What is compassion

బౌద్ధమతంలో, కరుణ అనేది ఇతరులు వారి బాధల నుంచి మరియు ఆ బాధలను తెచ్చే కారణాల నుంచి విముక్తి పొందాలని కోరుకోవటం. ఇది ఇతరుల ఆలోచనలను ప్రశంసించడంపై ఆధారపడి ఉంటుంది, ప్రత్యేకించి మనం కూడా అలాంటి వాటినే ఎదుర్కుంటున్నప్పుడు. వాళ్ళు పడుతున్న బాధను మనం అనుభవించకపోయినా, వారి చోటులో మనల్ని మనం ఉంచుకుని అది ఎంత కష్టమైనదో మనం తెలుసుకోవచ్చు. దాని నుంచి విముక్తి పొందాలని మనం ఎంతగా కోరుకుంటామో ఊహించుకుంటూ, ఇతరులకు కూడా అలాగే జరగాలని మనం గట్టిగా కోరుకుంటాం.

ప్రేమ, మరియు కరుణ అవసరాలు, లగ్జరీలు కావు. అవి లేకుండా మనుషులు జీవనాన్ని సాగించలేరు. - 14వ దలైలామా

కరుణ మన హృదయాలను మరియు మనస్సులను ఇతరుల కోసం తెరిచి ఉంచుతుంది, మన గురించి మాత్రమే ఆలోచించే ఒంటరి, స్వీయ-నిర్బంధ పరిమితుల నుంచి మనల్ని వేరు చేస్తుంది. మనమందరం కలిసి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కుంటున్నాము. మనం ఇతరులతో బంధాలను పెంచుకున్నప్పుడు ఒంటరితనం మరియు ఆందోళనను అధిగమిస్తున్నాము. కరుణతో ఉండటం మనల్ని సంతోషంగా మరియు మరింత సురక్షితంగా ఉండేలా చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇతరుల బాధలను, కష్టాలను సీరియస్ గా తీసుకొని సహాయం చేయాలనుకోవడం మనలో మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కరుణను పె౦పొ౦ది౦చుకునే౦దుకు మన౦ శిక్షణను పొ౦దగలిగితే, అది నిజ౦గా మన శ్రేయస్సుకు బాగా సహాయపడుతుంది.

కరుణ ఉత్తేజంతో ఉండాలి, అప్పుడు ఇది ఇతరుల బాధలను తగ్గించడానికి బాధ్యత తీసుకునేలా మనల్ని ప్రేరేపిస్తుంది. సహాయం చేసే మన సామర్థ్యం పరిమితంగా ఉండవచ్చు, కానీ మనం చేయగలిగితే కచ్చితంగా సహాయం చేస్తాము ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా మరియు బాధలో ఉన్నప్పుడు వలను మనం అలా చూడలేము.

కరుణ జ్ఞానం మరియు వివేకంతో కలిపితే అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అప్పుడు మనం అన్నిటినీ సరిగ్గా ఎంచుకుంటాము. మనం సహాయం చేయలేనప్పుడు లేదా మనం చెప్పింది జరగకపోతే బాధ పడకుండా మానసికంగా ఇబ్బంది పడితే, కరుణ మన లోపాలను అధిగమించడానికి మరియు మన పూర్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి బలమైన ప్రేరణగా ఉంటుంది.

Top