వివరణ
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం, క్షమించడం అంటే ఎవరైనా ఒక నేరం, లోపం లేదా తప్పు చేసినప్పుడు అతనిపై కోపం లేదా ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా ఉండటం. కొంత మందికి, ఇది తప్పు చేసిన వ్యక్తి లేదా ఏదైనా ఉన్నతాధికారి క్షమాభిక్ష మంజూరు చేయడం లాగా అర్ధం అవుతుంది, ఇది కూడా ఆ నేరస్థుడిని తను చేసిన పనికి ఎటువంటి శిక్ష పడకుండా ఉండేలా సూచిస్తుంది.
బౌద్ధమత విశ్లేషణ యొక్క మానసిక కారణాలలో క్షమాపణ అనేది ఒక స్పష్టమైన పదం కాదు, కానీ ఇది కోపం, పగ (ఇందులో వైర్యాన్ని కలిగి ఉంటుంది) లేకుండా, మరియు వారి ప్రత్యర్థులు, అంటే వాళ్ళు కోపంగా మరియు క్రూరంగా ఉండకపోవడం గురించి ఉంటుంది.
- కోపగించుకోకపోవడం అంటే మన పనుల వల్ల బాధ పడే ఇతరులకు లేదా మనకు ప్రతిస్పందనగా ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వారికి హాని కలిగించడానికి ఇష్టపడకపోవడం.
- క్రూరంగా ఉండకపోవడం అనేది కరుణను పెంచుతుంది, వాళ్ళు తమ బాధల నుంచి మరియు అవి వస్తున్న కారణాల నుంచి విముక్తి పొందాలనే కోరికను పెంచుతుంది.
కాబట్టి, బౌద్ధమత విధానంలో చూసుకుంటే, హానికరమైన పనుల ఫలితంగా ఇతరులు లేదా మనమే అటువంటి బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటాము. కాని ఎవరికి కూడా వారి తప్పు పనుల పర్యవసానాల నుంచి క్షమించుకునే అధికారం ఉండదు. కాబట్టి ఒక పూజారి లేదా కోర్టు న్యాయమూర్తి నేరస్థులను క్షమించినట్లుగా పవిత్రమైన భావన పెరిగే ప్రమాదం ఉండదు.
బౌద్ధమత విధానాలలో క్షమించడానికి కీలకమైనది ఆ వ్యక్తిని - ఎవరైనా లేదా అది మనమే అయినా - వాళ్లను వాళ్ళు చేసే హానికరమైన లేదా విధ్వంసక పనుల ప్రకారం వేరు చెయ్యాలి. గుర్తుంచుకోండి, మనం వినాశకరమైన విధంగా ప్రవర్తించి తప్పులు చేస్తాము, ఎందుకంటే మనం చెడ్డ వాళ్లం అని కాదు, కానీ మన ప్రవర్తన నుంచి వచ్చే ప్రభావం మనకు తెలియదు కాబట్టి మనకు దాని గురించి అవగాహన తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఆ తప్పులను చేస్తాము. మనం పరిమితమైన ఒక సంసార జీవులం, మన చేతిలో లేని సమస్యలు పదే పదే రిపీట్ అవ్వొచ్చు, అందుకని కరుణ కూడా అలాగే ఉంది. మనకు మనం ఇప్పటికే సరిపడినంత హానిని మరియు బాధను ఎదుర్కుంటున్నాము, దానికి ఇంకా కష్టాలను జోడించాల్సిన అవసరం లేదు.
కాబట్టి, బౌద్ధమత సందర్భంలో క్షమించడం అంటే:
- వ్యక్తిని తను చేసే పనిని బట్టి వేరు చేయడం - ఎవరినైనా లేదా అది మనమే అయినా
- వారి పట్ల లేదా మన పట్ల కోపగించుకోకుండా లేదా క్రూరంగా మారకుండా ఉండకుండా, దానికి బదులుగా,
- మనం లేదా వాళ్ళు వినాశకరంగా వ్యవహరించడానికి లేదా తప్పు చేయడానికి కారణమైన వాటి నుంచి విముక్తి పొందాలనే కోరికతో కరుణను అనుభూతి చెందడం.
హానికరమైన ప్రవర్తన లేదా పొరపాటు జరిగే విషయంలో, మనం రియాక్ట్ అవ్వకుండా ఉండలేము. మరిన్ని చెడ్డ పనులు జరగకుండా ఆపడానికి మరియు తప్పులను సరిదిద్దడానికి మనం అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము - కానీ కోపం లేదా పగ లేకుండా మనం వాళ్లను క్షమిస్తున్నామనే అహంకార భావన లేకుంటేనే ఇది సాధ్యపడుతుంది.
ధ్యానం
మనం ఇతరులతో మరియు మనతో కూడా ఒక క్షమా గుణాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ రోజు మనం ఇతరులపై దృష్టి పెడదాము. తర్వాత మనం మనపై ఫోకస్ చేసుకుందాం.
- శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
- మిమ్మల్ని బాధపెట్టిన లేదా చిరాకు కలిగించిన ఏదైనా వ్యక్తిని గుర్తు చేసుకోండి, మీరు అతని మీద కోపం తెచ్చుకుని పగ కూడా పెంచుకున్నారు, అలా మీరు వాళ్ళు చేసిన ఆ పని గురించి ఆలోచిస్తూ కోపం తెచ్చుకుని బాధ పడ్డారు.
- అప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారో గుర్తుతెచ్చుకుని ఇలా అనుభూతి చెందడం ఒక సంతోషకరమైన లేదా సౌకర్యవంతమైన మానసిక స్థితి కాదని గమనించండి.
- ఇప్పుడు, మీ మనస్సులో ఆ వ్యక్తిని తను చేసిన పని నుండి వేరు చేయడానికి ప్రయత్నించండి. ఇది ఒక సంఘటన మాత్రమే, ఇది వారి మొత్తం జీవితంలో అనేక సార్లు జరుగుతూ ఉంటుందని తెలుసుకోండి.
- నాతో సహా అందరి లాగే ఆ వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలని, అసంతృప్తిగా ఉండకూడదని అనుకున్నాడు, కానీ అతనికి ఏది సంతోషాన్ని ఇస్తుందో తెలుసుకోలేకపోతున్నాడు, అప్పుడు అతనికి తెలియకుండా మరియు అజ్ఞానంతో మిమ్మల్ని బాధపెట్టి చిరాకు కలిగించే పని చేశాడు.
- మీరు ఈ అవగాహనపై ఎంత ఎక్కువగా దృష్టి పెడితే మీ కోపం మరియు అసంతృప్తి అంత తగ్గుతుందని గమనించండి.
- అతని పట్ల కరుణను పెంపొందించుకోండి. అతను మిమ్మల్ని బాధపెట్టడానికి కారణమైన ఇబ్బంది మరియు అసంతృప్తి నుంచి విముక్తి పొందాలని అనుకోండి.
- సరైన సమయంలో, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, వాళ్ళు మీకు బాధ కలిగించిన విషయం గురించి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
తప్పు చేసిన వ్యక్తితో ఇలా మళ్ళీ చెయ్యండి:
- వాళ్ళు చేసిన తప్పును గుర్తు చేసి, వారిపై మీకు ఎలా కోపం వచ్చిందో చెప్పండి.
- మీరు ఎలా అనుభూతి చెందారో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించి ఇలా అనుభూతి చెందడం సంతోషకరమైన లేదా సౌకర్యవంతమైన మానసిక స్థితి కాదని చెప్పండి.
- ఇప్పుడు, ఆ తప్పు చేసిన వ్యక్తిని తను చేసిన పని నుంచి మీ మనస్సులో వేరు చేసి చేయడానికి ప్రయత్నించండి.
- నాతో సహా అందరి లాగే ఆ వ్యక్తి కూడా నాకు సహాయం చేయాలనుకున్నాడు మరియు తప్పు చేయకూడదని కోరుకున్నాడు, కానీ ఏదైనా చేయడానికి ఉత్తమమైన మార్గం ఏమిటో అని తెలుసుకోలేకుండా ఉన్నాడు, లేదా శ్రద్ధ వహించకుండా బద్దకంగా మరియు ఇంకేమైనా కారణం ఉండొచ్చు, కాబట్టి అజ్ఞానం మరియు ఇబ్బంది పడిన భావోద్వేగాల వల్ల అతను అలా తప్పు చేశాడు. వాళ్ళు పరిమితమైన సంసార జీవులు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటారని మరియు ఎప్పుడూ తప్పు చేయరని ఆశించడం మన తప్పే.
- మీరు అర్థం చేసుకోవడంపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే, మీ కోపం అంతగా తగ్గుతుందని గమనించండి.
- వారి పట్ల కరుణను పెంపొందించుకోండి, వాళ్ళు తప్పు చేయడానికి కారణమైన ఇబ్బందులు, అజ్ఞానం మరియు కలవరపరిచే భావోద్వేగాల నుంచి విముక్తి పొందాలని కోరుకోండి.
- సరైన సమయంలో, మీరు ప్రశాంతంగా ఉండి మీరు చెప్పేది వాళ్ళు వింటున్నప్పుడు, మీరు వాళ్ళ తప్పును ఎత్తి చూపి దాన్ని సరిదిద్దడంలో వారికి సహాయపడండి.
సారాంశం
క్షమించడం అంటే ఒకరు చేసిన వినాశకరమైన పనిని లేదా వారి తప్పులకు ఏమీ చేయకుండా ఉండడం కాదు, మనం వారి కన్నా పవిత్రంగా మరియు పరిపూర్ణంగా ఉన్నామా, లేదా వాళ్ళు మన కంటే అధ్వాన్నంగా ఉన్నారా అని చూసుకోవాలి, అప్పుడు వారు పశ్చాత్తాపపడకపోయినా, మన అధికారంతో మనం వారిని క్షమిస్తాము. క్షమించడం అంటే కోపం తెచ్చుకోకపోవడం, కోపంగా అనిపించకపోవడం, పగతో ఉండకపోవడం మరియు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకోకపోవడం. మనం ఒక వ్యక్తిని అతని పని బట్టి లేదా చేసిన తప్పును చూసి వేరు చేస్తాము, ఆ వ్యక్తి పట్ల కరుణను పెంపొందించుకుంటాము మరియు అతని తప్పుని సరిదిద్దడానికి లేదా అది మళ్ళీ జరగకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఈ విధంగా, కోపం మనకు కలిగించే నష్టాలు మరియు అసంతృప్తిని ఇలా నివారిస్తాము, ప్రత్యేకించి కోపం మనకు కోపంతో కూడిన ఆలోచనలను, దూకుడుని, చెడ్డ తిట్లు, మరియు నిర్లక్ష్య ప్రవర్తనకు దారితీసినప్పుడు.