ఏదైనా చేయాలని లేదా చెప్పాలని అనిపించడం మరియు దానిని బలవంతంగా చేయడం మధ్య ఉన్న తేడాలో, పరిణామాలను అంచనా వేయడానికి మరియు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.
Meditations conquering compulsiveness

వివరణ

కర్మ అనేది మన మొండితనానికి సంబంధించినది. ఇది ఏదో కలవరపరిచే భావోద్వేగం లేదా కలవరపరిచే వైఖరి ద్వారా బలవంతపు మరియు మానసిక ప్రేరణలను సూచిస్తుంది, ఇది ఒక అయస్కాంతం లాగా, ఏదైనా ఒక పనిలో నిమగ్నం కావడానికి, ఏదైనా చెప్పడానికి లేదా ఏదైనా ఆలోచించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. 

ఈ మొండితనపు ప్రేరణలను బలవంతంగా అమలు చేయడం వల్ల శారీరక, మౌఖిక లేదా మానసిక పనులు బలవంతంగా రిపీట్ అయ్యే ధోరణిని పెంచుతుంది. వివిధ పరిస్థితులు ఎదురైనప్పుడు – లోపల ఆందోళన కలిగించే భావోద్వేగాలు లేదా బయట మనకు ఉన్న పరిస్థితులు  - ఈ ధోరణులు ఆ పనులు రిపీట్ అయ్యేటటువంటి భావనకు దారితీస్తాయి. ఆ తర్వాత, సాధారణంగా ఆ పనుల పర్యవసానాల గురించి ఆలోచించకుండా, మనం వాటిని బలవంతంగా రిపీట్ చేసేస్తాము. ఈ మొండి ప్రవర్తన అసంతృప్తికి లేదా ఎలాంటి సంతృప్తి చెందని ఆనందానికి దారితీస్తుంది. కర్మ అనేది అలాంటి ప్రవర్తన వెనుక ఉండే ఒక రకమైన బలవంతపు కోరిక.

ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది, ఎందుకంటే ఇలాంటి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు చాలా నష్టాలను తెచ్చిపెడతాయి. అవి: 

  • మొండి ప్రవర్తనా విధానాలు - ప్రతీ దానికి బాగా అడిక్ట్ అయిపోవడం, అంటే మన ఫోన్లలో మెసేజ్ లు మరియు ఫేస్ బుక్ ని తప్పనిసరిగా చెక్ చేసుకుంటూ ఉండటం; లేదా అమాయకంగా ఉండి ఇతరుల భావాలను పట్టించుకోకపోవడం, మన తల్లిదండ్రులతో డిన్నర్ టేబుల్ వద్ద ఉన్నప్పుడు వేరే వాళ్లకు మెసేజ్ లు పంపుతూ ఉండడం; లేదా ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు కోపం తెచ్చుకుని మన హారన్ ను గట్టిగా వెయ్యడం మరియు ఇతరులను దాటుకుని వెళ్ళడానికి ప్రయత్నించడం లాంటివి.
  • మొండి మాటల విధానాలు - అసంతృప్తి అనేది బలవంతపు మాటలకు దారితీస్తుంది; సొంత-ప్రాముఖ్యత మరియు శత్రుత్వం మొండి విమర్శలు మరియు బెదిరింపులకు దారితీస్తుంది; సిగ్గు మరియు తక్కువ సొంత-విలువ అనే భావన తక్కువ చేసి మాట్లాడటానికి దారితీస్తుంది.
  • మొండి ఆలోచనా విధానాలు - అభద్రత మొండి రకపు ఆందోళనకు దారితీస్తుంది; వాస్తవికత గురించి అమాయకత్వం లేదా వాస్తవికతను వదిలెయ్యాలనే కోరిక బలవంతపు పగటి కలలకు దారితీస్తుంది. 

పైన వివరించిన ఉదాహరణలన్నీ అసంతృప్తికి దారితీసే సొంత-విధ్వంసక మొండి ప్రవర్తనా విధానాలు. కానీ మిగతా నిర్మాణాత్మక సందర్భాలు కూడా ఉన్నాయి - అవి పరిపూర్ణత స్వభావం, ఇతరుల లాజిక్ లను బలవంతంగా సరిదిద్దడం, "వద్దు" అని ఎప్పుడూ చెప్పకుండా పనులు చేసే వారి స్వభావం మొదలైనవి. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక, లేదా బాగా చేయాలనే కోరిక వంటి సానుకూల భావోద్వేగాలు వీటి వెనుక ఉండవచ్చు, కానీ వాటి వెనుక "నేను" అనే ఆలోచన మరియు ఆసక్తి అనేది ఉంటుంది కాబట్టి - "నేను" మంచిగా ఉండాలి, "నేను" అందరికి అవసరం పడాలి, "నేను" పరిపూర్ణంగా ఉండాలి, అవి మనకు తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వాలి, మనం ఏదైనా మంచి చేసినప్పుడు, ఆ ఆనందం నిలవకుండా అది ఒక సమస్య కాకూడదని అనిపిస్తుంది. ఉదాహరణకు, మన౦ ఎప్పటికీ సరిపోమని భావించి మన విలువను నిరూపి౦చుకోవడానికి బయటకు వెళ్లి ఇంకో మంచి పని చెయ్యాలని అనిపిస్తుంది. 

ముందుగా మనం ప్రశాంతంగా ఉండాలి మరియు నెమ్మదిగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయాలని లేదా చెప్పాలని అనిపించినప్పుడు, మొండితనం మధ్య తేడాను గుర్తించగలం. ఇక్కడ మన గురించి మనం అంచనా వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. దాని వెనుక ఏదైనా ఇబ్బందికరమైన భావోద్వేగం ఉందా, సాధ్యం కానీ దాని కోసం నన్ను నేను బలవంత చేస్తున్నానా (ఎప్పుడూ పరిపూర్ణంగా), ఆ పనిని చెయ్యడానికి ఏదైనా శారీరక కష్టం కావాలా (దురదను గీరడం ‍వంటిది), ఇది ప్రయోజనకరంగా ఉంటుందా లేదా హానికరమా? అని. వీటి మధ్యలో ఉన్న తేడాను గుర్తించండి. దాని తర్వాత సొంత నియంత్రణను పాటించండి. మనం ఏమి చేయాలనుకుంటున్నామో లేదా ఏమి చెబుతున్నామో అనే దానికి సరైన కారణం లేకపోతే, కొన్ని న్యూరోటిక్ కారణాలు మాత్రమే కనిపిస్తాయి. దీనికి మనం ఎలా ప్రవర్తిస్తామో, మాట్లాడతామో మరియు ఆలోచిస్తామో అనేది గుర్తుంచుకోవడం మరియు ఆ రోజంతా ఆత్మపరిశీలన చేసుకోవడం మరియు సొంత నియంత్రణ పాటించడం లాంటివి అవసరం పడతాయి.

మన ప్రవర్తన వెనుక సానుకూల భావోద్వేగాలు మరియు మన గురించి మరియు వాస్తవికత గురించి సాధ్యమైనంత తక్కువ విచక్షణాత్మక అవగాహనను ఉపయోగించడం మరియు సాధ్యమైనంత వరకు మొండితనం లేకుండా వ్యవహరించడం అనేదే లక్ష్యంగా పెట్టుకోవాలి.

ధ్యానం

  • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
  • మీ మొండి పనులు, మాటలు మరియు ఆలోచనా విధానాలను గుర్తించడానికి ప్రయత్నించండి.
  • వాటిలో ఒక దాన్ని ఎంచుకుని దాని వెనుక ఏదైనా ఇబ్బందికరమైన భావోద్వేగం ఉందా లేదా అని విశ్లేషించండి.
  • మీరు మొండిగా వ్యవహరించినప్పుడు, అది మీలో ఒక రకమైన సమస్యను కలిగిస్తుందని లేదా ఇతరులకు సమస్యను మరియు ఇబ్బందిని కలిగిస్తుందని గుర్తించడానికి ప్రయత్నించండి. ఇది అసంతృప్తి లేదా స్వల్పకాలిక ఆనందం యొక్క సంతృప్తికి దారితీస్తుంది.
  • మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో మరియు ఏమి చేస్తున్నారో ఒక అంచనా వేయడానికి మీ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తారని మరియు శాంతిదేవుడు సలహా ఇచ్చినట్లుగా, అది మీ సొంత-వినాశనం లేదా మీ అహంకారాన్ని బలపరుస్తుందని నిర్ణయించుకోండి, సొంత నియంత్రణను పాటించండి.
  • మీరు ధ్యానంలో కూర్చొన్నప్పుడు, మీకు దురద ఉన్న చోట గోకడం లేదా మీ కాలును కదిలించాలని అనిపించినప్పుడు దాని మధ్య ఉండే కాల వ్యవధిని గమనించి అలా చేయాలా వద్దా అని మీరు ఎలా నిర్ణయించుకోవచ్చో గమనించండి. మీరు సొంత నియంత్రణను పాటించగలరని తెలుసుకోండి. దానిని అమలు చేయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం కంటే దానిని అమలు చేస్తే వచ్చే ప్రయోజనమే ఎక్కువ ఉంటుందని తెలుసుకోండి.
  • మీ రోజువారీ జీవితంలో మొండి ప్రవర్తన వల్ల, మీకు ఏదైనా చేయాలని అనిపించినప్పుడు మరియు మీరు దానిని చేసినప్పుడు వాటి మధ్య ఉండే వ్యత్యాసం గురించి మీరు మరింత జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలా చేయకపోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని చేస్తేనే వచ్చే ప్రయోజనం మించిపోయినప్పుడు, మీరు ఆ విధంగానే అనుకున్నట్టుగానే చెయ్యటానికి ప్రయత్నిస్తారు.

సారాంశం

మన మొండి రకపు సొంత-విధ్వంసక ప్రవర్తన, బాగా ఇబ్బంది పెట్టే భావోద్వేగాల వల్ల అసంతృప్తి మరియు వివిధ సమస్యలకు దారితీస్తుందని మనం గమనించాము. నిర్మాణాత్మకంగా, సానుకూలంగా వ్యవహరించినప్పుడు, అభద్రతా భావం, అవాస్తవిక ఆలోచనలు మన గురించి ప్రేరేపించబడినప్పుడు, ఒక పనిని చక్కగా పూర్తి చేసిన తర్వాత లేదా సహాయకారిగా ఉన్న తర్వాత మనకు స్వల్పకాలిక ఆనందం కలుగవచ్చు, కానీ అప్పుడు మనల్ని మనం మళ్ళీ నిరూపించుకోవాలని బలవంతంగా ప్రయత్నిస్తాము.  

మనం ఏమి చేయాలనుకుంటున్నామో, ఏమి చెప్పాలనుకుంటున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో అనే దాని మధ్య ఉండే వ్యత్యాసాన్ని గ్రహించాలి. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి, బుద్ధిపూర్వకంగా మరియు వివక్షతో ఉండాలి. అతిష బోధిసత్వ గార్లాండ్ ఆఫ్ జెమ్స్ (28) లో ఇలా చెప్పాడు: 

మనుషుల మధ్య ఉన్నప్పుడు, నేను నా మాటలను చెక్ చేసుకుంటాను; అదే నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా మనస్సును చెక్ చేసుకుంటాను.

కానీ మనం ఎప్పుడూ అన్నిటినీ చెక్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి కఠినంగా మరియు మెకానికల్ గా ఎక్కువ స్థాయిలకు వెళ్లకుండా ఇలా చెయ్యడానికి ప్రయత్నించండి. మీరు ఇలా చేస్తే ఆకస్మికంగా ఉండరని మీకు అనిపించవచ్చు, కానీ దాని ప్రయోజనాన్ని లేదా సముచితను అంచనా వేయకుండా, ఆకస్మికంగా మన మనస్సులో ఏది అనిపిస్తే అది చెయ్యాలనుకుంటే, ఉదాహరణకు ఒక బాబు అర్ధరాత్రి ఏడుస్తుంటే, మనకు లేవాలని అనిపించకపోతే, మనం లేవంటూ అన్నట్టు ఇది ఉంటుంది. లేదా ఆ బాబుని సైలెంట్ చెయ్యటానికి కొట్టాలని అనిపిస్తే, మనం అలాగే చేస్తాము. కాబట్టి, మన మొండి ప్రవర్తన మరియు కర్మ యొక్క సమస్యలను ఎదుర్కోవటానికి - మనం పదే పదే ధ్యానం చేసి ఒక పోలీసుగా కఠినమైన రీతిలో ఉండాలి. స్వయంగా మరియు సహజంగా మనకు ఏమి చేయాలో గుర్తుంచుకోవడం కూడా ముఖ్యమైన విషయమే.

Top