ఇలాంటి కష్టతరమైన సంక్షోభ సమయంలో, మన ఆరోగ్యానికి ముప్పును మరియు మనం కోల్పోయిన కుటుంబం మరియు స్నేహితుల కోసం దుఃఖాన్ని ఎదుర్కుంటున్నాము. ఈ ఆర్థిక సమస్యలు ప్రభుత్వాలకు పెద్ద సవాళ్లు విసురుతూ చాలా మంది ప్రజల జీవనోపాధిని దెబ్బకొడుతున్నాయి.
ఇలాంటి సమయాల్లోనే మానవ కుటుంబ సభ్యులుగా మనల్ని ఏకం చేసే వాటిపై మనం దృష్టి పెట్టాల్సి ఉంది. అలా, మనం ఒకరికుకరు కరుణతో సహాయం చేసుకోవాలి. మనుషులుగా మనమంతా ఒక్కటే. మనందరికీ ఒకే రకమైన భయాలు, ఆశలు, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మనమందరం సంతోషం కోసం ఒక్కటిగా జీవిస్తూ ఉన్నాం. మన మానవ సామర్థ్యంతో పరిస్థితులను రియాలిటీకి దగ్గరగా చూసి వాటిని మార్చుకోగలిగే ప్రయత్నం మనం చెయ్యగలం.
ఈ సంక్షోభం మరియు దాని పర్యవసానాలు, ప్రపంచ అంతటా ప్రతిస్పందనతో కలిసి వస్తే ఇలాంటి కష్టతరమైన సవాళ్లను ఎదుర్కోగలమని ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. మనమందరం "ఐక్యం కావడానికి పిలుపు" అనే నినాదాన్ని అందరూ పాటించాలని నేను ప్రార్థిస్తున్నాను.
దలైలామా, మే 3, 2020