ధ్యానం
ఆర్టికల్ 1 యొక్క 13
తర్వాతది Arrow right

మార్గదర్శక ధ్యానాన్ని ఎలా ఉపయోగించాలి

ఈ మార్గదర్శక ధ్యానాలను అనుసరించడం ద్వారా, మనం మంచి ప్రయోజనకరమైన అలవాట్లను పెంపొందించుకోవచ్చు.
Meditatation how to use the guided meditations

లక్ష్యం - టిబెటన్ బౌద్ధమత సంప్రదాయంలో ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోండి; దాన్ని ఎలా చెయ్యాలో నేర్చుకోండి; మరియు దాని శిక్షణలో గైడెన్స్ ను పొందండి.

ఎవరెవరు చేయవచ్చు - అన్ని స్థాయిలు, మరియు వయస్సుల వారు.

ప్రాసెస్

  • వివరణ (సమస్య, కారణం, ఉదాహరణ, పద్ధతి)
  • ధ్యానం (కీలక పదాలతో మార్గ నిర్దేశం) 
  • సారాంశం 

ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి - నిశ్శబ్దంగా, శుభ్రంగా మరియు ఇబ్బంది లేని ఏ ప్రదేశంలో అయినా

ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి - మీరు రోజూ చేసే పనిని మొదలుపెట్టే ముందు ఉదయం పూట. అప్పుడు కుదరకపోతే, ఆ రోజు చివరిలో, నిద్రపోయే ముందు.

ఎలా కూర్చోవాలి - చాలా ఎత్తుగా, పొట్టిగా, మృదువుగా లేదా గట్టిగా లేని ఒక దిండుని మీ వెనుక భాగంలో ఉంచుకుని కాళ్లను మడత పెట్టి కూర్చోండి. అలా వీలు కాకపోతే ఒక స్ట్రెయిట్ బ్యాక్ కుర్చీలో కూర్చోండి. ఈ రెండు సందర్భాల్లో, మీ వీపుని నిటారుగా ఉంచి మీ చేతులను మీ ఒడిలో ఉంచుకోండి. మీ కళ్లను సగం తెరిచి ఉంచి, వదులుగా ఉండి దృష్టి కేంద్రీకరించి, నేల వైపు చూడండి.

ఎంత తరచుగా ధ్యానం చేయాలి - రోజుకు కనీసం ఒకసారి, వీలైతే రెండుసార్లు (ఉదయం పనికి వెళ్లే ముందు మరియు రాత్రి నిద్రపోయే ముందు), ప్రతి రోజు కనీసం ఒక వారం పాటు ఈ మార్గదర్శక ధ్యానం చెయ్యాలి, వెబ్‌సైట్లో లిస్ట్ చేయబడిన క్రమాన్ని అనుసరించి చెయ్యాలి. ఏ సమయంలోనైనా, మీకు అవసరం అనిపించినప్పుడు మీరు ఇంతకుముందు చేసిన ధ్యానాన్ని మళ్ళీ చేసుకోవచ్చు.

Top