Arrow left ఇంతకముందుది
ధ్యానం
ఆర్టికల్ 13 యొక్క 13
మన మొత్తం జీవితంలో మనం చేసిన తప్పులను చూసుకుని ఒక సరైన దృష్టితో గమనించి వాటిని నిష్పాక్షికంగా పట్టించుకోవడం మానేస్తాం. మనల్ని మనం తిట్టుకోకుండా ఒక క్షమాగుణంతో, అలా మళ్ళీ చెయ్యకూడదని నిశ్చయించుకుంటాం.
Meditation dispelling guilt

వివరణ

క్షమించడం అంటే ఒక నేరం, లోపం లేదా తప్పు జరిగినప్పుడు కోపం మరియు పగను తెచ్చుకోకుండా వదిలేయడం. ఇది ఇతరులు చేసిన హానికరమైన పనులు మరియు తప్పులకు ప్రతిస్పందనగా మాత్రమే కాకుండా, మన స్వంత ప్రతికూల చర్యలకు మరియు తప్పులకు ప్రతిస్పందనగా కూడా మనం పెంపొందించుకోవాల్సిన ఒక మంచి అలవాటు. ఇలా చెయ్యడానికి, మనం చేసిన ఏ పని అయినా లేదా తప్పు నుంచి అయినా ఒక వ్యక్తిగా మనల్ని మనం వేరు చేసుకుని ఆలోచించాలి. మనం మన పూర్తి జీవితం గురించి ఆలోచించాలి - పునర్జన్మపై బౌద్ధమత బోధనలను మనం అంగీకరిస్తే, అప్పుడు మన గతం మరియు భవిష్యత్తు జీవితాలను కూడా మనం అంగీకరించాలి. ఇలాంటి ముఖ్యమైన విషయంలో మనల్ని మనం పరిగణనలోకి తీసుకోవడానికి మన మనస్సును తెరిచినప్పుడు, మనం చేసిన ఏ పని లేదా తప్పు అయినా కేవలం ఒక సంఘటన మాత్రమే అని మనకు తెలుస్తుంది. మన జీవితంలో మనం ఎన్నో పనులను చేశాం, మనం బుద్ధులు కాదు కాబట్టి మనం ఖచ్చితంగా తప్పులు చేసే ఉంటాము. మనం చేసిన తప్పుతో మనల్ని మనం గుర్తించి, దాన్ని మన నిజమైన గుర్తింపుగా చేసుకుంటే, దాని ఫలితం మనకు అపరాధ భావన మాత్రమే మిగులుతుంది. మనం ఎంత ఎక్కువ సేపు అలా ఉంటే అంత ఎక్కువ సేపు ఆ అపరాధ భావనకు గురవుతాం, అప్పుడు మన గురించి మనం అంత అధ్వాన్నంగా ఫీలవుతాం.

మనల్ని మనం క్షమించుకోవడం అంటే మనం చేసిన పనిని మర్చిపోవడం కాదు. మనం చేసిన నష్టానికి మరియు తప్పులకు బాధ్యతను వహించటం. కానీ మనం వాటిని అపరాధ భావంతో చూడకుండా మనపై మనం కోపం తెచ్చుకోకుండా ఉంటాం. మన తప్పులను మనం అంగీకరిస్తాం, వాటితో మనల్ని మనం గుర్తుంచుకోవడం వదిలేస్తాము - మనం ఒక "చెడ్డ వ్యక్తి" లేదా ఒక "మూర్ఖుడు" అని భావిస్తాము - ఆ తర్వాత ఈ నాలుగు ప్రత్యర్థి శక్తులను ఉపయోగిస్తాము:

  • పశ్చాత్తాపపడతాం.
  • మనం చేసిన ఆ హానికరమైన పని లేదా తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం.
  • మన జీవితాల్లో మనం కోరుకున్న సానుకూల దిశ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం.
  • వీలైతే మన తప్పును సరిదిద్దుకుని క్షమాపణ చెప్పి మనం చేసిన చెడు యొక్క పర్యవసానాలను తగ్గించటానికి కొన్ని మంచి పనులను చేస్తాం.

ధ్యానం

  • శ్వాసపై దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండండి.
  • మీరు చేసిన ఏదైనా ఒక హానికరమైన పనిని గుర్తు చేసుకోండి - మీ పనులు లేదా మాటలతో ఎవరినైనా బాధపెట్టిన విషయం లాంటిది - ఆ తర్వాత మీరు చేసిన ఆ హానికరమైన పని చేసినందుకు మీరు ఎలా బాధపడ్డారో మరియు మిమ్మల్ని మీరు ఎలా కోపగించుకున్నారో గుర్తుతెచ్చుకోండి. 
  • మీ పరిధిని విస్తరించి మీ మొత్తం జీవితం గురించి ఆలోచించండి మరియు ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే అని గుర్తుంచుకోండి, ఇది మళ్ళీ జరిగినా, మీ జీవితంలో ఇంకా అనేక విషయాలు జరుగుతూనే ఉంటాయని గుర్తుంచుకోండి.
  • ఈ తప్పు గురించే ఆలోచిస్తూ దాని లోనే ఇరుక్కుపోతే మీకు అపరాధ భావన మరియు చెడు అనుభూతి మాత్రమే మిగులుతుంది. మీరు మీ గురించి చాలా పరిమిత పరిధిలోనే ఆలోచిస్తున్నారు అని దీని అర్ధం.
  • ఇది మీ సంపూర్ణతకు అనుగుణంగా లేదని గుర్తించి ఆ విషయాన్ని వదిలెయ్యండి. 
  • అప్పుడు మీ జీవితం మరియు మీరు చేసిన అన్ని మంచి పనుల గురించి ఆలోచించండి.
  • మీరు చేసింది మంచి పని కాదని ఒప్పుకోండి. మీరు ఇంకా విముక్తులు కాలేదు ఎందుకంటే మళ్ళీ మీరు హానికరమైన పనులు చేయొచ్చు. 
  • మీరు అలా చేశారనే వాస్తవాన్ని మార్చలేనప్పటికీ, దాని గురించి మీరు బాధపడతారు. అంటే మీరు అలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటారు.
  • ఇలాంటి పనిని మళ్ళీ చెయ్యకుండా మీ వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకోండి. మీరు ఎలా ప్రవర్తిస్తారు మరియు ఎలా మాట్లాడుతారు అనే దాని గురించి నిష్టగా ఉండి, మీకు ఇలాంటిది ఏదైనా మళ్ళీ చెయ్యాలని అనిపిస్తే ఒకసారి ఆగి ఆలోచించండి.
  • మీ జీవితంలో మీరు వేస్తున్న మంచి అడుగులను గుర్తించండి - మీ లోపాలు మరియు సమస్యలను అధిగమించడానికి మరియు మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మీపై మీరు పని చేయటం మొదలుపెట్టండి. 
  • కనీసం మీ మనస్సులోనైనా మీరు కష్టపెట్టిన వాళ్లను క్షమించండి. వాళ్లకు ఏదొక మంచి పనిని చేసి పెట్టండి, అలా అయినా మీరు చేసిన చెడుకి ప్రతిఫలంగా గుర్తు ఉంటుంది. మీరు ఆ వ్యక్తిని మళ్లీ కలుసుకుంటే, మీరు అనుకున్నది నిజంగా చేస్తారని గట్టిగా నిర్ణయించుకోండి.

మీరు చేసిన తప్పుకి ఈ స్టెప్స్ ని రిపీట్ చెయ్యండి:

  • మీరు చేసిన కొన్ని తప్పులను గుర్తు చేసుకోండి – ఉదాహరణకు పొరపాటులో మీ కంప్యూటర్ లోని ఏవైనా ముఖ్యమైన ఫైల్స్ ని డిలీట్ చేయడం అనుకోండి - అప్పుడు మీపై మీరు కోపం తెచ్చుకుని ఎలా మారి ఉంటారు, అప్పుడు మిమ్మల్ని మీరు ఒక మూర్ఖుడు అని ఎలా తిట్టుకున్నారు.
  • మీ పరిధిని విస్తరించి మీ జీవితం గురించి ఆలోచించండి మరియు ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే అని గుర్తించండి. ఇలా మళ్ళీ జరిగినా కానీ మీ జీవితంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయని గుర్తించండి. మీరు ఎక్కువ పనులను సరిగ్గానే చేస్తారు.
  • ఈ తప్పుతో మిమ్మల్ని మీరు గుర్తించడం మరియు దాని గురించే ఆలోచించడం మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు మీ గురించి చాలా పరిమిత పరిధిలో ఆలోచిస్తున్నారు అని దీని అర్ధం అనమాట.
  • మీరు ఉన్న ఆ విధానాన్ని మరచిపోయి, మీరు ఏంటో అసలు పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నించండి.
  • అప్పుడు మీ జీవితంలో మీరు చేసిన అన్ని మంచి పనులను బాగా గుర్తు తెచ్చుకుని ఆనందించండి.
  • మీరు చేసింది తప్పు అని, కొన్నిసార్లు ఇలాగే తప్పులు జరుగుతాయని అంగీకరించండి - ఎవరూ ప్రత్యేకమైన వారు గుర్తుంచుకోండి. 
  • వాస్తవం ఏమిటంటే మీరు చేసిన పనిని ఎలాగో మార్చలేరు, అయినా కానీ మీరు అలా చేసినందుకు బాధపడుతున్నారు. అంటే ఆ పనిని చేయకుండా ఉంటే బాగుండేది అని ఇప్పడు అనుకుంటున్నారు.
  • ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోండి. మీరు కంప్యూటర్ పై పనిచేసేటప్పుడు బుద్ధిపూర్వకంగా మరియు అప్రమత్తంగా ఉండటానికి ప్రయత్నించండి, అలా మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండగలరు.
  • మీ జీవితంలో మీరు చేస్తున్న మంచి పనులను గుర్తు తెచ్చుకోండి - మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం పని చెయ్యండి, మీరు ఏమి చేస్తున్నారనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టకుండా మీ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించండి.
  • ఒక ప్రశాంతమైన మానసిక స్థితితో, మీరు అనుకున్న దాన్ని గుర్తు తెచ్చుకుని అలా చెయ్యడానికి నిర్ణయించుకోండి. అప్పుడు నిజంగా అలానే చేయగలుగుతారు.

సారాంశం

మనం చేసిన హాని లేదా చేసిన తప్పులకు మనల్ని మనం క్షమించుకోవడం అంటే మనపై మనం కోపగించుకోకపోవడం, లేదా మనం చెడ్డ వ్యక్తి అని భావించకుండా ఆ అపరాధ భావన లేదా మూర్ఖులుగా మనల్ని మనం అనుకోకపోవడం. మనం చేసిన తప్పుతో మాత్రమే మనల్ని మనం పరిమితంగా గుర్తించడం మానెయ్యాలి, ఇది మన జీవితాల సంపూర్ణతకు అనుగుణంగా లేదని తెలుసుకోవడం ద్వారా సాధ్యపడుతుంది. మనం చేసిన పనులకు మనమే బాధ్యత వహిస్తాము మరియు వాటిని అలాగే డీల్ చేస్తాము. మనం చేసింది తప్పు అని ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడతాం. అలా మళ్ళీ చెయ్యకుండా ఉండేలా వాగ్దానం చేస్తాం. జీవితంలో మనం వెళ్లాలనుకుంటున్న మంచి దిశను తెలుసుకుంటాము, మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి క్షమాపణ చెప్తాము లేదా ఒక మంచి పనిని చేస్తాము.

Top