వివరణ
మరణం అనేది చాలా మంది ఆలోచించడానికి ఇష్టపడని ఒక టాపిక్. కానీ మరణం అనేది ఒక జీవిత సత్యం మరియు దీనిని ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు ముందు ఏమి జరుగుతుందో అనే దానికి మనల్ని మనం సిద్ధం చేసుకోకపోతే, మనం చాలా భయంతో, పశ్చాత్తాపంతో చనిపోబోతాం. కాబట్టి, మరణ ధ్యానం అనేది మనకు చాలా సహాయం చేస్తుంది మరియు ముఖ్యమైనది.
మనకు ఒక ప్రాణాంతకమైన నయం కానీ వ్యాధి ఉందని తెలిస్తే అప్పుడు మనం ఎలా ఉంటామో అని ఊహిస్తూ ఈ మరణం గురించి మనం అనేక ధ్యానాలు చేసుకోవచ్చు. ఈ క్రింది ధ్యానం అనేది ఒక ప్రామాణికమైనది. ఇది మన ఆలోచనలను మరియు ప్రవర్తనను మెరుగుపరచడానికి మనకు సహాయపడుతుంది. ఇప్పుడు మనకు ఇలాంటి ధ్యానం చేయడానికి చాలా అవకాశం ఉంది. ఈ ధ్యానంలో, శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉన్న తర్వాత, మనం ఈ క్రింది విషయాల గురించి ఆలోచిస్తాము:
ధ్యానం
మరణం అనివార్యమైనది, ఎందుకంటే:
- మరణం వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అది మనకు జరగకుండా ఏ శక్తి ఆపలేదు - చరిత్ర అంతటా జన్మించిన ఏ మనిషి కూడా ఈ మరణం నుంచి తప్పించుకోలేదు, కాబట్టి మనం చనిపోకుండా ఉండటానికి మనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
- మనం మరణించే సమయం వచ్చినప్పుడు, జీవించడానికి మిగిలి ఉన్న ఆయుష్షు నిరంతరం తగ్గుతున్నప్పుడు మన జీవితకాలం ఇంక పెరగదు - మన జీవితంలోని ప్రతి క్షణంలో మనం వృద్ధులై మరణానికి దగ్గరవుతున్నట్టు, చిన్నవాళ్లుగా ఇంక మనం ఉందనట్టు, మరణానికి కూడా దూరంగా ఏమీ లేము అని తెలియజేస్తుంది. ఇది ఎలా ఉంది అంటే కదులుతున్న ఒక కన్వేయర్ బెల్టు మీద ఉండి, ఆగకుండా, మన అనివార్య మరణం వైపు వెళ్తున్నట్లు.
- మనశ్శాంతితో, పశ్చాత్తాపం లేకుండా చనిపోవడానికి వీలు కల్పించే పనులు చెయ్యడానికి మనకు జీవించి ఉన్నప్పుడు సమయం లేకపోయినా మనం చనిపోతాం - అకస్మాత్తుగా గుండెపోటు లేదా కారు ప్రమాదం వంటి వాటి నుంచి కూడా మనకు మరణం అనేది అకస్మాత్తుగా సంభవించవచ్చు.
మనం ఎప్పుడు చనిపోతామో ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే:
- మాములుగా, మన జీవితకాలం గురించి మనకు ఏమీ తెలీదు - చనిపోవడానికి మనం ముసలి వాళ్లం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు.
- చనిపోవటానికి అవకాశాలు ఎక్కువ మరియు బతికి ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి - గ్లోబల్ వార్మింగ్ తో, ప్రకృతి వైపరీత్యాలు మరియు మహమ్మారి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి; బాగా క్షీణిస్తున్న సహజ వనరులు, ఆర్థిక అసమానతలతో హింస బాగా పెరిగిపోతోంది. నిస్సహాయతా భావాలు పెరగడంతో, మాదకద్రవ్యాల అధిక మోతాదుల వాడుక కూడా ఎక్కువయ్యింది. ఇవన్నీ మనం చనిపోవటానికి కారణాలు కావచ్చు.
- మన శరీరాలు చాలా మృదువుగా ఉన్నాయి - చిన్న అనారోగ్యం లేదా ప్రమాదం వస్తే అదే మన మరణానికి కారణం కావచ్చు.
మన ఆలోచనలను మరియు ప్రవర్తనను మెరుగుపరచడానికి పనిచేసే నివారణ చర్యలు తీసుకోవడం మినహా, మనశ్శాంతితో మరియు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చనిపోవడానికి ఇంకేమీ సహాయపడదు. ఇప్పుడు మనకు మరణం ఎదురైతే:
- మన డబ్బుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు – మన డబ్బు కేవలం ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద ఉండే ఒక సంఖ్యలాగా మిగిలిపోతుంది.
- స్నేహితులు మరియు బంధువులు ఎటువంటి సహాయం చెయ్యరు - మనం వాళ్ళందరిని విడిచిపెట్టాల్సి వస్తుంది. వాళ్లు అలాగే మన దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు, మనల్ని చాలా బాధ పెడుతూ
- మన శరీరం కూడా మనకు ఏ సహాయ౦ చెయ్యదు - ఆ అదనపు కిలోలు లేదా పౌండ్లను కోల్పోయి మనం ఇంక ఎంత ఓదార్పును పొ౦దగలం?
అందుకని, భయం మరియు పశ్చాత్తాపంతో మన మరణాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం మాత్రమే జీవితంలో అర్థవంతమైనది అని మనం నిర్ణయించుకుంటాము.
సారాంశం
మరణం యొక్క అనివార్యత గురించి తెలుసుకోవడం అనేది మనల్ని నిరాశకు గురిచేయడానికి లేదా భయాలతో నింపెయ్యడానికి కాదు. ఈ జన్మలో మనకు ఉన్న సమయం పరిమితమని, అది ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరని తెలుసుకున్నప్పుడు, మనకు ఇప్పుడు ఉన్న అవకాశాలను మరియు సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రేరణ లాగా ఉంటుంది. మరణం గురించి తెలుసుకోవడం మనకు భవిష్యత్తులో సరైన నిర్ణయాలను తీసుకోవటానికి అడ్డుపడే వాటిని ఈ సోమరితనం మరియు కాలయాపనను ఆపకుండా మనకు సహాయపడుతుంది.