ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి

How to develop love derek thomson unsplash

ప్రపంచపు ప్రేమ - ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మరియు ప్రతి ఒక్కరి సంతోషానికి కారణాలు అనేకమైనవి ఉండాలని కోరుకోవటం అనేది మనందరి జీవితాలు ఒకరితో ఒకరికి ఎలా పూర్తిగా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోవడం నుంచి వస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఈ మానవజాతిలో ఒక భాగం, మరియు మన శ్రేయస్సు ఈ మొత్తం ప్రపంచ సమాజంతో ముడిపడి ఉంది - మనలో ఎవరూ ఆర్థిక వ్యవస్థ యొక్క పతనం లేదా వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి తప్పించుకోలేరు. మనమందరం ఒకరికొకరు ముడిపడి సంబంధాలను కలిగి ఉన్నాం కాబట్టి, మన ప్రేమను ప్రతి ఒక్కరికి అందించడం పూర్తిగా సమంజసం.

ఇతరుల కోసం ప్రేమను పెంపొందించుకోవడం మనస్సును దానికదే ప్రశాంతంగా ఉంచుతుంది. ఇదే మన జీవితంలో విజయానికి అంతిమ మార్గం. - 14వ దలైలామా

ప్రేమను పెంపొందించుకోవడానికి మన పరస్పర సంబంధాన్ని మనం అభినందించాలి. మనం తినే, ఉపయోగించే, ఆస్వాదించే ప్రతీదీ ఇతరుల కష్టం నుంచే వస్తుంది. మీరు ఇప్పుడు చదువుతున్న ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చెయ్యటానికి నిమగ్నమైన ప్రపంచంలోని వివిధ మూలాల్లో ఉన్న వేలాది మంది గురించి ఆలోచించండి. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రతి ఒక్కరితో మనం కనెక్ట్ అయ్యి ఒక కృతజ్ఞతా భావాన్ని ఏర్పరచుకుంటాం. ఇది మనలో ఒక లోతైన సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మనకు సహజంగానే ఇతరుల సంతోషం గురించి ఆలోచన ఉంటుంది; ఈ భావాలే ప్రపంచపు ప్రేమకు ఆధారం.

ప్రేమపూర్వక దయను పెంపొందించడానికి ఒక చిన్న తరహా ధ్యానం

మనం ముందుగా మన పట్ల ఒక ప్రేమపూర్వక దయను పెంపొందించుకోవాలి. మనమే సంతోషంగా ఉండాలని అనుకోకపోతే, వేరే వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎలా కోరుకోగలం?

మనం బాగా లోతుగా ఆలోచించి దీనిని మొదలుపెట్టాలి:

  • నేను సంతోషంగా ఉండి ఆ సంతోషానికి కారణాలు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది.
  • నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
  • నాకు నేను సంతోషాన్ని అందించుకోగలగాలి. 

మన౦ స౦తోష౦గా ఉ౦డాలనే బలమైన కోరికను అనుభవి౦చిన తర్వాత, ఆ కోరికను మనం మిగతా వాళ్లకు కూడా అన్వయించవచ్చు:

  1. ముందుగా, మనం మన ప్రేమను అత్యంత ప్రియమైన వారికి మరియు స్నేహితులకి అందిస్తాము.
  2. ఆ తర్వాత దానిని మనం ప్రతిరోజూ కలుసుకునే వారికి ఇస్తాం.
  3. ఆ తర్వాత, మనకు అస్సలు నచ్చని వ్యక్తుల పట్ల ప్రేమను చూపించడానికి ప్రయత్నిస్తాం.
  4. చివరికి, మొత్తం ప్రేమను ఈ ప్రపంచానికి మరియు అందులోని సమస్త జీవులకు అందిస్తాము.  

ఈ విధంగా, మన కోసం మరియు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే కాకుండా, సమస్త జీవులందరికి మన ప్రేమ భావాన్ని పెంపొందించుకోవచ్చు.

ఇతరులను సంతోషపెట్టడానికి మనం నిజంగా ఏదైనా చేయగలిగితే, దానిని మనం ఖచ్చితంగా చేసి తీరాలి. మనం అలా చెయ్యలేకపోతే, వారి స్వల్పకాలిక సంతోషానికి మాత్రమే కాకుండా వారి దీర్ఘకాలిక సంతోషానికి కారణమైన వాటిని ఏవైనా ఇవ్వడానికి మనం ముందుకు రావాలి. ఇది నిరాశ్రయులకు ఆహారం మరియు ఆశ్రయం కల్పించడం గురించి మాత్రమే కాదు - అన్నింటికీ మించి, చాలా మంది ధనవంతులు మరియు విజయవంతమైన వ్యక్తులు కూడా దయనీయమైన వాళ్ళు కూడా ఉన్నారు. వారిని కూడా వీళ్లలో కలుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కొంచెం కొంచెంగా, మన కుటుంబం మరియు స్నేహితులు మరియు మనం కలుసుకునే ప్రతి మనిషి పట్ల నిజమైన ప్రేమ సహజంగా పుడుతుంది. ఇది మనకు మరియు ఇతరులకు సంతోషాన్ని ఇస్తుంది.

Top