వివరణ
ధ్యానం అనేది ఒక అలవాటుగా చేసుకుని మంచి అలవాట్లను నిర్మించుకునే ఒక పద్ధతి. ఒక కొత్త నాడీ మార్గాన్ని రూపొందించడం మరియు పాత దాన్ని వదిలించుకోవడం లాంటిది. ఇలా చెయ్యడానికి, ఒక ప్రయోజనకరమైన అవగాహన మరియు ఆలోచనలను సృష్టించడానికి మరియు మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ముందుగా మన మనస్సులను శాంత పరుచుకోవడం అవసరం. మనకు మనమే ప్రశాంతంగా ఉండటమే ఒక ప్రయోజనకరమైన అలవాటు. కానీ ఇది ఒక ప్రస్తుత మానసిక స్థితి లాగా ఉంటుంది. ఇది నిర్మాణాత్మక లేదా విధ్వంసక ఆలోచనలను సృష్టించడానికి ఆధారం అవ్వొచ్చు. ఈ ప్రశాంత స్థితిని ఒక నిర్మాణాత్మక మానసిక స్థితిని సృష్టించుకోవడానికి ఒక అవకాశంగా దీనిని ఉపయోగించుకోవచ్చు, అందుకోసం ఇది ఒక అనివార్యమైన సన్నాహక చర్య.
ప్రశాంతంగా ఉండటం జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను సులభంగా ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. తరచుగా, వాటిని ఎదుర్కోకుండా మనల్ని నిరోధించటానికి కారణం మన మనస్సులు అస్పష్టంగా ఉండటమే; అలసట మరియు ఒత్తిడి కారణంగా వాళ్ళు మానసిక కదలికలతో నిండి ఉండటం. ఉదాహరణకు, మనం పనిలో సుదీర్ఘమైన, ఒక కష్టమైన రోజును గడిపాము; బయలుదేరడానికి ఇంకా మనకు ఒక గంట ఉన్నా కానీ ఇంకా చాలా పని మిగిలి ఉంటుంది. మన శ్వాసపై దృష్టి పెట్టడం మనకు ప్రశాంతతను తెచ్చిపెడుతుంది. అలా మనం ఈ పరిస్థితులను స్పష్టమైన మానసిక స్థితితో ఎదుర్కోగలము.
ధ్యానం
- నిటారుగా కూర్చోండి, మీ చేతులను మీ ఒడిలో ఉంచుకోండి, మీ కళ్ళు సగం తెరిచి, మీ దంతాలు బిగించకుండా నేల వైపు చూడండి.
- మీ శరీరంలోని టెన్షన్ ని తీసెయ్యండి, ముఖ్యంగా మీ భుజాలు, నోరు మరియు నుదిటివి. మన శరీరంలోని టెన్షన్ పోతే తప్ప మన మనసును శాంతపరుచుకోలేం.
- ముక్కు నుంచి మామూలుగానే గాలిని పీల్చుకోండి.
- మీ మనస్సులో, 11 సార్లు శ్వాసను లెక్కించండి, మీ నాసికా రంధ్రాలలో నుంచి వచ్చే మరియు బయటకు వెళ్లే శ్వాస యొక్క అనుభూతిపై దృష్టి పెట్టండి.
- శ్వాసను లెక్కిస్తూ దానిని అనుభూతి చెందండి (మానసికంగా బలంగా ఆలోచించండి).
- నీరసం వల్ల మీరు మీ దృష్టిని కోల్పోయినప్పుడు దానిని గుర్తించడానికి అప్రమత్తంగా ఉండండి.
- మీ దృష్టి ఎటో వెళ్లిపోయిందని మీకు అనిపించినప్పుడు, శ్వాసను లెక్కించే దానిపై మీ దృష్టిని తిరిగి తీసుకురండి.
- మీ మనసు ఎటైనా వెళ్తున్నట్లు మీరు గమనిస్తే, మెల్లగా ఆ ఆలోచనను వదిలెయ్యండి, మీరు శ్వాసను వదులుతున్నప్పుడు అది మీ మనస్సు నుంచి బయటకు వెళ్తున్నట్లు ఊహించుకుని శ్వాసను లెక్కించటం మీద మీ దృష్టిని మళ్లించండి.
- మళ్లీ మీ భుజాలు మరియు మీ ముఖం బిగుసుకుపోతే, వాటికి మరోసారి విశ్రాంతిని ఇవ్వండి.
- చివరికి, ధ్యానం నుండి పరివర్తనగా, మళ్ళీ ప్రశాంతమైన మనస్సుతో నిశబ్ధంగా ఉండండి.
సారాంశం
మనం అలసిపోయినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు మరియు కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి మనస్సులో స్పష్టత మరియు భావోద్వేగ సమతుల్యత అవసరమైనప్పుడు, మనం ప్రశాంతంగా ఉండాలి. అలా మనం మన మానసిక మరియు భావోద్వేగ ప్రశాంతతను తిరిగి పొందాలి. కంప్యూటర్ లాగా మన మనసులను రీబూట్ చేసుకోవాలి. ఇలా చెయ్యడానికి, మనం మన శరీరాలను రిలాక్స్ చేసుకుని శ్వాసపై దృష్టి పెట్టాలి. ఇంట్లో ఈ ధ్యాన పద్ధతిని అభ్యసించడం ద్వారా, మన నాడీ మార్గానికి ఒక అలవాటును ఏర్పరుస్తుంది, అలా మనకు రోజువారీ జీవితంలో అవసరమైనప్పుడు ఈ పద్ధతిని వాడటం మరియు కొనసాగించడం చాలా సులభం అవుతుంది.