కరుణను అనుభూతి చెందడం

మన సమస్యల నుంచి, మరియు వాటి కారణాల నుంచి మనం విముక్తి పొందాలని గట్టిగా నిశ్చయించుకున్నాక, మన ఆందోళనను ఇతరులకు ఇచ్చేసి, కరుణతో, వారు కూడా స్వేచ్ఛగా ఉండాలనే కోరికను పెంపొందించుకుంటాం.
Meditation feeling compassion

వివరణ

మనం ఒక శ్రద్ధ గల, నిజమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించుకున్నాక, తర్వాతి దశ ఇతరుల పట్ల కరుణను పెంపొందించుకోవడం. కరుణ అనేది ఇతరులను జాలితో చూడటం కాదు, ఇది సహానుభూతిపై ఆధారపడి ఉంటుంది - ఇతరులు ఏమి భావిస్తారో మనం కూడా అలాగే అనుభూతి చెందడం. కరుణ అంటే ఇతరులు వాళ్ళ బాధల నుండి విముక్తి పొంది వారి జీవితంలోని అన్ని కష్టాల నుంచి బయట పడాలని మనం కోరుకోవడం. ఇది కేవలం ఊహించుకోవడం మాత్రమే కాదు, అది నిరాశాజనకమని తెలుసుకోవడం; కానీ నిజంగా వాళ్ళు తమ సమస్యల నుంచి విముక్తి పొందడం సాధ్యమే అనే విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కరుణలో సహాయం చేయడానికి సుముఖత మరియు మనకు చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉంటుంది. ఇది పాసివ్ గా మాత్రమే ఉండదు. అవసరమైతే శారీరకంగానో, భౌతికంగానో మనం సహాయం చేస్తాం, లేదా మానసికంగా ఇతరులు వారి సమస్యలను అధిగమించడానికి అవసరమైన మానసిక స్థితిని సృష్టించి దాన్ని వారికి పంపాలని మనం భావిస్తాము.

ధ్యానం

  • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
  • భూకంపంలో మీ ఇల్లు మరియు మీ ఆస్తులన్నింటినీ కోల్పోయినట్టు ఊహించుకుని ఇంక మీరు బయటే పడుకోవాలి, ఆహారం మరియు నీరు కోసం కష్టపడాలి, మరియు మీ జీవితాన్ని పునర్నిర్మించడానికి మీ దగ్గర డబ్బు ఏమీ లేదు అని అనుకోండి. అప్పుడు మీరు పూర్తిగా దుఃఖంలో ఉండి నిరాశకు గురవుతారు. 
  • మీరు ఈ పరిస్థితి నుంచి ఎలా విముక్తి పొందాలనుకుంటున్నారో ఊహించుకుని మీ అసంతృప్తికి కారణం అయిన మీ నిరాశను గ్రహించండి, అప్పుడు ఈ నిరాశ నుంచి విముక్తి పొందడానికి మరియు పునర్నిర్మాణానికి మార్గాలను కనుగొనాలని నిశ్చయించుకోండి.
  • అదే పరిస్థితిలో ఉన్న మీ తల్లిని ఊహించుకుని ఆమె స్వేచ్ఛగా ఉండటానికి మరియు కరుణను పెంపొందించడానికి సంకల్పాన్ని కలిగి ఉండండి - తను ఇలాంటి పరిస్థితి నుంచి విముక్తి పొందాలనే సంకల్పం లాగా.
  • తనకు ఉన్న ఆశను వదులుకోవద్దని, మళ్ళీ మనం బాగుపడతాం అనే ధైర్యం, మరియు శక్తి ఉండాలని కోరుకోండి.
  • ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్న లక్షలాది మంది నేపాలీల గురించి కూడా ఇలాగే ఊహించుకుని వారి పట్ల కరుణను పెంపొందించుకోండి.
  • భావోద్వేగ అసమతుల్యత కోసం కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. మీరు మానసికంగా అసమతుల్యతలో ఉన్న సమయాన్ని గుర్తుతెచ్చుకుని ఒక ప్రశాంతమైన, స్పష్టమైన మనస్సును అభివృద్ధి చేసుకోవడంతో మీరు భావోద్వేగ సమతుల్యతను పొందవచ్చని గ్రహించండి.
  • ఆ తర్వాత దీన్ని మీ తల్లికి, ఆపై మిగతా వాళ్లందరికి వర్తించేలా చెయ్యండి.

సారాంశం

మనం ఎలాగైతే సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ అసంతృప్తిగా ఉండకూడదని అనుకుంటామో, మిగతా వాళ్ళు కూడా వారి విషయంలో అలాగే అనుకుంటారు. మనలాగే ప్రతి ఒక్కరూ తమ బాధలు, సమస్యల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారు. వారి పట్ల కరుణను పెంపొందించుకోవడానికి - వారి బాధల నుంచి వారు విముక్తి పొందాలనే కోరికను - ముందుగా మన స్వంత సమస్యలను గుర్తించి వాటిని ఎదుర్కుని వాళ్ళ సమస్యల నుంచి కూడా విముక్తి పొందాలనే బలమైన కోరికను పెంపొందించుకోవాలి. మన బాధలను మనమే పరిష్కరించుకోవాలనే సంకల్పం ఎంత బలంగా ఉంటే, ఇతరుల బాధలను మనం అంతగా అర్థం చేసుకుని వారి బాధలను అధిగమించడానికి వారికి సహాయపడాలనే సంకల్పాన్ని బాగా పెంపొందించుకోగలుగుతాము. ఆ సంకల్పాన్నే మనం "కరుణ" అని పిలుస్తాము.

Top