ప్రేమ అంటే ఇతరులు సంతోషంగా ఉండాలని, వాళ్ళ సంతోషానికి కారణాలు చాలా ఉండాలని కోరుకోవడం. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటే, ఇది సార్వజనికమైనదిగా మరియు బేషరతుగా ఉంటుంది. ఇది ఇతరుల అవసరాలకు సున్నితంగా ఉండే లక్షణం మరియు వారి సంతోషానికి దోహదపడే సుముఖతను కలిగి ఉంటుంది. పక్కవాళ్లు ఏమి చేశారనే దానితో సంబంధం లేకుండా ఈ ప్రేమను అందరికీ సమానంగా పంచవచ్చు. ఇది ప్రతిఫలంగా ఇంకేమీ కోరుకోదు. బౌద్ధమతంలో ప్రేమే ఆనందానికి గొప్ప సోర్స్.
ప్రేమ వర్సెస్ అనుబంధం
ప్రేమ తరచుగా ఇతర భావోద్వేగాలతో నిండి ఉంటుంది. అనారోగ్యకరమైన అనుబంధంతో, మనం ఒకరి మంచి లక్షణాలను చూస్తాము – అవే అసలైనవి లేదా ఊహాజనకమైనవి - మరియు వారి లోపాలను తిరస్కరిస్తాము. మనం వాళ్లకు దగ్గర అయ్యి వాళ్ళు మనల్ని పట్టించుకోనప్పుడు బాగా బాధపడతాం, "ఐ లవ్ యూ; నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకు; నువ్వు లేకుండా నేను బతకలేను." అని చెప్తూ ఉంటాం.
మనకు నచ్చినా నచ్చకపోయినా సమస్త జీవుల ఆనందాన్ని నిష్పక్షపాతంగా కాపాడుకోవాలన్నదే నిజమైన ప్రేమ.– యోంగ్ జిన్ లింగ్ రింపోచే
బౌద్ధమతంలో ప్రేమకు ఇతరులతో సాన్నిహిత్యం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తున్నారా మరియు పట్టించుకుంటారా అనే దానిపై ఆధారపడి ఉండదు. అనుబంధం, పరాధీనతతో కూడిన ప్రేమ అస్థిరంగా ఉంటుంది. మనం ప్రేమించే వ్యక్తి మనల్ని బాధపెట్టే పని చేస్తే, మనం ఇంక వాళ్ళని ప్రేమించకపోవచ్చు. ప్రేమతో మొదలై విడాకుల్లో ఎన్ని పెళ్లిళ్లు ముగుస్తున్నాయో మీరే చూడొచ్చు! మనం ఎలాంటి అంచనాలను పెట్టుకోనప్పుడు, ఏదీ మనల్ని వాళ్ళ నుంచి విడదియ్యలేదు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలను ప్రేమిస్తూ వాళ్లకు మంచి జరగాలని ఎప్పుడు కోరుకుంటారు, స్థిరమైన ప్రేమను పెంపొందించుకోవడం ఎలాంటి వ్యక్తులతో అయినా ఉండటానికి మనకు శక్తిని ఇస్తుంది. దీనికి శిక్షణ అవసరం, కానీ మనందరం దీన్ని ఖచ్చితంగా పొందగలం.
మనల్ని మనం ప్రేమించుకోవడం
సార్వజనిక ప్రేమలో తరచుగా విస్మరించబడిన అంశం ఒకటి ఉంది: మనల్ని మనం ప్రేమించుకోవడం. స్వీయ-కేంద్రీకృత, అందంగా ఉండాలనే మార్గంలో కాదు, మన స్వంత స్వల్ప మరియు దీర్ఘకాలిక సంక్షేమం కోసం హృదయపూర్వక శ్రద్ధతో. మన వ్యక్తిత్వం యొక్క కొన్ని స్వీయ-విధ్వంసక అంశాలను మనం ఇష్టపడకపోవచ్చు, కానీ దీని అర్థం మనల్ని మనం సంతోషంగా ఉండకూడదని కోరుకోవడం కాదు - ప్రేమకు వ్యతిరేకంగా. సహజంగానే మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం.
ప్రేమను మన వైపు మళ్లించుకున్నప్పుడు, ఆనందం మరియు వినోదం కోసం మన కోరికను తీర్చడానికి ఏదొకటి కోరుకోవడమే కాదు. ఇలాంటి వాటి వల్ల మనకు లభించే కొద్దిపాటి ఆనందం ఎప్పటికీ నిలవదు మరియు మనం ఇంకా ఎక్కువ కోరుకుంటూ ఉంటాము. మనల్ని మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, తాత్కాలిక ఆనందం మాత్రమే కాకుండా నిజమైన శాశ్వత ఆనందాన్ని పొందడానికి వీలు ఉంటుంది. మనల్ని మనం నిజంగా ప్రేమించుకున్నప్పుడే ఇతరులను కూడా స నిజంగా ప్రేమించగలుగుతాం.