జీవితంలో ప్రతిదీ ఎప్పుడూ మారుతూనే ఉంటుందన్న నిజాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఇతరులతో సంబంధం కలిగి ఉండాలనే పాత కాలపు అలవాట్లలో మనం చిక్కుకోకుండా ఉంటాము.
Meditation impermanence

వివరణ

అశాశ్వతం అంటే ఎప్పుడూ మారుతూ ఉండేది అని అర్ధం: కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ప్రభావితమయ్యేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు, అవి క్షణ క్షణం మారుతూనే ఉంటాయి. కొన్ని వస్తువులు, అవి తయారైన తర్వాత, నెమ్మదిగా పాడవుతాయి. కంప్యూటర్, కారు లేదా శరీరం ఇలాగే పాడవుతాయి. మిగతా విషయాలు క్షణక్షణం మారుతూనే ఉంటాయి, కానీ అవి ఎప్పుడూ ముగిసిపోవు. అవి ఏమిటంటే మీరు పిల్లోడిగా, చురుకైన కుర్రోడిలా లేదా అల్జీమర్స్ ఉన్న ఒక వృద్ధాప్య రోగిగా ఉన్నప్పుడు మీ ప్రాథమిక మానసిక పనులు. ఉష్ణోగ్రత మరియు మీ ధ్యానం యొక్క నాణ్యత లాంటివి కొన్ని పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి; వేరే వాళ్ళు, విమానంలోని వ్యక్తులు ఒకేసారి కలిసి ప్రయాణించి విడిపోతూ ఉంటారు. కొన్ని విషయాలు ఋతువులు లేదా పగలు మరియు రాత్రి లాగా రిపీట్ అవుతూ మారుతూ ఉంటాయి, మరికొన్ని బౌద్ధమత ఆలోచనా విధానాల ప్రకారం విశ్వము లాగా పదే పదే అవి పుట్టుకొస్తాయి. అశాశ్వతంలో చాలా రకాలు ఉన్నాయి.

దురదృష్టవశాత్తు, మన మనస్సులు ఒకే క్షణంలో అన్ని సమయాలను గ్రహించలేవు కాబట్టి, మనం అయోమయానికి గురయ్యి మరియు కొన్నిసార్లు విషయాలు స్థిరంగా ఉంటాయని మరియు మన సంబంధాలు, మన యవ్వనం, మన మానసిక స్థితి లాంటి వాటిని ఎప్పటికీ మార్చలేమని అనుకుంటాము. అలా ఆలోచిస్తే మనకే అసంతృప్తి, సమస్యలు వస్తాయి. ఉదాహరణకు, మనం ఒకరితో ప్రేమలో ఉన్నాము. ఇది కొన్ని కారణాలు మరియు పరిస్థితుల వల్ల వస్తుంది - మనిద్దరం ఒకే ప్రదేశంలో ఉన్నాము, మనిద్దరం ఒక భాగస్వామి కోసం వెతుకుతున్నాము, మనిద్దరి జీవితంలో వేరే విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ, కాలక్రమేణా, ఆ పరిస్థితులు మారతాయి. ప్రారంభ దశలో మనకు ఉన్న సంబంధాన్ని మనం నిలుపుకుంటే, మన భాగస్వామి ఉద్యోగాలు మారినా, వేరే ఊరికి వెళ్లినా, ఎవరిని అన్నా కలిసినా లేదా కొత్త స్నేహితులను పొందినప్పుడు మనం సరిగ్గా ఎడ్జెస్ట్ కాలేము. మన బంధం మునుపటి లానే ఉంటుంది మరియు అది వాస్తవికతతో సంబంధం లేని కారణంగా, మనం బాధపడి అసంతృప్తి చెందుతాము.

మన ధ్యానం కోసం, మన జీవితంలో అశాశ్వతానికి లోబడి ఉన్న వివిధ విషయాలపై దృష్టి పెడదాం మరియు అవి మారాయి, కాలం గడిచేకొద్దీ మారుతూ ఉంటాయి మరియు చివరికి అంతమవుతాయి అనే నిజాన్ని తెలుసుకుని వాటిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిద్దాం.

ధ్యానం

  • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
  • మీ తల్లితో ఉన్న మీ అనుబంధంపై దృష్టి పెట్టండి.
  • అది ఎలా ప్రారంభమైందో గమనించండి - మీరు ఒక చిన్న పిల్లవాడు మరియు ఇది మీ సంబంధాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో ప్రభావితం చేసింది. 
  • అప్పుడు మీరు మరియు మీ తల్లి పెద్దవారయ్యారు తర్వాత మీరు ఆఅ చిన్నపిల్లాడి నుంచి ఒక టీనేజర్ గా, ఆ తర్వాత ఒక పెద్దవాడిగా మారారు. అప్పుడు తను వృద్ధాప్యంలోకి వెళ్ళింది. అప్పుడు మీ సంబంధం మారింది - అవునా కాదా?
  • తను మరణించినప్పుడు మీ అనుబంధ సంబంధం ముగిసినప్పటికీ, ఆమె పట్ల మీ ఆలోచనా విధానం మరియు జ్ఞాపకశక్తి ఎలా మారుతుందో గమనించండి. 
  • అదే విధంగా మీ తండ్రితో మీకు ఉన్న అనుబంధంపై దృష్టి పెట్టండి.
  • మీరు ఎంతగానో ప్రేమించే లేదా ఎంతగానో ప్రేమిస్తున్న భాగస్వామితో మీకు ఉన్న అనుబంధంపై దృష్టి పెట్టండి.
  • మీ ప్రొఫెషనల్ జీవితంపై దృష్టి పెట్టండి. 

సారాంశం

అశాశ్వతం అనేది ఒక జీవిత సత్యం. మనకు ఇది నచ్చినా నచ్చకపోయినా, ప్రతీదీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, ఏదీ ఎప్పుడూ  ఒకేలా ఉండదు. ఈ నిజాన్ని మనం అంగీకరించినప్పుడు, ప్రతి విషయాన్ని అంటి పెట్టుకుని ఉండటం వల్ల ఏం ఉపయోగం లేదని మనం గ్రహిస్తాము. జీవితంలోని పరిస్థితులలో, సంబంధాలలో, మన శరీరం మొదలైన వాటిలో అనివార్యంగా సంభవించే మార్పులను మనం అలవరచుకుంటే, అప్పుడు మనకు కలిగే ఎక్కువ శాతం అసంతృప్తిని మరియు సమస్యలను మనం సునాయాసంగా ఎదుర్కోవచ్చు.

Top