ప్రాచీన భారతీయ విలువలను పునరుద్ధరించడం

ప్రాచీన భారతీయ విలువల పునరుద్ధరణ గురించి మాట్లాడమని నన్ను అడగటం జరిగింది, ఇది పూజ్యులు దలైలామా గారి నాలుగు ప్రధాన కట్టుబాట్లలో ఒకటి. ఈ టాపిక్ అనేక సమస్యలను వివరిస్తుంది:

 • మొదటిది, ప్రాచీన భారతీయ విలువలు ఏమిటి? 
 • రెండవది, వాటిని పునరుద్ధరించడానికి కావలసిన లక్ష్యాలు మరియు ప్రయోజనాలు ఏమిటి?
 • మూడవది, వాటిని పునరుద్ధరించడం అంటే ఏమిటి?
 • నాల్గవది, వాటి పునరుద్ధరించడానికి కావలసిన కొన్ని ఆచరణాత్మక, ప్రభావవంతమైన పద్ధతులు ఏమిటి?

ఇప్పుడు మనం వాటిని ఒకటి తర్వాత ఒకటిగా పరిశీలిద్దాం.

ప్రాచీన భారతీయ విలువలు ఏమిటి?

ప్రాచీన భారతీయ విలువలను తెలుసుకోవాలంటే, మనం రెండు మార్కాల్లో చూడాలి:

 • మొదటి మార్గం అహింస మరియు కరుణ - ఈ రెండు పురాతన భారతీయ విలువలను గురువు గారు ప్రమోట్ చేస్తూ ఉంటారు. భారతీయ మత సంప్రదాయాలలో బోధించబడేవి ఆధునిక లౌకిక నైతికత, సార్వత్రిక విలువలు.  ఎమోరీ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభ్యాసం యొక్క SEE లెర్నింగ్ కార్యక్రమానికి ఆధారం. ఈ కార్యక్రమం ప్రస్తుతం భారతదేశంలోని అనేక స్కూల్స్ లలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అమలు చేయబడుతోంది. 
 • మరొక మార్గం భావోద్వేగ పరిశుభ్రత - ఇది గురువు గారు ప్రమోట్ చేసే మరొక పురాతన భారతీయ విలువ. ప్రధానంగా మనస్సు, భావోద్వేగాలు, జ్ఞాన మార్గాలు మరియు లాజిక్ పై పురాతన భారతీయ సిద్ధాంత వ్యవస్థల బోధనలలో ఇది కనిపిస్తుంది.

ఈ పురాతన భారతీయ విలువలలోని రెండవ అంశాన్ని పునరుద్ధరించడంపై నేను దృష్టి పెట్టాలనుకుంటున్నాను: అదే భావోద్వేగ పరిశుభ్రత. బుద్ధుని బోధనలలో చెప్పినట్లు భారతీయ విజ్ఞానం, ఫిలాసఫీ, మతం గురించి మాటలు, భావోద్వేగ పరిశుభ్రత చాలా వరకు భారతీయ విజ్ఞాన రంగంలో ఉంటుంది. అయితే, ఇది భారతీయ ఫిలాసఫీ లోని ఆత్మ, సత్యం మరియు రియాలిటీకి  సంబంధించిన సమస్యలతో వ్యవహరించేటప్పుడు కలిసి వస్తూ ఉంటుంది. మనల్ని మనం మరియు ఇతరులను ఎలా చూస్తామో మరియు రియాలిటీ మరియు సత్యాన్ని ఎలా పరిగణిస్తామనేది మన భావోద్వేగ శ్రేయస్సును స్పష్టంగా ప్రభావితం చేస్తుంది.

పురాతన భారతీయ సిద్ధాంత వ్యవస్థలలో నాలుగు బౌద్ధ మరియు ఎనిమిది బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థలు ఉన్నాయి, అందులో చాలా వాటిల్లో ఉప-వ్యవస్థలు ఉన్నాయి. ఏదేమైనా, ఈ సిద్ధాంత వ్యవస్థలలో ప్రతి ఒక్కటి ఒక సంపూర్ణ వ్యవస్థ. భావోద్వేగ పరిశుభ్రత యొక్క అన్ని అంశాలకు సంబంధించి దాని స్వంత ప్రత్యేకమైన వాదనలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి మనస్సు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది, మనస్సు మరియు సొంత మనిషి మధ్య సంబంధాన్ని, స్వంత జ్ఞాన సిద్ధాంతం మరియు స్వంత లాజిక్ ని అందిస్తుంది. అంతేకాక, వాళ్లందరికీ ఆత్మ, సత్యం మరియు రియాలిటీ యొక్క లాజిక్ విషయాలకు సంబంధించి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.

దీనికి తోడు చార్వాకులు తప్ప మిగిలిన వారంతా తమ శాస్త్రీయ, లాజిక్ వాదనలను భారతీయ మతాల ప్రధాన అంశాల నేపధ్యంలో చెప్తూ ఉంటారు. కర్మ, నియంత్రణ లేని పునర్జన్మ (మరో మాటలో చెప్పాలంటే సంసారం), సంసారంలో ఉండే బాధలు, సంసారానికి కారణమైన ఆత్మ మరియు రియాలిటీ గురించి అజ్ఞానం, సంసారం నుండి విముక్తిని పొందడానికి ఆత్మ మరియు రియాలిటీ గురించి సరైన అవగాహనను పొందడం ఇందులో ఉన్నాయి. మన భావోద్వేగ స్థితులు అజ్ఞానం ద్వారా ప్రభావితమయ్యి మన కర్మ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి కాబట్టి, అవి సంసార పునర్జన్మ యొక్క బాధలను తెస్తాయి. అజ్ఞానంపై ఆధారపడిన ఈ భావోద్వేగ స్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ పద్ధతులు అన్నీ సంసార పునర్జన్మ నుండి విముక్తికి దారితీసే విధంగా రూపొందించబడ్డాయి. అందుకని, భావోద్వేగ పరిశుభ్రత యొక్క భారతీయ శాస్త్రాన్ని, భారతీయ ఫిలాసఫీని మతం యొక్క ప్రాథమిక వాదనల నుంచి వేరు చేయడం మామూలు విషయం కాదు.

ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రం, ఫిలాసఫీ మరియు మతం కలిసి పంచుకున్న ప్రాథమిక వాదనలకు సంబంధించి భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలు ఏమిటి? అవి: 

 • వాస్తవం మరియు కల్పన మధ్య తేడాను గుర్తించడానికి హేతుబద్ధమైన, విశ్లేషణాత్మక ఆలోచనను ఉపయోగించడంలో ఉండే విలువ.
 • మన కోసం, మరియు ఇతరుల కష్టాలను అధిగమించడానికి మన మనస్సులు మరియు భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడంలో ఉండే విలువ.

భావోద్వేగ పరిశుభ్రతను నిర్వహించడానికి ఈ పురాతన భారతీయ సిద్ధాంత వ్యవస్థలు ఉమ్మడిగా పంచుకున్న పద్ధతులు మంచి విలువలను బయటపెడతాయి. 

 • ముందుగా విద్య యొక్క విలువ. ఈ వ్యవస్థలన్నీ అజ్ఞానాన్ని, బాధలను అధిగమించడానికి, వారి బోధనలను వినడం లేదా చదవడం ద్వారా మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి, తర్వాత వాటి గురించి విమర్శనాత్మకంగా ఆలోచించడం ద్వారా అవి సత్యం మరియు ప్రయోజనకరమైనవి అని సరైన అవగాహన మరియు నమ్మకాన్ని పొందాలని సూచిస్తున్నాయి. క్లిష్టమైన ఆలోచన సరైన విద్యకు పునాది. 
 • రెండవది మనం నేర్చుకున్న, అర్థం చేసుకున్న, నమ్మకాన్ని సంపాదించిన విషయాలను మన జీవితాల్లో కలుపుకునే విలువ. దీని కోసం, అన్ని భారతీయ వ్యవస్థలు ప్రయోజనకరమైన అలవాట్లను పెంపొందించుకోవడానికి ధ్యానాన్ని బోధిస్తాయి. 
 • మూడవది నైతిక సొంత క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు అంతర్దృష్టి యొక్క విలువలు. మన మనస్సులకు శిక్షణ ఇవ్వడానికి క్రమశిక్షణ కోసం ఇవన్నీ మన శరీరాలను మరియు మాటలను నైతిక ప్రవర్తనతో మరియు క్రమశిక్షణతో నేర్పుతాయి. అప్పుడు మన మనస్సులకు శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళు ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి ‘షమత’ ధ్యాన పద్ధతులను, మన అజ్ఞానాన్ని తొలగించే అంతర్దృష్టిని పెంపొందించుకోవడానికి ‘విపాశ్యన’ అనే పద్ధతులను ఉపయోగిస్తారు. అన్ని మానసిక కదలికలు, నీరసంగా ఉంటూ, ఒకే వస్తువుపై ఒంటరిగా స్థిరపడే మానసిక స్థితినే 'షమత' అంటారు. అది తన పనిని సరైన మార్గంలో చేసేటప్పుడు, అశాశ్వతమైనదిగా, లేదా కరుణ లాంటి ప్రయోజనకరమైన దృక్పథంతో చేస్తుంది. 'విపాశ్యన’ అనేది ఒక అసాధారణమైన గ్రహణాత్మక మానసిక స్థితి, ఇది షమత స్థితిని కొనసాగిస్తూనే, దాని పని పట్ల అవగాహన లేదా దృక్పథం యొక్క పూర్తి వివరాలను మరియు చిక్కులను లోతుగా గుర్తించగలుగుతుంది.

క్లుప్తంగా చెప్పాలంటే, భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలు 

 • విద్య
 • హేతుబద్ధమైన, విశ్లేషణాత్మక ఆలోచన
 • మనస్సు మరియు భావోద్వేగాలను అర్థం చేసుకోవడం
 • నైతిక విలువలతో కూడిన ప్రవర్తన
 • ఏకాగ్రత మరియు అంతర్ దృష్టిని పెంపొందించుకోవడానికి ధ్యానం.

భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలను పునరుద్ధరించడం యొక్క లక్ష్యం మరియు ఉద్దేశ్యం ఏమిటి?

"విలువలు" అంటే ఒక సానుకూల లక్ష్యాన్ని సాధించడానికి ముఖ్యమైన విషయాలు అని అర్థం. శారీరక పరిశుభ్రత అనేది పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు సురక్షిత ప్రవర్తన యొక్క విలువలపై ఆధారపడి ఉంటుంది. అన్నీ ముఖ్యమైనవి ఎందుకంటే అవి చెడుని మన దగ్గరకు రాకుండా చేసి మనలో మరియు మన సమాజం యొక్క శ్రేయస్సుకు సహాయపడతాయి. అదే విధంగా, భావోద్వేగ పరిశుభ్రత అనేది విద్య, హేతుబద్ధమైన ఆలోచన, సరైన అవగాహన, భావోద్వేగ సమతుల్యత, నిర్మాణాత్మక ప్రవర్తన, ఏకాగ్రత మరియు అంతర్దృష్టి యొక్క విలువలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ముఖ్యమైనవి ఎందుకంటే అవి అహేతుకమైన ఆలోచన, భావోద్వేగ అశాంతి మరియు స్వంత మరియు సమాజం రెండింటికి వినాశకరమైన బలవంతపు ప్రవర్తనను నివారించడంలో సహాయపడతాయి.

భావోద్వేగ పరిశుభ్రతపై పురాతన భారతీయ బోధనల లక్ష్యం మరియు ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు బాధలను అధిగమించడంలో సహాయపడటమే. సంసారం యొక్క బాధలను అధిగమించడమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ - అనియంత్రిత పునరావృత పునర్జన్మ - ఈ బోధనలు రోజువారీ సమస్యలు మరియు కష్టాలను అధిగమించడానికి సహాయపడతాయి. వారి మనస్సులు మరియు భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయో, ఎలా ప్రభావితం చేస్తాయో అని అర్థం చేసుకోవడానికి, వాటిని ఇబ్బంది కలిగించేవారిని ఎలా గుర్తిస్తారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి సరైన జ్ఞానం మరియు హేతుబద్ధత, క్రమశిక్షణకు ధ్యానాన్ని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి వారు విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగిస్తారు.

ఈ బోధనలను పునరుద్ధరించడం యొక్క లక్ష్యం మరియు ఉద్దేశ్యం మెదడు యొక్క పనితీరు మరియు మనస్సు యొక్క మానసిక సిద్ధాంతాల గురించి ప్రస్తుత శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడం. దానితో పాటు ప్రజలకు సహాయపడటానికి అందుబాటులో ఉన్న పద్ధతులను నేర్పడం. ప్రజలకు సహాయం చేయడం అంటే అనారోగ్యానికి గురైన రోగులకు చికిత్స చేయడం మాత్రమే కాదు, సాధారణ ప్రజలు వారి రోజువారీ జీవితంలో మెరుగైన మార్గాల్లో బతికేలా సహాయపడటం కూడా. కష్టాలను అధిగమించడానికి సమస్త ప్రాణులకు సహాయపడటం బహుశా, మన గురువు గారి యొక్క అత్యంత ప్రధాన నిబద్ధత.

భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలను పునరుద్ధరించడం మన ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యం. మన ప్రస్తుత కాలాన్ని "సత్యానంతర యుగం" అని పిలవడం అనేది మనం తరచుగా వింటూ ఉంటాము. తప్పుడు సమాచారం మరియు "ఫేక్ న్యూస్" అని పిలవబడేవి ఈ మధ్య విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. చాలా మంది నిజం అనేది వాస్తవాల మీద ఆధారపడి ఉండేది. అందుకు వాళ్ళు ఏది నమ్మితే అదే నిజమనేదానిపై ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నారు. ఇది అహేతుక ప్రవర్తన మరియు సామాజిక అసమ్మతి, పనిచేయకపోవడం మరియు గొడవలకు దారితీస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇది అనేక సమస్యలకు మరియు చాలా కష్టాలకు దారితీస్తుంది. భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలను పునరుద్ధరించడం రియాలిటీ గురించి అపోహలను మరియు వాటి నుండి ఉత్పన్నమయ్యే బాధను తొలగించటం. బలవంతపు విధ్వంసక ప్రవర్తనను ఎదుర్కోవటానికి మార్గాలను సూచించడం ఈ పరిస్థితికి సహాయపడుతుంది.

నేను ఒక ఉదాహరణ చెబుతాను. బౌద్ధ చిత్త మాత్ర కేవలం మనసు దృక్పథానికి, క్వాంటమ్ మెకానిక్స్ కి మధ్య సంబంధం ఉందని గురువు గారు చెప్తూ ఉంటారు. ఈ రెండూ ఆబ్జెక్టివ్ రియాలిటీకి సంబంధం లేకుండా, పరిశీలించే గమనించిన వస్తువుల స్థితిని ప్రభావితం చేస్తుందనే నిర్ధారణకు దారితీస్తాయి. అందుకని, అన్ని వైపుల నుంచి, ఫోటాన్ ఒక కణం లేదా శక్తి తరంగా ఉండటం లాంటి విభిన్న స్థితులు వాస్తవమైనవి, దీనిని కొలిచే పరిశీలకుడు భావనాత్మక ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి ఉంటాడు. ఒక క్లాసిక్ బౌద్ధ ఉదాహరణ ఏమిటంటే, మానవులు నీళ్లుగా అనుభవించేదాన్ని, దేవతలు అమృతంగా మరియు ప్రీత దయ్యాలు చీముగా భావిస్తాయి. ఫోటాన్ మరియు శక్తి తరంగం రెండూ నిజం అయినప్పటికీ, ఈ రెండింటికీ, అవి అనుభవించేది నిజమే అనిపిస్తుంది. అవి కారణం మరియు ప్రభావానికి అనుగుణంగా పనిచేస్తాయి. నీరు ప్రజల దాహాన్ని తీరుస్తుంది, అమృతం దేవతలకు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తుంది మరియు చీము ప్రీత దయ్యాలకు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. 

ఏదేమైనా, ఈ దృక్పథాలు మరియు అనుభవాల యొక్క సంబంధం సాంప్రదాయిక సత్యానికి సంబంధించినది, లోతైన సత్యానికి కాదు. కానీ సాంప్రదాయిక సత్యంలో, సరైన దానికి మరియు చెల్లుబాటి కాని దానికి మధ్య తేడా ఉంటుంది. ఎవరైనా ఒక విషయాన్ని నిజమని అనుకుని నమ్మినంత మాత్రాన అది నిజం అయిపోదు. మంటపై నూనె పోయడం వల్ల మంటలు ఆరిపోతాయని ఎవరైనా నమ్మినంత మాత్రాన, నిజానికి ఆ మంటలు ఆరిపోవు. లాజిక్ మరియు హేతుబద్ధత ఆధారంగా విమర్శనాత్మక ఆలోచన యొక్క పురాతన భారతీయ విలువను పునరుద్ధరించడంలో ఉండే ప్రయోజనాలలో ఒకటి, ఈ సత్యానంతర యుగం యొక్క సవాళ్లు మరియు గొడవల నుంచి బయట పడటానికి ప్రజలకు సహాయపడటం.

ఈ భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలను పునరుద్ధరించడం అంటే ఏమిటి?

ఈ వైవిధ్యభరితమైన బౌద్ధ, మరియు బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థలు వేరు వేరుగా అభివృద్ధి చెందలేదు. నలందా లాంటి గొప్ప భారతీయ విశ్వవిద్యాలయాలలో వాళ్ళు ఒకరితో ఒకరు సుదీర్ఘ చర్చల జరిపి చరిత్రను సృష్టించారు. గురువు గారి కట్టుబాట్లలో ఒకటి జ్ఞానంతో అన్ని సంప్రదాయాలను గౌరవించడం ఆధారంగా మత సామరస్యానికి కట్టుబడి ఉండటం. ఆ నిబద్ధతతో, నలందా విశ్వవిద్యాలయం యొక్క సంప్రదాయానికి అనుగుణంగా, ప్రాచీన భారతీయ విలువల పునరుద్ధరణ అంటే బౌద్ధ, బౌద్ధేతర సిద్ధాంతాలన్నింటిలో కనిపించే భావోద్వేగ పరిశుభ్రతపై బోధనలను పునరుద్ధరించడమే.  

భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలను పునరుద్ధరించడం అంటే సంస్కృత గ్రంథాలను ఆధునిక భాషల్లోకి అనువదించడమే కాదు, ఇది కూడా పనిలో ఒక ముఖ్యమైన భాగమే. మూల గ్రంథాలు, వాటి భారతీయ వ్యాఖ్యానాలు మరియు భారతీయ బౌద్ధ గ్రంథాలకు టిబెటన్ వ్యాఖ్యానాలు అర్థం చేసుకోవడం కూడా కష్టమే. అవి చాలా అధునాతనమైనవి మరియు అర్థం చేసుకోవడానికి చాలా నేపథ్య అధ్యయనం మరియు అభ్యాసం అవసరం. ఈ గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి ముందు నుంచే ప్రారంభించి వాటిలోని విషయాల యొక్క గ్రేడెడ్ స్థాయిల వివరణ తెలుసుకోవడం ముఖ్యం. ఇటులాంటి గ్రేడెడ్ మెటీరియల్ తోనే సంప్రదాయ భారతీయ విషయాలలో ఎలాంటి జ్ఞానం లేని వారికి అవి అందుబాటులోకి వస్తాయి.

ఏదేమైనా, ఈ బోధనల యొక్క గ్రేడెడ్ స్థాయిలను అర్ధం చేసుకోవడం అంటే, ఈ వ్యవస్థలను గ్రేడెడ్ క్రమంలో అమర్చడం మరియు అధ్యయనం చేయడం కాదు, ఇవి ఖచ్చితమైనవి మరియు చెల్లుబాటు అయ్యే విధంగా ఉన్నట్టు చూసుకోవడం. అలా చేయడం ఒక వ్యవస్థ మిగతా వాటన్నిటి కంటే గొప్పదని అర్ధం, "కిందటి వ్యవస్థలు" అధ్యయనం చేయటం అంటే పెద్ద వాటి కోసం మెట్లుగా నేర్చుకోవడం అనమాట. చాలా మంది పండితులు బౌద్ధ సిద్ధాంత వ్యవస్థల అధ్యయనాన్ని ఈ గ్రేడెడ్ పద్ధతిలో ఏర్పాటు చేసినప్పటికీ, బౌద్ధ మరియు బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థల అధ్యయనానికి ఈ విధానాన్ని వాడటం అనేది గురువు గారు చెప్పే మతాంతర సామరస్య విలువలకు పూర్తిగా విరుద్ధం. బౌద్ధ మరియు బౌద్ధేతర బోధనలను గ్రేడెడ్ క్రమంలో ప్రదర్శించడం అంటే ప్రతి సిద్ధాంత వ్యవస్థలను సంక్లిష్టత యొక్క గ్రేడెడ్ ఆర్డర్లలో విడివిడిగా ప్రదర్శించడం.

బౌద్ధ శాస్త్రం, ఫిలాసఫీపై బోధనలను మతంతో సంబంధం లేని అకడమిక్ సబ్జెక్టులుగా నేర్చుకోవచ్చని గురువు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇది భారతీయ సైన్స్, మరియు ఫిలాసఫీకి కూడా వర్తిస్తుంది. అయితే, ఈ పురాతన జ్ఞానాన్ని భద్రపరచడానికి మాత్రమే పరిమితం చేసి విద్యా సంస్థలలో మ్యూజియంలో ఉంచటం సరైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే దక్షిణాసియా అధ్యయన విభాగాలను కలిగి ఉన్నాయి, వీటిలో పురాతన భారతీయ ఫిలాసఫీపై కోర్సులు ఉన్నాయి. ఈ అధ్యయనాలలో నైపుణ్యం సాధించడానికి కొత్త నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి భారతదేశంలో ఈ కార్యక్రమాలను విస్తరించడం ఒక ముఖ్యమైన స్టెప్, కానీ ఇది ఒక్కటే సరిపోదు.

అంగన్ వాడీ నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని స్థాయిలలో పాఠ్యాంశాలలో ఈ విలువలను ఇంటిగ్రేట్ చేసి భావోద్వేగ పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత మరియు విలువను పిల్లలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో మంచి మార్పులను తీసుకురావడానికి ఉత్తమ మార్గం పిల్లల విద్యతో ప్రారంభించడమే అని గురువు గారు బలంగా నమ్ముతారు. అందువలన, అహింస మరియు కరుణ లాంటి పురాతన భారతీయ విలువలే కాకుండా - భావోద్వేగ పరిశుభ్రతను కూడా పిల్లల చదువులలో కలపాలని గురువు గారు వాదించారు. 

లౌకిక విద్యా విధానంలో ప్రాచీన భారతీయ విలువలను ప్రవేశపెట్టే లాంగ్-టర్మ్ స్ట్రాటజీని అనుసరించడం సమాజంపై మంచి ప్రభావాన్ని చూపడానికి అత్యంత స్థిరమైన మార్గం. ఈ విలువలను పెంపొందించే బోధనలు అన్ని భారతీయ ఆలోచనల సమూహాన్ని పంచుకునే భారతీయ మూలాల నుండి ఉద్భవించాయి. కాబట్టి, ఈ విలువలను మొదట భారతదేశంలో పునరుద్ధరించాలని గురువు గారు సూచించారు. ఈ ప్రోగ్రామ్ ఫలితాల ఆధారంగా, ఈ విలువలను పంచుకోలేని వారికి ప్రపంచ స్థాయిలో వీటిని పరిచయం చేయడానికి ప్రణాళికలను రూపొందించవచ్చు.

ఈ బోధనలు మరియు విలువలు నిజంగా పునరుద్ధరించబడాలంటే, ప్రజలు తమ ప్రస్తుత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు వాటిని ఎలా అన్వయించాలో తెలుసుకుని వాటిని పరిష్కరించుకోవాలి. కర్మ, పునర్జన్మ, ముక్తికి సంబంధించిన మతపరమైన అంశాలు లేని లౌకిక ఫ్రేమ్ వర్క్ లో భారతదేశంలో కూడా బోధనలను స్వీకరించాల్సి ఉంటుంది. వివిధ బౌద్ధ మరియు బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థలు ఈ విషయాలను తరచుగా పరస్పర విరుద్ధమైన పద్ధతుల్లో వివరిస్తాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఏదేమైనా, ఆత్మ, సత్యం మరియు రియాలిటీ గురించి వివిధ బౌద్ధ మరియు బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థల ఫిలాసఫీ వాదనలు కూడా తరచుగా ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. మతం మరియు ఫిలాసఫీ రంగంలోని ఈ రకరకాల వాదనలు భావోద్వేగ పరిశుభ్రత యొక్క సిద్ధాంత వ్యవస్థల ప్రదర్శనలను ప్రభావితం చేస్తాయి.

ఉదాహరణకు, ఈ రియాలిటీకి అజ్ఞానమే బాధలకు కారణమని అన్ని భారతీయ సిద్ధాంత వ్యవస్థలు ఉమ్మడిగా నొక్కి చెబుతున్నాయి. ఈ అజ్ఞానం వినాశకరమైన మరియు నిర్మాణాత్మకమైన అన్ని భావోద్వేగాలకు, అలాగే సంతోషం మరియు దుఃఖం యొక్క అన్ని భావాలకు ఆధారమని వాళ్ళందరూ చెబుతున్నారు. వాళ్ళందరూ ఈ క్రింది వాటికి అంగీకరిస్తున్నారు

 • మనస్సుకు విషయాలు ఎలా తెలుస్తాయో అర్థం చేసుకోవడానికి, 
 • చెల్లుబాటు కాని వాటి నుండి చెల్లుబాటు అయ్యే వాటిని తెలుసుకునే సరైన మార్గాలను వేరు చేయడం ద్వారా, మరియు 
 • లాజిక్ మరియు హేతుబద్ధతను ఉపయోగించడం ద్వారా, 

ఈ అజ్ఞానాన్ని మనం తొలగించుకుని మన బాధలను అంతం చేసుకోవచ్చు. 

పోలికలు అక్కడితో ముగుస్తాయి. బౌద్ధేతర వ్యవస్థలలో ఆత్మ అనేది మారని అస్తిత్వమని, అది బాధ మరియు పునర్జన్మల నుండి విముక్తి పొందినప్పుడు, శరీరం మరియు మనస్సు నుండి స్వతంత్రంగా ఉనికిలో వస్తుందని వాదిస్తుంది. ఈ వాదనకు అనుగుణంగా, అజ్ఞానాన్ని వదిలించుకోవడం అంటే అన్ని భావోద్వేగాలు మరియు భావాల నుండి మనల్ని మనం వేరు చేసుకోవడం. కాబట్టి ముక్తిని పొందాలంటే నిర్మాణాత్మకమైన, వినాశకరమైన భావోద్వేగాలను, సుఖ దుఃఖాలన్నింటినీ అధిగమించాలి. అప్పుడు ఆత్మ అనేది శరీరం, మనస్సు, భావోద్వేగాలు లేదా భావాలు లేకుండా ఉనికిలో ఉంటుంది.

దీనికి వేరుగా, బౌద్ధ వ్యవస్థలు, ముక్తి పొందినప్పటికీ, ఆత్మ, శరీరం మరియు మనస్సుపై ఆధారపడి ఉంటుందని బోధిస్తాయి. అజ్ఞానం పోయినప్పుడు, అజ్ఞానంతో కలుషితం కాని నిర్మాణాత్మక భావోద్వేగాలు మరియు కలుషితం కాని ఆనంద భావనలు మనకు మిగిలి ఉంటాయి. అప్పుడు విముక్తమైన ఈ ఆత్మ కల్మషం లేని భావోద్వేగాలు, భావాల ఆధారంగా, అజ్ఞానంతో కలుషితం కాని శరీరం, మనస్సుతో బతుకుతూనే ఉంటుంది. అందుకని, భావోద్వేగ పరిశుభ్రత రియాలిటీ గురించి అజ్ఞానాన్ని వదిలించుకోవడంపై ఆధారపడి ఉంటుందని బౌద్ధ మరియు బౌద్ధేతర వ్యవస్థలు రెండూ అంగీకరించాయి. కాని వాటి ఫలితం చాలా వేరుగా ఉంటుంది. భావోద్వేగ పరిశుభ్రత యొక్క బౌద్ధేతర ఆదర్శ స్థితిలో ఎటువంటి భావోద్వేగాలు లేదా ఆనందాలు ఉండవు, కానీ బౌద్ధ ఆదర్శ స్థితిలో ప్రేమ, కరుణ మరియు ఆనందం లాంటి కల్మషం లేని నిర్మాణాత్మక భావోద్వేగాలు ఉంటాయి. ఈ విధంగా, వివిధ పురాతన భారతీయ సిద్ధాంత వ్యవస్థల ఫిలాసఫీ మరియు మతపరమైన వాదనలు ఆదర్శ భావోద్వేగ పరిశుభ్రతకు సంబంధించిన వాళ్ళ వాదనలను బలంగా ప్రభావితం చేస్తాయి.      

విశ్వవిద్యాలయాలలో భావోద్వేగ పరిశుభ్రతపై ప్రాచీన భారతీయ బోధనలను ఒక అకడమిక్ సబ్జెక్టుగా పునరుద్ధరించడం, మనస్సు యొక్క భావోద్వేగ మ్యాప్, జ్ఞాన సిద్ధాంతం, జ్ఞాన మార్గాలు మరియు తార్కిక మార్గాల యొక్క వివిధ సిద్ధాంత వ్యవస్థల సందర్భాలను బోధించడం చేయాలి. ఈ తేడాలను ఎదుర్కోవటానికి విద్యార్థులు మేధా శక్తిని పెంపొందించుకోవాలి. ఏదేమైనా, భిన్నమైన మత మరియు ఫిలాసఫికల్ బోధనలు పాఠశాల పిల్లలు చదవడానికి చాలా కష్టంగా మరియు అర్ధం కాకుండా ఉంటాయి.

విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టడానికి అనువైన భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలు ఏమిటి? అవి, 

 • మన మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం యొక్క విలువ మరియు ప్రాముఖ్యత.
 • మన భావోద్వేగాలను విశ్లేషించడం యొక్క విలువ మరియు ప్రాముఖ్యత. అవి మన వైఖరుల ద్వారా ఎలా ప్రభావితమవుతాయి మరియు మనం ఎలా ఆలోచిస్తాము అని.
 • మన భావోద్వేగాలు మరియు వైఖరులు మన ప్రవర్తన మరియు శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం యొక్క విలువ మరియు ప్రాముఖ్యత
 • లాజిక్ ఆధారంగా విమర్శనాత్మకంగా, హేతుబద్ధంగా ఆలోచించడం యొక్క విలువ మరియు ప్రాముఖ్యత. 

మనం దీన్ని కూడా చేర్చవచ్చు 

 • ఏకాగ్రత మరియు అంతర్దృష్టిని పెంపొందించడానికి నైతిక క్రమశిక్షణ మరియు ధ్యానం యొక్క విలువలు.

ఈ విలువలకు నేపథ్యాన్ని ఏర్పరిచే ఫిలాసఫికల్ మరియు మతపరమైన భేదాలు పాఠశాల పిల్లలకు వేరే ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.    

ఈ ప్రాచీన భారతీయ విలువల పునరుద్ధరణకు కొన్ని ఆచరణాత్మక, ప్రభావవంతమైన పద్ధతులు ఏమిటి?

భావోద్వేగ పరిశుభ్రతపై బౌద్ధ బోధనలను పునరుద్ధరించడానికి అవసరమైన మొదటి అడుగును గురువు గారు ఇప్పటికే మొదలుపెట్టారు. బుద్ధుని మాటలకు భారతీయ గురువులు చేసిన వ్యాఖ్యానాల టిబెటన్ అనువాదాల సేకరణ అయిన తెంగ్యూర్ నుండి బౌద్ధ శాస్త్రం మరియు ఫిలాసఫీపై సమాచారాన్ని సేకరించడానికి గురువు గారు టిబెటన్ పండితులను నియమించారు. ఈ స్మారక రచన ఇప్పుడు టిబెటన్ భాషలో పూర్తి చేయబడి ప్రచురించబడింది. ఇప్పటికే భారతీయ బౌద్ధ క్లాసిక్స్ లో సైన్స్ అండ్ ఫిలాసఫీగా ఇంగ్లీష్ లోకి అనువదించబడింది. ఇతర ఆధునిక భాషల్లోకి కూడా అనువాదాలు చేయాలని ప్లాన్ చెయ్యటం జరుగుతూ ఉంది. ఈ రచన యొక్క రెండవ వాల్యూమ్, మైండ్, ఇప్పటికే ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. ఇది భావోద్వేగ పరిశుభ్రతపై కొన్ని విషయాలను కవర్ చేస్తుంది. ఈ ప్రాచీన భారతీయ విలువలను పునరుద్ధరించాలన్న గురువు గారి నిబద్ధతను నెరవేర్చడంలో ఇది ఒక గొప్ప అడుగు. బౌద్ధేతర భారతీయ సిద్ధాంత వ్యవస్థలలో కనిపించే ఈ విలువలపై బోధనలను పునరుద్ధరించడానికి వారి క్లాసిక్ గ్రంథాల నుండి ఇలాంటి సంకలనాలు మరియు అనువాదాలు ఎంతో అవసరం.

భావోద్వేగ పరిశుభ్రతకు సంబంధించిన మెటీరియల్ ను ఇప్పటికే తెంగ్యూర్ నుండి సేకరించి అనువదించి ఆధునిక ప్రేక్షకులకు అందించటానికి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా, భారతీయ గ్రంథాలు, వాటి భారతీయ వ్యాఖ్యానాలతో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. వాటికి మరిన్ని సవరణలు కావాలి. ఏదేమైనా, వాటిలో బోధనలను పునరుద్ధరించడం మరింత కష్టతరం అయ్యింది. ఎందుకంటే నలందా సంప్రదాయానికి వారసులైన వివిధ టిబెటన్ గురువులు ఈ భారతీయ గ్రంథాలను వేరు వేరు పద్ధతుల్లో వాళ్లకు నచ్చిన విధంగా రాయటం జరిగింది. ఇది ముఖ్యంగా జ్ఞాన సిద్ధాంతం మరియు మార్గాల యొక్క వారి విశ్లేషణలలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఉదాహరణకు, శాక్య పండితుని (స-పాన్) వ్యాఖ్యానాల యొక్క సాక్య, కాగ్యు మరియు నింగ్మా అనుచరులు దృశ్య జ్ఞానం, భావనాత్మకం కానిది, నారింజ రంగు లాంటి ఒకే సమయంలో ఒకే రంగు ఉంటుందని వాళ్ళు చెప్పారు. దృశ్య జ్ఞానం ఈ రంగు ఆకారాలను కామన్ సెన్స్ వస్తువుగా నిర్ణయించదు. ఒక భావనాత్మక జ్ఞానం మాత్రమే నారింజను ఒక కామన్ సెన్స్ వస్తువుగా గుర్తిస్తుంది, ఇది దృష్టి, వాసన, రుచి మరియు శారీరక అనుభూతిని కలిగి ఉంటుంది. ఇది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. అటువంటి భావనాత్మక జ్ఞానం మాత్రమే దానిని ఒక నారింజ రంగు అని గుర్తిస్తుంది.

చాపా (ఫైవా-పా) యొక్క గెలుగ్ అనుచరులు, దీనికి విరుద్ధంగా, దృశ్య జ్ఞానం నారింజ రంగు ఆకారాలను మాత్రమే కాదు, నారింజ రంగును కూడా అది గ్రహిస్తుందని మరియు ఇది ఒక కామన్ సెన్స్ వస్తువుగా నిర్ణయిస్తుందని చెప్పారు. అప్పుడు, ఈ రెండు విరుద్ధమైన అభిప్రాయాలు భావోద్వేగ పరిశుభ్రత యొక్క అనేక ఇతర అంశాల వివరణను ప్రభావితం చేస్తాయి, అంటే సరైన జ్ఞానం ఏమిటి అని మరియు రియాలిటీలో ఏది నిజమైనది అని? 

వారి బోధనల గురించి స్పష్టమైన అవగాహనను పొందడానికి భారతీయ బౌద్ధ మూలాలకు అనుబంధంగా ఇటువంటి టిబెటన్ వివరణలను జోడించాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ అదనపు వివరణలను ముందుగా భావోద్వేగ పరిశుభ్రత విషయాలను విశ్వవిద్యాలయ స్థాయి అకడమిక్ అధ్యయనానికి జోడించాలా లేక ఉన్నత స్థాయి ప్రభుత్వ విద్యకు జోడించాలా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.

భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలను పునరుద్ధరించడం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి హేతుబద్ధమైన ఆలోచనను ప్రోత్సహించడం. కాబట్టి, విశ్వవిద్యాలయ మరియు ప్రీ-యూనివర్శిటీ స్థాయిలలో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే, విద్యార్థులకు లాజిక్ మరియు డిబేట్ ల పురాతన భారతీయ విషయాలను చెప్పి ఈ విభిన్న సిద్ధాంతాల యొక్క లాభనష్టాలను వాళ్లే స్వయంగా నిర్ణయించేలా చెయ్యడం విషయం. ఆదర్శ భావోద్వేగ పరిశుభ్రత లాంటి వివిధ బౌద్ధ మరియు బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థలు వేరు వేరుగా ఉన్న వాటికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. 

ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి?

పదిహేడు మహిమాన్విత నలందా గురువుల అభ్యర్థనలలో, గురువు గారు నలందా గురువుల బౌద్ధ బోధనలను అధ్యయనం చేయడానికి ఆధునిక మనస్తత్వానికి మరింత అనువైన విధానంగా సూచించారు. ఇది రెండు సత్యాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది, తర్వాత రెండు సత్యాల నుంచి నాలుగు సత్యాలకు, ఆ తర్వాత నాలుగు సత్యాల నుండి మూడు శరణార్థులకు చేరుకుంటుంది. లౌకిక పద్ధతిలో భావోద్వేగ పరిశుభ్రతను బోధించడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ గా సహాయపడుతుంది. కానీ చివరి పాయింట్ బౌద్ధమత మూడు ఆశ్రయాల పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాధల నుండి తనను తాను రక్షించుకోవడానికి జీవితంలో వాడుకోవటానికి ఒక సురక్షితమైన దారిగా దీనిని చూపించవచ్చు.

గురువు గారు చెప్పిన వాటిని పరిశీలిద్దాం. ఎవరికైనా ఆమోదయోగ్యమైన అత్యంత సాధారణ సత్యాలలో, మనం నిజమని నమ్మే తప్పుడు రూపాలు, మరోవైపు నిజమైన రియాలిటీ. మనకు కనిపించేవన్నీ సరైనవని మనం నమ్ముతాము, ఎందుకంటే అవి నిజంగా భావోద్వేగపరంగా నిజమని మనకు అనిపిస్తుంది, కాబట్టి, విమర్శనాత్మకంగా, అవి రియాలిటీకి దగ్గరగా ఉన్నాయని మనం అంగీకరిస్తాం. కానీ, ఈ మోసపూరిత రూపాలను మనం పరిశీలిస్తే, అవి ఒక భ్రమ లాంటివి అని మనం కనిపెడతాం; అవి రియాలిటీకి అనుగుణంగా ఉండవని తెలుస్తుంది. రియాలిటీ అనేది వాస్తవం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భ్రమ అని మనకు తెలుస్తుంది. బౌద్ధ, బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థలన్నీ ఈ విషయాన్ని అంగీకరించాయి. చిన్న పిల్లలు కూడా తమ మంచాల కింద ఒక రాక్షసుడు ఉన్నాడని ఊహించుకుని, ఆ తర్వాత అక్కడ చూస్తే రాక్షసుడు లేడనే రియాలిటీని తెలుసుకుంటారు.

పిల్లలు ఈ రెండు సత్యాల మధ్య తేడాను అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళను నాలుగు సత్యాల యొక్క అత్యంత సాధారణ ఆలోచనకు పరిచయం చేయవచ్చు. వాళ్ళ ఊహలు నిజమని నమ్మితే భయపడి నిద్ర పోలేరు. బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఊహించేది నిజం కాదని తెలియకపోవడమే వారి బాధలకు కారణం. ఏదేమైనా, వాళ్ళు చూసి అక్కడ రాక్షసుడు లేడని తెలిసినప్పుడు భయం మరియు విచారం తొలగిపోతాయి.

బాధ అనే ఈ నాలుగు సత్యాలను అర్థం చేసుకోవడం, రియాలిటీని గుర్తించకపోవడం, ఏది నిజమో అని అర్థం చేసుకుని ఆ బాధను వదిలించుకునేలా ఆ పిల్లలను ఆలోచింపజేస్తే, "ఇంకెప్పుడూ భయపడకుండా అసంతృప్తి చెందకుండా ఉంటే అద్భుతంగా ఉంటుంది. చదువు, శిక్షణ ద్వారా నేను ఆ స్థితికి చేరుకోగలను. అదే నేను వెళ్లాలనుకుంటున్న దారి. ఆ సురక్షితమైన దిశలో వెళ్ళడం అంటే భయం కానీ ఆ బాధల నుండి నన్ను నేను ఎలా రక్షించుకోగలను."

ఈ విధంగా రెండు సత్యాల నుండి నాలుగు సత్యాల వరకు జీవితంలో అనుసరించవలసిన సురక్షితమైన దారిలో వెళ్తూ, పిల్లలే కాకుండా, అన్ని వయసుల వారి భయాలు మరియు అసంతృప్తికి ప్రధాన మూలం అయ్యే భావోద్వేగాలు అన్నిటినీ తెలుసుకోవచ్చు. ఆ సమస్యలను అధిగమించడానికి భావోద్వేగ పరిశుభ్రతను పొందడం యొక్క విలువను వారు గుర్తించడం జరుగుతుంది. భావోద్వేగ పరిశుభ్రత యొక్క ప్రయోజనాలు మరియు విలువలను అభినందించడం మరియు దానిని సాధించడానికి పనిచేయాలనే కోరిక మరియు ఉద్దేశ్యాన్ని అభివృద్ధి చేయడం తదుపరి శిక్షణకు అవసరమైన పునాది.

మోసపూరిత రూపాలు మరియు వాస్తవికత మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే ఈ పునాది సురక్షితంగా ఉన్నప్పుడు, తర్వాతి దశలు భావోద్వేగ పరిశుభ్రత కోసం కావలసిన వాటిని పరిచయం చేస్తాయి. ప్రతి బౌద్ధ మరియు బౌద్ధేతర సిద్ధాంత వ్యవస్థలు ఈ సాధనాలలో ప్రతి దానికి సంబంధించి అనేక రకాల భిన్నమైన వాదనలను అందిస్తాయి.  కాబట్టి, ముందుగా, అన్ని వ్యవస్థలకు ఆమోదయోగ్యమైన విధంగా సాధారణ పద్ధతిలో వివరించబడిన పూర్తి సాధనాల సమూహానికి ఒక పాఠం అవసరం. అప్పుడు, మరింత అధునాతన విద్యార్థులకు, ప్రతి సిస్టమ్ లోని పూర్తి టూల్స్ సెట్ యొక్క ప్రజంటేషన్ లను వివరించవచ్చు. ఒక సారి ఒక సిస్టమ్ గురించి ఒక పులుసులా కలిపి చెప్పడం అనేది సరైనది కాదు.

మనస్సు మరియు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి ముందుగా మనస్సు మరియు భావోద్వేగాలు అంటే ఏమిటో అర్థం చేసుకోవడం అవసరం. సాంఖ్య, వైశేషిక లాంటి కొన్ని బౌద్ధేతర వ్యవస్థలు మనస్సును, భావోద్వేగాలను భౌతిక అంశాలుగా గుర్తిస్తాయి. మెదడులోని భౌతిక ప్రక్రియలకు మనస్సును, భావోద్వేగాలను తగ్గించే పాశ్చాత్య శాస్త్రీయ దృక్పథాన్ని ఈ అభిప్రాయం గుర్తు చేస్తుంది. బౌద్ధేతర న్యాయ పాఠశాల వైశేషిక భౌతిక వాదనను అంగీకరిస్తుంది, కానీ అది ఒక ప్రత్యేకమైనదిగా తెలుసుకోవడానికి సరైన మార్గాలను కూడా యాడ్ చేస్తుంది. దీనికి విరుద్ధంగా, బౌద్ధ వ్యవస్థలు మనస్సును పూర్తిగా భౌతిక అస్తిత్వం లేదా భౌతిక ప్రక్రియకు తగ్గించడాన్ని తిరస్కరిస్తాయి. దీనికి బదులుగా మనస్సుకు స్పష్టత మరియు అవగాహనగా నిర్వచిస్తాయి. గురువు గారు చెప్పినట్టుగా, స్పష్టత అనేది ఒక వస్తువు యొక్క అభిజ్ఞా కోణానికి దారితీసే చర్య, అద్దంలో ప్రతిబింబం లాగా అవగాహన అనేది ఒక వస్తువుతో ఏదో ఒక విధంగా అభిజ్ఞాపరంగా నిమగ్నమయ్యే ఏకకాల చర్య. అందువల్ల, స్పష్టత మరియు అవగాహన ఒకే మానసిక సంఘటనను వివరిస్తాయి.

అన్ని బౌద్ధ, బౌద్ధేతర వ్యవస్థలు భావోద్వేగంతో పాటు జ్ఞానానికి మనస్సు ఎలా దారితీస్తుందో చెప్పడానికి ఆత్మ కూడా కారణం అని చెప్తాయి. కానీ ఆత్మ మరియు మనస్సు భావోద్వేగంతో దాని సంబంధం గురించి విరుద్ధమైన అభిప్రాయాలను తీసుకురాకుండా, ఈ వేరు వేరు అభిప్రాయాలు అంగీకరించేది, భావోద్వేగ పరిశుభ్రత ప్రయోజనాల కోసం. భావోద్వేగంతో పాటు జ్ఞానం ఆత్మాశ్రయ అనుభవాన్ని సూచిస్తుంది. సాధారణ పనులతో, ఈ అర్ధం దేనిని సూచిస్తుందో ప్రజలు కనిపెట్టవచ్చు.

తరువాత జరగబోయేది, ఈ నేలపై, మనస్సు మరియు భావోద్వేగాల యొక్క డ్రాయింగ్ ని గియ్యడం. అత్యంత సాధారణ మ్యాప్ లో స్మారక స్థితిలో రకాలు - ఇంద్రియ మరియు మానసికమైనవి. ఆసక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ఆనందం లేదా విచారం యొక్క అనుభూతి స్థాయిలు వంటి ప్రాథమిక మానసిక విషయాలను చేర్చాలి. ప్రేమ నుంచి  కోపం వరకు వివిధ భావోద్వేగాలు మన ఆలోచన, మాట్లాడటం మరియు ప్రవర్తించే మార్గాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం కూడా మనకు అవసరం. అన్ని పురాతన భారతీయ వ్యవస్థలు ఉమ్మడిగా పేర్కొన్న ప్రాథమిక మానసిక విషయాలు మరియు భావోద్వేగాల జాబితాలను ఒకటి చేయడానికి మరింత పరిశోధన అవసరం. కానీ, అవన్నీ కోరిక, కోపం మరియు అజ్ఞానంగా ప్రాధమిక సమస్యలను గుర్తిస్తాయి.

తరువాత నాన్-కాన్సెప్చువల్ మరియు కాన్సెప్చువల్ జ్ఞానం ఎలా పనిచేస్తుందనే దాని యొక్క ప్రజంటేషన్ ఉంటుంది, ఇందులో ప్రతి దానితో సంబంధం ఉన్న వస్తువుల రకాల గురించి చర్చ జరుగుతుంది. వస్తువులను తెలుసుకోవడానికి వివిధ సరైన మరియు చెల్లని మార్గాల పరిచయంతో ఈ ప్రదర్శనను పెంచవచ్చు, ముఖ్యంగా జ్ఞానం మరియు అంచనాలను. నిర్ధారణ యొక్క చర్చ సరైన మరియు చెల్లుబాటు కాని తర్క మార్గాల సమర్పణకు దారితీస్తుంది. చివరగా, ఈ సాధారణ అధ్యయనానికి తోడుగా, ఏకాగ్రత మరియు అంతర్దృష్టిని అభివృద్ధి చేయడానికి ప్రాథమిక ధ్యాన పద్ధతులను ప్రవేశపెట్టవచ్చు.

అన్ని ప్రాచీన భారతీయ వ్యవస్థలు కలిసి పంచుకున్న భావోద్వేగ పరిశుభ్రత సాధనాల యొక్క ఈ సర్వే పూర్తయిన తర్వాత, విద్యార్థులు వారి అభిరుచి, సామర్థ్యం మరియు ఆసక్తులను బట్టి, ప్రతి వ్యవస్థను ఒక్కొక్కటిగా అధ్యయనం చేయవచ్చు. ఒక వ్యవస్థలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. కానీ శిక్షణ యొక్క అన్ని స్థాయిలలో, వారు నేర్చుకున్నదాన్ని వారి జీవితంలో ఉపయోగించవచ్చు. మా studybuddhism.com వెబ్ సైట్ లో, మా బెర్జిన్ ఆర్కైవ్స్ బృందం ఇప్పటికే ఇలాంటి అనేక రిసోర్స్ లను అభివృద్ధి చేసింది.

ఇక్కడ పేర్కొన్న శిక్షణా కార్యక్రమాలు భావోద్వేగ పరిశుభ్రత యొక్క పురాతన భారతీయ విలువలను పునరుద్ధరించడానికి భగవంతుని నిబద్ధతను నెరవేర్చడానికి ఎంతగానో సహాయపడతాయి. గురువు గారు చెప్పినట్లుగా, "మానవులుగా, మనం తెలివైన వాళ్ళం. ఎలాంటి విషయాలను అయినా ఆలోచించే సామర్థ్యం మనకు ఉంది. ఆనందాన్ని పెంచుకోవడానికి మరియు బాధలను తగ్గించుకోవడానికి మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి మనం మన మనస్సును ఉపయోగించుకోగలుగుతాము." అందరికి ధన్యవాదాలు.

Top