టే ధర్మాన్ని బోధించమని కోరాడని, దాని నుంచి జ్ఞానోదయం పొందటానికి అర్హులు కూడా కొందరు ఉన్నారని ప్రారంభ గ్రంధాలలో చెప్పబడింది. దీనితో, బుద్ధుడు మొత్తం బౌద్ధ మార్గం యొక్క ఫ్రేమ్ వర్క్ ని ఏర్పరిచి ఇప్పటికీ ప్రపంచంలోని అన్ని బౌద్ధ సంప్రదాయాలకు పునాది అయిన నాలుగు ఉదాత్త సత్యాలపై డీర్ పార్కులో తన మొదటి ధర్మ బోధనను ఇచ్చాడు.

బుద్ధుడు బోధించిన మొదటి సత్యం ఏమిటంటే జీవితం ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా కానీ ఈ సంతోష స్థితి అస్థిరమైనది మరియు తాత్కాలికమైనది. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది - మనమందరం దీనిని మన జీవితంలో అనుభవిస్తాము. మనకు ఉన్న ఆనందం శాశ్వతమైనది కాదు మనం ఏ క్షణంలోనైనా దుఃఖంలోకి వెళ్లిపోవచ్చు. రెండవ సత్యం ఏమిటంటే, మన దుఃఖం నిజంగా బయట నుంచి కాకుండా, మనకు కావలసింది పొందాలనే మన స్వంత సంతృప్తి నుంచి వస్తుంది, అన్నింటికీ మించి అసలు ప్రతీదీ నిజానికి ఎలా ఉంటుందో మనకు తెలియదు. మూడవ సత్యం అన్ని బాధలు మరియు సమస్యల నుంచి విముక్తి పొందడం సాధ్యమని చెబుతోంది, మరియు నాలుగవ సత్యం ఒక మార్గాన్ని సూచిస్తుంది, దీనిని మనం అనుసరిస్తే, అన్ని సమస్యల నుంచి మనకు శాశ్వతంగా విముక్తి పొందడానికి ఇది సహాయపడుతుంది.

బుద్ధుని బోధనలు బాధలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

బుద్ధుని కాలంలో ధర్మ బోధలన్నీ మౌఖికంగా చెప్పి మెదడులోనే దాచుకునేవారు. వాటిని గ్రంథాలలో రాయడానికి ముందు అనేక తరాలకు ఈ విధంగా పంచారు. నేడు మనకు వందలాది సూత్రాలు, బుద్ధుని నియమాలతో కూడిన గ్రంథాలు, తాత్విక ప్రవచనాలు ఉన్నాయి. వీటిని కలిపి త్రిపిటక లేదా మూడు బుట్టలు అని పిలుస్తారు. సాంప్రదాయం ప్రకారం, బుద్ధుడు మొత్తం 84,000 ధర్మ బోధనలు ఇచ్చాడని, ఇవి మన 84,000 కలవర పరిచే భావోద్వేగాలను అధిగమించడానికి సహాయపడతాయని కొందరు చెబుతూ ఉంటారు. అయినా కానీ ఈ సంఖ్య ఒక రకంగా పెద్దగా అనిపించినా, మనకు ఎన్ని సమస్యలను, చిరాకులను, బాధలను భరించాల్సి వస్తుందో ఇది తెలియజేస్తుంది. వాటన్నిటినీ ఎదుర్కోవడానికి బుద్ధుడు ఇచ్చిన విస్తృతమైన బోధనల శ్రేణిని చూపించే మార్గం లాగా అర్ధం అవుతుంది.

నిజానికి బుద్ధుని బోధనలన్నీ బాధలను పోగొట్టుకోవడానికి ఉంటాయి. బుద్ధుడు ఆధ్యాత్మిక ఊహాగానాలపై ఆసక్తి చూపలేదు, ఆత్మ మరియు విశ్వం గురించి ఉండే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఈ విషయాలను ఆలోచించడం మనల్ని ముక్తికి దగ్గరగా తీసుకెళ్లదు కాబట్టి. బుద్ధుడు మానవుల పరిస్థితిని చూసి, అందరూ బాధపడటం గమనించి, దీనికి పరిష్కారాన్ని కనుగొన్నాడు. అందుకే బుద్ధుడిని తరచుగా వైద్యుడితో పోలుస్తారు, ధర్మ బోధనలను వైద్యంతో పోలుస్తారు. ఈ ధర్మ ఔషధం మన సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది.

బుద్ధుడు, ధర్మం, సంఘము అనే మూడు అంశాలు ఉన్నప్పటికీ, ధర్మమే అసలైనది. బుద్ధులు ధర్మాన్ని బోధిస్తున్నప్పటికీ, వాళ్లు ఒక్క చిటికె వేసి మన బాధలను తొలగించలేరు. సంఘం మనకు సహాయాన్ని మరియు ప్రోత్సాహాన్ని అందించినప్పటికీ, వాళ్లు మనల్ని ధర్మాన్ని ఆచరించమని బలవంతం చేయలేరు. మనమే స్వయంగా అధ్యయనం చేసి ధర్మంలో నిమగ్నం కావాలి: బాధ నుంచి బయటపడే ఏకైక మార్గం ఇదే. నిజానికి మనమే మన రక్షకులం.

ధర్మం యొక్క లక్షణాలు

ధర్మంలో అనేక లక్షణాలు ఉన్నాయి, కానీ ఇవే ప్రధానమైనవి:

  1. ధర్మం అనేక విభిన్న స్వభావాలకు సరిపోతుంది. థాయ్ లాండ్, టిబెట్, శ్రీలంక, జపాన్ మొదలైన దేశాలలో బౌద్ధమతం గణనీయంగా భిన్నమైన రూపాలను సంతరించుకున్నప్పటికీ, సంప్రదాయాలన్నీ ప్రధాన బౌద్ధ బోధనలను కలిగి ఉన్నాయి. ఇవన్నీ విముక్తిని సాధించే లక్ష్యంతో ఉన్నాయి.
  2. ధర్మం లాజిక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది మన మనస్సులను మరియు మనం అనుభవించే ప్రతి దాన్ని వాస్తవికంగా చూడమని అడుగుతుంది. ఇది దేనినైనా గుడ్డిగా నమ్మేది లాగా ఉండదు, ఒక దేవుడిని లేదా దేవుళ్లను నమ్మడం అవసరమే, కానీ ప్రతి దాన్ని లాజిక్ తో ప్రశ్నించమని ఇది చెప్తుంది. దలైలామా చాలా సంవత్సరాలుగా శాస్త్రవేత్తలతో కలిసి చైతన్యం మరియు మనస్సు వంటి ముఖ్యమైన బౌద్ధ భావనల గురించి తెలుసుకోవటానికి పనిచేస్తున్నారు. బౌద్దులు మరియు శాస్త్రవేత్తలు ఒకరి నుండి ఒకరు చాలా విషయాలను నేర్చుకుంటున్నారు.
  3. ధర్మం ఒకే ఒక్క సమస్యకు ఉద్దేశించినది కాదు, ఇది అన్ని సమస్యలకు మూలం. మనకు రోజూ భయంకరమైన తలనొప్పి వస్తే ఆస్పిరిన్ తీసుకుంటాం. వాస్తవానికి, అది కొంతసేపు వరకే పని చేస్తుంది, కానీ తలనొప్పి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. తలనొప్పి నుంచి శాశ్వత ఉపశమనం కలిగించే టాబ్లెట్ ఏదైనా ఉంటే దానిని మనం తప్పకుండా తీసుకుంటాం. ధర్మం కూడా అంతే, ఇది తలనొప్పికి మాత్రమే కాదు, అన్ని సమస్యలకు మరియు బాధలకు శాశ్వత ఉపశమనాన్ని కలిగిస్తుంది.

సారాంశం

బుద్ధుడు మన బాధను గుర్తించి, మనకు ఉత్తమమైన ఔషధమైన ధర్మాన్ని అందించే చాలా నైపుణ్యం కలిగిన వైద్యుడి. కానీ వైద్యం తీసుకోవడం - లేదా ధర్మ పద్ధతుల్లో నిమగ్నం కావడం - మన చేతుల్లోనే ఉంటుంది. అలా చేయమని మనల్ని ఎవరూ బలవంతం పెట్టలేరు, కానీ ధర్మం తీసుకువచ్చే ప్రయోజనాలు, మనశ్శాంతి, మన సమస్యలు, చిరాకులు మరియు బాధలను తొలగించడానికి అది నిజంగా ఎలా సహాయపడుతుందో తెలుసుకున్నప్పుడు, దానితో ఇతరులందరికీ ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలిస్తే అప్పుడు మనం ఆ ధర్మాన్ని సంతోషంగా ఆచరిస్తాము.

Top