ప్రతి ఒక్కరితో మన పరస్పర సంబంధాన్ని, పరస్పర ఆధారాన్ని తెలుసుకున్నప్పుడు, మనల్ని మనం ఈ మనుషులలో ఒక భాగంగా భావించి ఈ విశ్వవ్యాప్త ప్రేమతో, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాము.
Meditations broadening love 1

వివరణ

బౌద్ధమతంలో ప్రేమ అనేది ఇతరులు సంతోషంగా ఉండాలని మరియు వాళ్ల సంతోషానికి కారణాలు ఉండాలని కోరుకోవడం మరియు మనకు కుదిరితే ఆ ఆనందాన్ని తీసుకురావడానికి సహాయం చెయ్యటం గురించి ఉంటుంది. వేరే ఎవరైనా సహాయం చేస్తారని కూర్చోకుండా ఉండటం. ఇది విశ్వజనీనమైనది, మనకు నచ్చిన వారికి లేదా మనకు సన్నిహితమైన వారికి మాత్రమే కాకుండా, అపరిచితులకు మరియు మనకు నచ్చని వారికి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి, ఇలాంటి విశ్వజనీన ప్రేమ నిష్పక్షపాతమైనది: ఇది అనుబంధం, విరక్తి మరియు ఉదాసీనత భావాలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే, అందరూ ఒకేలా ఉంటారని, వారు సంతోషంగా ఉండాలని, అసంతృప్తిగా ఉండకూడదని గ్రహించడంపై ఇది ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మనకు అసంతృప్తి కలిగించే వినాశకరమైన మార్గాల్లో ప్రవర్తించవచ్చు మరియు ఆలోచించవచ్చు. కానీ వాళ్లు అందువల్లే అయోమయానికి గురయ్యి వారికి ఏది సంతోషాన్ని ఇస్తుందో తెలుసుకోలేరు.

అందుకని, మనలాగే ఇతరులందరినీ సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తులుగా భావించడంపైనే మన ప్రేమను ఆధారం చేసుకుంటాం. వాళ్లు సాధారణంగా చేసే పనులపై మన ప్రేమను ఆధారం చేసుకోము, మరియు వాళ్లు మనతో మంచిగా ఉన్నారా లేదా మనల్ని తిరిగి ప్రేమిస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడము. మనకు ఎటువంటి అంచనాలు, పక్షపాతాలు ఉండవు కాబట్టి, ఎలాంటి షరతులు లేని మన ప్రేమ ఒక ప్రశాంతమైన మానసిక స్థితి లాగా ఉంటుంది; ఇది మన మనస్సులను అనుబంధాల ఆలోచనతో లేదా ప్రవర్తనతో కప్పి ఉంచదు.

మన ప్రేమ యొక్క భావోద్వేగ తీరు ప్రతి ఒక్కరితో సంబంధాన్ని మరియు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుంది. మనం తినే లేదా ఉపయోగించే ప్రతీదీ ఇతరుల పని నుంచే వస్తుందని గ్రహించడం ద్వారా ఈ అనుబంధం మరియు కృతజ్ఞతా భావం వస్తుంది. ఇతరుల కష్టం లేకపోతే మనం వాడే వస్తువులు, ఆ వస్తువుల తయారీకి అవసరమైన ముడిసరుకులు, తినే ఆహారం, మనం ధరించే దుస్తులు, మన ఇళ్లలో కరెంటు, నీరు, ఇంటర్నెట్ లో సమాచారం మొదలైనవి ఎక్కడ నుంచి వస్తాయి? మనం కొనే ఉత్పత్తులను తయారు చేయడానికి ఇతరులను ప్రేరేపించబడి మార్కెట్ ను సృష్టించడం ద్వారా ప్రజలు మనకు పరోక్షంగా సహాయపడతారు. 

ఈ సంబంధాన్ని మరియు కృతజ్ఞతా భావాన్ని మనం ఎంత బలంగా అనుభూతి చెందుతామో, అంతే సురక్షితంగా మరియు సంతోషంగా మనం జీవిస్తాము. ఇది ఆక్సిటోసిన్ హార్మోన్ లకు సంబంధించినది - తల్లి మరియు అప్పుడే పుట్టిన బిడ్డకు మధ్య బంధంలో ఉండే హార్మోన్. ఈ వెచ్చని, సంతోషకరమైన అనుభూతిని పొందిన తర్వాత, మనం దానిని మన ధ్యానంలోకి, ముందుగానే మన లోపలికి పంపుకుంటాము, ఎందుకంటే ముందు మనం సంతోషంగా ఉండాలని అనుకోకపోతే, వేరే వాళ్లు సంతోషంగా ఉండాలని మనం ఎందుకు అనుకుంటాము? తర్వాత మనం ఆఅ సంతోషాన్ని ఎక్కువ మందికి పంచుతాము.

ప్రతీ దశలో మన ప్రేమకు సంబంధించి మూడు ఆలోచనలు ఉంటాయి:

 • ఇతరులు స౦తోష౦గా ఉంటూ వాళ్ళ స౦తోషానికి కారణాలు ఉ౦టే ఎ౦త బాగుంటుందో కదా?
 • వాళ్ళు స౦తోష౦గా ఉ౦డాలి, అంటే ,"వాళ్లు స౦తోష౦గా ఉ౦డాలని నేను నిజ౦గా కోరుకు౦టున్నాను." అని అర్ధం.
 • "నేను వాళ్ళకు సంతోషాన్ని కలిగించగలిగను" అని. 

ఇతరుల కోసం సంతోషానికి కారణాలను తీసుకురావటానికి ఆలోచించే ముందు, మనం వారి దుఃఖానికి గల కారణాన్ని ముందే గుర్తించాలి. వాళ్ళు ఆకలితో ఉంటే, తినడానికి వాళ్లకు అవసరమైనవి దొరకాలని కోరుకోవటమే కాకుండా; వాళ్ళు భోజనం చేసి సంతోషంగా ఉన్నప్పటికీ, వాళ్ళు జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినేసి లావుగా తయారవుతారని మనం గ్రహిస్తాము. కాబట్టి, వారి ఆహారపు అలవాట్లతో భావోద్వేగ సమతుల్యత, సంతృప్తి మరియు సొంత నియంత్రణ ఉండాలని మనం కోరుకుంటాము. డబ్బు, వస్తువులు మొదలైన వాటిల్లో కూడా ఇంతే. భౌతిక అవసరాలను తొందరగా నెరవేర్చుకోవడం కంటే ఎక్కువ రోజుల ఆనందం గురించి మనం ఆలోచిస్తాం.

ధ్యానం

 • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
 • మీరు తీసుకునే మరియు ఉపయోగించే ప్రతీదీ ఇతరులపై ఎలా ఆధారపడి ఉంటుందో తెలుసుకోండి.
 • అందరితో మంచి సంబంధాన్ని నిర్మించుకోవడంపై మరియు ఒక లోతైన కృతజ్ఞతా భావాన్ని సృష్టించుకోవడంపై దృష్టి పెట్టండి.
 • ఇది మిమ్మల్ని మంచిగా, మరింత సురక్షితంగా మరియు సంతోషంగా ఎలా చేస్తుందో తెలుసుకోండి.
 • మీపైనే దృష్టి పెట్టి తరచుగా మీరు కూడా అసంతృప్తికి గురువుతారని గమనించండి. 
 • ఇలా ఆలోచి౦చ౦డి: నేను స౦తోష౦గా ఉ౦టూ నా స౦తోషానికి కారణాలు ఉ౦టే అది ఎ౦త అద్భుత౦గా ఉ౦టు౦దో అని. నేను సంతోషంగా ఉండగలనా; నాకు మరింత సంతోషాన్ని కలిగించే కారణాలను నేను అభివృద్ధి చేసుకోగలనా, కొంత కాలమే సంతోషం తెచ్చేది కాకుండా, ఎక్కువ రోజులు ఆనందాన్ని తెచ్చేది కూడా పొందగలనా. మిమ్మల్ని సంతోషకరమైన వ్యక్తిగా మార్చే కొన్ని విషయాల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు - భావోద్వేగ సమతుల్యత మరియు స్థిరత్వం, ప్రశాంతమైన మనస్సు, మరింత అవగాహన, ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండటం లాంటివి.  
 • [ఆప్షనల్: ఈ వెచ్చని ఆనందాన్ని వివరించే, ఒక పసుపు రంగు కాంతితో మిమ్మల్ని మీరు నింపుకున్నట్లు ఊహించుకోండి.]
 • అప్పుడు మీకు నచ్చిన వారితో అలాగే చేసి మీకు నచ్చిన ఇంకొంత మందికి దీనిని విస్తరించండి. 
 • [ఆప్షనల్: మీ నుంచి ఒక వెచ్చని పసుపు రంగు కాంతి వెలువడి ఆ వ్యక్తిని నింపుతున్నట్టు ఊహించుకోండి.] 
 • అప్పుడు మీ జీవితంలో మీకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు, అంటే దుకాణంలో చెక్-అవుట్ కౌంటర్ వద్ద ఉండే వ్యక్తులను లేదా బస్సు డ్రైవర్ వంటి వారిని మీరు ఎదుర్కుంటారు.
 • ఇంకా మీకు ఇష్టం లేని వ్యక్తులను.
 • మిగతా మూడు గ్రూప్ వ్యక్తులను.
 • ఈ ప్రేమను మీ నగరంలో, మీ దేశంలో, మరియు మొత్తం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించండి.

సారాంశం

నిష్పాక్షికమైన, విశ్వజనీనమైన ప్రేమ అనేది ఒక సంక్లిష్టమైన భావోద్వేగం. ఇది ప్రతి ఒక్కరితో అనుబంధంతో కూడిన భావనను మరియు వారు మీ జీవితంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మంచిని కోరుకోవటానికి ఎలా సహాయం చేశారో ఆ కృతజ్ఞతా భావాన్ని వివరిస్తుంది. ఇది ఒక ప్రశాంతమైన, వెచ్చని భావోద్వేగ స్థితి. అనుబంధం, విరక్తి లేదా ఉదాసీనత లేకుండా, మరియు ఇష్టమైనవి లేదా మిమ్మల్ని దూరం పెట్టే వాళ్ళ నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది ఎలాంటి షరతులు లేకుండా ఉంటుంది మరియు ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి సమానత్వాన్ని అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. సంతోషంగా ఉండాలని ఎప్పుడూ బాధపడకూడదని చెప్తుంది. ఇది తిరిగి ప్రతిఫలంగా ఏమీ ఆశించదు. ఇది ఒక పాసివ్ ఫీలింగ్ మాత్రమే కాదు, ఇది భౌతిక అవసరాలు లేకుండా ఉండటం యొక్క స్వల్పకాలిక ఆనందాన్ని, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు ఇతర ఆలోచనలు లేకుండా దీర్ఘకాలిక స్థిరమైన ఆనందాన్ని పొందేలా ఇతరులకు సహాయపడుతుంది.

Top