శ్రద్ధను పెంపొందించుకోవడం

ఇతరులను మనుషులుగా భావించి, మనలాగే వాళ్లకు కూడా భావాలు ఉన్నాయని తెలుసుకుంటే, మన ప్రవర్తన మరియు మాట్లాడే పద్ధతులు వాళ్ళను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై శ్రద్ధ వహిస్తాము.
Meditation generating care matheus ferrero

వివరణ

ఎలాంటి రకమైన ధ్యానం చేసినా, మనకు అవసరమైన శ్వాసపై దృష్టి పెట్టి మన మనస్సులను శాంత పరచుకున్న తర్వాత, మనం ఒక సానుకూల, నిర్మాణాత్మక మానసిక స్థితిని సృష్టించుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇతరులతో సంబంధాలను పెంపొందించుకోవడానికి, వారి పట్ల మనకు చిత్తశుద్ధితో కూడిన శ్రద్ధ మరియు జాగ్రత్త చాలా ముఖ్యం. అంటే వారిని మనుషులుగా, మనలాగే భావాలున్న వ్యక్తులుగా సీరియస్ గా తీసుకోవడం. ఏదేమైనా, మనం బిజీగా ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదో ఒక విధంగా పనిలో నిమగ్నమైనప్పుడు ఈ నిజాన్ని మర్చిపోయి పట్టించుకోకుండా ఉండడం జరగవచ్చు. కానీ మనపై, మన సమస్యలపై, భావాలపై ఎంత ఎక్కువగా ఆలోచిస్తే మనం అంత అసంతృప్తికి గురవుతాం. మన చుట్టూ ఉన్న విస్తృత వాస్తవికతతో మనకు సంబంధం తెగిపోతుంది.

మనుషులుగా మనం ఒక రకమైన సామాజిక జంతువులం; మనమందరం మన సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం ఒకరిపై ఒకరు ఆధారపడతాము. మనం వారితో సంబంధాలను పెంపొందించుకోవాలి. కాబట్టి, ఇతరులతో వాస్తవికంగా మరియు ఆరోగ్యకరమైన రీతిలో సంభాషించడానికి, వారి సంక్షేమం మరియు శ్రేయస్సు గురించి మనం నిజాయితీగా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా, వారి పరిస్థితుల వాస్తవికత మరియు వారి భావాల గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి, ముఖ్యంగా మనం వారితో మాట్లాడే తీరు సరిగ్గా ఉండాలి. 

మనం ఎవరినైనా కలిసినప్పుడు, మనం ఇంతకు ముందు అనుభవించిన విషయాలు మనల్ని ఎలా ప్రభావితం చేశాయో, వారి విషయంలో కూడా అలాగే ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. మనం వారిని కలిసినప్పుడు వాళ్లకి వాళ్ళే బయటపడరు. వారు ఉన్న మానసిక స్థితి మన వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది, అలాగే వాళ్లకు కూడా అలాగే జరుగుతుంది. ఇందులోని సత్యాన్ని, వాస్తవికతను మనం పట్టించుకోకపోతే, మనకు, వారికి సంబంధించి, మనం కోరుకున్న సంబంధాలు దాని కంటే చాలా భిన్నంగా మారిపోతాయి. దానికి తోడుగా, మనం వారితో ఎలా మాట్లాడతాము మరియు వారితో ఎలా ప్రవర్తిస్తాము అనేది వారి హావ భావాలను ప్రభావితం చేస్తుంది. అంటే ఎలాగైతే వారు మనతో మాట్లాడే మరియు మనతో వ్యవహరించే విధానం మనపై ప్రభావం చూపుతుందో. 

మనం ఈ నిజాలను గుర్తు చేసుకున్నప్పుడు మరియు ఇతరులతో తగినట్లుగా ఉన్నప్పుడల్లా - స్నేహితులు, అపరిచితులు లేదా మనకు నచ్చని వ్యక్తులు అయినా - సంబంధాలు మనకు మరియు వారికి బాగా ఉపయోగకరంగా మరియు సంతృప్తికరంగా ఉంటాయి.

ధ్యానం

  • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
  • ప్రశాంతమైన మనస్సుతో, జడ్జిమెంటల్ గా ఉండకుండా, మీకు సన్నిహితంగా అనిపించే మరియు ఎవరితో ఉంటే బాగుంటుందో ఆ వ్యక్తి గురించి ఆలోచించండి.
  • మీరు ఒక మనిషి అని మరియు మీకు భావాలు ఉన్నాయనే అవగాహనతో ఉండండి,
  • నాలాగే ఉండండి.
  • మీరు ఉన్న మానసిక స్థితి మన సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది,
  • నా మానసిక స్థితి ఎలాగైతే ప్రభావితం అవుతుందో
  • నేను మీతో ఎలా ప్రవర్తిస్తానో మరియు నేను ఏదైతే చెప్తానో అది మీ భావాలను బాగా ప్రభావితం చేస్తుంది. 
  • అలా, మన సంబంధంలో మీరు నా గురించి మరియు నా భావాల గురించి శ్రద్ధ వహిస్తారని నేను అనుకుంటాను, నేను మీ గురించి మరియు మీ ఫీలింగ్స్ గురించి శ్రద్ధ వహిస్తాను. 
  • పరిచయస్తుడు లేదా తెలియని వాళ్ళ మీద, మీకు ప్రత్యేకమైన భావాలు లేని వ్యక్తి, సినిమా థియేటర్ లో టికెట్ ఇచ్చే వ్యక్తి వంటి వాళ్లపై దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ తిరిగి చెయ్యండి. 
  • మీకు నచ్చని మరియు అసౌకర్యంగా అనిపించే వ్యక్తిపై కూడా ఇలాగే చెయ్యండి.

సారాంశం

ఈ ధ్యానం అనేక అనువర్తనాలను కలిగి ఉంటుంది మరియు దీన్ని బాగా విస్తరించవచ్చు. పైన పేర్కొన్న మూడు కేటగిరీల్లో వివిధ వయసులు, వేర్వేరు లింగాలు, విభిన్న జాతులు మొదలైన వారిపై కూడా మనం ఇలా ప్రయత్నించవచ్చు. ఈ ధ్యానాన్ని మన మీద కూడా కేంద్రీకరించవచ్చు. మనం కూడా మనుషులమే, మనకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. మనల్ని మనం చూసుకునే విధానం మరియు మన మనస్సులో మాట్లాడుకునే విధానం మన భావాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా మన పట్ల కూడా శ్రద్ధా భావాన్ని పెంపొందించుకుంటాం.

Top