మన జీవిత నాణ్యతను మెరుగుపరచుకోవడానికి మన గురించి మనం పని చేసుకోవడానికి మనందరికీ ఉన్న స్వేచ్ఛ మరియు అవకాశాలను ప్రశంసించడం నేర్చుకోవాలి.
Meditations appreciating life

వివరణ

కొన్నిసార్లు మన గురించి మనమే సారీ ఫీల్ అవుతూ ఉంటాం. ముఖ్యంగా చిన్న చిన్న విషయాల కోసం. అవి ఎలాంటివి అంటే ఏదైనా రెస్టారెంట్ లో మనం ఆర్డర్ చేయాలనుకున్న ఐటెమ్ అయిపోయినప్పుడు, లేదా మనం కోరుకున్న సమయం లేదా తేదీలో విమానం లేదా రైలుకు రిజర్వేషన్ దొరకనప్పుడు, లేదా జలుబు రావడం వల్ల మనం కోరుకున్నప్పుడు స్విమ్మింగ్ కు వెళ్లలేకపోయినప్పుడు మరియు ఇతర చిన్న విషయాలకు. కానీ మన జీవితాలను మనం అర్థవంతంగా చూసుకున్నప్పుడు, మనం చాలా అదృష్టవంతులమని గ్రహిస్తాము. నిర్మాణాత్మకమైన లేదా విలువైన పనులు ఏవైనా చేయగల మన సామర్థ్యానికి అడ్డు వచ్చే అధ్వానమైన పరిస్థితుల నుంచి మనం విముక్తి పొందుతాము. దానికి తోడుగా, మన జీవితంలోని పరిస్థితులను అర్ధం చేసుకుని వాటిని మెరుగుపరచుకోవడానికి బౌద్ధమత బోధనల గురించి తెలుసుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి.  

2015 భూకంపం తర్వాత నేపాల్ వంటి విపత్తు ప్రాంతంలో ఉన్నప్పుడు, కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు, యుద్ధ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక అభ్యాసం చట్టానికి విరుద్ధంగా లేదా అందుబాటులో లేనప్పుడు, హింసాత్మక నేరస్థులతో జైలులో బంధించబడినప్పుడు, యుద్ధ ప్రాంతంలో సైన్యంలో పోరాడాల్సి వస్తే ఈ సందర్భాలలో బౌద్ధమత బోధనలు, పద్ధతులు నేర్చుకుని వాటిని ఆచరణలోకి ఎలా పెట్టగలం? లేదా మనం శారీరకంగా, మానసికంగా లేదా భావోద్వేగ వైకల్యంతో ఉన్నప్పుడు, ఇలా చెయ్యటం కుదరచ్చు, కానీ చాలా కష్టం అనే చెప్పాలి. లేదా మనం చాలా ధనవంతులం అయి, మనం అసలు ఎప్పుడూ పని చేయవలసిన అవసరం లేకుండా మన జీవితమంతా పార్టీలు మరియు వినోదాలతో నిండి ఉంటే, అప్పుడు మనకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎలా ఉంటుందా? లేదా ఆధ్యాత్మిక సాధన పట్ల మనం పూర్తిగా ఏమీ ఎరగనట్టు, విరోధులుగా ఉన్నామా?

మనకు ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ బోధనల అనువాదాలు కూడా వచ్చాయి, అవి పుస్తకాల రూపంలో మరియు ఇంటర్నెట్ లో లభిస్తాయి, రచయితలు అందులో వారి ప్రచురణలను అందించారు, వీటిని బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు, మనం నేర్చుకోగల కేంద్రాలు ఉన్నాయి మరియు ప్రజలు వాటిని నేర్చుకుని మంచి తెలివితేటలను పెంపొందించుకోవటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 

మనం ఈ ప్రస్తుత జీవితం యొక్క అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి విముక్తి పొంది మనకు ఉన్న ఈ అవకాశాలతో మన జీవితాలు సుసంపన్నం చేసుకోగలం అనే ఈ నిజాన్ని మనం తెలుసుకోగలగాలి. మనం ఈ అమూల్యమైన జీవితాన్ని ఆనందించి దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.

ధ్యానం

  • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
  • భూకంపం వస్తున్న సమయంలో మీరు నేపాల్ పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తున్నట్లు ఊహించుకోండి, అక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళడానికి కానీ ఎలాంటి ఆహారం తినటానికి గానీ అవకాశం లేదని ఊహించుకోండి. 
  • అప్పుడు మీరు ఎయిర్ లిఫ్ట్ చేయబడి ఇంటికి తిరిగి పంపించబడ్డారని ఊహించుకోండి. 
  • ఆ భయానక పరిస్థితి ను౦చి బయటపడినందుకు మీరు ఎ౦త సంతోషిస్తారో ఊహించుకోండి. 
  • ఆ స్వేచ్ఛలో మునిగి తేలండి.
  • సిరియాలో ఉన్నప్పుడు ఒక ఇస్లామిక్ స్టేట్ మీ నగరాన్ని చుట్టుముట్టినట్లు ఊహించుకోండి, మరియు మీకు అక్కడి నుంచి బయటపడటానికి మార్గం లేదని అనుకోండి.         
  • అప్పుడు ఆ పరిస్థితి నుంచి బయట పడినట్టు ఊహించుకోండి.
  • ఆనందించండి.
  • రాత్రింబవళ్లు హింసాత్మకంగా, మిమ్మల్ని బెదిరిస్తున్న కఠినమైన జైలు ముఠా సభ్యులతో జైలులో బంధించబడి ఉన్నట్టు ఊహించుకోండి.
  • అప్పుడు జైలు నుంచి విడుదల అయినట్టు ఊహించుకోండి.
  • ఆనందించండి.
  • సూడాన్ లో కరువు మరియు ఆకలితో అలమటిస్తున్నట్టు ఊహించుకోండి.
  • అప్పుడు మీ కోసం ఒక ఆహార సంచి పైనుంచి పడినట్టు ఊహించుకోండి, అందులో మీ కోసం తినడానికి తగినంత ఆహారం మరియు నీళ్లు  ఉన్నట్టు ఊహించుకోండి.   
  • ఆనందించండి.
  • మీకు అల్జీమర్స్ వ్యాధి ఉండి మీరు ఏమీ లేదా ఎవరినీ గుర్తుంచుకోలేకుండా ఎవరితోనూ మూడు పదాలను కూడా కలిపి మాట్లాడ లేకుండా ఉన్నట్టు ఊహించుకోండి. 
  • ఆ వ్యాధి మీకు నయం అయినట్టు ఊహించుకోండి. 
  • ఆనందించండి.
  • అప్పుడు క్రమంగా ఈ బాధలన్నిటి నుంచి విముక్తి పొంది – అంటే నేపాల్ భూకంపంలో చిక్కుకుపోవడం, ఐసిస్ ఆధ్వర్యంలో ఉన్న సిరియాలో పట్టు బడటం, హింసాత్మక ముఠా సభ్యులతో జైలు గదిలో బంధించబడటం, సూడాన్ లో కరువు మరియు ఆకలితో ఉండటం, అల్జీమర్స్ వ్యాధి రావటం నుంచి విముక్తి పొందినట్లు అనుకోండి.   
  • మీకు ఉన్న అత్యంత స్వతంత్రాన్ని అనుభూతి చెందండి.
  • అప్పుడు మీకు ఉన్న ఈ నమ్మశక్యం కాని అవకాశాల గురించి ఆలోచించండి: బోధనల అనువాదాలు ఉన్నాయి, అవి పుస్తకాల రూపంలో మరియు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి, రచయితలు అందులో వారి ప్రచురణలను అందించారు, వీటిని బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు, మనం నేర్చుకోగల కేంద్రాలు ఉన్నాయి మరియు ప్రజలు వాటిని నేర్చుకుని మంచి తెలివితేటలను పెంపొందించుకోవటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
  • ఆఖరిగా, మీకు ఉన్న అన్ని రకాల స్వేచ్ఛలను మరియు సుసంపన్నమైన అవకాశాలను గుర్తు చేసుకుని, మీకు ఉన్నవి మిగతా వాళ్ళకు ఉన్న వాటి కంటే మరియు చరిత్ర మొత్తంలో చూసుకుంటే మీకు ఉన్నవే ఎంత ప్రత్యేకమైనవని తెలుసుకోండి. 
  • ఆనందించి మీకు ఉన్న ఈ ప్రత్యేకమైన జీవితాన్ని బాగా ఉపయోగించుకోవాలని మరియు దానిని ఊరికే వృధా చేయకుండా ఉండేలా చూసుకోండి. 

సారాంశం

మనం మన ప్రస్తుత పరిస్థితుల గురి౦చి ఆలోచి౦చి, మన భావోద్వేగ, ఆధ్యాత్మిక సంతోషం కోస౦ పనిచేయడానికి మనకు ఈ తీరిక లేని జీవిత౦లో మనకు ఎ౦త అదృష్టం ఉందో తెలుసుకున్నప్పుడు, ఈ జీవితంలో ఉన్న వాటి పట్ల ఒక లోతైన కృతజ్ఞత భావం వస్తుంది. ఎవరి జీవితం పరిపూర్ణమైనది కానప్పటికీ, పరిస్థితులు కూడా ఎప్పుడూ మనకు అణువుగానే ఉండవు, అయినా కానీ అవి ఎంత భయంకరంగా ఉన్నా మన జీవితంతో పోలిస్తే మనం నిజంగా చాలా అదృష్టవంతులం. ఈ కృతజ్ఞతతో, మన జీవితాలను మరింత మెరుగ్గా మార్చుకోవడానికి మనకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటాము.

Top