జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వడం

మన జీవితానికి అర్ధం లేనట్లుగా అనిపిస్తే, మన లోపాలను అధిగమి౦చడానికి, మన సామర్థ్యాన్ని గ్రహి౦చడానికి మన౦ పని చేసుకోవడ౦ ద్వారా ఒక అర్థవ౦తమైన దారిని ఏర్పరుచుకు౦టా౦.
Meditation a meaning in life

వివరణ

మనలో చాలా మంది మన జీవితాలు ఎక్కడికీ వెళ్లట్లేదని భావిస్తూ ఉంటాం. మన ఉద్యోగాలలో అర్ధం లేనట్లుగా మనకు అనిపించవచ్చు, లేదా మనకు ఉద్యోగం లేక ఎలాంటి ఎదుగుదల కనిపించకపోవచ్చు. మన౦ ఇంకా స్కూల్ లోనే ఉండి అక్కడి విద్య యొక్క విలువను, మరియు దాని అర్థాన్ని ప్రశ్ని౦చవచ్చు. మన పరిస్థితి దారుణంగా తయారయ్యి డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని భయపడవచ్చు. దీనితో పాటు, మనం ఈ ప్రపంచంలో కొంత మార్పును తెచ్చిపెట్టే మంచి అర్థవంతమైన పనులను చేయాలనుకుంటున్నాము. దానిని మనం ఇతరులతో పంచుకోవాలని అనుకుంటున్నాము. మనలో చాలా మంది చాలా డబ్బు సంపాదించడం మరియు చాలా వస్తువులను కలిగి ఉండటం మన అన్ని అవసరాలను తీర్చదనే నిజాన్ని తెలుసుకుంటారు.

బౌద్ధమతం ఈ సమస్యను సురక్షితమైన దారి అనే అంశంతో ప్రస్తావిస్తుంది, ఇది సాధారణంగా ఆశ్రయంగా అనువదించబడుతుంది. మనకు ఉన్న ఈ అమూల్యమైన మానవ జీవితం ఖచ్చితంగా మరణంతోనే ముగుస్తుందని, ఇప్పుడు మనం ఈ జీవితంలో మంచి పనులు  చేయకపోతే ఘోరమైన పునర్జన్మలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకున్నప్పుడు, దానిని ఎలా అరికట్టవచ్చో మనం ఆలోచిస్తాము. అలాగే, మనం ఈ పునర్జన్మ అనే విషయాన్ని అంగీకరించకపోయినా, ఇప్పుడు మనకు ఉన్న ఈ విలువైన జీవితం మనకు ఉన్నందుకు అభినందిస్తాము, మరియు మన జీవితాలు ఎంత అర్థరహితమైనవో, విచారంతో చనిపోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకొని, ఈ జన్మలో పరిస్థితులు మరింత దిగజారిపోతాయని భయపడతాము. 

బౌద్ధమతం అందించే సురక్షితమైన దారిని ఈ మూడు విలువైన రత్నాలు సూచిస్తాయి. అందులో ప్రధానమైనది ధర్మం - నిజమైన మార్గాలు మరియు మనస్సులకు సరైన దారులు. కాబట్టి, మన లోపాలను అధిగమించడానికి మరియు అన్ని మంచి లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా మన సామర్థ్యాలను గ్రహించడానికి బాగా కష్టపడాలి. భావోద్వేగాలను ఇబ్బంది పెట్టడం, ఏకాగ్రత లోపించడం, సొంత రక్షణ, సమర్థవంతంగా సంభాషణ చేయడంలో ఇబ్బందులు మొదలైనవి లోపాలు. దయ, కరుణ, సహనం, అవగాహన, క్షమాగుణం, నిజాయితీ మొదలైన ప్రాథమిక మానవ విలువలు మంచి లక్షణాలు. అలాగే నైతికత, ఏకాగ్రత మరియు అంతర్దృష్టి యొక్క భావన. బుద్ధులు పూర్తి స్థాయిలో, మరియు అత్యంత సాకారమైన గురువులు కొంతవరకు చేసినట్లుగా వీటిని సాధించడానికి కృషి చేయడం మన జీవితాలకు ఒక అర్థాన్ని ఇస్తుంది.

మనం ఇతరులతో మాట్లాడాలని అనుకున్నప్పటికీ, దీని అర్థం కేవలం సోషల్ మీడియాలో మన విజయాన్ని పోస్ట్ చేయడమే కాదు, పెరుగుతున్న ఆత్మవిశ్వాసంతో, మనకు సాధ్యమైన చిన్న లేదా పెద్ద మార్గాల్లో సహాయం చేసి మన అభివృద్ధిని ఇతరులతో పంచుకోవాలి. అందువల్ల, మన జీవితాలలో ఒక సురక్షితమైన దారిని ఉంచుకోవాలి. పరిస్థితులు మరింత దిగజారిపోతాయనే భయం, మన జీవితాలు మరింత దిగజారకుండా మనపై మనం పని చేసుకోవాలి. మన విజయాలను పంచుకుంటూ మనం సహాయం చేయాలనుకునే ఇతరుల పట్ల శ్రద్ధ మరియు కరుణను కలిగి ఉండటం.

ధ్యానం

  • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
  • మీ జీవితం గురించి ఆలోచించి అది మీకు అర్థవంతంగా అనిపిస్తుందో లేదో ఒక అంచనా వేయండి.
  • మీ జీవితానికి సంబంధించిన విషయాలను ఇతరులతో ఎలా పంచుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి.
  • మీ లోపాలను అధిగమించడానికి మరియు మీ సామర్థ్యాన్ని గ్రహించడం కోసం పనిచేయడం మీ జీవితానికి ఎలా అర్థాన్ని ఇస్తుందో ఆలోచించండి. ఇతరులతో సరైన విషయాలను పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, మరియు మీరు పంచుకున్నవి - ఆన్‌లైన్‌లోనే కాదు, వ్యక్తిగత పరస్పర సంభాషణలలో కూడా వారికి ఒక విధంగా సహాయపడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి.
  • మీ జీవితంలో అర్థవంతమైన దారి లేకపోవడం వల్ల ఒక లోతైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు ఊహించుకోండి.
  • మీ కోసం మీరు పనిచేయడం మిమ్మల్ని ఈ నిరాశ నుంచి ఎలా రక్షిస్తుందో ఆలోచించండి. మీరు ఇతరులతో పంచుకోగల అద్భుతమైన బహుమతి ఇదే అవుతుంది.
  • మీ జీవితంలో అలాంటి దారిని వేసుకోవాలని నిశ్చయించుకోండి.
  • కానీ ఇప్పుడు మీరు ఆ కొండపై నుండి పడిపోయే అంచున ఉన్నారని ఊహించుకోండి.
  • కానీ మీరు ఆ కొండకు కొంచెం దూరంలో ఉన్నారు, కానీ మెల్లగా దానికి దగ్గరవుతున్నారని ఊహించుకోండి.

సారాంశం

మన జీవితాలు రొటీన్ గా, బోరింగ్ గా, అర్థరహితంగా అనిపించినప్పుడు, మనం చురుకుగా ఉండటం నేర్చుకోవాలి. మన జీవితాల్లో మనకు మాత్రమే కాకుండా ఇతరులకు అర్థవంతమైన రీతిలో దిశానిర్దేశం చేయాలి. మన లోపాలను అధిగమించడానికి మరియు మన సానుకూల సామర్థ్యాన్ని గ్రహించడానికి పనిచెయ్యడమే సరైన దారి. దీనిని పూర్తిగా సాధించినా సాధించ లేకపోయినా, మన అంతిమ లక్ష్యం బుద్ధులు చేసినట్లుగా - ఈ ప్రయాణం చేస్తూ మన జీవన నాణ్యతను బాగా మెరుగుపరుచుకోవడమే.

Top