క్లిష్టమైన సంబంధాలతో వ్యవహరించడం

మన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, ఇబ్బందులకు కారణమవుతున్న అవాస్తవిక అంచనాలను తొలగించుకుని ఒక శ్రద్ధతో కూడిన ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలి.
Meditation difficult relationships nik shuliahin unsplash

వివరణ

బౌద్ధమత ధ్యానం సమస్యలను అధిగమించడంపై దృష్టి పెడుతుంది. అందుకే బుద్ధుడు నాలుగు గొప్ప సత్యాలను బోధించి సమస్యలను మెరుగ్గా ఎదుర్కోవడానికి మనకు సహాయం చేశాడు. మనందరి జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. కొన్ని మిగతా వాటి కన్నా తీవ్రంగా ఉంటాయి. కానీ మనలో చాలా మంది వాటిని ఎదుర్కొనేటప్పుడు అది ఇతరులతో మన సంబంధాల గురించి ఉంటుంది.

అందులోని కొన్ని సంబంధాలు చాలా కష్టమైనవిగా మరియు సవాళ్లతో కూడి ఉంటాయి. కానీ వాటిని మనం మెరుగ్గా నిర్వహించగలమని బుద్ధుడు మనకు బోధించాడు. ఈ సమస్యలకు కారణాలను కనిపెట్టడానికి మన లోపలే మనం వాటిని వెతుక్కోవాలి. ఎందుకంటే, మన సమస్యలకు ఇతరులు ఎంత బలంగా దోహదపడుతున్నప్పటికీ, మనం వాటికి ఎలా స్పందిస్తామనే దానిపై మనం నిజంగా నియంత్రణ చేసుకోగలం. అంటే మన వైఖరి, మరియు ప్రవర్తన రెండింటి లోనూ మనం ఎలా స్పందిస్తాం అని.

మన ప్రవర్తన మన వైఖరి బట్టి మారుతుంది కాబట్టి, మన ఆలోచనలను మెరుగు పరుచుకోవడంపై మనం దృష్టి పెట్టాలి. సమస్యాత్మకమైన విషయాల స్థానంలో వాస్తవికత మరియు కరుణపై ఆధారపడిన వాటిని ఉంచితే, అప్పుడు మనం కష్టమైన సంబంధాల నుంచి వచ్చే బాధలను పూర్తిగా తొలగించకపోయినా కొంత వరకు తగ్గించుకోగలము.

ధ్యానం

 • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
 • ముందుగా ఉత్తమ సత్యానికి, నిజమైన బాధలకు ఉదాహరణగా మీతో కష్టాలను పంచుకున్న వ్యక్తిని గమనించండి.
 • చిరాకు అనే భావనను తొలగించుకోండి.
 • రెండో ఉత్తమ సత్యానికి ఉదాహరణగా, బాధకు నిజమైన కారణాలను పరిశీలి౦చ౦డి. వాళ్లతో ఉండటం మనకు కష్టంగా అనిపించవచ్చు, లేదా వాళ్ళ గురించి మనకు ఏదైనా నచ్చకపోవడం లేదా వారితో ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు.
 • మనం మరింత లోతుగా ఆలోచించినప్పుడు, మనం వారిని ఆ అంశంతో మాత్రమే గుర్తిస్తాము మరియు వాస్తవానికి వారి జీవితంలో చాలా మంది ఉండి మనతో పాటు వారిని ప్రభావితం చేసే ఇతర విషయాలు ఉన్న ఒక మనిషిగా పరిగణించకుండా, వాళ్ళు కూడా మనలాగే భావాలను కలిగి ఉండి మనలాగే ఇష్టపడాలని కోరుకుంటాం.
 • ప్రతి ఒక్కరూ తమ పట్ల అలానే భావించరు, కాబట్టి వారితో కలిసి ఉండటం వల్ల వచ్చే చిరాకు మరియు అసౌకర్య భావనను మూడవ ఉత్తమ సత్యానికి ఉదాహరణగా చెప్పొచ్చు.
 • అలాంటి ఇబ్బందిని వదిలించుకోవడానికి, నాలుగవ ఉత్తమ సత్యానికి ఉదాహరణగా, సరైన అవగాహన యొక్క నిజమైన మార్గాన్ని మనం గ్రహించాలి, వాళ్ళు నిజంగా చికాకు కలిగించే వ్యక్తిలా ఉంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ నుంచి చికాకునే అనుభూతి చెందుతారు. కానీ అది అసాధ్యం.
 • వాళ్ళు నిజంగా చిరాకు పెట్టె వ్యక్తులు అనే ఆలోచనను మనం తీసివేస్తాము.
 • అప్పుడు మనం వాళ్లను మంచి వ్యక్తులుగా చూస్తాము. వాళ్ళు మనకు చిరాకు కలిగించే వ్యక్తులుగా కనిపిస్తారు, కానీ అది ఒక భ్రమ మాత్రమే.
 • అప్పుడు మనం వారి పట్ల శ్రద్ధగా ఆలోచిస్తాము - వాళ్ళు కూడా మనుషులే మరియు అందరి లాగే వాళ్లని కూడా అందరూ ఇష్టపడాలని మరియు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ వ్యక్తి నన్ను ఒక దోమను చూసినట్టు చూసి ప్రవర్తించడం నాకు ఇష్టం లేనట్లే - ఇది నా భావాలను ప్రభావితం చేస్తుంది - అలాగే, వాళ్ళు కూడా ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడరు ఎందుకంటే ఇది వారి భావాలను ప్రభావితం చేస్తుంది.
 • శ్రద్ధను చూపించే వ్యక్తిని మనం గౌరవించాలి.

సారాంశం

క్లిష్టమైన వ్యక్తులతో వ్యవహరించడానికి, మనం ముందుగా వారిని కలిసినప్పుడు లేదా అవకాశం ఉంటే వారిని కలవక ముందు నుంచే ప్రశాంతంగా ఉండాలి. ఆ తర్వాత మనం వారితో ఉన్నప్పుడు, వారిని కూడా మనలాగే సమాన మనుషులుగా చూడాలి, మరియు శ్రద్ధతో వాళ్లను పట్టించుకోవాలి. అటువంటి ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవడానికి అడ్డు పడేవి వారి జీవిత వాస్తవికత కాదు. మన అంచనాలను తొలగించి, వాళ్లను రియాలిటీకి దగ్గరగా మరియు శ్రద్ధగా పట్టించుకుంటే, మనం వాళ్లని విజయవంతంగా ఎదుర్కోగలుగుతాము.

Top